Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

వెనక్కి

ప్రేమ యొక్క మూలము సద్గురు

ప్రేమ యొక్క మూలము సద్గురు

प्रेम के स्रोत सद्गुरु

ఈ విశ్వములో ఏ మార్గమైనా, జ్ఞానమైనా, కర్మఅయినా యోగమైనా, తంత్రమైనా లేక భక్తి మార్గమైనా కానివ్వండి, పరమ ప్రేమ లేకుండా ఈశ్వర ప్రాప్తి ఆకాశ కుసుమములాగే అనిపిస్తుంది (ప్రతీతమౌతుంది). మహాత్మా కబీర్ లాంటి సంత్ కి ఇవన్నీ తెలిసి వున్నా కూడా తన అంతర్భావమును ప్రకటిస్తూ మానవ మాత్రుడికి ఇదే సందేశము ఇస్తున్నారు ---
పోథీ పఢి పఢి జగ్ ముఆ పండిత్ భయా న కోయ|
ఢాయీ ఆఖర్ ప్రేమ్ కా పఢై సో పండిత్ హొయ్ ||
పెద్ద పెద్ద గ్రంథాలు చదివి-చదివి ఎంత మంది వెళ్ళి పోయారో కానీ ఎవరూ విద్వాంసులు అవలేక పోయారు. రెండున్నర అక్షరాల ‘ప్రేమ’ అనే పదాన్ని చదివినవారు, తాత్పర్యాన్ని అర్థము చేసుకున్నవారు, పండితులు అయ్యారు.
ఆ “రెండున్నర అక్షరాల ప్రేమ” అనే చదవాలి, చదవడమే కాదు మననము చెయ్యాలి, మననము చేసాక నిధిభ్యాసన (నిదిధ్యాసన) అంటే మన అంతరాలలో ఇమడ్చాలి, ఆ రంగులో మనని పూర్తిగా లయము చేసేయ్యాలి. ఎలాగైతే గురు మహారాజ్ గారు పాండవులకు, కౌరవులకు, సత్యం వద, ధర్మం చర స్వాధ్యాయాన్మాప్రమద: ప్రథమ పాఠము కంఠస్థము చేయడానికి ఇచ్చారో, అప్పుడు అందరూ రామ చిలుకలాగ కంఠస్థము చేసి గురువు గారికి అప్ప చెప్పేశారు. కానీ యుధిష్ఠిరుడు మాత్రము అందరిలాగ వినిపించలేక పోయాడు, వారికైతే సత్యం వదను అంతరాలలో నింప వలసి ఉండేది, ఆఖరికి అంతరాలలో ఇమడ్చడములో సాఫల్యము దొరికింది. ఇలాగే ఆ రెండున్నర అక్షరాల “ ప్రేమ ” ను మన అంతరాలలో లయము చేసేయ్యాలి. ఇందుకే సహజో బాయి లాంటి గురు భక్తురాలు ఈ విధముగా సూచిస్తున్నారు.
ప్రేమ ప్రేమ సబ్ హీ కహే ప్రేమ న చీన్హే కోయ|
ఆఠ పహర్ భీనా రహే ప్రేమ కహావే సోయ ||
తాత్పర్యం—ప్రేమ-ప్రేమ అని అందరూ అంటారు కానీ ప్రేమ ఎవరికీ తెలియదు. ఎవరైతే ఎనిమిది ప్రహరాలు (ఆ ఈశ్వరుడిలో) నిమగ్నమైవుంటారో అదే ప్రేమ. ఈశ్వరుడు ప్రేమ మయుడు. ఈజీవాత్మ ఈశ్వరుడి అంశం. అంశీ యొక్క గుణము అంశములో సహజముగానే దృష్టిగోచరము అవుతుంది.
ప్రేమ హరీ కౌ రూప హై త్యో హరి ప్రేమ స్వరూప్ |
ఏక హోయి ద్వై యో లసై జ్యో సూరజ్ అరు ధూప్ ||
ప్రేమ హరి యొక్క రూపము, అలాగే హరి కూడా ప్రేమ యొక్క స్వరూపము, ఒకటే వస్తువు కానీ చూడడానికి రెండులాగ అనిపిస్తుంది, ఎలాగైతే సూర్యుడు దాని వేడిమి.

పరమ సమర్థ గురు మహారాజ్ గారి వాణిలో ప్రేమయెక్క సంగ్రహావలోకనం (గ్లింప్సె) చెయ్యండి. “ భక్తి ఒక వస్తువు అయితే ప్రేమ ఇంకొక వస్తువు. భక్తి సాధన అయితే ప్రేమ సిద్ధి. ఎవరైతే భక్తినే ప్రేమ అని అర్థము చేసుకున్నారో వారు తప్పు చేస్తున్నారు. జ్ఞానము, భక్తీ మరియు యోగము ఎక్కడైతే సమాప్తమైపోతాయో అచ్చట ప్రేమ యొక్క అభ్యుదయము మొదలవుతుంది. ప్రేమలో కర్మ ఉండదు, ఆలోచన ఉండదు, కేవలం ప్రియుడి జ్ఞాపకము, కలుసుకునే తీవ్రమైన కోరిక ఉంటుంది. ప్రేమ రసము యొక్క ఒక చుక్క అయినా గొంతు నుండి కిందకి దిగిందంటే మత్తు ఎక్కుతుంది. ఇదే వేదాల సోమరసం, ప్రేమలో అహంకారం లోపిస్తుంది, బుద్ధి ఆ స్థానానికి క్రింద ఉండిపోతుంది, ఆలోచన, వివేకము శాంతపడిపోతాయి. ప్రేమలో ఆకర్షణ ఉంది ఆనందము ఉంది. ప్రేమే ఆనందమయ కోశము”.
జహా బాజ్ బాసా కరై పంఛీ రహత న కోయ|
ప్రేమ భావ్ పరకాసియ సబ్ కఛు గయా బిగోయ్ ||
ఎక్కడ అయితే డేగపక్షి నివసిస్తుందో అచ్చట ఏ పక్షీ ఉండదు |
ఎచ్చటైతే ప్రేమ భావము ప్రకాశిస్తుందో అచ్చట ఇంక ఏమీ మిగలదు.
ప్రేమ ఒక కేన్వాస్ (canvas ) దేనినైతే ప్రకృతి అలంకరించిందో మరియు ప్రేమికుల యొక్క కల్పనలు తీర్చి దిద్దాయో – ఒక విచారకుడు వాల్టేయర్.
ఖలీల్ జిబ్రాన్ లాంటి విచారకులు వ్రాశారు - ‘ఎప్పుడైతే ప్రేమ నిన్ను పిలిచే సంకేతము ఇస్తుందో అప్పుడు దాని అనుచరుడు అయిపో, ఆ భూమి ఎన్ని రాళ్ళతో నిండి ఉన్నా మరియు ఎంత పల్లమైన దారైనా, అది ఎప్పుడైతే దాని రెక్కలు నిన్ను కప్పడానికి పరుస్తుందో, అప్పుడు నువ్వు (నిన్ను) అందులో ఇమిడించేసుకో, అందులో ఉన్న ముళ్ళవలన నీ శరీరము గాయాలతో నిండిపోయినా, పుష్పాలు ముళ్ళలోనే ఉంటాయి, ఆ ముళ్ళతో వాటి రేకలు గాయపడినా, వాటికి వాటితోనే ఆప్యాయత, అదైతే ఆ ముళ్ళల్లోనే పూస్తుంది, చిరు నవ్వు నవ్వుతుంది, గట్టి గట్టిగా నవ్వుతూన్నట్లు అనిపిస్తుంది, అది అందులోనే ఆనందిస్తోంది, దానికి ఆ ముళ్ళతోనే ప్రేమ, ఎలాగైతే చాతక పక్షి కి దాని ప్రియమైన స్వాతి నక్షత్రము యొక్క మబ్బులలో ఉన్న దోషాలు కనిపించవో.
చఢత న చాతక్ చిత కబహు ప్రియ పయోద్ కే దోస్ |
తులసీ ప్రేమ పయోధి కీ తాతే నాప్ న జోఖ్ ||
చాతక పక్షి యొక్క చిత్త (మనస్సు) కి దాని ప్రియమైన మబ్బులలో ఉన్న దోషము ఎప్పుడూ కనిపించదు. తులసీదాస్ జీ అంటారు ప్రేమ యొక్క సాగరానికి ఏ కొలతా లేదు.
ఇలాగే ప్రేమికుడుకి ప్రియమైన వారి దోషాలలో కూడా గుణాలే కనిపిస్తాయి ఎందుకంటే ఆ అగాధమైన ప్రేమ పయోధిలో వారు విలీనమైపోతారు, వారైతే ప్రియమైనవారిని చూస్తూనే ఉంటారు, రసఖాన్ లాంటి ప్రేమికుడి పరిస్థితి ఎలాగుండేదో వారే స్వయంగా చెప్తున్నారు –
కాహూ సో మొయీ కహా కహియే, సహియే జు సోఈ రసఖాన్ సహావై |
నేం కహా జబ ప్రేమ కియో, తబ నాచియే సోఈ జో నాచ్ నచావే ||
ఎవరితోనైనా నేను ఏమి అనాలి? రసఖాన్ కవి అంటారు, దేనిని అయితే సహించమంటారో దానిని సహించడమే, ఎప్పుడైతే ప్రేమించామో, అప్పుడు నియమాలు ఎక్కడ? అప్పుడు ఎలాగ నృత్యము చేయిస్తే అలాగే నృత్యము చెయ్యండి.

చాహత్ హై హమ్ ఔర్ కహా సఖి, క్యో హూ కహూ ప్రియ దేఖన్ పావే|
చరియే సో గుపాల రచ్యో తౌ చలౌరీ సబై మిలి చేరీ కహావే ||
హే సఖీ! నాకు ఇంకా అనాలి అని అనిపిస్తుంది, కానీ ఎందుకు అనాలి! ప్రేమికుడిని చూడగలిగితే బాగుండేది అనా? అలాగే నడుద్దాము ఎలాగైతే గోపాలుడు రచించేడో, అలాగైతే మనము అందరమూ కలిసి కృష్ణుడికి దాసీలమైపోదాము.
ఇలాగే భరతుడి లాంటి భక్తుడి హృదయములో ఉన్న ప్రేమాగ్ని, రామ చరణాల దర్శనముతో తొలిగిపోగలదు, అందుకే వారు తన దీనతను ఈ విధముగా ప్రకటించారు –
ఆపని దారున్ దీనతా కహఉ సబహి సిరు నాయి, దేఖే బిను రఘునాథ్ పద్ జియ్ కే జరని న జాయి –
తన దారుణమైన దీనతను భరతుడు తల వంచి అందరితోనూ చెప్తున్నారు, శ్రీ రఘునాథుడి పాదాలను చూడకుండా, హృదయములో ఉన్న ప్రేమాగ్ని తొలగదు అని.
ఇంకా భక్తుడి హృదయములో ఒకటే తీవ్రమైన కోరిక ఉంది -
“ఎకహి ఆంక్ ఇహయి మన్ మాహీన్ ప్రాత:కాల్ చలిహున్ ప్రభు పాహీ” ఒకటే కోరిక ఈ మనస్సులో ఉంది ప్రాత:కాలాన్నే వెళ్లి ప్రభుని పొందాలని .ఇది ఒక భక్తుడి( హ్రుదయోద్గారము) హృదయవేదన, ఎచ్చటైతే జీవితములో ఆ ఇష్టుడే(ప్రేమికుడు) వ్యాపించిపోయాడు.

ఒక విచారకులు వ్రాశారు – వాస్తవికములో మనము అసలు ఎవరు? మన మూల ప్రకృతి ఏమిటి? దీని అనుభవము మనిషికి సూక్ష్మావలోకనము వలెనే దొరుకుతుంది. ఖాళీ సమయములో మనము ఏమి చేస్తాము? ఏకాంతములో మన అభిరుచి ఎలా గుంటుంది? ఎలాగైతే భోజనము చేసేవారికి ప్రతి ముద్దతో పాటూ తుష్టి, పుష్టి, మరియు క్షుధా నివృత్తి, మూడూ లభిస్తాయి అలాగే మనిషి భగవంతుడి శరణు పొంది వారి ధ్యానము చేస్తాడు. అతనికి ధ్యానము యొక్క ప్రతి క్షణములో భగవంతుడిపై ప్రేమ, తన ప్రభువు స్వరూపము యొక్క అనుభవము మరియు సంసారము యొక్క అన్ని విషయాలనుండి వైరాగ్యము ఈ మూడింటి ప్రాప్తి అవుతుంది. అసలైతే ఈ మనస్సు అత్యంత చంచల,చపల, వేగవాన్, బలశాలి మరియు మొండిది, దానిని వశములో పెట్టడము చాలా కష్టకరము కానీ వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా దానిని వశములోకి తీసుకురావచ్చు. ఇంద్రియాలను వశములో పెట్టి మనస్సుని నియంత్రణలో పెట్టడము సంభవము కాదు, కానీ మనస్సుని వశంలో పెట్టి ఇంద్రియాలను నియంత్రణలో పెట్టగలము. ప్రేమ జెండా పైకెత్తుతూన్న ఆ “బ్రజ” లో ఉండే చదువులేని గోపికలు తమ మనస్సుని కృష్ణుడికి సమర్పించేసి దాని వలనే ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడిని, మజ్జిగ నిండి ఉన్న చిన్న కుండపై నర్తన చేయించార. సమర్పణ ఐతే గురు కృపవలనే సంభవము, శిష్యుడి ప్రయాసము పనికి రాదు. “గురు కృపా హి కేవలం” ఇది ఒక్కటే సహారా.
పరమ్ భాగవత్ పండిత్ జీ మహారాజ్ గారి అమోఘమైన వాణిలో గురువు యొక్క ఆశీర్వచన దర్శనము మాత్రమే కనిపిస్తోంది, ఇందుకే వారు వ్రాసారు –“విశాల వృక్షము అవకముందు ఆ గింజకు పృథ్వీ మాత గర్భములో కొన్ని రోజులు ఉండవలసి వస్తుంది, అదే ఆశీర్వచనము ఇచ్చింది. ఇంకా అది ఆ విశాలతను పొందింది. ఇందుకే నువ్వు ఎవరి చరణాలలోనైనా దాగి కూర్చో ఏదో ఒక రోజు వారే ఆశీర్వచనము ఇచ్చి నిన్ను పైకి ఎత్తేస్తారు. తన అంతట తనే తల పైకి ఎత్తితే ఎవరూ ఎదిగిపోరు.
ఒక షాయర్ యొక్క సాహిత్యం దీని కొరకే ప్రేరిస్తోంది
మిటా దే అపనీ హస్తీ కో గర్ కుఛ మర్తవా చాహే|
కి దానా ఖాక్ మే మిలకర్ గులే గుల్జార్ హోతా హాయ్ ||
నీ ప్రాముఖ్యతను కొన్నిసార్లు తొలిగించేయ్యి, ఎందుకంటే గింజ
మట్టిలో కలిసినప్పుడే పువ్వుల తోట తయ్యారు అవుతుంది.
కారలాయి యొక్క విచారములో –“Love unexpressed is sacred.” అవ్యక్తమైన ప్రేమే పవిత్రమైనది. ఎవరి హృదయములోనైనా ఏదైనా బాధ ఉందొ, వారు ఎక్కడపడితే అక్కడ కేక పెడుతూ తిరుగుతూ ఉండరు , వీథిల్లో కేకలు పెడుతూ, వారే తిరుగుతూ ఉంటారు. ఎవరి హృదయములోనైతే ఆ ప్రేమ యొక్క మధురమైన రసముతో కూడిన “ఓహ్” అనే శబ్దము రాదో! ఇలాంటి ప్రేమకులకు వారి దర్శనము ఎక్కడ?
దాదూజీ మహారాజ్ గారి వాణి ద్వారా దొరుకుతూన్న సంకేతాన్ని
చూడండి – అందర్ పీర్ న ఉభరై, బాహర్ కరై పుకార్ |
దాదూ సో క్యా కరి లహై, సాహిబ్ కా దీదార్ ||
తాత్పర్యము-- లోపల ఏ బాధాలేదు, బైట కేక పెడతారు ఇలాంటి వారికి, దాదూ గారు అంటారు సాహెబ్ యొక్క దర్శనము ఎందుకు దొరుకుతుంది?
దీపము ఇంటిలోపలే నిశ్కంపముగా నిశ్చలముగా ఉంటుంది, గుమ్మము బైటకి వస్తే దాని జ్యోతి, క్షీణిస్తుంది లేకపోతే ఆరిపోతుంది. వాస్తవములో పవిత్ర ప్రేమ ఒక దీపము లాంటిది. ఇందుకే అన్నారు ప్రేమ అయితే మూగది. ఒక పాశ్చాత్య విచారకుడు ఏమంటారంటే –Love’s tongue is in the eyes. తాత్పర్యము ప్రేమ యొక్క నాలుక కళ్ళల్లో ఉంటుంది, ఇక్కడైతే కళ్ళే మాట్లాడతాయి నాలుక కాదు. ఎవరైతే ఆ ప్రియుడిని చూసేసారో వారు ఇంక ఏమీ అనరు వారి గురించే చెప్తూ తిరుగుతారు అతనికి వారి దర్శనము కలగనే లేదు.
కబీర్ సాహెబ్ గారి సాఖీ ప్రకటిస్తోంది---
జో దేఖే సో కహై నహి కహై సో దేఖే నాహి|
సునై సో సమఝావై నహీ రసనా దృగ శృతి కాహి||
తాత్పర్యము --- ఎవరైతే చూసేరో వారు చెప్పరు, ఎవరైతే చెప్తున్నారో వారు చూడ లేదు, ఎవరైతే విన్నారో అర్థము అయ్యేలాగ చెప్పరు, ఎందుకంటే నాలుకకి కళ్ళు,చెవులు ఎక్కడ?
వస్తుత: ఆ ప్రేమ అయితే అత్యంత గోపనీయమైనదే. ఇలాంటి ఆ ప్రేమనే పరా భక్తి అంటారు ఏదైతే అన్నింటికన్న ఆఖరిన వస్తుందో. ప్రేమ యెక్క ఆత్యంతిక అనుభవమే పరమాత్ముడు. ప్రేమించండి, ప్రేమిస్తూ ఉండండి, మీ పిల్లలతో, భార్యతో, పరివారముతో, అందరి ప్రియజనులతో, మనుషులతో, పశువులతో, వృక్షాలతో –చెట్లతో, పర్వతాలతో, ప్రతి చోటా ఆ ప్రేమని వ్యాపించడి. ఎలాగైతే ఈ ప్రేమ యొక్క వ్యవహార-క్షేత్రము పెరుగుతూఉంటుందో అలా అలా వారిలో పరమాత్ముడి దర్శనము ఒక చూపులో కనిపించడము మొదలౌతుంది. పరమ్ సమర్థ గురుమహారాజ్ గారు దీనిని ఇంకా స్పష్టము చేస్తూ అంటారు --- ఈశ్వరుడు ప్రేమ కోరతాడు ప్రేమ యొక్క నాడి మనిషిలో అణిగి పడి ఉంది. పరమాత్మ అంటాడు నన్ను ప్రేమించు, అందరినీ ప్రేమించు నిన్ను నువ్వే ప్రేమించు, కానీ మనమే మన శత్రువులమై కూర్చున్నాము.....స్త్రీ, ధనము, సంతానము, వైభవము, కుటుంబము, తెగల యొక్క వలలో మనిషిని ఎందుకు ఇరికించారంటే వారు ప్రేమించడము నేర్చుకోవాలని, ప్రేమ యెక్క మూలము(source) పగిలి, బద్దలై దాని నుండి ప్రేమ, ధార రూపములో ప్రవహించాలని, తరువాత దానిని రెండో వైపుకి తిప్పెయ్యాలి –అంతే, పని పూర్తి అయిపొయింది. గుఱ్ఱము దక్షిణ దిశకు తీవ్ర గతితో పరుగెడుతూ ఉండేది కళ్ళెము లాగేసరికి అది ఆ వేగముతోనే ఉత్తర దిశ వైపుకి పరుగెత్తడము మొదలెడుతుంది. ....ఎవరికైతే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులపై ప్రేమ లేదో, భగవంతుడు ప్రసాదించిన వస్తువులపై ప్రేమ లేదో, ఇలాంటి కఠోరమైన హృదయమున్న మనుషులకు ఈశ్వర దర్శనము నూరు జన్మలు ఎత్తిన అసంభవము.

వస్తుత: గురువే ఆ ప్రేమ యొక్క మూలము, ఎలాంటి కఠోరమైన హృదయమైనా, ఇలాంటి సమర్థుల శరణుకి వెళ్ళినప్పుడు, నమ్రత, సరళత, సహజత పోందేస్తారు. అంగులిమాల్, వాల్మీకి, ఎలాంటివారు ఉండేవారు? క్షణ మాత్రము దొరికిన సాన్నిధ్యము వలన మారి పోయారు. గురువు అయితే అగాధమైన ప్రేమ సాగరులు, ప్రేమను పంచుతూనే ఉంటారు, వారు ప్రేమ యొక్క రసాయనులు.
ప్రేమాంబుధిం ప్రేమ రసాయనంచ ప్రేమ ప్రదానం నిధిమద్వితీయం| మృత్యుం జయం మృత్యు భయాపహారం శ్రీ సత్య దేవం నితరాం నమామి||