గురు దర్శన్

రామాశ్రమ సత్సంగ్, మధుర సాహిత్యం

రామాశ్రమ్ సత్సంగ్, మథురా

మా పద్ధతి ద్వారా ఈ పని ఎంత సునాయాసంగా అవుతుందంటే దాన్ని విని అందరూ ఆశ్చర్య పడతారు. ఈ నూతన పద్దతి కర్మ, భక్తి మరియు జ్ఞానము యొక్క మిశ్రమము. స్త్రీ పురుషులు, వయోవృద్ధులు, విద్వాంసులు నిరక్షరాస్యులు, గృహస్తులు, విరక్తులు, జాతి భేదాలు లేకుండా అందరూ ఎంతో సులభముగా దీనిని చెయ్య గలరు.

మత ధర్మ భేదాలు కూడా వీటికి అడ్డు రావు, ఎందుకంటే ఎచ్చటైతే మత, ధర్మ భేదాల సీమ సమాప్తమవుతుందో, అచ్చటి నుంచే ఈ పద్ధతి ప్రారంభమవుతుంది.

ప్రారంభములోనే సాధకునికి ఎలాంటి అనుభవము కలుగుతుందంటే వారి మనస్సుని ఎదో శక్తి బలంగా పట్టేసిందని, వారి మనస్సు యొక్క వేగము, చపలత్వము నశింపబడ్డయని మరియు అది ఏ పనిలోనూ విఘ్నము కలిగించడము లేదని. నిత్య అభ్యాసముతో ఈ స్థితి మరింత ముందుకు వెళ్తుంది. కొద్ది కాలములోనే సమాధి యొక్క ఆనందాన్ని పొందడము మొదలు పెడతారు.

పరమార్థ పథానికి – పది ఆలోకాలు

1
పరమేశ్వరుడు ఒక శక్తి (పవర్), దానికి ఏ పేరు, ఏ రూపు లేదు. ఎవరు ఏ పేరు పెట్టేసుకుంటే, అదే సరి.
2
వారిని పొందడానికి గృహస్తి (సంసారము) విడిచి అరణ్యాలలో సంచరించే అవసరము లేదు, వారిని, ఇంట్లో ఉండి కూడా పొంద గలము.
3
ఇప్పటి వరకు మీరు పరమేశ్వరుడి దర్శనము చెయ్యలేదు, ఇందుకు వారిని పొందడానికి, మొదట మీరు వారిని సంప్రదించండి ఎవరైతే ఆ పరమాత్ముడిని చూసారో, వారే మీకు ఈశ్వర దర్శనము చేయించ గలరు.
4
మీ జీవితములో ఆంతరిక ప్రసన్నత తీసుకురండి, ఇది చాలా గొప్ప దైవిక గుణము.
5
జ్ఞానములో శాంతి ఉంది, అది మీ అంతరాలలోనే ఉంది, అది మీకు బైట ఎక్కడ నుండి దొరకదు. దాని కొరకు ఆంతరిక సాధన చేయ్యవలసుంటుంది.
6
మీరు ఎక్కువ సమయము సాంసారిక కార్యాలకు ఇవ్వండి. కొంత సమయము ఇక్కడ ఇవ్వండి కానీ, ఈ కాస్త సమయములోను ప్రపంచాన్ని మరచిపోండి.
7
రెండు పనులు సాధకులకు అత్యావశ్యకమైనవి. మొదటిది ఏమిటంటే కష్టార్జితమైన భోజనము, రెండవది మన మనస్సును ఎప్పుడూ పనిలో నిమగ్నము చేసి ఉంచడము.
8
జ్ఞానము అనంతమైనది, ఒక గురువు కనుక దీన్ని పూర్తీ చెయ్య లేక పొతే, మరొక గురువు ద్వారా పొందాలి కానీ, సంపూర్ణ ఆత్మజ్ఞానము ఉన్న గురువు దొరికిపోతే మాత్రము రెండవ గురువు దగ్గరకి చేర కూడదు.
9
ఈ ప్రపంచములో సేవకునిలాగ అన్ని పనులు చెయ్యాలి కానీ, యజమానిలాగ కాదు.
10
ఈ ప్రపంచములో ఒక అతిథి లాగ ఉండండి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుని మరొకరిది అనుకోండి. నేను-నాది వదిలేసి నువ్వు-నీది అనే పాఠము నేర్చుకోండి.

పరమానందాన్ని పొందడానికి నియమాలు

1
ఎవరైనా తోడు కొరకు తప్పక ప్రయత్నించండి, ఎప్పుడైతే నిజమైన తోడు దొరికిపోతారో, అప్పుడు వారిపై శ్రద్ధ, విశ్వాసము కుదుర్చుకోండి, వారి ఆజ్ఞలను పాటించండి.
2
పరమాత్ముడు ఆనంద స్వరూపులు, పరమానందులు. ఎవరైతే వారితో సంపర్కములో ఉంటారో వారే సంపూర్ణముగా ప్రసన్నముగా ఉండకలుగుతారు, ఎందుకంటే వారి ప్రకాశము ముందు అన్నీ నిస్తేజమై పోతాయి. ఇందుకే సంత్ మహాత్ములు ఎప్పుడూ ప్రసన్నచిత్తులై ఉంటారు.
3
ఈ దారిలో వెళ్ళే వారిని అందరూ చాలా ప్రశంసిస్తారు, ఆదరిస్తారు. మీరు వారి పొగడ్తల్లోకి వచ్చారంటే మాత్రము దారి తప్పి పోతారు.
4
అరే! నేనైతే ధర్మము యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నాను, అనే అహంకారము మీ మనస్సులో ఉద్భవిస్తే చాలు, మీరు మరొక దారిన పడిపోతారు.
5
ఈ మార్గాన్ని అనుసరించిన వారిని, ముందుకి వెళ్ళేక రిద్ధులు స్వాగతించి మీకు కావలసినది స్వీకరించండి అంటాయి, మీరు స్వీకరిస్తే మాత్రము మీ ప్రగతి ఆగి పోతుంది.
6
మీకు సిద్ధులు దర్శనమిచ్చి, మీరు కావాల్సిన వ్యక్తిత్వాన్ని ధరించండి అని మీకు ఉపహారాలు ఇవ్వడానికి సిద్ధపడతాయి. వీటిని స్వీకరిస్తే మాత్రము మీ ప్రగతి ఆగిపోతుంది, అలాకాకుండా మీరు గురు చరణాలను చూసుకుంటూ వెళ్తే మాత్రము మీరు చాలా ముందుకి వెళ్లి పోతారు. ఎక్కడైతే గొప్ప-గొప్ప యోగులు కూడా చేరలేక పోతారో.
7
గురువు మీకు ఏ వస్తువు ఇచ్చారో అది అన్ని సంపదలకన్నా గొప్పది, అన్ని వైభవాలకన్నా మించినది, ఇది ఒక అమృతము, ఏదైతే మృత్యు యొక్క దుఃఖాన్నుండి తప్పించేస్తుందో, అందుకే దీన్ని దాచి పెట్టండి. మనకి తెలియనే తెలియదు వారి కృప ఎలాగ కలిగిందో, మనకు ఈ పరమ ధనము, పరమానందము లభించిందో!

తాజా వ్యాసాలు

అన్నీ చూడండి
ప్రేమ యొక్క మూలము సద్గురు

ప్రేమ యొక్క మూలము సద్గురు

ప్రేమ యొక్క మూలము సద్గురు प्रेम के स्रोत सद्गुरु ఈ విశ్వములో ఏ మార్గమైనా, జ?......

మరింత చదవండి

శిష్యుడు అంటే ఎవరు ?

శిష్యుడు అంటే ఎవరు ? शिष्य कौन ఇంతకు ముందు అధ్యాయాలలో మేము సంత్ మతము, సంత్ జ??......

మరింత చదవండి

సంత్ యొక్క స్పర్శ

ఈ సమావేశం ఏదైతే జరుగుతోందో, అది వసంత పంచమి శుభ సందర్భాన జరుగుతున్నది అని మ??......

మరింత చదవండి
సమర్పణము

సమర్పణము

మనమందరమూ ఏ సాధనైతే చేస్తున్నామో, దానిలో పూర్ణత్వము, సమర్పించడములోనే ఉంది. ......

మరింత చదవండి

Amrit ki oor

అమృతం వైపు Amrit ki oor సాధారణముగా మనము వింటూనే ఉంటాము మనిషి జన్మ చాలా భాగ్యం  తో ల......

మరింత చదవండి

Kahat Na Aave Bain

कहत न आवे बैन వర్ణనాతీతము ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడి ఒక అందమైన రచనే,ఈ సృష్టి. మహ......

మరింత చదవండి