Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

Atrás

సంత్ యొక్క స్పర్శ

ఈ సమావేశం ఏదైతే జరుగుతోందో, అది వసంత పంచమి శుభ సందర్భాన జరుగుతున్నది అని మీ అందరికీ తెలిసినదే. వసంత పంచమి రోజున జ్ఞానము యొక్క అభ్యుదయము జరుగుతుందని మనమందరమూ వినే ఉంటాము. జ్ఞానం ప్రాప్తించింది అంటే జ్ఞాన దేవత ప్రాప్తించినట్టే. మనమందరం విని, కాగితాలమీద చదివిన దాని ప్రకారం జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది శాస్త్రోక్త మైనది, ఈ జ్ఞానం శాస్త్రాలలో లిఖించబడింది. రెండవది ఆధ్యాత్మికమైనది, ఇది ఎక్కడా లిఖించబడలేదు కానీ దాని ప్రభావం గొప్పగానే వుంది. మీ జ్ఞానం కాగితాలమీదది కానీ నాది కళ్ళతో చూసింది. కళ్ళతో చూసి అనుభవం అయిన విషయాలను చెప్పే వారు జ్ఞానులైతే, వారు ఇంకెవరో కాదు ఆధ్యాత్మికులే. ఈ కారణం చేతనే ఈ జ్ఞానం యొక్క గొప్పదనం పెరుగుతూనే ఉంటుంది. గొప్ప గొప్ప పండితులు ఎవరికైతే శాస్త్రాల సారం తెలిసి ఉంటుందో, వారు సాధారణ వ్యక్తులలో కేవలం అమాయకత్వాన్ని మాత్రమే చూస్తారు. ఒకానొక సమయంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకు ప్రపంచ విజేత అవ్వాలని ఇంకా ఏ ఒక్క పండితుడూ ఆయన ముందు పోటీకి నిలవకూడదని కోరిక ఉండేది. ఆయన భార్య కూడా గొప్ప పండితురాలే. ఆవిడ తన భర్తతో - మీరు ప్రపంచం మొత్తం తిరగవలసిన అవసరం లేదు. ఈ చుట్టుప్రక్కలే ఒక మహాత్ముడు 'కబీర్ సాహెబ్' వున్నారు. మీరు వారిని పరాజితులను చేయండి. ఆయనతో మీరు శాస్త్ర తర్కం చేయండి. వారు అప్పుడు పరాజితులు అవుతారు. అప్పుడు అందరూ మిమ్మల్ని విశ్వవిజేతగా ఒప్పుకుంటారు - అని చెప్పింది. దానికి ఆ పండితుడు అంగీకరిచాడు కబీరుగారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కబీరుగారు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. పండితుడు కబీరుగారితో - నాకొక ఆలోచన వుంది, నన్ను లోకం విశ్వ విజేతగా చూడాలని కోరిక. చాలామంది ప్రజలు మిమ్మల్ని జయిస్తే విశ్వవిజేతను అవుతానని అన్నారు. అందుకే మీతో శాస్త్ర తర్కం చేయవచ్చా? - అని అడిగారు. దానికి కబీరు గారు - మాకు చదవడము వ్రాయడము రాదు, అటువంటప్పుడు శాస్త్రం ఎలా తెలుస్తుంది? మీరు గొప్ప పండితులు, మాకు చదువురాకపోవడం వల్ల మేము మీ ముందు అపజయాన్ని అంగీకరిస్తున్నాము అన్నాడు. పండితుడు సంతోషించి ఇలా అన్నాడు- అయితే మీరు ఓడిపోయామని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇవ్వండి. అందుకు కబీరు గారు - మేము చదవడం వ్రాయడం నేర్చుకోలేదు, మరి ఈ విషయాన్ని ఎలా వ్రాసి ఇవ్వగలం? మీరే వ్రాయండి నాకు సంతకం చేయడం వచ్చు, నేను సంతకం చేస్తాను అన్నారు. వెంటనే పండితుడు జాగ్రత్తగా విషయాన్ని వ్రాసాడు. అందులో ఫలానా తేదీన నాకు మరియు కబీరుగారికి శాస్త్ర తర్కం జరిగింది, అందులో కబీరుగారు ఫలానా పండితుని ముందు ఓడిపోయాడు అని వ్రాసి వుంది. కబీరుగారు దానిపై సంతకం చేసారు. దాంతో పండితుడు ఎంతో సంతోషించాడు. కాగితాలతో ఇంటికి వెళ్లి భార్యతో - నువ్వు ఎప్పుడూ కబీరుగారి ధ్యానంలో ఉంటావు, కానీ ఆయన ముందుగానే తన ఓటమిని అంగీకరించారు చూడు అన్నాడు. పండితుని భార్య ఆ కాగితాలను చదివింది. అందులో కబీరుగారు పండితునిపై విజయం సాధించినట్టుగా వుంది. భార్య మాటలను విన్న పండితుడు ఆశ్చర్య పోయాడు. తన స్వహస్తాలతో వ్రాసి మరొకసారి చదివి పరీక్షించిన తర్వాత కూడా ఇలా ఎలా జరిగింది? అని ఆశ్చర్యపోయాడు. పండితుడు మరొకసారి కబీరుగారి దగ్గరకు వెళ్లి - నేను తప్పుగా వ్రాసేశాను, మరొకసారి వ్రాయవలసి ఉంటుంది మీరు సంతకం చేస్తారా? అని అడిగాడు. కబీరు గారు దానికి అంగీకరించారు. ఈసారి తాను వ్రాసిన కాగితాలను తన భార్యకు చూపించాడు కానీ అందులో అదే తప్పు వ్రాసి వుంది. అప్పుడు పండితుని భార్య తన భర్తతో - మీకు ఒక విషయం అర్థం అవ్వటం లేదు. మీరు ఏ జ్ఞానంతో విర్రవీగుతున్నారో అది నిజానికి జ్ఞానమే కాదు. సూర్యుని ముందర వెయ్యి వాల్టుల బల్బు వెలిగించినా ఏమీ తేడా ఉండదు. ఎవరి దగ్గరైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో, వారి ముందు మీ జ్ఞానం పనికిరాదు అన్నది.

ఆధ్యాత్మిక జ్ఞానుల సభలో విచిత్రమైన మాటలు తొంగి చూస్తాయి. ఒకరు నాకు బాగా పరిచయస్తులు, దగ్గరి సంబంధికులు ఇంకా భాగవతంలో మంచి విద్వాంసులు ఉన్నారు. వారు నాకు ఒక చిన్న పద్యాన్ని చెప్పారు. ఇంకా వారు అందులో శాస్త్రీయ పండితుల కవితలను మరియు ఆధ్యాత్మిక వేత్తల కవితల వ్యత్యాసాలను చాలా చక్కగా వివరించారు. వారు ఈ విధంగా వివరించారు- సుమేరు పర్వతం ఒక బంగారు పర్వతం కానీ దాని అడుగు భాగాన్న కేవలం రాళ్ళు పడి ఉంటాయి.

ఏ రే మేర్ సుమేర్ తేరే డింగ్ పత్తర్ పడే మలయగిరి కో హేర్ సభీ పేడ్ చందన్ భయే.

నువ్వు బంగారు పర్వతానివి కానీ నీవల్ల ఏమి ప్రయోజనం? నీ దగ్గర కేవలం రాళ్ళు పడి వున్నాయి. మలయగిరిని చూడు, అక్కడ దాని సువాసనతోనే వృక్షాలన్నీ చందనమైయ్యాయి. ఆధ్యాత్మికజ్ఞానము ఎలాంటి సభ అంటే అందులో ఉన్న అందరూ చందనబరితులౌతారు. పారస్ సంపర్కముతో లోహం కూడా సువర్ణ మైపోతుంది. సంత్ ల స్పర్శతో సంత్ లు అయిపోతారు”.

అది మొఘలుల కాలం. అప్పుడు సిక్కులకు గురువుగా హర్ కృష్ణ గారు వ్యవహరించేవారు. వారు అతి చిన్న వయస్సులోనే గురువు అనే గద్దెని అలంకరించారు. అతను చిన్న వయస్సువాడు కావడం వల్ల తేలికగా ఓడించవచ్చు అని మొఘలులు అనుకున్నారు. దాంతో హిందువుల మరియు సిక్కుల మనోబలం సన్నగిల్లుతుంది అని వారు అనుకున్నారు. ఒక పండితున్ని అక్కడకు పంపి శాస్త్ర తర్కం నిర్వహించమని అన్నారు. ఆ పండితుడు హర్ కృష్ణ గురువుని చిన్న పిల్లాడని, శాస్త్రజ్ఞానం ఉండదని అనుకొని అక్కడకు వెళ్ళాడు. పండితుడు అక్కడకు వెళ్ళేటప్పటికే హర్ కృష్ణ గురువు గారు సత్సంగం జరుపుతున్నారు. అది ముగిసిన తర్వాత పండితుడు గురువుగారితో శాస్త్ర తర్కం జరపాలన్న కోరికను తెలియబరిచేడు. గురువు శాస్త్ర తర్కము చెయ్యలా? అని దగ్గరలో పాత్రలు తోముతున్న ఒక వ్యక్తిని పిలిచి నీవు అతనితో శాస్త్ర తర్కము చెయ్యి-అని అన్నారు. తర్కం జరిగింది, అందులో పండితుడు ఓడిపోయాడు. అప్పుడు హరకృష్ణ గురువుగారు పండితునితో -ఒకవేళ నేను తర్కించి గెలిచివుంటే అప్పుడు మీరు నేను ఒక మహారాజు కుమారుడిని కనుక ఎప్పుడో, ఎక్కడో ఈ ప్రశ్నలకు సమాధానాలను విని ఉంటానని అనుకుంటారు. ఒక గురువు మహత్వం ఇంత మాత్రమే కాదు, మీరు ఇక్కడ ఉన్న ఎవరితోనైనా శాస్త్ర తర్కం జరపవచ్చు. అందరి దగ్గరా మీకు ఇదే సమాధానం ఎదురవుతుంది అని అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎవరైనా సత్పురుషులు అవ్వచ్చు, ఎలాగైతే మలయగిరి వల్ల అక్కడ ఉన్న ప్రతి చెట్టూ చందనమవుతుందో. మంచి వారి సహవాసంలో అందరూ మంచి వారే అవుతారు. మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆధ్యాత్మిక సభలో కూర్చున్నప్పుడు మీలో ఆధ్యాత్మికత నిండిపోతుంది. మీరు వినే వుంటారు గోపికలు కృష్ణ భగవంతుని దాసీలు, వారు కృష్ణుణ్ణి ఆరాధించే వారు, గౌరవించేవారు. ఎంత నమ్మేవారంటే ఆ ప్రభావంలో వారికి ఎప్పుడూ కృష్ణుడు మాత్రమే కనిపించేవాడు. కృష్ణ భగవానుడి మిత్రుడు ఉద్ధవ గారు గొప్ప జ్ఞాని. వారి జ్ఞానం మీద వారికి అభిమానం ఉండేది. కృష్ణుడికి తన మిత్రుని లోని ఈ జ్ఞానం తొలగిపోయి భక్తి భావము ఉద్భవించాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఉద్ధవ ని గోపికల వద్దకు పంపిస్తే వారి సంపర్కము వలన తనలో మార్పు వస్తుంది అని ఆలోచించి ఉద్ధవునితో ఇలా అన్నాడు - నీవు గోపికల దగ్గరకు వెళ్ళి, వారికి జ్ఞాన బోధచెయ్యి. వారికి ఉద్ధారము అవుతుంది, ఎందుకంటే మీ జ్ఞానం శ్రేష్టమైనది. ఉద్ధవునిలో అహంకారం ఉండేది, నేను గోపికలకు జ్ఞాన బోధన చేసిరావాలి అనుకున్నాడు. గోకులంలో గోపికలు ఉద్ధవుని చూసి కృష్ణుడు దగ్గర నుండి వచ్చాడు కనుక తప్పక మా కొరకు సందేశం తెచ్చి ఉంటాడని అనుకున్నారు. అందరూ ఉద్ధవుని చుట్టూ చేరి కృష్ణుడు తమకు ఏమన్నా చెప్పమన్నాడా అని అడగటం ప్రారంభించారు. ఉద్ధవునికి తన జ్ఞానంపై గల నమ్మకంతో, అభిమానంతో ఇలా చెప్పాడు -ఓ గోపికలారా! కృష్ణుడు పురుషుడు, ఒక సాధారణ మనిషి, మీరంతా ఆ ఈశ్వరున్ని ఆరాధించండి. జ్ఞాన సమాధిలోకి వెళ్ళి జ్ఞానాన్ని పొందండి. అందుకు సమాధానంగా వారు ఇలా అన్నారు—మేము కృష్ణుడిని చూశాము, మీకు ఇది తెలిసున్నదే మనస్సు అయితే ఒకటే ఉంటుంది “ఊధవ్ మన్ నాహీ దస్ బీస్ ఏక్ హుతో తో గయో శ్యామ్ సంగ్.”

ఉద్ధవ్! మనస్సు ఒక్కటే ఉంది, అది శ్యామ్ తో వెళ్లి పోయింది. మేము సాధన ఎలా చెయ్యాలి? మీరేమో చాలా జ్ఞానము ఇచ్చారు మాకు.

“ ఊధవ్ జ్ఞాన్ కో సందేసో దేతే అనేక్ తుమ్. దేఖ్ లేతే కాహ్న హమారీ అఖియా సే” ?

ఉద్ధవా! కృష్ణుడు అంటే ఎవరు అని నువ్వు మా కళ్ళతో ఒక్కసారి చూడు. మీరు మీ దృష్టి కోణంతో కృష్ణుడిని చూశారు, అతను మీ మిత్రుడు. మీరు మా కళ్ళతో ఒక్కసారి చూడండి కృష్ణుడు అంటే ఏమిటి అని, అప్పుడు మీ పూర్తి జ్ఞానం మాయమైపోతుంది. ఆధ్యాత్మికతలో జ్ఞానముండదు ప్రేమ నిండిపోతుంది అన్నారు. మరియు ఇదే అయింది కూడా. ఈ మాటలతో ఉద్ధవుని మన:స్థితి మారిపోయింది. అతని జ్ఞానం అంతా మాయమై ఇలాగ ఆలోచించడము మొదలు పెట్టేరు, ఈ గోపికలు ఎంత అదృష్టవంతులు అని ఆలోచించడం మెదలుపెట్టాడు. నేను ఇచ్చట ధూళి అయిపోయి ఉంటే వీరి చరణాలు నాపై పడేవి, నేను కదంబ వృక్షము అయిపోయి ఉంటే ఇచ్చట కురుస్తోన్న ఆనందాన్ని చూస్తూ ఉండేవాడిని.

ఈ విధంగా వాస్తవములో సంత్ ల సభలో ఆనందం వర్ష రూపంలో కురుస్తుంది. ఈ సభలో సుపాత్రులు (పాత్రత ఉన్నవారు) లేక కుపాత్రులు (పాత్రత లేనివారు) అనేది ఉండదు. నీరు పల్ల మెరుగునట్లు, అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా, ధనవంతులైనా, నిర్ధనులైనా ప్రతి ఒక్కరూ తడిసిపోతారు. మనము ఇచ్చట అందరమూ సుపాత్రులము కాము. సంత్ సభలో ఇలానే జరుగుతుంది. ఇక్కడ ఆనందం కురుస్తుంది. అందులో అందరమూ తడిసిపోవాల్సిందే. మేము ముందుగా చెప్పినట్టుగా అన్ని వృక్షాలు చందనమైనట్లే మన అందరిలో చందనం పరిమళిస్తుంది. ఇది ఆధ్యాత్మ సభ యొక్క మహాత్మ్యము, ఎందులోనైతే మీకు మాకూ కూర్చోగలిగే అదృష్టం ప్రాప్తించిందో .

ఎక్కడ బ్రహ్మ ఙ్ఞాని ఉంటాడో అక్కడ వాతావరణం మారిపోతుంది. నాకు ఈ సందర్భంలో ఒక సంఘటన గుర్తుకువస్తుంది, జైపూర్ లో భండారా జరుగుతూ ఉండేది, అక్కడ పరమ పూజ్యులైన పండిత్ జీ మహారాజు గారు ప్రవచనం చేస్తున్నారు. ఆయన ఈ విధంగా ప్రసంగిస్తున్నారు - ఇక్కడ ఆనందం కురుస్తోంది దానికి కారణము నేను ఇక్కడ ఉండడం వల్లనో, లేక మీరు ఇక్కడ ఉండడం వల్లనో ఈ సంతోషం కలుగుతోందని మీకు అనిపిస్తే అది ఖచ్చితంగా అపోహే. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక జ్ఞాని వున్నారు, వారు ఆధ్యాత్మిక జ్ఞాని అని వారికి కూడా తెలిసి ఉండదు. నిజానికి ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానులమని అనుకుంటారో వారు ఆధ్యాత్మికులు కారు. వారికి కనీసం వారు భక్తులని కూడా తెలిసివుండదు. అటువంటి వ్యక్తి ఎవరో ఇక్కడ వున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మిక జ్ఞానులు వారి వేషధారణ ద్వారా గుర్తించ బడరు. నేను నా వస్త్రాలను మార్చుకోవటం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానిని అవ్వను. నేను సంస్కృతం చదివాను, అందులోని శ్లోకాలను కంఠస్థం చేశాను ఇంకా ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను అంటే విధ్వాంసుడిని అవ్వను.

మనమందరం ఒక కథ వినే ఉంటాము. అది జనశ్రుతి మహారాజు మరియు బండివాడైన రైక్వ కథ. అది జనశ్రుతి మహారాజు గొప్పగా రాజ్యాన్ని పరిపాలించు సమయం. ఎప్పుడూ ఆ రాజ్యం కరువును కానీ కష్టాన్ని కానీ చూడలేదు. నేను మంచి శాసకుడిని, నా రాజ్యంలో ప్రజలు సంతోషంగా వున్నారు, నా రాజ్యంలో కరువు రాలేదు అని మహారాజు సంతోషంగా చెప్పుకునేవారు. ఒకసారి మహారాజు అడవికి వేటకు వెళ్లారు. అలసిన మహారాజు ఒక పెద్ద వృక్షం క్రింద విశ్రమిస్తున్నారు. అప్పుడు ఆ వృక్షం మీద వున్న రెండు హంసలు ఇలా మాట్లాడుకుంటున్నాయి - చూడు సోదరా శబ్దం చేయకు ఈ చెట్టు క్రింద మహారాజు జనశ్రుతి విశ్రమించి వున్నారు. వారు గొప్ప పరాక్రమవంతులు. దానికి మరొక హంస ఇలా అన్నది – అయ్యో! నీకు తెలియదు ఆ ప్రతాపం వీరిది కాదు, వీరి రాజ్యంలోని ఒక బ్రహ్మ జ్ఞాని అయిన వ్యక్తిది. వారు ఒక ఆధ్యాత్మిక వేత్త, వారి ప్రతాపం వల్లనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది. ఆయన పేరు రైక్వ, వారి వల్లనే ఈ రాజ్యం ఆనంద వర్షంలో తడుస్తోంది. ఈ మాటలను విన్న మహారాజు వెంటనే రాజ్యానికి తిరిగి ప్రయాణమయ్యాడు. రాజ్యం చేరుకొని తన మంత్రులతో రైక్వ అనే పేరుగల మహాత్ముడిని వెతకమని చెప్పాడు. పెద్ద-పెద్ద ఆశ్రమాలలో, మందిరాల వద్ద ఎంత గాలించినా ఆ పేరు గల మహాత్ముడు దొరకలేదు. అప్పుడు రాజు - ఆ హంస అబద్ధం చెప్పివుండదు. ఖచ్చితంగా రైక్వ అనే పేరుతో ఆ మహాత్ముడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. సుగంధ పుష్పం ఎలాగైతే తన పరిమళాన్ని వ్యాపిస్తుందో, అలాగే ఆ మహానుభావుడి మంచితనం రాజ్యమంతట వ్యాపించివుంటుంది అన్నారు. చివరగా మంత్రులకు ఒక వ్యక్తి సమాచారం అందజేశాడు. దాని ప్రకారం ఆ రైక్వ పేరున్న వ్యక్తి మహాత్ముడు కాదు అని, అతను కేవలం ఒక బండి నడుపుకునే వాడే. ఆధ్యాత్మ జ్ఞానము ఉపయోగించి చూస్తే తెలిసింది వీరే ఆ మహాపురుషులు ఎవరైతే బండి నడిపేవారో, వారి వల్లనే ఇచ్చట సుకాలము. ఇందుకే ఎక్కడైతే ఇలాంటి ఆత్మజ్ఞాని ఉంటాడో అక్కడ వాతావరణంలో ఎంతో మార్పు వస్తుంది, అచ్చట ఒక పరిమళం వ్యాపించి ఉంటుంది. ఇంకా అక్కడ ప్రతి ఒక్కరు ఆనందములో నిమగ్నమై వుంటారు. ఇదే జ్ఞానులకి, బ్రహ్న జ్ఞానులకి వుండే అంతరం. ఇక్కడ ఆనందం వర్షం రూపంలో కురుస్తూ ఉంటుంది.

శాంతి అనేది దుర్లభమైనది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కాని మనం విశ్రాంతి కోసం కూర్చోగానే మన అలసిపోయిన మనస్సు కూడా విశ్రాంతి తీసుకుంటుంది మరియు శాంతి అనుభవం పొందుతుంది. అది సంత్ మహాత్ముల సభ, అక్కడ ఆనందం కురుస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానంలో- సత్, చిత్ ఆనందము ఉంది. మీకూ మరియు నాకూ ఎంతో అదృష్టం ప్రాప్తించింది, ఇటువంటి సభలో పాల్గొన్నందుకు. ఇక్కడ మనకు దొరుకుతున్న ఆనందం ఎవరివల్లనో కాదు ఇక్కడ వున్న ఈ సంత్ మహాపురుషుల కృప వల్లనే. ఆ గురు మహారాజ్ గారి కృప వల్లనే ఇక్కడ ఆనంద వర్షం కురుస్తోంది. వారికి ఓకే ఒక్క వినతి, వారి ఈ దయ నాపైన, మీపైన, ఇంకా అందరిపైన ఉండాలని, ఇంకా మనందరికీ ఆనందము ఇలానే నిండివుండాలని. గురువు అంటే సాధారణులు కాదు, గురువు అంటే ఒక దాత. కానీ వంద, రెండు వందల రూపాయలు ఇచ్చేరకమైన దాతలు కారు. ఎవరైతే యాచకుడిని కూడా దాతగా మార్చేవారో వారే గురువు అంటే. గురువుకి ఇటువంటి గౌరవమే ఉంటుంది. గురువు నిర్మిస్తాడు కానీ అది సాధారణ నిర్మాణం కాదు. వారు సాధారణ వ్యక్తిని కూడా ఈశ్వరునిగా మార్చేస్తారు. వాస్తవానికి ఇటువంటి మహాపురుషుని దర్శనంచేసుకొని ఈసభలో కూర్చున్నందుకు మనమంతా అదృష్టవంతులం.

మనం ఇలాగే ఇక్కడకి చేరిపోలేదు, ఇది కేవలం వారి కృప. అందుకే మనందరిని ఇక్కడకు పిలిపించారు. పాత్రత ఉన్నా, లేక పోయినా ఎంతో పాత్రతను ఇచ్చారు. ఆ గురు మహారాజ్ తో మా ప్రార్థన ఏమిటంటే, మాలో భక్తి , శ్రద్ధ , విశ్వాసం లేకున్నా, మీకు కృపా సాగరులు అనే బిరుదు ఉంది కనుక, ఇక్కడ కూర్చుని వున్న వారందరిపై మీరు కృప కలిగించి, మా కృపా సంచులను ఎప్పుడూ నింపి ఉంచండి.