ప్రతి మనిషి ఇది తెలుసుకోవాలని అనుకుంటాడు – గురువు యొక్క స్వరూపమేమిటి అని ఎలాగతెలుసుకొవడము? ఎవరినైనా గురువు రూపములో పొందాలంటే గురువులో ఏ లక్షణాలు ఉండే అవసరముంది?
గురుమ్ ప్రశాంతం భవ భీతి నాశం విశుద్ధ బోధం కలుశాపహారం ,
ఆనంద రూపం నయనాభిరామం శ్రీ సత్య దేవం నితరాం నమామి.
గురువు ప్రశాంతవంతులు, భవభీతి నశింపచేసే వారు, విశుద్ధ బోధముతో కూడినవారు, కాలుష్యాన్ని హరించే వారు, ఆనంద స్వరూపులు, నయనాభిరాములు ఇలాంటి సత్య దేవునికి నేను నిరంతరము నమస్కరిస్తాను.
దీని గురించి మా గురువు గారు ఏమంటారంటే—గురువు యొక్క మొదటి స్వరూపము– “ప్రశాంతము”
ఎలాగైతే ఒక చెట్టు దగ్గరకి వెళ్తే, మనము ఏ భావముతో వెళ్ళినా, దాని కిందకి వెళ్తే చాలు అది నీడ ఇస్తుందో, దానికి ఆ కీర్తి ఉంది బిరుదు ఉంది. ఎంత దు:ఖములో ఉన్న మనిషైనా గురువు దగ్గరకి చేరినవారిని వారు శాంతపర్చేస్తారు. తాత్పర్యము ఏమిటంటే ఎక్కడైతే కూర్చున్న మాత్రాన్నే మన అంతఃకరణము శాంత పడిపోతుందో, మన మనస్సు మరియు ఆత్మ శాంతిస్తుందో. వారు భయభీతి ని నశింప చేసేవారు .
‘భవ’ యొక్క అర్థము ఏమిటంటే ‘అయిపోవడము’. ఈ విశ్వములో భయము అనేది అసలు లేదు “కానీ అది అయి పోయింది”. దీని తాత్పర్యాన్ని ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకో వచ్చును. ఎలాగైతే చీకటిలో తాడును చూసి పాము అనుకోని భయ పడిపోతామో.
ఒక గది ఉంది,అక్కడ రకరకాల సౌకర్యాలుఉన్నాయి, ఉదాహరణకు - టీ.వీ. ఫ్రిడ్జి, సోఫా సెట్టు, కానీ అక్కడ మాత్రము చాలా చీకటి ఉంది. దాని మూలాన గదిలోకి వెళ్ళగానే కాళ్ళకు , చేతులకు అవి అడ్డు తగిలి పోయాయి. కానీ ఎప్పుడైతే లైట్ స్విచ్ ఆన్ చేసామో అంధకారము దూరమైపోయింది, నిజమేమిటో తెలిసిపోయింది, భయము దూరమైపోయింది, ఇంక ఎంత సంతోషమో! తాత్పర్యమేమిటంటే ఈ విశ్వములో ఏ భయమైతే ఉద్భవించిందో, దానిని నశింపచేసేవారు గురువు.
విశుద్ధ బోధము—ఎవరైతే జ్ఞానము యొక్క బోధన చేయించే వారో వారిని గురువు అంటారు. గురువు విశుద్ధ బోధ స్వరూపులు. రెండు కళ్లతోనూ ఏ జ్ఞానమైతే మనము పొందుతామో అది బుద్ధి యొక్క విషయము, కానీ ‘బోధము’ అనేది ఆత్మ యొక్క విషయము. అప్పుడప్పుడు ధ్యానము తరువాత ఆనందము యొక్క అనుభూతి కలుగుతుంది అది బోధము. దేనినైతే శబ్దాల ద్వారా వర్ణించలేమో. గురువు సమీపములో కూర్చుంటే కలిగే ఆనందము యొక్క అనుభూతి వర్ణనాతీతము.
గురువు కలుషాపహారులు – తాత్పర్యము పాపాలను నశింప చేసేవారు. గురు కృప వలన గురు తత్వము ఎప్పుడైతే ఎవరిలోనైనా ప్రకటిస్తుందో, అప్పుడు వారు గురువు అనిపించ బడతారు. ఏదైతే పరమేశ్వరుడి మానవ స్వరూపమో, అదే గురువు స్వరూపము. వారి దర్బారులో ఏ రకమైన భేదము ఉండదు. దుష్టుడైనా, సజ్జనుడైనా, పాత్రుడైనా, అపాత్రుడైనా ఇక్కడ భేదము అనేది లేనే లేదు. వారి స్వరూపము స్నేహమయము, వారు అందరినీ ప్రేమిస్తారు, వారిలో అందరి కొరకు దయ, మమకారము, వాత్సల్యము ఉంటుంది. వారికి స్వ –పర అనే భావము ఉండదు. క్షణములో దుష్టుల హృదయాన్ని శుభ్రపరిచేస్తారు. గురు దృష్టి పడితే చాలు, హృదయము నిర్మలమైపోతుంది అనడానికి ఇదే కారణము. దేనిలోనైతే , స్నేహము ఉందో, మమకారము ఉందో, కానీ వీటి అన్నిటికన్నా, గొప్ప గుణము వాత్సల్య రూపము, అదే మాతృరూపము. అచ్చట స్వ-పర భేదము లేదో. మంచి-చెడు, సజ్జన దుర్జనుల భేదం లేదు, క్షమార్పణ అడగమనే పని లేదు, ఏ రకమైన భేదమూ లేదు. వారు మన స్వరూపాన్ని చూడరు , ఆత్మనే చూస్తారు. వారు అంతర్ దృష్టి కలిగినవారు కనుక ఎదుటి వ్యక్తిని చూడగానే , వారు ఆత్మ స్థాయికి చేరిన వారు అవునా కాదా అని తెలుసుకోగలరు .
కళ్ళనుండి ప్రవహిస్తున్న ఆ ప్రేమ, ముగ్ధమనోహరమైన ఆ చిత్తము ద్వారా మనము గురువుని తెలుసుకోగలము.