ఈశ్వర దర్శనము యొక్క ఆవశ్యకత
<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/04/param-poojya-panditji-222x300.jpg" alt="" width="222" height="300" class="alignnone size-medium wp-image-58358" />
మహాప్రభు అవతరించినప్పుడు
ఈ రోజు మేము మీ పుణ్యస్మృతి లో కూర్చొని ఏమి ఆలోచిస్తున్నామంటే, ఆ రోజు ఎంత శుభమైన రోజో, ఎప్పుడైతే మీరు ఆ ఆనందమయమైన లోకాన్నుండి వచ్చి ఈ భవ్య భారత భూమి పై మానవ శరీరములో అవతరించారో. మీరు ఋషుల యొక్క ఆ మహాసూక్ష్మ జ్ఞానాన్ని ఏదైతే అసత్యము నుంచి సత్యము వైపుకి, అంధకారము నుంచి ప్రకాశము వైపుకి, మృత్యువు నుంచి అమరత్వము వైపుకి తీసుకోనివెళ్లేదో, ఆ మహా జ్ఞానాన్ని మా గృహస్తులకు ఇంటిలో కూర్చొనే సులభంగా అందేలా చేసారు. ఇప్పుడు కూడా మీ సత్సంగము సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ లాగ ఉపయోగపడుతున్నది. హే ప్రభూ! మీరు చేసిన ఈ సహజ మైన కృప కొరకు ఏ విధంగానూ, ఏకాలములోనూ మీ ఋణాన్ని తీర్చుకోలేము.
మేము మీతో దూరంగా ఏ లోకంలో వున్నా మా అంతరాత్మ ఎప్పటికీ మీ చరణాలపై తలవంచి మీ ఆశీర్వచనాలకొరకు అంజలి పట్టి వుంటుంది. మరియు మీ నుంచి ఆ ప్రకాశ కిరణాల కొరకు ఆశతో ఎదురుచూస్తూ వుంటుంది.
ఈశ్వర దర్శనము గురించి మాట్లాడే ముందు మనము తెలుసుకోవలసింది ఏమిటంటే, మనకి ఈశ్వర దర్శనము లేక ఈశ్వర భజన యొక్క అవసరము ఏమిటి? ఈ రోజుల్లో ఒక శిక్షితుడైన వ్యక్తి మొట్ట మొదట ఏదైతే అత్యంత ఆవశ్యకరమైనదో అదే చెయ్యాలని ఆలోచిస్తాడు. ఉదాహరణకు విద్యాధ్యయనము, సుఖ శాంతి కొరకు ధనార్జన. ఈ దశలో నిద్ర కూడా అత్యంత ఆవశ్యకరమైనదని, దాని కొరకు సమయము కేటాయించాలని వారికి తెలియదు.
ఈ మధ్య చూస్తున్నది ఏమిటంటే, చాలా మంది మనుష్యులు అనారోగ్యము తోటి బాధ పడుతున్నారు , ఎందుకంటే వారు తమ జీవితాలలో నిద్రని తగ్గించేశారు , ఏదైతే వారి కొరకు చాలా ఆవశ్య కరమైనదో నిద్ర, భోజనము మరియు నీరు కన్నా ఎక్కువ ఆవశ్య కరమైనది. దీని గురించి ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే నాలుగు రోజుల వరకు నిద్ర రాదో, అలాంటి పరిస్థితిలో మెదడు సరిగ్గా పనిచెయ్యక, శరీరము రకరకాల వ్యాధులతో బాధ పడవచ్చు, ఇంక ఆ మనిషి ఏ పనీ చెయ్యలేక పోతాడు. అలాంటప్పుడు డాక్టర్ ని కలవ వలసి వస్తుంది. దీని వలన ఏమి తెలుస్తున్నదంటే , జీవితములో జాగృతి మరియు సుషుప్తి రెండూ మనిషికి పరమావశ్య కమైనవి. ఈ రెండింటిలో నుంచి ఏది రాకపోయినా జీవితమే సమాప్తమైపోతుంది.
నిద్ర మరియు భజన
ఎలాగైతే ఈ నిద్ర ప్రతి దినమూ మన అశాంతి మరియు అలసటను తొలగిస్తుందో, మనస్సుకి మరియు బుద్ధికీ శాంతి కలిగిస్తుందో, అలాగే ఈశ్వర ధ్యానము, జీవితములో ఒక పరమశాంతిని ప్రసాదిస్తుంది. దీని వలన మీరు శరీరానికి, మనస్సుకి మరియు బుద్ధికి శాంతి కలిగిస్తారు, ఈశ్వర భజన వలన జీవాత్మకు శాంతి కలుగుతుంది. ఎలాగైతే సర్వసౌకర్యాలూ ఉన్నాకానీ నిద్ర లేకపోతే, మనిషి అశాంతి అనుభవిస్తాడో, అలాగే ఆ జీవాత్మ (ఏదైతే ఆ మనిషిలోపల వున్న) కూడా అన్నీ ఉన్నా కానీ అశాంతిగా వుంటుంది.
మీకు తెలుసా నిద్ర ఏమిటని? అది ప్రభువు మనకు ఇచ్చిన ఒక చక్కటి వరము. ఏదైతే కొద్ది సమయము కొరకు మనిషి దగ్గర నుండి అన్నీ తీసేసుకొని తన దగ్గర పెట్టేసుకుంటుంది, మరియు మనల్ని తేలికగా చేసేస్తుంది. జాగ్రత్ అవస్థలో ఏ భారాలైతే తన మీద వేసేసుకున్నాడో, మరియు వాటిని ఇవన్నీ నావి అని అనుకొని ఇచ్చి పుచ్చుకోవడములో బాధ పడుతున్నాడో, ఆ సమయములో నిద్ర కొంత సేపటికి కొరకు, తన మీద ఆ భారాన్ని పుచ్చేసుకొని విశ్రాంతి కలిగిస్తుంది, మరల జాగ్రత్ అవస్థ రాగానే , అన్నీమునుపటి లాగే అప్పచేప్పేస్తుంది. నిద్రకి ముందు ఉన్నట్లుగానే అతని సుఖ దు:ఖాలు అలాగే తిరిగి ఉండిపోతాయి. అతని పరివారము, ధనము విద్య ఇత్యాదుల్లో ఏ మార్పూ వుండదు. శరీరము మరియు మనస్సు ఏ స్థితి లో పడుకొనే ముందు ఉండేదో అది కూడా అలాగే తిరిగి ఉండిపోతుంది.
ఎలాగైతే నిద్ర, కొంత సేపటికొరకు మనిషికి శాంతి ప్రసాదిస్తుందో ,జాగ్రత్ స్థితిలో ఉన్న కష్టాలను దూరము చేసిందో, అలాగే ఈశ్వర భజన మన ఆత్మకు పూర్ణ శాంతిని ఇస్తుంది. నిద్ర అయితే రెండుగంటల కొరకు శాంతి ఇచ్చింది, కానీ ఈశ్వర భజన, ద్యానము వలన ఒక అద్భుతమైన, అనిర్వచనమైన శాంతి కలుగుతుంది. నిద్రలో ఏ దు:ఖాలు అయితే దూరమైనవో, మరలా మెలకువ రాగానే అవి తిరిగి వచ్చేస్తాయి, కానీ ఈశ్వర ధ్యానము, దర్శనము వలన అవి ఎప్పటికీ తిరిగి రావు. దుఖాలు వున్నా కానీ, అవి మనిషికి దుఃఖము కలిగించవు, ఎందుకంటే దు:ఖాలు మనల్ని దుఃఖ పరచవు, వాటి ఆలోచనలే దు:ఖాన్ని కలిగిస్తాయి. ఎక్కడైతే ఒక సాధారణమైన మనిషి దు:ఖాలతో దు:ఖపడతాడో, అక్కడే ఒక ఈశ్వర భక్తుడు (జ్ఞానము తో కూడిన వ్యక్తి) దు:ఖాలలో చిక్కుకొనివున్నా కానీ దు:ఖపడడు. ఎందుకంటే ఈశ్వర భజన మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని మార్చేస్తుంది. మరియు ఎలాంటి జ్ఞానము ఇస్తుందంటే అతను అన్ని దశలలోనూ ప్రసన్నముగా ఉండగలడు. రాజ్యము లభించినా, త్యజించినా అతనికి విశేషమైన సుఖ దు:ఖాల అనుభవము కలగదు. ఈ ప్రపంచము లో వున్నా, లేక వదలి వెళ్ళినా ఏమీ కష్టము అనిపించదు. ఈ జ్ఞానము వలనే కదా శ్రీ రాముడికి రాజ్యము దొరికినా, త్యజించవలసి వచ్చినా ఏమీ ఆనందము, కష్టము కలగలేదు. అయోధ్యను వదలి ఎలా వెళ్ళారంటే ఎలాగైతే, ఎవరైనా తనది కాని దాన్ని వదలి వెళ్లి పోతారో. మహాత్మా తులసీ దాసు గారు వారి ఈ పరిస్థితిని చాలా చక్కగా వర్ణించారు. దాని తాత్పర్యమేమిటంటే
“శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే వనవాసానికి బయల్దేరారో, అప్పుడు తన పట్టు వస్త్రాలను విలువైన ఆభూషణాలను, ఆ క్షణములోనే ఎలాగ త్యజించేసేరంటే, ఎలాగైతే ఒక చిలుక తన రెక్కలను రాల్చేస్తుందో, దారిన వున్న చెట్లను, బాటసారులను ఆ దారిన పోయే మనిషి (బాటసారి) ఏ వ్యామోహమూ లేకుండా వదిలి ముందుకి వెల్లి పోతాడో. అప్పుడు ఆ రాజీవ లోచనుడు శ్రీరామచంద్రుడు అనుజుడు లక్ష్మణుడు , సీతమ్మ సమేతముగా ఎంత అందముగా అనిపించారంటే, ఎలాగైతే సాక్షాత్ ధర్మమే శరీరాన్ని ధరించిందా అని అనిపించింది. శ్రీరామచంద్రుడు తండ్రి యొక్క రాజ్యాన్ని దారిపోయే వారిని వదలినట్లు వదిలి పోయారు” .
ఈశ్వర దర్శనము వలన మనకు బాగా అర్థమైనది ఏమిటంటే ,ఈ సుఖ దుఃఖాల స్థితి ఎక్కువ దూరము దాకా లేదు, కేవలము ఈ శరీరం వరకే, మరియు అది కూడా జాగ్రత్ స్థితి వరకే. మనకి తెలుసు కదా జాగ్రత్ స్థితి లో ఉన్న సుఖ దుఃఖాలు స్వప్నము లో మారి పోతాయి. మెలకువ స్థితిలో ఉన్న ఒక రాజు స్వప్నములో ఒక దరిద్రుడు అవవచ్చు, జాగ్రత్ స్థితి లో చాలా బాధ పడుతూన్న మనిషి స్వప్నంలో సుఖాన్నీ , వైభోగాన్నీ పొందవచ్చు, జాగ్రత్ స్థితి లో ని:సంతానుడు కలలో తమ పుత్రులతో కలుసుకోవచ్చు, కానీ దీని కన్నా కొంచెము దూరంగా సుషుప్తి లోకి వెళితే ఇవి ఏవీ ఉండవు .
స్వీకరించడము మరియు త్యజించడము
జీవితములో రెండు పక్షాలు ఉన్నాయి, వాటిని కనుక బాగా అర్ధము చేసుకొని సక్రమంగా నిర్వహిస్తూంటే కష్టాలు ఎప్పటకీ రానే రావు . అది ఏమిటంటే - స్వీకరించడము మరియు త్యజించడము రాత్రి పూట కొంత సేపు అన్నింటితోను దూరమయి, మరియు ఈ సమయాన్ని దేవుడిది అనుకోండి , ఆ పరమాత్ముడికి వారి లెక్క అప్పచెప్పేసి సుఖముగా నిద్ర పొండి, ఇదే( గ్రహణ్ మరియు త్యాగ్) గ్రహించడము మరియు త్యజించడము. గ్రహించడము ఎంత అవసరమో మరియు త్యజించడము కూడా అంతే అవసరము. గ్రహిస్తూనే ఉండిపోతే ఈ జీవితము యొక్క పరిస్థితి ఏమి అవ్వాలి? ఎంత భారము పడిపోతుంది మన పైన? ఇందుకే కొంత భారాన్ని ఉంచుకోండి కానీ, కొంత సేపటికి దాన్నికూడా దింపేసి ఒక పక్కని పెట్టెయ్యండి, జీవితములో సుఖము, గ్రహించడములోనే కాదు త్యజించడములోనూ అంతే ఉంది, ఇంతే కాదు అంతకన్నా ఎక్కువ ఆనందము ఉంది.
దృష్టాంతము
ఒక మహాత్ముడు భ్రమణం చేస్తూ వెళ్తూంటే ఒక వూరిలో ఒక సేఠ్ ఆయనతో ఇలా అన్నారు. ప్రభూ! కొన్ని రోజులు మీరు మా తోటలో నివసించండి. అచ్చట చాలా చక్కటి గది ఉంది, అందులో మంచి –మంచి పుస్తకాలు ఉన్నాయి, విశ్రాంతి కొరకు అన్ని సౌకర్యాలూ అచ్చట ఉన్నాయి. ఆ మహాత్ముడు అక్కడ ఆగి పోయారు. ఆయన దినచర్య ఏమిటంటే ఉదయాన్నే లేచి తిరగడానికి వెళ్ళడము, చాలా సేపటి తరువాత తిరిగి రావడము మరియు ఎప్పటిదాకా నైతే అక్కడ గది లో ఉండేవారో తలుపు వేసుకొనే ఉండేవారు, మరియు బైటకి వెళ్ళినప్పుడు తలుపులు తెరిచి వెళ్లిపోయేవారు. సేఠ్ యొక్క సేవకులు ఈ విషయాన్ని సేఠ్ కి తెలియచేసేరు. మీ నియమము యొక్క కారణము ఏమిటి? అని అతను మహాత్ముడిని అడిగేరు .మహాత్ముడు ఇలాగ జవాబు చెప్పేరు ---ఎప్పటి దాకానైతే నేను గది లో ఉంటానో సామాన్లు జాగ్రత పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు వాటి అవసరము ఉంటుంది కనుక, బైటకి వెళ్ళినప్పుడు, ఎందుకు తెరిచి వెళ్లి పోతానంటే మళ్ళీ తిరిగి వస్తానో రానో? అని. నేను శరీరము యొక్క భారాన్ని మనస్సు మీద మోపను, ఈ విధముగా చెయ్యడము వలన నాకు ఏ బెంగా ఉండదు మరియు శాంతి కలుగుతుంది , నాకు ప్రభువు మీద నమ్మకము ఉన్నది. ఎవరైతే ఈ రోజు ఇస్తున్నారో, రేపు కూడా వారే తప్పక ఇస్తారు, ఇదే నా గ్రహించడము, మరియు త్యజించడము.
మన జీవితాలను మనము లోభముతో కూడిన మనిషి లాగ చేసుకోకూడదు , ఎవరైతే ప్రతి వస్తువునీ తీసుకుంటాడు కానీ ఏదీ వదలడు, ఎవరికీ ఇవ్వడు, వాటి సంగ్రహమూ, మరియు వాటి రక్షణ లోనే తన సంపూర్ణ జీవితాన్ని గడిపేస్తాడు. మీరు మీ జీవితాలను ఈశ్వరమయము చేసుకోండి. నిత్యం తీసుకోండి నిత్యం ఇచ్చెయ్యండి, ఎందుకంటే ఆ దేవుడు “నిత్యం” మరియు ఈ జీవితము కూడా అనిత్యంకాదు “నిత్యమే.”
మూడు రకాల దాతలు
మొదటి రకమైన మనిషి ఎవరికైనా ఏదైనా ఇస్తే అందరి ముందూ ఇస్తాడు , ఈ రకమైన మనిషి నిమ్న కోటి మానవుడు. రెండవ రకమైన దాతలు ఎవరికీ చూపించ కుండా ఇస్తారు. అది ఇద్దరికే తెలుస్తుంది ఒకడు ఇచ్చేవాడైతే , రెండవవాడు తీసుకొనేవాడు. మూడవ రకము వారు ఎలాంటి వారంటే, వారు ఇచ్చినప్పుడు తీసుకోనేవాడికి కూడా తెలియకుండా ఇచ్చేస్తారు ,ఇలాంటి వారు దేవుళ్ళ శ్రేణి లోకి వస్తారు. దేవుడు అందరికీ ఇస్తాడు కానీ ఇప్పటి దాకా ఎవరూ ఆ దేవుడిని చూడలేదు వీటిలో మొదటి వారు తమ పేరు(యశస్సు) కొరకు, రెండవ వారు స్వర్గప్రాప్తి లేక సుఖము కొరకు చేనేవారు , మూడవ వారు తమ కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు కానీ, ఏమీ కోరుకోరు .
ఈశ్వర ధ్యానము లేక ఆత్మ జ్ఞానము వలన మనిషికి మంచి జరుగుతుంది . ఎప్పుడైతే మనిషి ఆత్మయొక్క అనుభవాన్ని పొందుతాడో అప్పుడు మహాత్ముడని అనిపించుకుంటాడు, అలాంటప్పుడు తను తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు మరియు జనన, మరణ యొక్క దు:ఖాలని దాటి ముందుకి వెళ్లి పోతాడు. సంపూర్ణ విశ్వములో తన స్వరూపాన్నే చూస్తాడు , అలాంటప్పుడే ఒక సీమ (లిమిట్) దాటి సర్వేశ్వరుడిలో ఐక్యం అయిపోతాడు. ఎవరికైతే ఏ సీమా లేదో , ఎవరైతే సంపూర్ణమో, వారు సదైవులు. మీకు మీ జీవితాలలో పూర్ణత్వం కావాలంటే , ప్రభువుతో కలవండి , వారి వలనే మీకు పూర్ణ జ్ఞానము లభిస్తుంది , పూర్ణ ఆనందము మరియు అక్షయ జీవితము లభిస్తుంది. ఆ రోజు మీకు ఏమి అర్ధమౌతుంది అంటే నాకు భోజనము, నీరు , వాయు, దొరకకపోయినా పరవాలేదు , కానీ నా రాముడు, నా ఈశ్వరుడు నాతొ వేరు కాకూడదు, నిజంగా ఆ రోజు నుండి మీరు వేరు అవ్వలేక పోతారు . మనిషిలో ఉన్న ఆ రాముడే కదా అతనిలో మాట్లాడుతాడు అతనే కదా అన్నీ చూస్తాడు , మరియు అతనే అన్ని సుఖాల ఆధారము కూడా, అతనే కదా అన్ని జీవుల లోనూ ఉన్నది .
ఎంత తప్పు జరిగిపోయింది
ఎలాంటి తప్పు జరిగి పోయింది? ఈ జీవితము యొక్క సఖుడు, ఎవరి వలనైతే ఈ జీవితము ఉందో, మనము తననే మర్చి పోయాము . కానీ కొంచము ధ్యానముగా చూస్తే , తను ఎప్పుడూ మనతోనే ఉన్నాడు , తను మనల్ని మరవలేదు. మనము సూర్యుడునీ ,వాయువు నీ మరచిపోవచ్చు కానీ సూర్యుడూ, వాయువు మనల్ని మర్చి పోయారా ? ఈశ్వరుడు మీ నీడ లాగ ఎప్పటికీ మిమ్మల్ని వదలక సుఖము లోనూ దుఃఖము లోనూ మీతోనే ఉంటాడు. కానీ మీరు గమనించారా, నీడ మనకు ప్రకాశము ఉన్నంతవరకే కనిపిస్తుంది, చీకటిలో కాదు . అయితే మరి ఆ నీడ చీకటిలో మిమ్మల్ని విదిలి ఇంక ఎవరితోనైనా వెళ్లి పోతుందా? లేదు లేదు అంధకారములోనూ మీతోనే వుంటుంది కానీ మీరు దాన్ని చూడలేకపోతారు . ఈ చీకటి, వెలుతురు (ప్రకాశము) మనిషి యొక్క జ్ఞానము మరియు అజ్ఞానమే కదా! జ్ఞానము తో కూడి ఉన్నప్పుడు మీరు మీతోనే వున్న ఆ పరమాత్ముడిని చూడ గలరు మరియు అంధకారము లేక అజ్ఞానము లో ఉన్నప్పుడు మీరు చూడ లేక పోతారు. ఇదే కారణము మనిషికి వెలుగు లో అంత భయము వెయ్యదు ఎంతైతే చీకటిలో వేస్తుందో . ఇందువలన తెలిసిన దేమిటంటే ప్రకాశము అంటేనే జ్ఞానము , ఆ జ్ఞానమే ఈశ్వరుడు.
మన జ్ఞానము .
సాంసారిక జ్ఞానము వేరు. ఆత్మ జ్ఞానము వేరు. వీటి మధ్య ఉన్న సంబంధము ఎలాంటిదంటే, ఎలాగైతే మన శరీరమూ మరియు మనము. మీ శరీరము మీతో వేరుకాదు, కానీ మరలా చూస్తే వేరు కూడాను . ఈ సంసారములో ఉన్న పెద్ద- పెద్ద విద్వాంసులను “మీరు ఎవరు” అని అడిగినా వారు కూడా బహుశ సరైన జవాబు చెప్ప లేక పోవచ్చు , నేను ఫలానాని అని జవాబు చెప్పవచ్చు.ఇది చాలా సాధారణమైన మాట, ఈ జవాబు ఒక చిన్న పిల్లవాడు కూడా ఇచ్చెయ్య గలడు ఎవరికైతే ఏమి తెలియదో . కానీ వారి ఈ జవాబు తోనూ మీరు సంతృప్తి పడకపోవచ్చు. “మీరు ఎక్కడ నుండి వచ్చారు” “మరియు మీరు ఎక్కడకి వెళ్తారు” ? వీటికి సరైన జవాబు చెప్పడము ఏమైనా సులువైన పనేనా? దీనికి జవాబు వారే చెప్ప గలరు ఎవరైతే ఆజన్మ పర్యంతం ఈ జవాబు కొరకు కఠిన పరిశ్రమ చేసి ఉంటారో . ఋషులు, మునులు మరియు మహాత్ములు , ఎవరైతే ఈ కఠినమైన ప్రశ్నకి జవాబు ఇచ్చేరో, వారు పెద్ద- పెద్ద త్యాగాలూ, తపస్సులతో కూడిన జీవితాలని గడిపేరు, వారు సంసారము నుంచి పారిపోలేదు. మీరు ఈ సంసారాన్ని ఒక పాఠశాల మరియు మిమ్మల్ని ఒక ఎకాగ్రచిత్తమైన విద్యార్థి అనుకోండి. ఏ విద్యార్థి అయితే పాఠశాల నుండి పారిపోతాడో , అతను ఏమి నేర్చుకోగలుగుతాడు? ఈ జనన మరణాలు ఆ విద్యార్థి యొక్క రాత్రి పగలు లాంటివే . ఈ విద్య కూడా ఒక రోజుది కాదు, ఒక జన్మది కాదు, ఇది వేలకొద్ది ఏళ్ల బేరం కూడా అవ్వచ్చు కానీ ఎప్పుడైతే విద్యార్థి చదువు మొదలు పెడతాడో అతను రోజులు లెక్కపెట్టడు . ఒక రోజు తన చదువు తప్పక పూర్తి చేసేసుకుంటాడు. ఇలాగే ఆ మహాత్ములు ఈ విశ్వము లో ఉండి చాలా ఆనందంగా ఈ ప్రశ్నలకు జవాబులు కనుగొన్నారు . మీరు అనుకుంటారేమో తపస్సు, త్యాగమూ కష్టమని, మీరు సంసారాన్ని పొందడానికి అంతకన్నా ఎక్కువ త్యాగము చేస్తున్నారు . మనము చూస్తున్నాము కదా చాలా మంది విద్యార్థులు తన ఆర్జన ఆర్జించుకుంటూ కూడా పెద్ద పెద్ద ఉత్తీర్ణులవుతున్నారు, ఈ విధముగానే ఈ ఆత్మ జ్ఞానము కూడా అని అర్థము చేసుకోండి.
సంతోషకరమైన ప్రయాణము
మనుషులలో ఎవరికైతే దేవుడిపై దృష్టి, ధ్యానం, వెళ్లినదో వారిని అడగండి, వారి జీవితాలు ఎంత ఆనందముగా గడుస్తున్నాయో. అది ఎలాగంటే, మీరు రైలుబండిలో కూర్చుని యాత్ర చేస్తున్నప్పుడు , కిటికీ తెరిచి అందమైన దృశ్యాలను చూస్తూ, మంచి మంచి పుస్తకాలు చదువుతూ యాత్ర చేస్తే ఎంత బాగుంటుంది. పడుకొని వుంటే ఏమి లాభము ?
ఒకావిడ తమ జీవితము గురించి చెబుతూ ఉండేవారు, అదేమిటంటే , నా జీవితము చాలా కష్టమయముగా ఉండేది, రక రకాల రోగాలతో పీడింప బడుతూ ఉండేదాన్ని, విపరీతమైన కోపము, కానీ ఎప్పుడైతే గురు దర్శనము కలిగినదో సత్సంగము యొక్క ఆశ్రయము దొరికినదో, నా అన్ని రోగాలూ నన్ను విడిచి పోయాయి. కోపము తెలియదు ఎక్కడకి వెల్లి పోయినదో. ఇప్పుడు నేను జీవితములో ఎప్పుడూ చెయ్యనంత పని చేస్తున్నాను, ప్రేమ యొక్క సీమ( లిమిట్ )ఎంత పెరిగి పోయిందంటే నాకు అందరూ మనవాళ్ళే అనిపిస్తారు . మనస్సుకి ఏమనిపిస్తుందంటే నేను జీవితాంతమూ వీళ్ళ అందరి సేవ చేస్తూనే ఉండాలి అని .
ఇందుకే అన్నారు , రామభజన , ఈశ్వరుడు యొక్క దర్శనము మన జీవితాల యొక్క ఒక చక్కటి స్నేహితులని. ఎవరైతే దీనిని స్వీకరించరో వారి జీవన -యాత్ర చాలా కష్టమయం అయిపోతుంది .
ఒక నేత్రహీనుడికి మరియు కళ్ళు ఉన్న వారి యాత్ర లోనూ ఎంత భేదము ఉన్నది ? ఆ కళ్ళు ఉన్నవారు , ఆ ద్రుష్టిహీనుడిని తన కూడా తీసుకొని వెళ్తున్నాడు , దారిన ఇద్దరూ వెళ్తున్నారు కానీ ఆనందం కళ్ళు ఉన్న వారే పొందగలరు అది నేత్రహీనుడికి ఎక్కడ దొరుకుతుంది ? మార్గము యొక్క స్థానాలు ఇద్దరికీ ఉన్నాయి కానీ , నేత్రజ్యోతి ఇద్దరికీ లేదు . ఈశ్వరుడే ఈ నేత్ర జ్యోతి , ఇందుకే ఈ విశ్వము యొక్క పుస్తకాన్ని చదవాలంటే ఈశ్వరుడి ప్రకాశములోనే చదవడము సంభవం , ఇంక ఏ ప్రకాశములోనూ కాదు .
అనుకున్నది ఇది కాదు
ఒక మహాత్ముడు నాతో ఏమి చెప్పేరంటే నేను కూడా ముందు ఇలాగే అనుకొనేవాడిని ఏమిటంటే మనిషికి ఆత్మ జ్ఞానము చాలా అవసరమైనది కానీ దీనిని పొందడానికి చాలా కఠినమైన ప్రయత్నాలు చెయ్యవలసి వస్తాయి, ప్రాణాలు అర్పించ వలసివస్తుంది, తమని ఎవరి చరణాలకో అర్పించవలసివ స్తుంది , సంపూర్ణ త్యాగము మరియు తపస్సుతో కూడిన జీవితము గడుపుకో వలసివ స్తుంది, ఏకాంతవాసము చెయ్యవలసివస్తుంది . కానీ ఇది కాదు ఆ మాటే వేరు . దానిని చూడగానే నా హృదయం ఆనందంతో నిండిపోయింది , అంతులేని ఆనందం. నిజం చెప్తే ఆ రోజు నుండే నా జీవితము చాలా సహజమైనది అయిపొయింది. భలే! సంత్ మహాత్ముని యొక్క సాన్నిధ్యము , వారి దర్శనమూ, కల లో కలిగితే కూడా వారి జీవితమే మారి పోతుంది వారి, జీవితానికి సాఫల్యము కలుగుతుంది. నా ఆలోచనలే నన్ను మోసము చేస్తూ ఉండేవి . సంత్ మహాత్ములు ఎంత దయామయులు ఉంటారంటే , నేను వారికి ఎదో ఇవ్వడము పోయి, వారే నాకు అంతా ఇచ్చేసేరు. నా పేదరికము, నా రకరకాల కష్టాలు అయితే ఆయన దర్శన మాత్రము తోనే తీరిపోయాయి . పరమార్థము గురించి నేను ఏమి చెప్పగలను, ఈ సంసారము యొక్క మార్గమైతే నా కొరకు చాలా సులువైనది అయి పొయింది. అరే! ఎవరైతే ప్రతిఒక్కరికీ జీవితము ఇస్తారో, వాళ్ళ కష్టాలను హరిస్తారో, ఎప్పుడూ అందరిపై కృపచూపిస్తూ ఉంటారో ఆ సర్వేశ్వరుడికి మనము ఏమి ఇవ్వ గలము ? అలాంటప్పుడు మన సర్వస్వము అర్పించే మాటే లేదు కదా! అవును మనకు ఏ సంత్ యొక్క సాన్నిధ్యము దొరకకపోతే మాత్రం, పరమార్థం మాట వదిలెయ్యండి , ఈ సంసారం యొక్క యాత్ర కూడా కష్టమయం అయిపోతుంది . వారి సాన్నిధ్యం వలనే నాకు ఏమి తెలిసిందంటే ఈ సంసారమే పరమార్థం. ఇదే కదా ఆ ఈశ్వరుడు ఎవరికోసమైతే ఈ విశ్వం పరుగెడుతోందో .
ఇప్పటి వరకు మనం మన ఇంటినే సర్వం అనుకున్నాము, మన కుటుంబీకులను మరియు మన వాళ్ళనే ప్రేమించేము, కానీ ఎప్పుడైతే మన దృష్టి విశాలమైనదో అప్పుడు ఈ జీవితము యొక్క వైశాల్యము పెరుగుతుంది, అలాంటప్పుడు, ఈ విశ్వం అంతా మన పరివారం లాగే సుఖం కలిగించేది అయిపోతుంది, అప్పుడు మీరు ఎప్పటికీ ఈ సంసారాన్ని త్యజించే మాటే మాట్లాడరు. అలాంటప్పుడు మీకు ఈ భూమి ఉపవనము లాగ అనిపిస్తుంది మరియు ఈ సంసారము నిజమైన స్వర్గము.
సంత్ మహాత్ముల చరణ ధూళి
ఈ విశ్వములో సంత్ మహాత్ములు సమయ సమయానికి అవతరిస్తూనే ఉన్నారు, ఎవరైతే మనుష్యుల యొక్క అజ్ఞానము, అధర్మముతో కూడిన స్వభావాల్ని జ్ఞాన రూపములో మార్చేసేరో. వీళ్ళు నేర్పే పాఠాలు దేశ కాల పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి మన శరీరాలు మూడు రకాలతో కూడినవి. మొదటిది కర్మేంద్రియాలతో కూడిన “స్థూల” శరీరము, రెండవది జ్ఞానేంద్రియాలతో కూడిన “సూక్ష్మ” శరీరము, మూడవది అంతఃకరణము (మనస్సు ,బుద్ది ) ది –“ కారణ” శరీరము దేని వల్ల అయితే అన్ని పనులు అవుతాయో . వీటిని స్వచ్ఛముగా, మరియు పవిత్రముగా ఉంచడమే మనిషి యొక్క ధర్మము . కానీ మనము స్థూ లాన్ని అయితే స్వచ్ఛముగా ఉంచుకుంటాము, వాటిని శుభ్రము చేసే పద్ధతులు కూడా నేర్చుకుంటాము, కానీ సూక్ష్మ మరియు కారణ శరీరాన్ని పవిత్రము చెయ్య లేక పోతాము. ఎప్పుడైతే అవి మైల పడిపోతాయో, అప్పుడే మనిషి తననితాను అపవిత్రుడు, పాపిష్టి మరియు చెడ్డవాడు అనుకోవడము మొదలు పెడతాడు . సంత్ మహాత్ములు వీటిని పవిత్రము చేసే కొన్ని క్రియలు చెబుతారు, దాని వలన, అప్పుడు వారు ఈ క్రియలను పాటించి, ఎలా నిర్మలమైపోతారంటే ఎలాగైతే బురద లో మునిగిన చేతులు స్వచ్చమైన నీటితో శుభ్రమవుతాయో .
మీ హృదయములో ఒక పవిత్ర ధార ఉంది, ఎదైతే విష్ణుమూర్తి చరణాల నుండి ఉద్భవించి, అందరినీ పవిత్రము చేస్తోందో, సంత్ (గురు)దాని గురించే చెప్తారు అప్పుడు మీరు అందులో మునిగి, తేలి ధన్యులు అయిపోతారు , అపరిమితమైన పవిత్రులు అయిపోతారు . మీరు ఇందులో స్నానము చేసి చూడండి , మీరు చేసిన పాపము ఒక పాపము కాదు, మీరు చేసిన అధర్మము ఒక అధర్మము కాదు, ఇదంతా ఒక భ్రమలాగే ఉండేది, ఏదైతే గురు కృప వలన తొలగిపోయినదో . గణికా, అజామిల్, వాల్మీకి యొక్క కధలు చదివేక మనకు ఎలాంటి విశ్వాసము కలుగుతుందంటే, వారి కృప కలిగితే ఇలాంటిది జరగడము పెద్ద ఆశ్చర్యమైన పని కాదు . ఎవరి బుద్ధి అయితే పాషాణం లాంటిదో, జడత్వం తో కూడినది అయిపోయిందో ఆ పరమేశ్వరుడి యెక్క చరణ స్పర్శ వలన అపరిమితముగా పవిత్రమైనది అయిపొయింది . ఆ చరణాలు ఒక్క మాటైనా స్పృశించడానికి దొరికిపోతే , ఈ జీవితం ఎంత ధన్యం అయిపోతుందో . భక్తుడు అంటాడు వారి చరణాల ప్రభావము ఏదైతే ఉందో, దాని ప్రభావము ఎలాగూ వున్నది, అంతకన్నా ఎక్కువగా ఆ చరణధూళి యొక్క ప్రభావము ఎక్కువది అని .
ఒక మాటు ఏమైందంటే ఒక భక్తుడు పొర్లి పొర్లి గిరిరాజు పర్వతానికి పరిక్రమ చేస్తున్నాడు , ఎవరో అడిగేరు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? దీని మహత్యము ఏమిటి?అందులకు ఆతను ఇలా అన్నాడు బృజ్ భూమి పై మూడు వస్తువులే కదా ఉన్నవి , ఏవైతే ఈశ్వరుడు అక్కడలేకపోయినా జీవుడిని పవిత్రం చేస్తున్నాయో . మొదటిది యమునా నది , ఎందులోనైతే వారు ప్రతి దినమూ స్నానము చేసేవారో , రెండవది ఆ బ్రజ్ భూమి ఎక్కడైతే వారు నిత్యం భ్రమణ చేసేవారో , మూడవది ఆ గోవర్ధన పర్వతము, దేనినైతే బ్రజ్ రక్షణ కొరకు ఆ భగవంతుడు చిటికిన వేలు మీద ధరించేరో , తక్కినవి అన్ని మారిపోయి ఉండవచ్చు కానీ, ఇవి మాత్రము ఇప్పటకీ అలాగే ఉన్నాయి, ఏ ధూళి కణాలు అయితే ప్రభు చరణాలను స్ప్రుశించాయో, వాటిని నేను కూడా స్పృశించ గలుగుతానేమో అని నేను ఈ ధూళిపై అస్తమానూ పోర్లుతాను.
భ్రాంతి ధారణలు
ఈ విశ్వములో చాలా మహాత్ములు వచ్చేరు, వారి శిక్ష (పాఠం) ఒక్కటే వుండేది , కానీ మనుషులు వారి పేరు మీద చాలా మార్గాలని మొదలు పెట్టేసేరు . దీని వలన ఈ విశ్వము ఎన్నో భాగాలలో విభజించి పోయినది , దేనివలనైతే ఒక రాగ, ద్వేషాగ్ని పుట్టినది , ఏదైతే ఇంకొకరిని కాకుండా, ఈ మానవుడినే కాల్చి పారేస్తోంది . మనుష్యులు కేవలము విద్యాధ్యయనమునే శాంతి యొక్క ఉపాయము అనుకున్నారు, మరియు సమాజం ఆ దారినే పట్టుకున్నారు . సంసారం లో ఆధ్యాత్మ జ్ఞానం యొక్క ఏ అవసరమూ లేదని .ఆత్మ జ్ఞానం గృహస్తులకి ఏ విధముగానూ దొరకనే దొరకదు, అని అందరి మనసుల్లోనూ నాటుకు పోయింది , దాని కొరకు ఏకాంతవాసము మరియు జీవితంలో చాలా సమయం ఇవ్వాలని, త్యాగము యొక్క పాఠము అవసరమని , మరియు ఈ జ్ఞానము అందరికీ సంభవించదు , కొందరు విశేష పురుషులు మాత్రమే పొందగలుగుతారు. మరియు ఇంకొక భ్రాంతి ఏమిటంటే, ఎవరైతే ఈ సంసారం లో చాలా చిక్కుకొని ఉన్నారో, ఎవరి దగ్గర అయితే సమయము తక్కువ ఉందో , వారు దీనిని ఎప్పటికీ పొందలేరు అని, మరియు దీని కొరకు చాలా కఠినమైన పరిశ్రమ, సంపూర్ణ యోగము మరియు కఠిన మైన బ్రహ్మచర్యము పాటించాలి అని .
ఇలాంటి అనేక రకాల మాటలు విని మనుష్యులు దీని వైపు చూసేవారే కాదు, ఇంతే కాదు తమనీ, తమ పిల్లలనీ కూడా ఈ వైపుకి రాకుండా చూసుకోనేవారు, ఎందుకంటే ఈ దారి పట్టుకుంటే ఆ మనిషి సన్యాసి అయిపోతాడు, ఇంక సంసారానికి పనికిరాడు అని గురు మహారాజ్ యొక్క వరము
గురు మహారాజ్ గారు ఈ అన్ని భ్రమలనుండి మనల్ని చాలా చక్కగా వేరు చేసేరు మరియు ఏమన్నారంటే ---నేను మీకు ఒకరితో ఒకరిని వేరు చేసే శిక్ష (పాఠం )ఇవ్వడానికి రాలేదు కానీ , మీరు ఎవరైతే ఒకళ్ళ తో ఒకళ్ళు దూరమైపోయారో వారిని కలపడానికి (ఏకము చెయ్యడానికి )వచ్చాను . వారు మన ముందు ఋషుల యొక్క ఆ మార్గాన్ని తీసుకొచ్చి పెట్టారు, ఏదైతే అన్నిట్లోకన్నా చక్కటిదీ మరియు మంగళమైనదో, దేనినైతే అందరూ స్వీకరించేరో,ఏదైతే అన్ని సంప్రదాయాలతో వేరైనది మరియుమానవులలోఐకమత్యాన్ని పెంపొందించేది.
ఆయన సాంసారిక విద్య గ్రహించడము పై చాలా బలమిస్తూ ఏమన్నారంటే ఈ చదవడం, రాయడం, కూడా చాలా అవసరమైనవి ఇది లేక పొతే మనిషి యొక్క మూర్ఖత్వం పోదు, కానీ దీని కన్నా ముందు దేవుడు యొక్క అంటే ఆత్మ జ్ఞానము యొక్క అవసరము కూడా అంతే ఉంది , ఇది లేకపోతే హృదయము యొక్క అజ్ఞానము దూరము అవ్వదు .
ఎవరికైతే ఇలాంటి ఆలోచనలు ఉండేవో, సంసారం లో ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క అవసరము ఏమీ లేదు అని , వారికి ప్రత్యక్షంగా ఆ ధ్యాత్మ జ్ఞానం లేకపోతే సంసారాన్ని నిర్వహించడం సంభవం కాదని చూపించేరు.. మనిషి జీవితానికి ఎంతైతే భోజనం, నీరు ,వాయు లేక ఆకాశం యొక్క అవసరము ఉందొ అంతే ఆధ్యాత్మిక జ్ఞాన అవసరము కూడా ఉంది .
నిజమాలోచిస్తే భోగము లోనే యోగము , సంసారం లో వైరాగ్యం యొక్క పాఠం గురించి మనం విన్నాము, శ్రీ కృష్ణుడి చరిత్రలో కూడా కొంత చదివేము కానీ, దాని ప్రత్యక్షమైన అనుభవము మనకు గురు మహారాజ్ గారే చేయించారు . వారి శిక్ష వలనే మనకు ఇది కూడా అనుభవమైంది అదేమిటంటే , ఎవరైతే భోగం లో యోగం, సంసారం లో వైరాగ్యం తెలుసుకోలేదో దానిని అర్ధం చేసుకోలేదో, వారి భోగము పూర్తి కాదు , మరియు సంసారం యెక్క నిర్వాహం కూడా సరిగ్గా అవ్వదు .
వారు మరొక మాట ఏమన్నారంటే, ఆత్మ-జ్ఞానము పొందడానికి, సంసారము లేక వైరాగ్యము అడ్డంకి ఎంత మాత్రం కావు . అదైతే ఒక విద్య, ఎవరైనా పొంద వచ్చు , కావాలంటే కాషాయపు బట్టలు కట్టుకోండి లేక శ్వేత వస్త్రాలు ధరించండి. ఏ మునులు, ఋషులు దీని గురించి తెలుసుకున్నారో, వారు ఎక్కువగా గృహస్తులే .
వారు ఇంకా ఏమన్నారంటే , ఈ జ్ఞానము ఏ సంప్రదాయానికి లేక ఏ జాతి విశేషానికి చెందినది కాదు. ప్రతి ఒక్కరూ దీనిని పొందగలరు . స్త్రీలు కూడా దీనిని చాలా సుళువుగా తెలుసుకోగలరు. దీని పై ప్రతి ఒక్కరికీ సమానమైన అధికారము ఉన్నది.
వారు మరొక రహస్యమైన మాట ఏమి చెప్పేరంటే ఈ విద్యను వైరాగ్యులకన్నా గృహస్తులు చాలా సుళువుగా పొందగలరు, మరియు ఏమన్నారంటే , ఎవరి దగ్గరైతే సమయము చాలా తక్కువ ఉన్నదో , దానిని పొందాలని ఎవరైతే ఆతురత పడతారో, వారు ఈ జ్ఞానాన్ని ఇంకా తొందరగా పొందగలరని నిరూపించేరు.
వారు ఈ భ్రమని కూడా దూరముచేసేరు , అదేమిటంటే దీని కొరకు చాలా ఎక్కువ పరిశ్రమ , సంపూర్ణ త్యాగము, సంపూర్ణ నిష్ఠ తో బ్రహ్మచర్యము పాటించే అవసరం ఉందని. దీని కొరకు చాలా తక్కువ పరిశ్రమ, నియమిత జీవితమూ, మరియు సరైన తెలివితేటలూ కావాలి అని వారు ఉద్ఘాటించారు. దీనిని పొందడము కొరకు మీరు ఎచ్చటైతే అనేక ఉపాయాలూ , మరియు కష్టాలలో పడి ఉన్నారో, అచ్చటే కొంత సేపు అన్ని వదిలేసి కేవలము పది నిమిషాలు మాత్రమె స్థిరత్వం లోకి వచ్చెయ్యండి, అప్పుడు మాత్రం మనస్సు తో ఏ పనీ చెయ్యవద్దు. ఇంతే , ఆ తత్వాన్ని మీరు సహజముగానే పొందేస్తారు . వీరు ఏమి చెప్పారంటే ఏ మనిషి అయితే దీనిని పొందుతాడో అతడు సంసారము నుండి ఎప్పటికీ పారిపోడు ,మరియు అందులోనే ఉంటూ మరొకళ్ళకి కూడా శాంతి ప్రసాదిస్తాడు .
ఈ విధముగా వారు మన జీవితాలలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించేరు , మన దౌర్బల్యాలూ , వివశతలూ ఈ జ్ఞానార్జనకు అడ్డంకులు కావని ఆయన నమ్మేరు. వారు మనిషి లో ఉన్న బలహీనతలవైపు కాక, వారిలో ఉన్న గొప్ప ఆంతరిక శక్తుల వైపు మన ధ్యానాన్ని ఆకర్షింప చేసేరు , వాటిని పొందడానికి ఎలాంటి సుగమ మైన, సహజమైన ,సుళువైన దారి మన ముందు పెట్టేరంటే , దీని మీద నడవడానికి ఎవరూ అడ్డగించరు , ఎవరికీ ఏ ప్రతిబంధకమూ లేదు, ఈ దారి అందరి కొరకూ తెరవబడి ఉన్నది. మీరు కూడా మీ జీవితములో సాధన యొక్క కొత్త పధ్ధతి వలన లాభాన్ని పొందండి . భగవంతుడు మీకు సత్ ప్రేరణ ప్రసాదించాలి.
ఓం శం