Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

Retour

Kahat Na Aave Bain

कहत न आवे बैन

వర్ణనాతీతము

ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడి ఒక అందమైన రచనే,ఈ సృష్టి. మహాపురుషుల ఆలోచనల్లో  ఈ సృష్టి యొక్క ఆరంభములో  ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడి  అంతః కరణములో ఒక చిన్న ఆలోచన వచ్చినది ‘ ఏకాకీ న రమతే ’ అర్థాత్ ‘ఒక్కడినీ ఉండకూడదు. ఈ ఆలోచన మరొక ఆలోచనను ఇచ్చినది  ‘ఏకోహం బహుస్యామ్’ అర్థాత్ ఒకరి నుండి అనేకము అయిపోవాలి . ఈ ఆలోచన, ఈ భావము రావడము ఆలస్యం, వారు ఒకరినుండి అనేకులైపోయారు. ‘ఈశావాస్యమిదం సర్వమ్ యత్కించ జగత్యాం జగత్’ (ఈశావాస్యోపనిషద్ 1) తాత్పర్యము ఈ అఖిలాండములో ఏవైతే  ఉన్నవో అవి జడ-చేతన స్వరూపమైనవి, సమస్తము ఆ పరమాత్ముడితోనే వ్యాపింపబడి ఉన్నవి.  ఆ ఒక్క   శక్తే  ఇచ్చట వివిధ రూపాలలో (దృష్టిగోచరము అవుతోంది) కనిపిస్తోంది. ఈ అనేకములో అది  ఒకటి , ఆ సీమరహితులే సర్వత్ర వ్యాపించి ఉన్నారు, ఆ (సీమ రహితమైన) అంతులేని శక్తి   యొక్క సీమను, ఒక సీమలో ఉన్న వారు ఎలాగ తెలుసుకోగలుగుతారు?   ఇందుకే పరమ సమర్థ గురుదేవులు ఇలాగ వ్రాసారు ‘ఈశ్వరుడు ఒక శక్తి(పవర్) ఏదైతే నామ రూపరహితమైనదో, దానికి ఎవరు ఏ పేరు పెట్టుకుంటే అదే సరైనది.  ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడి శక్తే  ఇచ్చట  ప్రతి చోట పని చేస్తోంది, కానీ జీవుడు అజ్ఞానవశపరుడై (భ్రమితుడై) భ్రమలో పడిపోతాడు మరియు  ఆ భ్రమలో ఆ  శక్తి తనదే అనుకొని  సంశయములో పడిపోతాడు.

కేనోపనిషద్ లో  శిష్యుడు జిజ్ఞాసపరుడై  గురువుని ప్రశ్నించేడు –హే గురుదేవా! ఎవరి ద్వారా లేక ఏ శక్తి ద్వారా సంచలితమై  ఈ మనస్సు తన విషయాలలో నిమగ్నమైపోతుంది? ఏ శక్తి  ఈ ప్రాణులను  సంచలనము చేస్తోంది? ఎవరి ద్వారా ఈ వాణి  మాట్లాడగలుగుతోంది? ఎవరి ద్వారా ఈ కళ్ళు చూడడానికి సమర్థులవుతున్నాయి? మరియు ఎలాంటి  శక్తి అది , దేని వలనైతే ఈ చెవులు వినగలుగుతున్నాయి? ఓ గురుదేవా! ఆ శక్తి ఏమిటి మరియు ఎక్కడుంది, నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గురువు శిష్యుడి ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు  అతి సహజముగా ఇచ్చి శిష్యుడి జిజ్ఞాసను శాంత పరుస్తారు. వారు అంటారు --- ఆ శక్తే  బ్రహ్మ, ఎవరి శక్తి యొక్క అంశ మాత్రము వలనే ఈ మనస్సుతో   సహా  అన్ని ఇంద్రియాలు  పని చేస్తున్నాయి. ఆ అవస్థలో మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా, ఎవరైనా ఎలాగ చెప్పగలుగుతారు? బ్రహ్మ ఇలాగుంటారని, అది వాణి  ద్వారా చెప్పబడేది కాదు, ఎందుకంటే వాణి ఏ  శక్తి ద్వారా మాట్లాడింపబడుతుందో అది బ్రహ్మ కాదు, అదైతే వాణి కన్నా సర్వతా ఉన్నతమైనది,  మనస్సు మరియు బుద్ధి కన్నా ఉన్నతమైనది, దాని శక్తి ద్వారానే మనస్సు తెలుసుకోవలసిన పదార్థాలను, విషయాలను తెలుసుకుంటుంది. కళ్ళల్లో  చూడగలిగే శక్తి ఏదైతే  తే ఉందో, అది దాని శక్తి యొక్క అంశ  మాత్రమే. ఈ కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో, అది బ్రహ్మ కాదు, మన చెవులు ఆ శక్తి యొక్క అంశ మాత్రముతోనే వినడానికి సమర్థిస్తాయి,   ఎంతదాకా అంటే ప్రాణము కూడా ఆ శక్తి వలనే సంచలింపబడుతోంది. ఆ సర్వశక్తిమూర్తి  పరమేశ్వరుడే బ్రహ్మ. ఎవరికైతే ఆ పరమేశ్వరుడు తెలుసునో, కానీ తెలుసుననే గర్వము వచ్చేసిందో అలాంటి వారికి తను తెలియనట్లే మరియు ఎవరైతే ఇది ఒప్పుకుంటారో బ్రహ్మని తెలుసుకోవడము కష్టము అని వాస్తవములో  వారికే బ్రహ్మ గురించి తెలుసును, ఎందుకంటే, తమ  అహంకారము  కారణముగా వారికి   చాలా దూరమైపోయాడు.

ఎలాగ తెలుసుకోవడము?

ఇంక ఆ బ్రహ్మని ఎలాగ తెలుసుకోవడము అనేదే ప్రశ్న –దాని కొరకు పరమ పూజ్య గురువుగారి సందేశము –‘ఇప్పుడు మీరు పరమేశ్వరుడిని చూడలేదు, అందుకే  వారిని పొందడానికి , ముందు వారితో సంప్రదించండి  ఎవరైతే ఆ పరమాత్ముడిని చూసారో’. వారే మీకు వారి దర్శనము చేయించగలుగుతారు’. గురువు మనకి జ్ఞాన ప్రకాశము ఇస్తారు. దివ్య మరియు పరోక్ష దృష్టి కటాక్షిస్తారు దేనివలనైతే మనము ఆ పరబ్రహ్మ యొక్క అనుభవాన్ని  పొందకలుగుతామో,  లేక ఆ ఆనందాన్ని పొందకలుగుతామో  కానీ, అది ఎప్పుడు? ఎప్పుడైతే మనిషి అర్జునుడిలాగ ప్రార్థిస్తాడో. మరియు  యుద్ధ స్థలమున శోకముతో ఉద్విగ్నమైన మనస్సుతో కూడిన అర్జునుడి శరీరము వణకడము మొదలు పెడుతుందో, చేతి నుండి గాండీవము జారిపోతూ ఉండేదో, అప్పుడు ఆర్త దృష్టితో అర్జునుడు, కృష్ణుడి వైపు చూస్తూ ఇదే అంటాడు –హే కృష్ణా ! నా కొరకు ఏదైతే కల్యాణకరమైనదో అది మీ కృప వలన నాకు తెలియ చెయ్యండి. ఎందుకంటే నేను మీ శిష్యుడిని ఇందుకే  మీ శరణులోకి వచ్చిన నాకు  ఉపదేశించండి ‘శిష్యస్తేsహం శాధి మాం త్వాం ప్రపన్నమ్’   భగవన్తుడు  ఆ భక్తుడిపై కృప కలిగించి  మరియు వారి జ్ఞానము వలన అతని అంతర్చక్షులను తెరిపిస్తారు. భక్తుడు కృతార్థుడు అయిపోతాడు, రాజ్యము దొరికిన తరువాత అర్జునుడు ఒక మారు  మరలా గీత యొక్కజ్ఞానాన్న

వినిపించమని  భగవంతుడిని ప్రార్థించాడు  –‘ ఓ భగవంతుడా! మీరు యుద్ధ భూమి లో వినిపించిన  గీత యొక్క అపూర్వ గానం మరల ఒక మారు     వినాలని ఉంది, మీరు ఎప్పుడైతే బోధించేరో అప్పుడు నా మనస్సు  చాలా చపలముగా ఉండేది, రకరకాల విపత్తులలో చిక్కుకుని ఖంగారుగా ఉండేవాడిని, మళ్ళీ ఒక మారు  వినిపిస్తే చాల కృప కలుగుతుంది,అప్పుడు  భగవంతుడు ఇలా  అన్నారు --- న  శక్య తన్మయా భూయ: తథా వక్తుం అశేషత:|

పర హి  బ్రహ్మ కథితం యోగ యుక్తేన తన్మయా||

ఓ అర్జునా! అప్పుడు నేను అత్యంత యోగయుక్త అంత:కరణముతో ఉపదేశించాను, మళ్ళీ అలాగే ఉపదేశించడము  ఇంక ఇప్పుడు సంభవము కాదు.    వాస్తవము ఇదే, ఎప్పుడైతే శిష్యుడు వ్యగ్రతతో (విహ్వలుడై)  అర్థాత్  కిమ్-విధి- విమూడ   పరిస్థితికి లొంగి, ఆర్త దృష్టితో, గురువుని తన రక్షణ కొరకు శరణాగతుడై  ఆర్త నాదముతో పిలుస్తాడో, అప్పుడు ఆ పరమాత్ముడు గురువు ద్వారా శిష్యుడిపై కృప కలిగిస్తారు మరియు ఆ జ్ఞానాన్ని   శిష్యుడి అంతరాలలో ప్రవేశింపచేస్తారు. అప్పుడు ఆ  శిష్యుడు  పరమానంద  స్థితికి చేరతాడు ఏదైతే వర్ణనాతీతమో ---

అలఖ్ లఖా, లాలచ్ లగా, కహత్  న ఆవే బైన్ |

నిజ మన్  ధంసా సరూప్ మే సద్గురు దీన్హీ సైన్ ||

ఇలాగే సద్గురు కృప వలన ఆ ఋషులు, ధ్యాన యోగము ద్వారా ఆ బ్రహ్మ లో ఉన్న , శక్తి యెక్క    అనుభవాన్ని పొంది ఇలా అన్నారు.

ఓ అమృతపుత్రుల్లారా! దివ్యధామములో నివసించే  దేవగణులారా వినండి- నేను సూర్యసమానమైన ఆ మెరుస్తున్న  పురాణపురుషుడిని పోల్చుకున్నాను, ఏదైతే సమస్త అజ్ఞాన-అంధకారము కన్నా మించినది. కేవలము దాన్ని తెలుసుకొని, మృత్యువు యొక్క  భవభీతి నుంచి   తప్పుకోవచ్చు. ఇది కాక ఇంక ఏ రెండవ దారి లేనే లేదు. ఆ మార్గము, చెప్పేవారు ఆ సద్గురువే. ‘బిన్ గురు బాట్ బతావే కౌన్’ |

సూఫీ కవి జాయసీ కూడా ఈ వైపుకే సంకేతము ఇచ్చారు

గురు సూఆ జేహి పంథ్ దిఖావా, బిన్ గురు జగత్ కో నిర్గున్ పావా .

ఉపనిషద్ ఏమంటుందంటే ---‘య తో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా (తైత్తిరీయోపనిషద్ 4/11 ) అర్థాత్ మనస్సు మరియు  వాణి ఇత్యాది ఇంద్రియాలు దానిని పొందేక తిరిగి వచ్చేస్తాయి, అది  మనస్సు మరియు వాణి(వాటి)    విషయమే కాదు, కానీ గురువు ఆ రహస్యాన్ని ప్రకటిస్తారు . కొందరు ఆ ఆత్మని ఆశ్చర్యముగా చూస్తారు , కొందరు ఆశ్చర్య పడేలాగాదానిని చెప్తారు, కొందరు దానిని ఆశ్చర్యముగా వింటారు, మరి కొందరు దానిని విని కూడా దాని గురించి తెలుసుకోలేక పోతారు(గీత 2 /29 ) కానీ సంత్ మహాత్ములు మాత్రం అందులోనే నిమగ్నమైఉంటారు వారి కొరకైతే ఇది ఒక హస్తామలకము లాంటిది, పరమభాగవత్  పండిత్ జీ మహారాజ్ వ్రాసారు –‘మహాపురుషుల సుమన సరోవరములో ఏ  మలినమైన మనస్సు స్నానము చేయ్యకలుగుతుందో అది అప్పుడు  పూర్తిగా మారి పోతుంది, అప్పుడు  కష్టాలన్నీ పూర్తిగా  దూరమైపోతాయి, ’ …..గురువు నేత్ర జ్యోతి లేని వారికి దృష్టి  అర్థాత్ కళ్ళు ఇస్తారు, మూగ వారికి వాణి  ఇస్తారు, భయస్తులకు  నిర్భయత కలిగిస్తారు, బంధనుడికి ముక్తి ఇస్తారు, ఎన్నని  చెప్పను వారు తమ  ఎన్నో   జన్మల ఆర్జనను     శిష్యుడికి ఇచ్చేస్తారు ఇంతే కాదు, తన ప్రాణాలను దేనినైతే తన స్వంత కొడుకులకి కూడా ఇవ్వాలంటే సంకోచిస్తారో, అలాంటి ప్రాణాలను  కూడా శిష్యుడి ప్రాణాలలో కలిపి అమరత్వాన్ని  ప్రసాదిస్తారు..... ఎలాగైతే జీవుడు తల్లి  లేకుండా ఈ ప్రపంచములోకి రాలేడో  అలాగే గురువు లేకుండా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళలేడు. ఈ విశ్వములోకి రావడానికి, మొదట  ఈశ్వరుడు తరువాత  గురువు, కానీ ఈ సంసారము నుండి వెళ్ళాలంటే మొదట  గురువు తరువాత  ఈశ్వరుడు. ఇది  నిశ్చితము. గురువు ఈశ్వరుడి సూక్ష్మ రూపము, ఆ పరమాత్మున్ని   తెలుసుకోవాలంటే ముందు గురువుని  తెలుసుకో వలసి వస్తుంది, ఎవరైతే గురువుని తెలుసుకున్నారో వారు అంతా తెలుసుకున్నట్లే.’

ఒకసారి పరమ సమర్థ గురుదేవులుని ఒక విద్యార్థి ప్రశ్నించేడు   దేవుడు ఎవరు ? ఎలాగుంటాడు?   మనము దేవుడిని నమ్మకపోతే ఏమి నష్టము ? దానికి గురుదేవులు ఇలాగ  జవాబు ఇచ్చారు —ఈశ్వరుడు ఒక శక్తి ఏదైతే కనిపించనూ కనిపించదు, అర్థమూ కాదు, అదైతే విద్యుత్ (కరెంట్) లాంటిది, అందరిలోనూ వ్యాపించి రక-రకాలుగా  అనుభూతి చెంది   మరియు ఎన్నో పనులు చేస్తోంది. అనేక రకాల  యంత్రాలు, ఫ్యాన్లు, బల్బులు దాని వలెనే ప్రకాశింపబడుతున్నాయి మరియు తిరుగుతున్నాయి. మనము ఆ శక్తికి ఏ పేరైన పెట్టుకోవచ్చును, కానీ ఇది మాత్రం నమ్మవలసి వస్తుంది అది ఒక విశేష శక్తి అని, ఏదైతే సంపూర్ణ బ్రహ్మాండాన్ని నియంత్రణలో ఉంచుతోందో. మీరు దాన్ని నమ్మితే దానికి ఏ లాభమూ లేదు మీరు నమ్మకపోతే ఆ ఈశ్వరుడికి ఏ నష్టమూ   లేదు, కానీ  మీకు మాత్రము తప్పకుండ లాభ-నష్టం కలుగుతుంది. అది ఎలాగంటే మీరు ఆ శక్తి తో కలిస్తే , గొప్ప శక్తివంతులు అయిపోతారు మరియు జ్ఞానాన్ని పొందుతారు, కానీ దానితో కలవకపోతే ఎలాగున్నారో  అలాగే ఉండి  పోతారు. గురువు యొక్క వాణి వలన అంతరాలలో ప్రకాశము ప్రజ్వరిల్లుతుంది మరియు శిష్యుడు ఆ ప్రకాశముతో  వారిని చూస్తాడు , ‘శబ్దహి శబ్ద భయో ఉజియారో ఆతమరూప్ లఖాయో.’ ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడిని తెలుసుకొని   గోపికలలాగే  ఒఖక్షణము కూడా భరించలేనంత విరహ వేదన పడతాడు  .....’తద్విస్మరణే పరమ వ్యాకులతా’ (నారద భక్తి  సూత్ర 19) అర్థాత్ ఒక క్షణ విస్మరణ మాత్రము వలనే బాధపడిపోతాడు. +ఇందువలనే ఓ గురుదేవా!

మేమందరము  కూడా శరణాగతులము, మా అంతరాలలో కూడా ఇలాంటి వ్యాకులత నింపండి,   మేము మిమ్మల్ని  ఒక క్షణం కూడా మరచిపోకుండా, మా  పై కృప కలిగించండి , అప్పుడే ఈ జీవితము    సఫలమవగలుగుతుంది.