Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

واپس

సమర్పణము

మనమందరమూ ఏ సాధనైతే చేస్తున్నామో, దానిలో పూర్ణత్వము, సమర్పించడములోనే ఉంది. శ్రద్ధ, విశ్వాసము(నమ్మకము) మరియు సమర్పణ, తమని తాము సమర్పించుకోవడము. కానీ సమర్పణ ఒక స్థితి , అచ్చట మనది అనేది ఏమీ ఉండదు, ఏ భాష ఉండదు, ఏ పదము ఉండదు, ఇదంతా మీదే అని అంటే చాలదు , అది సమర్పణ అనిపించుకోదు. సమర్పణ అంటే ఒక స్థితి, ఎచ్చటైతే మన మనస్సు, బుద్ధి, అహం అన్నీ వారికి అర్పితమైపోతాయో. ఒక తల్లికి, శిశువుకి మధ్య ఉండే సంబంధము ప్రేమ సంబంధము అని అందరికీ తెలిసినదే . తల్లి కోరుతుంది, ఆ శిశువు నడవాలని, తను నడుస్తాడు, పడతాడు కూడా, కానీ ఆ తల్లి యొక్క సహాయము ఎప్పుడూ ఉంటుంది, ఇలాగే గురువు ఒక సాధనైతే ఇస్తారు కానీ ఎలాగైతే తల్లి యొక్క ఒక రక్షణ హస్తము శిశువుకి ఎల్లప్పుడూ ఉంటుందో, అలాగే వారి రక్షణ హస్తము కూడా మనకు సర్వవేళలా ఉంటుంది. మనలోనే శ్రద్ధ లేదు విశ్వాసమూ లేదు, శ్రద్దే లేనప్పుడు, సమర్పణము అనేది ఎలాగ? ఎలాగైతే నేను అన్నానో, చిన్న బాలుడికి నడక రాదు కానీ తల్లి నడవడము నేర్పుతుంది , ఇలాగే గురు మహారాజ్ గారు ఒక మార్గము చూపించారు, దీని పై నడిచేరంటే శ్రద్ధ పుడుతుంది, శ్రద్ధ అనేది బయట నుండి వచ్చేది కాదు అది అంతరాలలోంచి ఉద్భవిస్తుంది. విశ్వాసము అనేది కూడా బయటనుంచి రాదు, మన అంతరాలలోనే ఉద్భవిస్తుంది. ఇచ్చట నూటికి నూరు శాతము సమర్పించాము అని మాటలతో అంటే అది సమర్పణ అనిపించుకోదు. సమర్పణ అనేది పూర్ణ రూపముగా సమర్పించినప్పుడే అది సమర్పణ అనిపించుకుంటుంది. ఎవరైతే తననుతాను సమర్పించేసారో వారే ఆ రంగులో మునిగిపోయారు. మనము గమనిస్తూనే ఉంటాము, ఏ వస్త్రానికైతే మనము రంగు వెయ్యాలనుకుంటామో దానిని ఆకలిపిన రంగులో ముంచుతాము. కానీ ఎచ్చటైతే మనము చేతితో పట్టుకున్నమో, అచ్చట మాత్రము రంగు అంటదు, అలాగే ఎవరైతే సంపూర్ణముగా సమర్పించేసుకున్నారో, (శరీరముతో, మనస్సుతో, బుద్ధితో, అహంతో) వారు గురువులో లీనమైపోయారు. ఇదే సమర్పణము . మన గురు మహారాజ్ గారు దాని కొరకు ఒక కొత్త మూలము ఇచ్చారు. వారు అన్నారు శ్రద్ధ, విశ్వాసము ఈ పని అంతా నాది, మీ పని ప్రొద్దున సాయంత్రము కూర్చోవడమే. గురువు మన మనస్సులో, బుద్ధిలో నిండిపోతారు, అప్పుడు విశ్వాసము పుడుతుంది. మన ప్రతి రక్త కణములోను గురువు నిండి పోతారు, అప్పుడే సమర్పణము అయిపోతుంది.

ఇందులో చాలా స్థాయిలు ఉంటాయి కానీ, ఆ పని అంతా గురు కృపే. నిజ కృప ఉన్నప్పుడే గురుకృప కలుగుతుంది. మనము నిజకృపే చెయ్యకుండా, గురు మహారాజ్ గారు దయ తలిస్తే అయిపోతుంది అనుకుంటే అది మంచి పధ్ధతి కాదు, ప్రయత్నము చెయ్యడము మన పని. ప్రయత్నము చేస్తే గురు కృప తప్పక కలుగుతుంది. సాధన చెయ్యడము మన పని, మిగిలిన పని అంతా గురువు గారిది.

యే ఫల సాధన తే నహి హోఈ , తుమ్హారీ కృపా పావ్ కోయి కోయి .

ఇది ఒక పొడవైన దారి ఉంది, గురు కృప ఏమి చేయ్యగలదో అది వర్ణనాతీతమైనది. ప్రార్థన అనేది - ఎలాంటిదంటే దేనివలనైతే పరమాత్ముడు ద్రవించి పోతాడో, కరిగిపోతాడో, ప్రార్థనలో కూడా రకాలు ఉన్నాయి, ఒక దాంట్లో స్వరము, తాళము, పదాలు ఉంటాయి కానీ దీని కన్నా పై స్థాయి ప్రార్థన లో పదాలు ఉండవు. కన్నీరు (అశ్రు ధార) ఒకటే మిగిలి పోతుంది , పరమాత్ముడికి ఈ భాష ఒకటే అర్థమౌతుంది , తెలుగు, హిందీ, సంస్కృతం , ఏమీ అర్థము కాదు, కన్నీటి ప్రార్థన వలన ద్రవించి పోతాడు ఆ పరమాత్ముడు. ద్రౌపది, వస్త్ర హరణము సమయములో సహాయము కొరకు తన భర్తల వైపు, సమాజము వైపు చూస్తుంది కానీ ఎవరూ ముందుకి రాలేదు, తన బలము కూడా ప్రయోగించింది, ఏ ఫలితమూ దొరకనప్పుడు ఆ పరమాత్ముడిని తల్చుకుంది, ఆఖరికి కన్నీరు కారిపోయాయి అప్పుడు ఆ పరమాత్ముడే వస్త్రాలను అందించాడు. ద్రౌపది అడిగింది హే కృష్ణ! నువ్వు ఆలస్యము చేశావు రావడములో. అప్పుడు కృష్ణుడు అన్నాడు ఆలస్యము నా వైపు నుంచి కాదు, అది నీ వైపునుంచే . నీ కంట ఒక చుక్క కన్నీరు రాగానే నేను ఆగలేక పోయాను.

ఇలాగే జీవితములోను సాధన చేస్తూ- చేస్తూ రకరకాల స్థాయిలు వస్తాయి. సాధన దీని కొరకే, మన అంతరాలు నిర్మలమవడానికి, మనలో శ్రద్ధ, విశ్వాసము ఉద్భవించి , మన ప్రతి ఒక్క రక్త కణమూ గురుమయము అయి పోవాలి. అప్పుడు అశ్రు (కన్నీటి) భాష ఒకటే ఉండి పోతుంది, మరియు జీవితము యొక్క శ్రేయస్సుని పొందేస్తారు. దాని కొరకే మనమందరమూ కూర్చున్నాము ఆ సాధనే చేస్తాము, దేనివలనైతే మనలో శ్రద్ధ, విశ్వాసము ఉద్భవిస్తుందో ఇంక గురువు మనలని స్వీకరించకలుగుతారో.