Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

Atrás

Amrit ki oor

<strong><u>అమృతం</u></strong> <strong><u>వైపు</u></strong>

<img class="alignnone size-full wp-image-58350" src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/04/pp_panditji_1945-1.jpg" alt="" width="100" height="136" />

Amrit ki oor

సాధారణముగా మనము వింటూనే ఉంటాము మనిషి జన్మ చాలా భాగ్యం  తో లభిస్తుందని కానీ అయితే ఈ శరీరములో అమృతం ఉంది, విషం కూడా ఈ శరీరములోనే ఉంది.  అయితే వీటిలో  మనము ఏమి కోరుకుంటున్నాము, ఇది మనమే నిశ్చయించుకోవాలి. అయితే ముఖ్యమైన విషయం  ఏమిటంటే, అమృతం పొందడానికి చాలా ప్రయత్నము చెయ్యాలి, చాలా కష్ట పడాలి కానీ విషము పొందడానికి ఏమీ కష్ట పడనక్కల్లేదు . విషము సహజముగానే మనము పొందుతాము. ఎలాగైతే ఒక బాలుడు రోజూ స్కూలు కి వెళ్లి శ్రద్ధగా చదువుకుని  వృద్ధిలోకి వస్తే వాడు అమృతం పొందుతాడు, అలాకాకుండా, వాడు రోజంతా ఆడు కుని, చదవకుండా, సమయమంతా వృథా చేసుకుంటే, వాడు విషమే పొందుతాడు. మనము విషమార్గాములోకి వెళ్తామా, జీవితమంతా విషమయము అయిపోతుంది, అశాంతి మయం అయిపోతుంది మరియు అలాంటి స్నేహితులే మనకి దొరుకుతారు. అమృత మార్గాన్ని ఎంచుకున్నవారికి మంచి స్నేహితులే దొరికి, ఈ మార్గము మీదే ముందుకి వెళ్ళడానికి ప్రోత్సహిస్తారు. మన ప్రగతి మన పరిశ్రమం మీదే ఆధారపడి ఉంటుంది. విద్యార్థి తన విద్యాధ్యయన సమయములో బాగా చదివి వృద్ధిలోకి రావాలి అని అనుకునేవాడు, ఒక్కోక్క తరగతిలోనూ మంచి  మార్కులు పొంది  ప్రగతి పథము మీద ముందుకి సాగి పోతూ ఉంటాడు, ఒక రోజు వాడు చాలా గొప్ప వ్యాపారి గానీ ఉద్యోగస్తుడుకానీ అయి జీవితము లో సుఖ పడతాడు, మంచి కీర్తి సంపాదిస్తాడు. శబరి  గురించి మీకు తెలిసే ఉంటుంది , ఆమెకి  పెళ్ళి కుదిరింది, తండ్రీ పెద్ద తాలూకా ఉద్యోగి, ధనవంతుడు, అతను చాలా పశువులని తెచ్చి ఇంట్లో ఉంచేడు. శబరి  అడిగిందిట, నాన్నగారూ! ఈ పశువులని ఎందుకు తెచ్చి ఉంచేరు? అని. తండ్రి  చెప్పారుట – నీ పెళ్ళికి వీటిని బలి ఇచ్చి వండి భోజనము లో అందరికీ వడ్డిస్తామని . ఆమెకి ఆలోచన వచ్చింది ట, నా పెళ్లి వలన ఇన్ని పశువులని బలి ఇవ్వడము సరైన పద్ధతి కాదు, నేను పెళ్ళే చేసుకోను, అనుకుని వెంటనే ఇల్లు విడిచి వెళ్లి పోయింది, ఏ దారీ లేదు, ఎక్కడకి వెళ్ళాలో  తెలియదు, ఎక్కడకి వెళ్ళినా తన తండ్రి  మనుషులని పంపి తనను పట్టుకొని తీసుకొని వెళ్తాడు. శబరి కి విష మార్గము ఎంచుకోడానికి మంచి అవకాశము ఎదురుగా ఉండేది కానీ తను                       ఆ మార్గాన్ని ఎంచుకోకుండా అమృత మార్గాన్నే ఎంచుకుంది. అందువలన ఇల్లు విడిచి వెళ్ళవలసి వచ్చింది. కంటక మార్గము, కానీ వెళ్ళాలి . ఎక్కడకి వెళ్ళాలి ఏమి చెయ్యాలి ? ఏమి నిశ్చయము లేదు.

అక్కడ దగ్గరలో ఋషులూ, మునులూ ఉండే ఆశ్రమాలు ఉండేవి, అక్కడకి వెళ్ళి పోయింది. ఆశ్రమములోకైతే తన తండ్రీ పంపిన గుప్తచరులు రారు, వారికి అక్కడకి రావడానికి అనుమతి లేదు.

శబరి ముని ఆశ్రమములోకి వెళ్ళి రెండు రోజులు గడిపింది తరువాత అక్కడ వాతావరణము యొక్క మహత్యము వలన ఆమెకి ఒక ఆలోచన వచ్చింది ,నేను ఈ విధముగా ఊరికే ఉండకూడదు, ఏదైనా సేవ చెయ్యాలని, కానీ ఎలాగ! పగలు మునులకి తను కనబడితే వారు అక్కడ ఉండనివ్వరు, బైటకి పంపివేస్తారు అందుకని రాత్రి వేళలో మునుల ఆశ్రమము ముందు తుడిచి శుభ్రం చేసే పని మొదలు పెట్టినది శబరి. ఇలాగా కొంత కాలము గడిచినాక అక్కడ అధ్యక్షుడిని గురువుగారు అడిగేరు ట. ఎవరు ఇంత  బాగా శుభ్రము చేస్తున్నారని. ఆతను రాత్రి అంతా మేలుకొని ఎవరు శుభ్రము చేస్తూన్నది అని తెలుసుకొని శబరిని గురువు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు.

గురువు గారు శబరిని అడుగగా తన వృత్తాంతము అంతా చెప్పినది, అప్పుడు గురువు గారు ఆమెకి అభయము ఇచ్చి ఆమె ఎదురుగా ఉన్న విషము ఆయన స్వీకరించి  శబరికి అమృతము ఇచ్చారు.

గురువులు ఎప్పుడూ కూడా మన మీద ఉన్న ప్రేమ, దయ వలన విషము తను  తీసుకొని అమృతము భక్తులకు పంచుతారు. తాత్పర్యము మన లో ఉన్న చెడు, అంటే జరగబోయే చెడు పరిణామాలు గురువులు తీసుకొని మనకి మంచి జరిగేలాగ  చేసి మన మనస్సు లో అమృతము నింపుతారు, మన జీవితము అమృత మయము చేస్తారు. మనమనుకుంటాము ఈ మార్గాన్ని స్వీకరించాలంటే ఇల్లూ, మన బంధువలను అందరినీ విడిచి అడవిలోకి వెళ్ళాలని, కానీ అలాంటిదేమీ చేయనక్కరలేదు. మన గురువు గారి పద్ధతి చాలా వేరైనది. గురువుల సంపర్కముతో మన మనస్సులో ఉన్న చెడు (విషము) అంతా దాని అంతట అదే ఒదులుతూ ఉంటుంది, మన ప్రేమా భక్తి వారి వైపుకు మరలి పోతుంది . మనము ప్రాపంచిక విషయాలు వదిలివేసి వారు (గురువులు)చెప్పిన పద్ధతినే అనుసరిస్తాము. ఆఖరికి ఒక రోజు మనకి ప్రాపంచిక సుఖాలమీద ఆసక్తి తగ్గి, శ్రద్ధ ఆసక్తి గురువుగారి మీద పెరుగుతుంది, అంటే మన సర్వస్వమూ ఆయనకే అర్పించేయ్యాలని అనిపిస్తుంది. మనకి దేని మీద కోరికే ఉండదు, మనము సాధన చేస్తాము కదా, మనకి ముక్తి దొరికితే బాగుంటుంది, మనకి మనిషి జన్మే దొరకాలి వగైరా-వగైరా  లాంటి ఏ కోరికలూ ఉండవు. మనము పొందిన ప్రతీదీ వారి కృప వలనే అనే నమ్మకము పెరుగుతుంది.ఇక్కడ మనదంటూ ఏమీ లేదు, కానీ ఈ ఆలోచనలు మనకి రావడము మన గొప్పతనము కాదు. అంతా  సత్సంగము యొక్క ప్రభావము. మనలో ఉన్న దుర్గుణాలు అన్నీ వాటి  అంతట అవే మనని విడిచి పెడుతూ ఉంటాయి. గురువుగారు మనలో అమృతము నింపి ఇంకా-ఇంకా ముందుకు వెళ్ళు అని మనని ముందుకి పంపుతారు. ఎలాగైతే పిల్లవాడి చేతులో ఉన్న రూపాయి నాణెము అడిగితే ఇవ్వడు కాని నిద్రలోకి జారుకున్నాక ఆ నాణెము దానంతట అదే చేతిలో నుండి జారి పోతుంది, అదే విధముగా మనము ఎంత గురువుల మార్గములో నడుస్తామో అంతకి అంత   ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి తగ్గి శ్రీ గురు దేవులు చెప్పిన విషయముల మీద శ్రద్ధ పెరుగుతుంది, మనకి అనిపిస్తుందీ మన దగ్గిర ఉన్న సమస్తమూ ఆ గురుదేవులు ప్రసాదిన్చినదే . నాది అంటూ ఈ ప్రపంచములో ఏమీ లేదు. ఈ శరీరమూ, నాకు ఉన్న కీర్తి-ప్రతిష్ఠలు,  ఇల్లూ డబ్బూ, సమస్తమూ వారిదే, వీటిని పొందడానికి నా  ప్రయాసము, నా ప్రయత్నమూ అన్నది  ఏమీ లేదు. వారి దర్శన భాగ్యం వలెనే నాకు ఇంటిమీద, పరివారము మీద ధనధాన్యాల మీద మోహము పోయింది, ఇదంతా ఎలాగ జరిగిందని కూడా నాకు తెలియదు ఈ మోహము నేనుగా వారికి అర్పించ లేదు. వారి దయ, వారి కృప, వలెనే ఇది జరిగింది వారే ఈ విధముగా వారిలో కలిసిపోయేలాగ చేసేరు. శ్రీ గురుదేవుల మహత్యము ఈ విధముగా ఉంటుంది. ఆ మహాత్ముడు మన జీవితములో అనుభవించ వలసిన  విషమంతా తామే తీసుకొని మనకి అమృతం ఇచ్చి “చూడు నాయనా ఈ అమృతాన్ని తీసుకొని జీవితములో ఇంకా-ఇంకా ముందుకి వెళ్లి అమృతత్వాన్ని పొంది  మీరు అమృత పుత్రులు అవ్వండి” అని శ్రీ గురు దేవులు మనని ఆ స్థా నానికి చేరుస్తారు. ఇదే దృష్టాంతము మనము శబరి విషయములో చూస్తాము. ఉచ్చ కులానికి చెందినది కాదు, చదవలేదు, అయినా ఆమెను శ్రిగురువులు ఎక్కడకి చేర్చేరు! ఆమె జీవితములో ఉన్న విషమంతా తాను సేవించి ఆమెకు అమృతత్వము ఇచ్చి చెప్పేరు శబరీ! మీ ఇంటికే శ్రీరామచంద్రుడు వస్తాడు. నువ్వు ఎక్కడకీ వెళ్లనక్కరలేదు అని .ఈ విషయము మీకూ తెలిసినదే, శ్రీరాముడు ఏ ఋషులు, మునులు దగ్గరకి వెళ్ళకుండా శబరి  దగ్గరకే . శబరి వెళ్ళాడు  ఎలాగా కృతార్థురాలైంది, శ్రీరామచంద్రుడు కూడా ఆ భక్తురాలి దర్శనం వలన కృతార్థుడైయ్యాడు.ఈ విషయమే శ్రీమద్ భాగవతములోనూ వస్తుంది అదేమిటంటే ఎవరి హృదయములోనైతే ఇతరలు పట్ల భేద భావము, ద్వేషము, ఈర్ష్య ఉండదో, ఎవరి మనస్సు నిర్మలత్వము తో కూడి ఉంటుందో, అలాంటి వారి వెనక-వెనకే నేను తిరుగుతూ ఉంటాను ఎందుకంటే వారు నడిచేటప్పుడు వారి పాద ధూళి నా మీద పడాలని, దాని వలనే నేను కృతార్థుడవుతానని  శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు. ఒకానొక సమయములో జరిగిన విషయము ఇది –శ్రీ గురుదేవుల సత్సంగము జరుగుతోంది, చాలా మంది భక్తులు కూర్చుని ఉన్నారు,ఈ సత్సంగము చాలా గొప్ప స్థాయికి చెందినది అని శ్రీ గురు దేవులు అన్నారు, ఇక్కడకి దేవతలు కూడా శరీరము ధరించి ప్రశాంతత కొరకు వచ్చి కూర్చుంటారు. ఒక సారి  ఒక విచిత్రమైన విషయము జరిగింది, దక్షిణ దేశము లో కన్యాకుమారి దగ్గర వివేకానందులవారి స్మారకము  కట్టబడి ఉన్నది, అక్కడ వివేకానందులవారు రోజూ ధ్యానము చేసేవారుట. ఆ ధ్యాన  మందిరములో ఇప్పటకీ జనాలు ధ్యానము చేసుకుంటూ ఉంటారు, అక్కడకి శ్రిపరమపూజ్యులు శ్రీ పండిత్ జి మహారాజ్ వారు 5-6 శిష్యులతో కలసి వెళ్ళేరు, అందరూ ధ్యానము చెయ్యడానికి కూర్చున్నారు చెస్తూ ఉండగా ఆ ధ్యాన  మందిరము అంతా భక్తులతో నిండిపోయింది. ధ్యానము పూర్తి  అవగానే అందరూ మాయమైపోయారుట. ఆ ముందు కూర్చున్న పరమపూజ్యులూ ఆయన శిష్యులు తప్ప. ఒక భక్తుడు చాలా ఆశ్చర్యముగా అడిగేడుట. ఇంత  మంది ఇంత  త్వరలో ఇక్కడకి ఎలాగరాగలిగేరు? ధ్యాన మందిరం సముద్రం మధ్య లో ఉంది కదా ? ఏదైనా నావ గాని ఓడ గాని ఉంటె గాని ఎవరూ ఇక్కడకి రా లేరు కదా అని. శ్రీ పరమ పూజ్యులు అన్నారుట మన గురుదేవులు చాలా ఉన్నతమైన స్థానములో ఉన్నవారు , ఆయన సాన్నిధ్యం కొరకు దేవతలు పరితపిస్తారు , అందుకే దేవతలు శ్రీ గురువు గారి దర్శనము కొరకు వచ్చేరు. ఎవరైతే అమృత మార్గాన్నూ శ్రేయస్  మార్గాన్ని పట్టుకున్నారో, ప్రేయస మార్గముని విదిలి వేస్తారో, ఇల్లూ వాకిలి, పరివారము అన్నింటిమీద మోహము వదిలి గురుదేవుల మార్గములో నడుస్తారో వారిని శ్రీ గురుదేవులు, ఎంత ఉన్నత స్థానానికి చేరుస్తారో చెప్పలేము. ఇది శ్రేయస్  మార్గము అమృత మార్గము. మనకి తెలుసు మృత్యు శరీరానికే అవుతుంది ఆత్మకి కాదు, ఆత్మ శాశ్వతము. భక్త రైదాస్ గురించి మీకు తెలిసే ఉంటుంది వారు  కుల రీత్యా ఉద్యోగ రీత్యా వెనకపడిన వారు. కానీ ఆ రోజుల్లో రాజు ఎవరు అని తెలియక పోయినా  ,ధనవంతుడు ఎవరు అని తెలియక పోయినా, భక్త  రైదాస్ గారు మాత్రము అందరికీ తెలుసును, ఎందుకంటే ఆయన శ్రేయస్  మార్గాన్ని ఎంచుగుని అమృతము పొందినవారు అవడము చేత ఈ రోజు వరకూ మనమంతా ఆయన్ని తలచుకుంటాము. ఈయన లాంటి లక్షలాది భక్తులు గురువుని ఆశ్రయించినవారికి ఆ సమర్థ సద్గురు అమృతత్వాన్ని వాళ్ళల్లో నింపి వేసేరు. ఏ విధముగానైతే విద్యార్థులు శ్రద్ధ తో ఉన్నత విద్యల ద్వారా పీ.జీ., పీ.హేచ్.డీ మొదలైన డిగ్రీలు పొందుతారో అదే విధముగా శ్రీ గురుదేవులు మనని కూడా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారు, అలాగే మనము కూడా ఆ గురువుగారి అడుగు జాడలలో నడుచుకోడమే , మనకి శ్రేయస్కరం. ప్రేయాస్ మార్గము చాలా ఆకర్షణీయముగా ఉంటుంది, ఏంతో సులభముగా ఈ మార్గము లోకి వెళ్ళిపోతాము, కానీ ఎంతో ప్రయత్నము  చేసి కష్టాలు ఓర్చి అయిన శ్రేయస్  మార్గాన్నే పట్టుకోవాలి, మనము రెండు అడుగులు ఈ శ్రేయస్ మార్గములో ముందుకి వేస్తె, సమర్థ సద్గురు పది అడుగులు ముందుకి వచ్చి మనని ఈ మార్గము మీద పైకి తీసుకువెళ్తారు, కానీ ఆ రెండు అడుగులూ వెయ్యడము కూడా అంత  సులభము కాదు. ఈశ్వర కృప, గురు కృప,  నిజ కృప ఈ మూడూ ఉంటేనే ఈ దారి సులభమౌతుంది కానీ ఈ ఆలోచన ఏ నాడూ మన మనస్సులోను రానే రాదు. నిజ కృప అంటే ఇదే. మనము ఎప్పుడూ ప్రాపంచిక విషయాలనే పట్టుకుంటాము, ఎవరైతే

ప్రాపంచిక విషయములంటే కష్టం సుఖం ధనము బిరుదులూ యశస్సు ఆ అమృతత్వము ముందు తుచ్ఛమని భావిస్తారో వాళ్ళే ఈ అమృతత్వాన్ని పొందుటకు అధికారులు.

సహజో బాయీ అనే భక్తురాలు అంటుంది శ్రిరాముడినైనా  విడిచిపెడతాను కానీ శ్రీ గురు దేవులు ని విడిచి  పెట్టను. ఆ రాముడు అమృతమూ, విషము కూడా ఇచ్చేడు కానీ గురుదేవులు విషము తను తీసుకొని అమృతము ఇచ్చేరు. సమర్థ శ్రీ సద్గురులు చెడు మాట వింటారు కానీ తిరిగి తియ్యగా మాట్లాడుతారు . శ్రిగురువులు మనజీవితములో అమృతమైన నిధి ని మనకి అందించేరు .మనము గంగా స్నానము చెయ్యాలంటే చాలా కష్టపడి  దూరాలు నడవాలి కానీ శ్రీ గురు దేవులు ఎంత ఉన్నతమైన సత్సంగ గంగని  ప్రవహింపచేసేరు అంటే అందులో స్నానము చెయ్యడానికి మనకి మంచి బుద్ధులు లేక పోయిన, ప్రాపంచిక విషయాల మీదే ధ్యాస  ఉన్న, ధ్యానములో మనస్సు నిలబడకపోయినా  రోజూ ఉదయం అరగంట, సాయంత్రము  అరగంట ధ్యానములో కూర్చుకూర్చుంటూ ఉంటే,ఈ విధముగా సత్సంగ గంగ లో స్నానము చేస్తూ ఉంటే  స్వతహాగానే శ్రీ గురుదేవులు దయ వలన ప్రాపంచిక విషయాలు విడిచి వేస్తాము. మనకి బంగారము ఇచ్చినా  దాని పక్కకి మనము చూడము. అటువంటిది ఈ అమృతము. ఇనుము పారస మణి  స్పర్శ వలన బంగారముగా మారుతుందంటారు అది నిజమైనా  కాకపోయినా శ్రీ సమర్థ సద్గురు సాన్నిధ్యం వలన మనని వారు తన అంతటి వారిని చేస్తారు. శ్రీ పరం పూజ్య పండిత జీ మహారాజ్ అనే వారు ,ఈ మార్గములో,మాటలలోనే ఈ నిధిని శ్రీ గురుదేవులు మనకి అందించేస్తారు. అది పెద్ద –పెద్ద యోగులుకి కూడా శ్రమపడి  సాధించుకొన్నా లభించదు. గంగా స్నానము చెయ్యడానికి ఏ విధముగానైతే కొన్ని పర్వదినాలు, పుష్కరాలకి మాహత్యము ఉందొ అలాగే సత్సంగ గంగలో కూడా పర్వ దినాలు ఉంటాయి వాటినే సత్సంగ భండారా అంటారు, అంటే వేలకి వేల మంది ఒకే చోటకి చేరి శ్రీ గురు దేవుల సాన్నిధ్యములోసత్సంగము చేస్తారో అక్కడ సత్సంగానికి విశేషముగా మాహత్యము ఉంటుంది, ఆ రోజు గురు దేవులు వారి జ్ఞాన-నిధిని అందరి కొరకూ విశేషముగా ప్రవహించేస్తారు.ఆ గురు దేవులు ఒక విత్తనము వేస్తారు అది ఒక రోజు తప్పక మహావృక్షము అవుతుంది. మనలో జ్ఞానము మహావృక్షము లాగ విస్తరిస్తుంది. హే గురు దేవా! మేమందరమూ మీ శరణం లోకి వచ్చేము మా అందరిపైన మీ కృప చూపండి.