ఈ విశ్వములో ఏ గురువైన దారి చూపించేవారు మాత్రమె కాదు, ఈ సంసార రూపమైన అడవిలో మనతో పాటూ నడిచేవారు. వారి గురించి ఏమైనా అందామంటే మాట మూగ పోతుంది. మహాత్ములు అన్నారు--
గురు మహిమ హరి కన్నా గొప్పది.వేదాలూ, పురాణాలూ ఉద్ఘోషణ చేసి (అరిచి-అరిచి) చెప్తున్నాయి.గురువు కృప కలిగినప్పుడు బ్రహ్మ మరియు వ్యాసుడిలా మనల్ని మార్చడానికి ఒక క్షణము కూడా పట్టదు.వారు ఒక నీటి చుక్కను సముద్రములా మార్చ గలరు, అల్పజ్ఞుడిని సర్వజ్ఞుడిని చేసేస్తారు. వారు జ్ఞానము యొక్క సాగరులు. వారు మన జ్ఞాన చక్షులను తెరిచేస్తారు, కాకిని కోకిల చేసేస్తారు, అప్పుడు దాని వాణిలో మాధుర్యము వచ్చేస్తుంది.