Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

પાછળ

Guru Ashtakam

గురు అష్టకం

<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2018/01/11728783_993637730686354_5591676513354723342_o-2-300x200.jpg" alt="" width="300" height="200" class="alignnone size-medium wp-image-58316" />

Guru Ashtakam

రామాశ్రం సత్సంగ్
మథుర

గురు అష్టకం
శ్లోకం గురుం ప్రశాంతం భవ భీతి నాశం విశుద్ధ బోధం కలుశాపహారం |
ఆనంద రూపం నయనాభి రామం శ్రీ సత్య దేవం నితరాం నమామి||
భావార్థము –(బాహ్య ఉపాధులతో నిర్లిప్తం అవడం వలన )ఎవరైతే పరమ శాంత వంతులో, విశ్వము యొక్క భయాన్ని నశింపచేయువారో, కేవలం అత్యంత పరిష్కృతమైన అంతః కరణము ఉన్న వాళ్ళ ద్వారానే బోధగమ్యులో, సమస్త పాపాలను హరించేవారో మరియు ఆనంద స్వరూపులో మరియు (సాకారులు అవడం వలన ) నేత్రాలకు ప్రియమనిపించేవారో, ఇలాంటి సత్య దేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తున్నాను.
శ్లోక౦-అజ్ఞాన నాశం నిత్య ప్రకాశం సత్ చిత్ స్వరూపం జగదేకమూర్తిం |
విశ్వాశ్రయం విశ్వపతిం పరేశం, శ్రీ సత్య దేవం నితరాం నమామి ||
భావార్థము- ఎవరైతే అజ్ఞానాన్ని నశింపచేయువారో, నిత్యమైన ఆత్మ యొక్క ప్రకాశాన్ని కలిగించేవారో, సత్ చైతన్య స్వరూపులో, ఈ విశ్వము యొక్క ఏక మాత్రమైన ప్రతిభో ( సంపూర్ణ విశ్వము వారిలోను లీనమై ఉన్నదో , లేక విశ్వాన్ని తన లోను ఇముడ్చుకున్నారో ) (మరియు ఎవరైతే ) విశ్వము యొక్క ఆశ్రయ భూతములో (సమస్త జీవులు ఎందులోనైతే ఆశ్రయము పొందుతాయో ) , ఎవరైతే అఖిల బ్రహ్మాండము యొక్క స్వామియో మరియు సర్వశక్తి మంతులో ఆ (అలాంటి) సత్య స్వరూపులైన గురు దేవునికి నేను నమస్కరిస్తున్నాను.
శ్లోకం స్వయంభువం శాంతమనంతమాద్య౦ బ్రహ్మాదివంద్య౦ పరమేశ పూజ్యం |
కాలాత్మకం కాలభువం శరణ్యం , శ్రీ సత్య దేవం నితరాం నమామి||
భావార్థం- ఎవరైతే స్వయంభూ (స్వేచ్చగా ఆకారాన్ని ధరించే వారో) శాంతవంతులో అంత రహితులో మరియు అన్ని౦టికీ ఆదికారకు లో బ్రహ్మాది దేవతల ద్వారా వందనీయులో , అందరికీ స్వామి మరియు పూజ్య నీయులో, కాలస్వరూపులో (ఎందులోనైతే మూడు కాలాల సమాహారం అయ్యి ఉన్నదో)
ఇంతే కాదు, అవధులులేని వ్యాపక శరీరమో , మరియు ఎవరైతే సమస్త ప్రాణులకు ఆశ్రయ స్వరూపులో, ఆ సత్యస్వరూపులైన గురువుకు నేను అనన్య భావముతోనమస్కరిస్తాను .
శ్లోకం అణు౦ మహాంతం సదసత్ పరంచ ,యోగైకగమ్యం కరుణావతారం| సదా వసంతం హ్రుదయార విందే ,శ్రీ సత్య దేవం నితరాం నమామి ||
భావార్థము ---ఎవరైతే అణువు కన్నా సూక్ష్ములో, మహాన్ సత్- అసత్ (అస్తి-నాస్తి) రెండిటికన్నా మించినదో, (మరియు) చాలా కష్టాన్ని బోధ గమ్యులు అయినా కానీ , అతి శీఘ్రముగా కరుణ వలన వశీభూతులై ద్రవించి పోతారో , కేవలం సమాహృత యోగము (తాత్పర్యం చిత్త వృత్తి నిరోధము) ద్వారా నే లభి౦చబడతారో (ఇలాంటి)సత్య స్వరూపులైన గురుదేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తాను.
శ్లోకం-భోగాపవర్గం ప్రతిదాన శక్తుం, బంధుం సఖాయం, సుహృదం ప్రియంచ |
శాంతి ప్రదానం భవదు:ఖ హీనం శ్రీ సత్యదేవం నితరాం నమామి ||
భావార్థము –ఎవరైతే భోగము మరియు మోక్షము (రెండూ) ప్రసాదించడానికి సమర్థులో , ప్రాణుల యొక్క నిస్వార్థ బంధు, సఖ, సుహృద, మరియు ప్రియులో (మరియు) జీవులకు శాంతి ప్రసాదించేవారో, ఎవరైతే స్వయంగా సంసార దు:ఖాలతో ముక్తులో,( తాత్పర్యం) దు:ఖాతీతులో(ఇలాంటి) సత్య స్వరూపులైన గురువులకు నేను అనన్య భావము తో నమస్కరిస్తాను.
శ్లోకం- ప్రేమామ్బుధిం ప్రేమ రసాయనంచ ,ప్రేమ ప్రదానం నిధిమద్వితీయం|
మృత్యు౦జయం మృత్యు భయాపహారం శ్రీ సత్య దేవం నితరాం నమామి ||

భావార్థము -- ఎవరైతే ప్రేమ యొక్క సాగరములో తాత్పర్యం ఎవరి స్మరణ వలెనే సాధకుడి హృదయము ప్రేమమయము అయిపోతుందో, దేవుడి యొక్క ప్రేమను (భక్తి ) కలిగించేదో , ఏదైతే భక్తుల యొక్క అద్వితీయమైన నిధియో మరియు ఎవరైతే ప్రతిచోటా , సర్వత్ర ఉన్నారో, ఎవరైతే మృత్యువుని గెలిచేవారో మరియు (సాధకుల ) మృత్యు భయాన్ని దూరము చేసేవారో (ఇలాంటి) సత్యస్వరూపులైన గురుదేవుని చరణాలకు నేను నమస్కరి స్తాను.
శ్లోకం-జ్యోతిర్మయ౦ పూర్ణ మనంతశక్తిం సంసార సారం హ్రుదయేశ్వరంచ |
విజ్ఞానరూపం సకలార్తి నాశం శ్రీ సత్యదేవం నితరాం నమామి ||
భావార్థము –ఎవరైతే జ్యోతిస్వరూపులో అన్ని విధములగానూ పూర్ణులో ,
అనంత శక్తులతో పరిపూర్ణులో, సంసారము యొక్క ఏక మాత్రమైన సారమో,
భక్తుల హృదయాల ఏకఛత్ర స్వామియో ( ప్రేరకులు ) మరియు ఎవరైతే జ్ఞాన –విజ్ఞాన మూర్తులో సమస్త జీవుల పీడను హరించే వారో (ఇలాంటి )
సత్య స్వరూపులైన శ్రీ గురు దేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తాను .
శ్లోకం-- స్నేహం దయాం వత్సలతాం విధాయ , చిత్తం ప్రముగ్ధం క్రుతమత్రయేన|
తమ్ దీననాథం భవసింధుపోతం శ్రీ సత్య దేవం నితరాం నమామి ||
భావార్థము –ఎవరైతే (నాపై) స్నేహము , దయ , మరియు వాత్సల్యము (మమకారం) చూపించి నా చిత్తాన్ని మోహింప చేసారో (మరియు ఎవరైతే) దీనుల యొక్క నాథులో , మరియు సంసార సాగరమును దాటించే నావ రూపాన్ని ధరించిన వారో, ఇలాంటి సత్య స్వరూపులైన శ్రీ గురు దేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తాను