Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

பின்

శిష్యుడు అంటే ఎవరు ?

శిష్యుడు అంటే ఎవరు ?

शिष्य कौन

ఇంతకు ముందు అధ్యాయాలలో మేము సంత్ మతము, సంత్ జనుల స్వరూపము, చరిత్ర ఆది గురించి విస్తృతంగా చర్చించాము. సంత్-మతములో గురు శిష్యుల పరంపరను నిర్వహిస్తూ, ఆధ్యాత్మిక మార్గం పై ముందుకి జరగబడుతుంది. సంత్-మతం గురించి చర్చించేటప్పుడు గురువు అంటే ఎవరు, ఎలా ఉంటారు అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు శిష్యుడి గురించి చెప్పడం న్యాయ సమ్మతముగా ఉంటుంది.

మానుష్ తన్ సద్గురు మిలన్ మోచ్ఛహు ఇచ్చా హోయ| యహ్ తీనో దుర్లభ్ పరమ్, పాయ సుయోగ్ న ఖోయ||

తాత్పర్యం - మనిషి జన్మ, పరమాత్ముడి యొక్క ఒక అందమైన కళాకృతి. జీవితము యొక్క దయనీయ పరిస్థితులను చూచి ఆ పరమాత్ముడు కరిగినప్పుడే ఈ జన్మ ప్రాప్తించబడుతుంది.—

'కబహుక కరి కరుణా నర దేహీ, దేత్ ఈస్ బిను హేతు సనేహి'

జీవుడు స్వయంగా నాశనం లేనివాడు, అజరుడు, నిర్మలుడు, అమరుడు కానీ ప్రకృతి తో మమేకం అవ్వడం వల్ల తన నిజ స్వరూపాన్ని మర్చిపోవడం జరిగింది. ఎలెక్సిస్ కైరల్ అను భావకవి తన ‘మాన్ ద అన్నోన్' (Man The Unknown) అనుగ్రంథంలో మానవుల మనస్సులో ఉత్పన్నమయ్యే ప్రశ్నల గురించి వివరిస్తూ ఇలా అన్నాడు-మనిషికి రెండు రూపాలు ఉంటాయి, ఒకటి తెలిసినది, మరొక రూపము ఏదైతే ఇప్పటికీ తెలియనిదే, ఆ రూపము మనిషికి తెలియనే తెలియదు. తెలిసిన రూపం అదే కదా! ఏదైతే ఎత్తు, రంగు-రూపం ఎలాగుందని వివరిస్తుందో. ఇది చాల అల్పమైనది, కానీ అజ్ఞాత రూపం చాల విస్తృతమైనది, ఆశ్చర్యపరిచేది. ఈ విస్తృతమైన, అజ్ఞాత రూపమైన దాని గురించి తెలుసుకునేదే జీవితము యొక్క నిజమైన ప్రక్రియ. అదే జీవితము యొక్క ఉద్దేశ్యం. విచిత్రం ఏమిటంటే మనిషి తనను తానే మర్చిపోయాడు, తన గురించి తెలుసుకోవడం మానేసి మనిషి తన చుట్టూ వున్న పూర్తి ప్రపంచాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో మునిగిపోయాడు. సంపూర్ణ జీవితము ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికే అర్పిం చేశాడు. ఒక షాయర్ ఈ విధంగా చెబుతాడు –

బాహమా జౌక్ -ఏ ఆవాగహి హాయ్ రే పస్తీఏ బశర్,|

సారే జహాఁ కా జాయజా అపనే జహాఁ సే బేఖబర్||"

తాత్పర్యము-- మనుషులు వారి శక్తి సామర్థ్యాలను వృథా చేస్తూ ఇక్కడా అక్కడా సరదాగా తిరుగుతూ, ప్రపంచములోని అన్ని విషయాలు తెలుసుకుంటారు కానీ తమ గురించి (బే ఖబర్) ఏమీ తెలుసుకోరు.

ఎలాగ తెలుసుకోవడము? ఈ ప్రశ్న మానవ మాత్రుడి సమక్షంలో వుంది. తన గురించి తాను తెలుసుకోవడానికి శాస్త్రాలు మూడు కృపల గురించి సూచించారు, మొదటిది - నిజ కృప రెండవది - గురు కృప మరియు మూడవది ఈశ్వరుని కృప. తన గురించి తెలుసుకోవాలనే కోరికే నిజ కృప ఆశయం. ఒకవేళ సాధకుల మనస్సులో తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉన్నట్లయితే తెలియ చేసేవాళ్ళు కూడా దొరికిపోతారు. ఋగ్వేదంలో ఇలా చెప్పబడి వుంది -'జానతాం సంగమేమహి' అర్థం – జ్ఞానవంతులతో (తెలుసున్నవారితో) సంప్రదించండి. శిష్యుని అంతరాలలో తెలుసుకోవాలన్న గొప్ప కోరిక ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి పరమ సమర్థులైన గురువు యొక్క సాన్నిధ్యం దొరికితే, అతను తన విస్మ్రు తమైన (మరచిపోయిన) మరొక రూపం అలవోకగ తెలుసుకోగలగడం మొదలుపెడతాడు. భారతీయ వాఙ్మయంలో ఎంతటి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సాహిత్యం ఉన్నదో, అది గురు శిష్యుల సంభాషణలోనే ప్రకటించబడింది. ఇటువంటి సంభాషణలలో శిష్యుని సందేహాలకు మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. జనకుడు – అష్టావకృడి సంభాషణ, కృష్ణార్జునుల సంభాషణ, (భగవద్గీతలో) యముడు-నచికేతుని సంభాషణ, యుధిష్ఠరుడు-భీష్మపితామహుల సంభాషణ, మైత్రేయి-యాజ్ఞవల్కుల సంభాషణ, నైమిషారణ్యంలో ఎనభై వేల ఋషుల సంభాషణ, ఆమన దేవి - కబీరు గారి సంభాషణ మొదలగునవి. వీటితో పాటు మరెన్నో కథలు ప్రయోగం చేయడం జరిగినది, వేటివలనైతే పాఠకులు సరైన విధముగా కంఠస్తం చేయకలుగుతారో. వివేకచూడామణిలో మనం చూసినట్లయితే, శిష్యుడు గురువుతో వినయంగా ఇలాగ ప్రశ్నించాడు హే! గురో! బంధనం అంటే ఏమిటి? ఇది ఎలాగ వచ్చింది? దీని ద్వారా మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది? అనాత్మ అంటే ఏమిటి? పరమాత్ముడు అని ఎవరిని అంటాము? ఇది విన్న గురువు సంతోషించి శిష్యుని సందేహాలను నివృత్తి చేసారు.

గురువు యొక్క కృప శిష్యుని ఆలోచన మీదనే ఆధారబడి ఉంటుంది. అగర్ హై తిష్నగీ కామిల్ తో పైమానే భి ఆఏంగే ఒక మహాపురుషుడు ఇలాగ వ్రాశాడు- గురువు నిన్ను హెచ్చరిస్తారు- నీవు నీ గురించి ఎంతైతే ఊహిస్తున్నావో నీవు అంతకన్నా ఎక్కువ. నీవు సాగరానివి, కేవలం నీటి చుక్కవై కూర్చుని ఉన్నావు. నీటి చుక్క అవ్వడం నీ నియతి కాదు, సాగరమవ్వడమే నీ నియతి.

"గురు బినా గతి నహీ, గురు బినా మతి నహీ".

గురువు లేని మనిషికి బుద్ధి అనగా జ్ఞానము ప్రాప్తించదు, ఇంకా అతడు తన జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోలేడు. గురువు యొక్క వివేకరూపమైన ప్రకాశం చేత శిష్యుడి అంతరము ప్రకాశితమవడం ప్రారంభిస్తుంది, మరియు ఆ శిష్యుడు ఎక్కడనుండి ఎక్కడకో చేరిపోతాడు. మహర్షి పతంజలికి సంబంధించిన ఒక సంఘటన- ఒకసారి కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని పతంజలి మహర్షి వద్దకు తీసుకు వచ్చి ఇలా అనడము మొదలు పెట్టారు- 'ఈ వ్యక్తి యోగ సాధన చెయ్యనూ చెయ్యడు, ఇంకా ఇతనికి వాటి పై నమ్మకం కూడా లేదు. ఇతని జీవితం అనవసర విషయాలలోనే వృథాగా గడిచిపోతోంది. అప్పుడు మహర్షి అతడిని తన వద్ద విడిచిపెట్టి కొంత కాలం తరువాత కలవమని చెబుతారు. ఆ వ్యక్తులు కొంత కాలం తరువాత అతడిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ వ్యక్తి లో ఎవరూ ఊహించని పరివర్తన కలిగి ఉంటుంది. వాళ్ళు చూసినప్పుడు ఆ వ్యక్తి వృక్షము క్రింద ధ్యానావస్థలో నిమగ్నమై ఉన్నాడు. మహర్షిని అడగగా వారు ఈ విధంగా వివరిస్తారు- ఇది సాధనాత్మక వాతావరణం మరియు దృష్టికోణ చికిత్స యొక్క

పరిణామము. దృష్టి చికిత్స ఏ సాధారణ వైద్యుడైనా చెయ్యగలడు కానీ దృష్టి కోణ చికిత్స చెయ్యడం ఒక్క ఋషికి మాత్రమే సాధ్యపడుతుంది. ఋషి తన సాధనబలంతో వ్యక్తి యొక్క దృష్టికోణాన్నే మార్చేస్తారు, తద్వారా ఆ వ్యక్తి యొక్క అంతరమే మారిపోతుంది. సమర్పణ

- మనిషి తన జీవితాంతం ఒక విద్యార్థి లానే ఉంటూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ఏ వ్యక్తి యొక్క ఆత్మ నుంచి శక్తి మరొక ఆత్మ లోనికి సంచరింపబడుతుందో, అతడు గురువు అనిపించుకుంటాడు మరియు ఎవరి ఆత్మలోకి శక్తి సంచరితమైనదో వారిని శిష్యుడు అంటారు. ఏ ఆత్మలోకైనా ఈ విధముగా శక్తి సంచరితము చెయ్యాలంటే, ఏ ఆత్మ నుండి ఈ సంచారము అవుతుందో, వారిలో స్వయంగా ఈ సంచార శక్తి ఉండాలి మరియు ఏ ఆత్మలోకైతే ఈ శక్తి సంచరింప బడుతోందో దానిలో ఈ శక్తిని గ్రహించే యోగ్యత ఉండాలి. విత్తనము మంచిదై ఉండాలి మరియు భూమి కూడా బాగా దున్నబడినదై ఉండాలి. అలాగే అసలైన గురువులో కూడా అపూర్వమైన యోగ్యత ఉండాలి. అందుకే శాస్త్రము ఏమంటుందంటే –“ఆశ్చర్యో వక్తా కుశలోsస్య లబ్ధా” ఆ జ్ఞానాన్ని తన అంతరాలలో ఎవరైతే నింపు కుంటాడో అతనే అసలైన శిష్యుడు. ఏ విధముగానైతే చకోర పక్షి చంద్రుడిని కంటిరెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటుందో, చాతక పక్షి స్వాతి నక్షత్రము యొక్క మబ్బుల వైపుకి చూస్తూనే ఉంటుందో, ఇలాగే ఏ శిష్యుడైతే నిర్నిమేష నేత్రాలతో వారి గురువుని చూస్తూనే ఉంటారో, వారికి ఆ జ్ఞానము సుళువుగా దొరికిపోతుంది. పరమ భాగవత్ పండిత్ జీ మహారాజ్ వాణి ఈ వైపుకి సూచిస్తోంది – ‘అగ్ని ఒక నిరాకార తత్వము, అది ప్రపంచములో ప్రతి చోట వ్యాపించి ఉంది, కానీ దానిని ఎప్పుడైతే ప్రకటించాలి అని అనుకుంటామో అప్పుడు ఒక వెలుగుతూన్న కర్రను రెండవ కర్ర యొక్క సంపర్కములోకి తెచ్చినప్పుడు, కొంత సమయములోనే ఆ అగ్ని రెండవ కర్రను కూడా అగ్నిలోకి మార్చేస్తుంది. అప్పుడు ఆ నిరాకారమైన అగ్ని సాకారము అయిపోతుంది. ఇలాగే మీరు కూడా సంత్ మహాత్ముల శరణులోకి వెళ్ళండి, ఎందుకంటే వారు స్వయం ఈశ్వర స్వరూపులు, ఈశ్వరుడిలో లయమైన వారు. అప్పుడు మీరు కూడా ఆ స్థాయికి చేర గలరు.’ఇలాంటి స్థితిని పొందడానికి శిష్యుడికి, గురువు ప్రతి సర్వతోభావేన సమర్పితులై తమను తాము అర్పించుకుంటే, గురువు సంతోషించి ఆ శిష్యుడికి ఇవ్వనిది ఏమి ఉండిపోతుంది? కృష్ణ పరమాత్ముడు గురువు యొక్క జ్ఞానాన్ని పొందడానికి యుక్తి చెప్పారు ---–

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శిన: || - గీత 4/34 తాత్పర్యము – ఆ జ్ఞానాన్ని నువ్వు (అర్జునుడు) తత్త్వదర్శులైన జ్ఞానవంతులకు నమస్కరించి, వారి సేవ చేసి మరియు నమ్రతాపూర్వకముగా వారిని ప్రశ్నించి తెలుసుకో. ఇలాంటి నీ జ్ఞాన పిపాసను, జిజ్ఞాసను మరియు నమ్రతను చూసి సేవ మరియు ప్రశ్నలతో సంతోషించి, ఆ తత్త్వదర్శులైన జ్ఞానవంతులైన పురుషులు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశించేస్తారు. దీని తాత్పర్యము ఏమిటంటే, శిష్యుడు తన వినమ్రతతోను, సేవ మరియు జిజ్ఞాస బలము వలన ఆ తత్త్వదర్శి మరియు జ్ఞానవంతుడైన పురుషుడ్ని నీ వైపుకి (ఉన్ముఖము) చేసేసుకోవాలి, లేకపోతే వారిలోనైతే జ్ఞాన ప్రదానం చేసే ప్రవృత్తే ఉండదు. వంగి నమస్కరించడము (ప్రణిపాతము), సేవ మరియు పరిప్రశ్న, ఇవన్నీ గురుకృపను ఆకర్షితం చేసే సాధనలు మాత్రమే. గురువు యొక్క హృదయము ఎప్పుడైతే ద్రవించిపోతుందో అప్పుడు ఆ జ్ఞానాన్నిశిష్యుడు చాలా సులువుగా పొందేస్తాడు. సూఫీ కవి మొహమ్మద్ జాయసీ వ్రాశారు --గురు హృదయ చినగీ జో మేలా |

జో సిలగాయి లేయి సో చేలా||

తాత్పర్యము – గురువు ఇలాంటి శిష్యుని అంతరాలలో, తన జ్ఞాన రూపమైన ప్రకాశ కిరణాలను ప్రవేశ పెడతారు. ఆ చింగారిని ఎవరైతే ప్రజ్వలితము చేసేసుకుంటారో వారే శిష్యులు.

సంత్ తులసీదాస్ గారి వాణి ఈ వైపే సంకేతము ఇస్తోంది – జే గురు చరణ్ రేను సర్ ధరహీ |

తే జను సకల విభవ బస్ కరహీ ||

తాత్పర్యం- ఎవరైతే గురు చరణ ధూళి శిరస్సున ధరిస్తారో వారు సకల వైభవాన్ని వశములో చేసేసుకుంటారు. ప్రతి శిష్యుడినీ గురువు తనలాగే చేద్దామనుకుంటాడు కానీ తను ఎందుకు చెయ్యలేక పోతాడంటే, శిష్యుడు తన అహంకారాన్ని వదలడు, ఈ అహంకారము అతన్ని విడవనే విడవదు, కేవలము అదైతే గురువు కృప కలిగినప్పుడే తొలుగుతుంది. దీనికొరకు శిష్యుడి ప్రయాసము ఒక్కటే పనికిరాదు, అహర్నిశం ప్రార్థన జరుగుతూనే ఉండాలి. గురువు కృప అయితే చేస్తారు, గురు కృప లేకుండా ఏ సాధకుడూ కృతార్థుడు అవలేడు. గురువు నడుస్తూ-మాట్లాడుతూన్న బ్రహ్మ. గురు-శిష్యుల సంబంధము పూర్వీకుల వంశముల సంబంధము లాంటిదే. శ్రద్ధ, నమ్రత, సమ్మానము మరియు శరణాగతి ద్వారా గురువు యొక్క మనస్సుని మన వైపుకి ఆకర్షితము చేసేస్తే, శిష్యుడి ఆధ్యాత్మిక ప్రగతి అవగలుగుతుంది. స్వానుభూతి గ్రంథాల ద్వారా పొందలేము. శ్రీ గురు కృప లేకుండా స్వానుభూతి యొక్క యథార్థమైన రహస్యము ముల్లోకాలలోనూ ప్రాప్తించదు.

. స్వానుభూతే ఆధ్యాత్మ జ్ఞానము యొక్క పరమ మరియు చరమ సీమ, సాధకుడు నేను ఎవరని అప్పుడే తెలుసుకోగలుగుతాడు. ఒక కథ హనుమంతుడి గురించి ఉంది – ఒకమాటు శ్రీరామచంద్రుడు వినోదముగా(సరదాగా) వారిని అడిగేశారు – హనుమంతా! నువ్వు ఎవరు? అప్పుడు వారు అతి వినమ్ర వాణిలో చెప్పారు –

‘దేహ దృష్ట్యా తు దాసోsహం –జీవ దృష్ట్యా త్వదంశక: ఆత్మద్రుష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి:’

‘ఓ పరమాతుడా! దేహ దృష్టితో నేను మీ దాసుడిని, జీవ దృష్టితో మీ అంశము మరియు ఆత్మ దృష్టితో మీరూ నేనూ ఒకటే, ఇది నా నిశ్చితమైనమతి(బుద్ధి). ఇలాంటి సమర్పితులైన శిష్యుడి విషయములో గురు భక్తురాలు సహజో బాయీ యొక్క వాణి ఇదే సంకేతము ఇస్తోంది .—

గురు కీ ఆజ్ఞా దృఢ కరి గహియే, గురు ఆజ్ఞా మే హీ రహియే|

గురు ఆజ్ఞా బిను కాజ్ న కీజై , హాని హోయ తో హోనే దీజై ||

సహజో సిఖ్ ఐసో భలో జైసే చకఈ డోర్|

గురు ఫేరే త్యోన్ హీ ఫిరై త్యాగే అపనీ ఖోర్ ||

సహజో సిఖ్ ఐసో భలో జైసే మాటీ మోయ్ |

ఆపా సోమ్పి కుమ్హార్ కూన్ జో కఛు హొయ్ సో హొయ్ ||

తాత్పర్యము – గురువు యొక్క ఆజ్ఞను దృఢంగా పట్టుకోండి, గురు ఆజ్ఞలోనే నడవండి, గురు ఆజ్ఞ లేకుండా ఏ పనీ చెయ్యకండి, హాని అయితే అవనివ్వండి. సహజో బాయి అన్నారు –శిష్యుడు ఎలాంటి వాడు కావాలంటే ఎవరైతే దారము మరియు చర్కీ లాగ ఉండాలి, తన ఇష్టాన్ని వదిలి గురువు ఎలాగ తిప్పితే అలాగే తిరగాలి.. సహజో గారు అంటారు శిష్యుడు మట్టి ముద్ద లాగ ఉండాలి, ఎలాగైతే మట్టి తనను కుమ్మరికి అప్పచెప్పి ఏమైతే అది అవనీ అని వదిలేస్తుందో.

ఇలాంటి సమర్పితులైన శిష్యులు, గురువు యొక్క మాధుర్యమైన రూపాన్ని కంటి రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటారు. ఎలాగైతే దిక్సూచి సూది యొక్క మొన ఆకాశములో మెరుస్తూన్న ఏ నక్షత్రము వైపు చూడకుండా, అది కేవలము ఒక జ్యోతి వైపే తిరుగుతుంది. ఎంత గాలి వీచినా, తుఫాను వచ్చినా, మేఘాలు వర్షించినా అది మాత్రము ఒక్క ధ్రువ తార వైపే చూస్తుంది. ఇలాగే అంకితమైన శిష్యుడికి తన మనస్సు యొక్క సూదిని తన వాస్తవికమైన ఉద్దేశ్యము యొక్క ధ్రువతార (గురువు) వైపు నుండి ఎప్పటికీ కదలకుండా ఉండేలా చూడాలి, అప్పుడే జీవితము యొక్క ఉద్దేశ్యము లభిస్తుంది. గురువు ఒక తత్వము, మనిషి కాదు. ఇందుకే మహాపురుషులు అంటారు –గురువులో మనిషి బుద్ధి మరియు మనిషిలో గురు బుద్ధి ప్రయోగించడము అపరాధమని. పరమ భాగవత్ పండిత్ జీ మహారాజ్ ని ఎవరో సాధకుడు ఇలా ప్రశ్నించేడు - జీవితములో ప్రభు దర్శనము పొందడానికి కష్టమైన పని ఏమిటి? – వారి జవాబు ఇలా ఉండేది –సద్గురు యొక్క చరణాల వద్దకి చేరడము. అతని ఇంకొక ప్రశ్న –సద్గురువు దాకా చేరడమేనా లేక ఇంకా ఏదైనా కష్టతరమైన పని ఉందా? జవాబు –అవును రెండవ కష్టమైన పని ఉంది, అదేమిటంటే —తనను తానే అర్పించేసుకోవడము, అన్ని ధర్మాల యొక్క పరమ ధర్మము పరమేశ్వరుడైన ఈశ్వరుడే శరణమని ఇంకా చెప్పడము మొదలు పెట్టారు – ఈశ్వరుడి సాన్నిధ్యమునైతే నువ్వు ఇప్పటి వరకూ పోందేవు, ఎందుకంటే నువ్వు ప్రతి క్షణమూ ఈశ్వరుడిలోనే ఉంటావు కానీ, నీకు సంత్ యొక్క సాన్నిధ్యము దొరకలేదు, ఏరోజైతే సంత్ యొక్క సాన్నిధ్యము దొరుకుతుందో ఆ ఆనందము మరొకలా అనిపిస్తుంది. జీవితానికి గురువు అయితే ఒక సూర్యుడు. ఇప్పటి వరకు పూర్ణ జ్ఞానము గురువు లేకుండా ఎవరికీ కలగనే లేదు. గురువు యొక్క సాన్నిధ్యము వలెనే పూర్ణత్వము లభిస్తుంది.

ఎవరైతే తమ సమస్త కోరికలను గురువు యొక్క కోరికలలో విలీనము చేసేస్తాడో, గురువుకే అంకితమై ఉండిపోతాడో, ఆ శిష్యుడు ధన్యుడు. గురువు శిష్యుడికి ఏమిస్తారు అనేది ఎవరు చెప్పగలుగుతారు? కబీర్ సాహెబ్ యొక్క వాణి లో –

గురు కీ స్తుతి కహాన్ లౌ కీజై, బదలా కహాన్ గురున్ కో దీజై|

గురు కా బదలా దియా న జాయీ, మన మే ఉపజతి హాయ్ సకుచాయీ ||

తాత్పర్యము –గురువు యొక్క స్తుతి ఎంతవరకు చెయ్యడము అనే దానికి అంతు లేదు. గురువు చేసిన ఉపకారానికి బదులు ఏమి ఇవ్వగలము అని మనస్సులో చాలా సంకోచముగా ఉంది. పరమ సంత్ డాక్టర్ బృజేంద్ర కుమార్ జీ మహారాజ్ గారి వాణిలో –“గురువు ధనము కాదు, ప్రేమ కోరతారు వారు మీ శరీరము కాదు మీ మనస్సు కోరతారు, వారు వారి సేవ కాదు మిషన్ సేవ కోరతారు. మనకి పూర్ణ గురువు దొరకక పోతే మనిషి జన్మ పొందడమే వ్యర్థమైపోతుంది, మరియు మనము మంచి శిష్యులము అవలేకపోతే మనిషి జీవితమే వ్యర్థము అయిపోతుంది.

***********