Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

ಹಿಂದೆ

గురువు అంటే ఎవరు ?

ఏ మనిషిలోనైనా ఎప్పుడైతే , నేను రకరకాల పూజలు అనుష్ఠానాలు, వ్రతాలు, ఉపవాసాలు, జపాలు-తపాలు, అన్నీ చేసినా కానీ నాకు ఎలాంటి శాంతి మరియు ఆనందము లభించడము లేదు అనే భావము ఉద్భవిస్తుందో, అప్పుడు ఏమి అర్థ మౌతుందంటే ఈ శాంతిని, ఈ ఆనందాన్ని పొందాలంటే గురువు కావాలి, అని పూర్తి నమ్మకముతో ఆ మనిషి గురువు సమక్షానికి చేరతాడు. అప్పుడు ఆ మనిషి మనస్సులో ఏ భావము ఉంటుందంటే, నాకు వీరి ద్వారా జ్ఞానము లభిస్తుంది అని గురువు ఇచ్చిన సాధనలో తల్లీనమైపోతాడు. మొదటి మారు దర్శనము చేసుకున్నప్పుడు తన అభిప్రాయము గురువు గురించి ఏమై ఉంటుందంటే వీరు నన్ను తప్పక నా గమ్యానికి చేరుస్తారు. కొంత కాలం వరకూ వారి ద్వారా దొరికిన సాధన చేసిన తరువాత గురువు పై అభిప్రాయము ఈ విధముగా మారుతుంది.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహు గురుర్దేవో మహేశ్వరః|
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
అప్పుడు ప్రారంభములో, శిష్యుడు గురువుని ఎలాగ అర్థము చేసుకుంటాడంటే వీరు బ్రహ్మ, సృష్టి కర్త. కొంత కాలాంతరములో ఏమి అనుభవమౌతుందంటే, వీరు సృష్టి కర్తే కారు, మమ్మల్ని పోషించే విష్ణుమూర్తి కూడా, ఇంకా కొంత ముందుకి వెళ్లేక ఏమి అనిపిస్తుందంటే గురువైతే శుభము చేసే శివుడు కూడా. కానీ ముందు-ముందు ఏమర్థమౌతుందంటే గురుస్థాయి ఈ ముగ్గురు కన్నా పై స్థాయిది.అప్పుడు వీరు పరబ్రహ్మ అని పూజిస్తాడు.
ధ్యాన మూలం గురోర్మూతి: పూజా మూలం గురో: పదం|
మంత్ర మూలం గురోర్వాక్యం మోక్ష మూలం గురో: కృపా||
ధ్యానానికి మూలము గురువు యొక్క మూర్తి
పూజ యొక్క మూలము గురువు పాదాలు
గురువు యొక్క వాక్యమే మంత్రము యొక్క మూలము,
గురువు యొక్క కృపే మోక్షానికి మూలము
అంతా కేవలం గురు కృపే.