Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

Retour

Tum Mujhse Sampark Kar Lo

మీరు నాతొ సంపర్కము చెయ్యండి

<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2018/01/15741268_1326715307396260_6618069820526969433_n-300x200.jpg" alt="" width="300" height="200" class="alignnone size-medium wp-image-58292" />

నేను 2007వ సంవత్సరములో విదేశాలకు వెళ్ళినప్పుడు హాలండ్ లో ఒక సత్సంగుల ఇంటిలో ఆగాను. అచ్చటినుండి జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ కి వారితో కలసి వారి కారులో వెళ్ళడానికి సిద్దపడ్డా ము. మాకు ఆ స్థలము కొత్త. అచ్చటికి చేరడానికి ఎవ్వరికీ

తెలియదు . వారి కారులో ఒక మెషీన్ {యంత్రము} అమర్చబడి వున్నది , అదేమిటంటే GPS (GLOBAL POSITION SYSTEM). ఎచ్చటికైన వెళ్ళడానికి దారి తెలియనప్పుడు కారు దీని పైన ఆధారపడి వుంటుంది. ఈ సిస్టం ఒక యంత్రము ద్వారా కారు యొక్క సంబంధాన్ని ఒక కృ త్రిమ ఉపగ్రహముతో చేస్తుంది. ఈ ఉపగ్రహములో భూమి పైన వున్న అన్ని పట్టణాల మార్గాలకు సంబందించిన సూచనలు మ్యాపు(map) ద్వారా అమర్చబడి వుంటాయి. కారు ఎప్పుడైతే తన సంబందాన్ని ఆ సిస్టం తో అమరుస్తుందో అప్పుడు ఆ కారు భూమి పైన ఏ దేశములో, ఏ పట్టణములో,ఎచ్చట ఉన్నదో ఆ ఉపగ్రహానికి తెలిసిపోతుంది . కారు నడిపేముందు వారు ఫ్రాంక్ ఫర్ట్ అని వారు చేరే గమ్యాన్ని ఫీడ్ చేసారు,ఇంక ఆ మెషీన్ మెల్ల మెల్లగ కారుకు గైడ్ చేస్తూ ఎవరి ఇంటికైతే వెళ్ళవలసి వుందో వారి ఇంటి ముందు వచ్చి, “బండి ఆపండి మీ గమ్యము వచ్చింది” అని సూచించింది . కారు ఆగగానే మేము వెళ్ళవలసిన ఇంటి పెద్దమనిషి ఇంటి ముందు నిల్చొని వున్నారు . ఇది చూసి నాకు ఆశ్చర్యమేసింది ఎందుకంటే ఈ అనుభవము నాకు కొత్త కాబట్టి.
జీవితము యొక్క గమ్యము పూర్ణము తో కలవడము. ఇలాగే మన జీవితానికి ఒక సునిశ్చితమైన గమ్యము వుంది. ప్రతి ఒక్కరు అచ్చటికి చేరవలసిందే. ఈ గమ్యము ఏమిటి? మనము పరమాత్ముని యొక్క అంశము. అంశము యొక్క గమ్యము ఏమిటి ? పూర్ణము తో కలవడము. మనము పరమాత్ముని నుంచే వచ్చాము తిరిగి పరమాత్మునిలోనే లీనమవ్వాలి. ఇదే మన గమ్యము. మనము గమనించినదేమిటంటే సముద్రము యొక్క నీరు బాష్పములోకి మారి మేఘాల ద్వారా ఆ నీటిని వర్షము ద్వారా భూమిపైకి తీసుకొనివస్తుంది, ఆ నీరే నదులద్వార, కాలువలద్వార సముద్రములో కలిసి శాంతిస్తుంది. ఇలాగే మన జీవితము కూడా ఒక సిస్టం లాగ పనిచేస్తుంది, దేనికైతే ఒక గమ్యము వుందో. ఈ సిస్టంకే మన శాస్త్రాలు ,ओ,उ,म् ( ఓ ఊ మ్) {ఓం}అని పేరు పెట్టారు.
अ,उ,म(,) (అ,ఉ,మ) (మ్)
మా పైన వున్న పొల్లు . ఈ సిస్టం లాగానే ఈ ప్రపంచములోకి రావడము,ఉండడము,తిరిగి వెళ్ళిపోడము . మన గమ్యం కూడ ఈ సిస్టం లో ఫీడ్ చెయ్యబడి వుంది, కానీ జరిగేది ఏమిటి ? ఈ ప్రపంచములోకి వచ్చాము, కర్మలు చేసాము, ఏ కర్మలైతే మనము చేసామో,ఆ కర్మల యొక్క సంస్కారాలు సంచిత మవుతూ వు న్నాయి. ఆ సంచితమైన కర్మలే మన భాగ్యము (అదృష్టము ) అయ్యాయి. ఆ భాగ్యముతో నేను కలసిపోయాను. కలవ వలసినది” ओउम् “యొక్క మ్ అనే పొల్లుతో . కానీ కలసి పోయాను ప్రారబ్దముతో. ఈ విధముగా మన సంబంధము సిస్టము నుండి తెగిపోయింది. సంపర్కము తెగడమువలన మనము దారి తప్పిపోయాము. ఎలాగైతే మనము విమానము యొక్క సంపర్కము సిస్టం తో తెగిపోయిందని, విమానము దారి తప్పి పోయింది మరియు క్రాష్ అయిపోయిందని, ఎక్కడ పడిపోయిందో తెలియడములేదు అని వింటామో . ఇలాగే వెళ్ళాల్సింది పూర్ణముతో కలవడానికి, కానీ భాగ్యము, మరల జన్మఎత్తించి ఈ ప్రపంచములోకి తీసుకొని వచ్చినది. గమ్యము పూర్ణముతో కలవవలసి వుండేది కానీ నాల్గవ పాదము, ఏదైతే “మ్” లో వున్న పొల్లు యొక్క క్షేత్రము అవరోదము కలిగించింది. మనము జన్మించాము, వున్నాము, మరణించాము తిరిగీ జన్మ పొందాము. ఈ విధముగా జనన,మరణ చక్రము ఆరంభమైంది . నీటి బిందువు కలవాల్సింది సముద్రముతో,కానీ కలసింది చెరువులో.
దారి తప్పిపోయాము----------అశాంతి

ఈ జనన మరణ చక్రములో మనము ఏమి లాభము పొందాము? అశాంతి తప్ప. మనము ఏమి చూస్తున్నామంటే మన దగ్గర ఎంత డబ్బు వున్నా, ఎంత విద్య వున్నా, ఎంత వైభవము వున్నా కాని శాంతి లెదు. ఎందుకంటే మనము గమ్యానికి చేరలేదు, పూర్ణము తో కలవలేదు. మనము ఏమి చెయ్యాలి? మన ము మన పనులను ఎలా చేయ్యలంటే అవి మనదారికి అవరోధము కలిగించకూడదు. కర్మలు మనము చెయ్యాల్సిందే, కానీ వాటి ఫ లితాల ప్రభావము మన పైన పడకుండా చూసుకోవాలి. ఎలాగైతే ఒక శెనగ గింజని భూమి పైన నాటి దానికి కావలసిన నీరు,ఎరువులు వేస్తె అది చక్కగా మొలకెత్తుతుంది. అదే వేగిన శెనగ గింజ ను వేస్తె దానికి మొలకెత్తే గుణము నశించిపోతుంది. ఇంక ఆ గింజ మొలవలేదు. శ్రీ కృష్ణ భగవానుడు గీతలో అర్జునుడితో దీని ఉపాయము చెబుతూ ఇలా అన్నారు ---“-కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన “
శ్రీ కృష్ణుడు ఏమంటారంటే కర్మలు చెయ్యాలి. కానీ వాటి పలితాన్ని గురించి ఆలోచించకూడదు. కానీ పలితము యొక్క ఆలోచన ముందే వస్తుంది. ఈ పని నేను ఎందుకు చెయ్యాలి ? దీని వలన నాకు ఏమి లాభము, దీని వలన నాకు ఏమి దొరుకుతుంది ? దీని సమాధానము ఏమిటి ?మన గురు మహా రాజు గారు దీనికిచాలా చక్కటి సమాదానము ఇచ్చారు . ఆయన ఏమన్నారంటే గమ్యము మీలోనే ఫీడ్ అయివుంది. మీరు పూర్ణము తో కలవాలి. మీరు నాతొ సంపర్కము చెయ్యండి, నాకు దాని దారి తెలుసు. నేను మీ కళ్ళకు గంతలు కడతాను,దాని వలన మీకు దారి గురించి బెంగ వుండదు. మీ గమ్యము రాగానే నేను ఆ కట్టు విప్పెస్తాను. అప్పుడు మీరు అంటారు అరే! “ నేను చేరుకోవలసినది ఇక్కడికే అని”.

ఉపాయము
మన గురుమహరాజు గారు ఏమంటారంటే పూర్ణము దాక చేరడము మీ ఒక్కరి వలన సంభవము కాదు, ఎందుకంటే ఈ ప్రపంచములో ప్రలోభాలు చాలా వున్నాయి. ఈ జీవుడు తృష్ణ లో చిక్కుకొని వున్నాడు. తాడుతో కట్టి వున్న జీవుడు ముక్తి పొందగలడు కానీ, తృష్ణలో చిక్కుకున్న జీవుడికి ఎప్పటికీ ముక్తి సంభవము కాదు. ఈ ప్రపంచములో అసంఖ్యాకమైన మెలికలు వున్నాయి, ఆ మెలికలన్నీ కోరికలతోనే నిండి వున్నాయి . అవేమి టంటే “నాకు ఇల్లు కావాలి, ఖ్యాతి కావాలి--------“అంతులేని కోరికల లిస్టు వున్నది. మన గురువుగారు ఏమంటారంటే నాతొ సంపర్కము పెట్టుకున్న సాధకుల కళ్ళకు , వారు ఈ కోరికల వలలో చిక్కుకోకుండా గంతలు కట్టేస్తాను. పాత సాధకులు పలుమార్లు గమనించే వుంటారు ధ్యానము బాగా కుదిరింది, ఇంక గమ్యముచాలా దగ్గరలోనే వున్నదని అనిపిస్తుంది,కానీ ఒక్కోసారి ధ్యానము యొక్క ABCDలు కూడా మరచిపోతాము. ధ్యానము ఎలా చెయ్యాలి ? గురుమహరాజు గారు సాధన మీ వశములో వున్న పని కాదు,మీరు సాధన చేసి మా అంతటా మేమే దారి పట్టుకోగలము అనుకుంటే అది ఎప్పటికీ సంభవము కాదు. విమానము నడిపే వ్యక్తి ఆకాశము,నేల చూసుకుంటూ తనే గమ్యము చేరుతాను అనుకుంటే అదిఎలా సంభవము. అతను దారి చూపెట్టే యంత్ర సహాయము తప్పక తీసుకోవాల్సిందే. అతనికి తన విమానాన్ని, గమ్యము చేర్చడానికి ఆ యంత్రముతో కలపవలసిందే.

మనము మన జీవితములో పూర్ణత పొందాలంటే, మనము గురువుతో సంపర్కము పెట్టుకోవలసిందే. ఏ సంత్ మహాత్ములతో నైనా సంబంధము పెట్టుకోవాల్సిందే. “సబ్ కర్ మమతా తార్ బటోరీ” తాత్పర్యమేమిటంటే మనము మన అన్ని మమతాను బంధాలన్నీ ముడిపెట్టి గురువు గారి చరణాల దగ్గర ముడివేయ్యాలి. అప్పుడు ఆ సంత్ మహారాజుగారు మీ కళ్ళకు గంతలు కట్టి గైడ్ చేస్తూ ప్రపంచము లోని అన్ని ప్రలోభాలనుంచీ, అపాయాలనుంచీ రక్షిస్తూ మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తారు. ఇది ఎంత సులువైన ఉపాయము,కానీ ప్రతి ఒక్కరికీ ఈ పలితము దొరకదు. ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్కరు తమని తాము సమర్పించుకోలేరు . ప్రతి ఒక్కరూ తమ బుద్ధినీ, తమ మనస్సునీ,తమ అహాన్ని వదిలిపెట్టలేరు. ఇదిభగవంతుని కృప వలన కొందరికే సంభవము.
ఉపాయము వుంది కానీ విశ్వాసము ఎందుకు లెదు
మనస్సు, బుద్ధి మరియు అహం ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఆత్మ రాజు. వీటి ద్వారానే అది పనిచేస్తుంది. ఆత్మకి ఏదైనా వస్తువుని చూడాలంటే అది మన కళ్ళ తోటే చూస్తుంది. ఏ రంగైన,ఎలాంటి స్వరూపమైన వుంటుందో దానినే కళ్ళు చూస్తాయి, మరియు ఆత్మ కూడా అదే చూస్తుంది. కానీ నేను ఎరుపు కళ్ళ అద్దాలు పెట్టుకున్నట్లయితే ప్రతీదీ ఎరుపుగానే కనిపిస్తుంది, అదే ఆకు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే అంతా ఆకుపచ్చ గానే కనిపిస్తుంది. ఇలాగే మన మనస్సుకు కామ,క్రోధ,లోభ,మోహము అనే కళ్ళద్దాలు వచ్చేశాయి . ప్రపంచాన్నిఆత్మ ఎప్పుడైతే తన మనస్సు యొక్క కళ్ళతో చూస్తుందో, ఆ మనస్సుపై ఆవరించి వున్న కామ,క్రోధ,లోభ,మొహాలతో కూడిన రంగుల కళ్ళద్దాల వలన సృష్టి అంతా ఆవిధంగానే రంగు రంగులగా అనిపిస్తుంది. వాస్తవంలో ప్రకృతి యొక్క యదార్థమైన దర్శనము సంభవము కాదు. ఆత్మ ఈ ప్రపంచము యెక్క వాస్తావిక రూపాన్ని చూడక,మనస్సు ద్వారా ఈ అసహజమైన వికారాలతో ప్రేరేపింప బడిన ప్రపంచాన్ని చూస్తోంది . మనస్సులో మొహరించి వున్న ఈ కళ్ళద్దాల కారణంగానే మనకు గురు మహారాజు పైన నమ్మకము కలగడములేదు . వారు చెప్పిన సులువైన ఉపాయము పైన నమ్మకము కలగదు. ఎందుకంటే మనలో నిండివున్న” మన “ అనే అహం ,విశ్వాసము కలిగించటములేదు. మీరు గమనించే వుంటారు రెండు రకాల వ్యక్తులే విశ్వాసము చెయ్యగలరు. మొదటిరకము వారు ఎవరికైతే ఏమీ తెలియదో, వారు తమని గురువుగారికితమని తాము పూర్తిగా సమర్పించేసుకుంటారు. ఉదాహరణకి” శబరి” . రెండవ రకము వారు ఎవరైతే అపరా జ్ఞానములో పరాకాష్టకి చేరివున్నారో, ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానముపొందే తీవ్రమైన ఆసక్తి వుందో వారే విశ్వాసము చేస్తారు. బహుళ విద్వాంసుడైన పండిత రామానుజాచారి అనేక శాస్త్రాలు అద్యయనము చేసినా, వారి జీవితములో సంతృప్తి,సారము లేకపోయినవి. ఆయనకు దగ్గరలోనే యవ్వనాచార్య గారు ఎవరైతే ఆద్య్యాత్మిక విద్యలో సంపూర్ణ సంపన్నుడు.నివసించి వున్నారని,అతను చాటలు అమ్మి పొట్ట పోసుకునే ఒక హీన జాతి వ్యక్తీ అయినా కానీ రామానుజాచార్య గారు ఆయన దగ్గరికి ఆత్మ జ్ఞానము పొందడానికి చేరిపోయారు. మద్య రకము వ్యక్తులు ఎలాంటి వారంటే తమకి తెలియదు, వేరే వారిని విశ్వసించరు. రామ చరిత మానసములో గోస్వామి తులసీ దాసు గారు ఈ మద్యరకమైన వ్యక్తుల గురించి చాలా బాగా వివరించారు. వీరు మంచి సన్నిధులు దొరికితే మారిపోతారు. మూడవ రకమైన వారు {మూర్ఖులు} అలాకాదు, వారు భగవద్ గీతలో ఇలా వ్రాసి వుంది, ఉపనిషత్తులో అలా వ్రాసివుంది, అని తర్కిస్తూ వుంటారు. ఈ మూడవ రకము వ్యక్తులు ఆద్యాత్మిక దారిలో ముందుకు వెళ్ళలేరు. మారి ఏమి చెయ్యాలి?
ఏమి చెయ్యాలి ?
గురు మహారాజు గారు ఆ సిస్టంతో కలవడానికి ఒకసులభమైన సాధన తెలిపారు. వారు ఏమన్నారంటే మీ మనస్సులో శ్రద్ధ లెదు,భక్తీ లెదు, విశ్వాసమూ లెదు ,మీరు ఎలా కలవ గలరు? మిమ్మల్ని కలిపే భాద్యత నాది. మీరు చదివినవారైన, కాకపోయినా, ఏ జాతి వారైనా , ఏ ధర్మము వారైనా, ఏ అవస్తలో వున్నా కేవలము ఒక సహజ విశ్వాసముతో, నా ఎదుట పరమాత్ముడు,నా గురువు కూర్చుని వున్నారు నేను వారి ఎదుట కూర్చున్నానుఅని అనుకుంటే చాలు. ఇంకేమీ చెయ్యక్కరలేదు. మీరు వారికి ఉప ఆసనముగా వుంటే మిగిలిన పని అంతా వారిదే. ఎలాగైతే ఇనుము,మరియు అగ్ని. ఇనుముని అగ్ని లో పెట్టినప్పుడు అది వేడెక్కి పోతుంది, అగ్ని దానిని వేడి చేస్తూ చేస్తూ ఎర్రగా చేసేస్తుంది . ఇంక అదే ఇనుము, అగ్ని అయిపోతుంది. తాత్పర్యము ఏమిటంటే నియమంగా కూర్చోవడమే మన పని.
గురువు ఏమి చేస్తారు ?
మనము ఎప్పుడైతే కూర్చోవడము మొదలు పెడతామో అప్పుడు గురువు ఏమి చేస్తారు ? గురువు మన మనస్సులోకి ప్రవేశిస్తారు. మనస్సులో ఉన్న అన్ని వికారాలనూ తొలగిస్తారు. అప్పుడు మన మనస్సుపై వున్న అన్ని కళ్ళద్దాలూ తొలగి పోతాయి. అప్పుడు మన దృష్టి స్వాభావికమైనది అయిపోతుంది. మనస్సు యొక్క దృష్టి నిర్మలమై పోతుంది, ఇంక మన మనస్సులో కామ, క్రోధ,మోహ లోభముతో కూడిన కళ్ళద్దాలన్నీ తొలగిపోతాయి. ఇంక మన దృష్టి సహజమైనది అయిపోతుంది. ఇలాగే గురువు మన బుద్ధి లోకి ప్రవేశిస్తారు. బుద్ది, ఏదైతే జ్ఞానము యొక్క అవయవముగా వున్నిందో , దేని పని అయితే సహజంగానే జ్ఞానాన్ని పొందేదో దానిని మనము అనవసరమైన వాటితో నింపేసాము . శాస్త్రాలనీ, ఉపనిషత్తులనీ, సంసారమనీ ఇంకా ఇలానే ఏమేమో. మనము బుద్ధిలో, పరమాత్మ ఏమిటి అనేది నింపాము,కానీ బుద్ధికి పరమాత్ముడు ఏమిటి అని ఆలోచించే అవసరము ఇవ్వలేదు. దానికి సహజమైన జ్ఞానాన్ని గ్రహించే శక్తి క్షీణించి పోయింది. గురువు బుద్ధిలో ప్రవేశించి అందులో నిండివున్న కృత్రిమ జ్ఞానాన్ని తొలగిస్తా రు. అప్పుడు బుద్ది పూర్తిగా శాంతంగా, మరియు పవిత్రంగా అయిపోతుంది. ఇంక, బుద్ధి వాస్తవిక జ్ఞానాన్ని గ్రహించడము మొదలుపెడుతుంది. రామచరితమానసములో గోస్వామి తులసీదాసు గారు చాలా స్పష్టంగా వ్రాశారు . .
గురువుగారి చరణ కమలాల గోళ్ళ నుంచీ వచ్చిన జ్యోతి సహజంగానే మన కళ్ళకు, మన మనస్సుకు, మన బుద్ధికి వచ్చేస్తే అన్ని ఆవరణాలు తొలగిపోతాయి. రాముని చరిత్ర రూపమైన మణి మాణిక్యాలు స్పష్ట మవడము ఆరంభిస్తాయి. అన్ని రహస్యాలు బయటపడతాయి. బుద్ధికే ఏది మంచి,ఏది చేస్తే బాగుంటుంది అని తోచడము మొదలవుతుంది. మెల్ల మెల్లగా నా అహం ఎందులోనైతే “నేను,నాది “ అని నిండి ఉండేదో దాన్ని గురువు నిర్మలము చేస్తారు. అప్పుడు మనకు ఏమి అర్థమవుతుంది అంటే “ కర్తను నేను కాను చేసేవాడు ఆ పరమాత్ముడే ,ఆ గురువే “. అందరికీ తండ్రి ఆయనే, అందరికొరకు అన్నీ ఆయనేచేస్తారు. ఎంతవరకైతే నా బుద్ధి నిర్మలంగా వుండేది కాదో, అప్పటి వరకు నేను ధనము,బంగారు,వజ్రాలు అన్నీ భవిష్యత్తు కొరకు సంగ్రహించే వాడిని. కానీ ఇప్పుడు నా బుద్ధి,మనస్సు,అహం అన్నీ నిర్మలంగా అయ్యాక ఇవన్నీ సంగ్రహించడము మంచి పని కాదు అని అనిపిస్తుంది. ఆ పరమాత్ముడే అందరికీ ఇస్తాడు. ఆ పక్షులను చూడండి, వాటిదగ్గర ఏ ధనము,ఇల్లు ,ఏ విలువైన వస్తువులూ లేవు అయినా కానీ, అన్ని వేళలా కలకలా రావాలు చేసుకుంటూ అవి ఎంత సంతోషంగా ఉంటాయో. గురువుగారు ఒక దృష్టి ఇచ్చి, ఇలా అన్నారు చూడండి, ఇక్కడ ఏమున్నది.? గమనిస్తే అన్నింటిలోనూ ఆ పరమాత్ముడే వున్నారు. గీత లో వర్ణించినట్లు అర్జునిడి అవస్త లాంటిదే మనకూ కలుగుతుంది. శ్రీ కృష్ణుడు అర్జునుని ఆ అవస్తకు చేర్చినప్పుడు, ఎప్పుడైతే అతను పూర్తిగా ఆయన శరణులోకి వచ్చాడో అప్పుడు ఏమిచూసాడంటే, ఇచ్చట అర్జునుడూ లేడు, దుర్యోధనుడు లేడు ,పాండవులు,కౌరవులూ ఎవ్వరూ లేరు. ఇచ్చట జననమూ లెదు,మరణము లెదు. ఇచ్చట గెలుపు లేదు,ఓటమి లే దు. ఇచ్చట ఏమియునూ లేవు. ఇచ్చట ఒక ఆట జరుగుచున్నది, అది మనందరమూ కలసి ఆడుతున్నాము. ఎలాగంటే మీరు T.V లో ఒక సీరియల్ చూస్తున్నట్లు. అందులో ఒక పక్షము వారు ఇంకో పక్షము వారితో గొడవలు పడుతున్నారు,అందరూ గాయ పడుతున్నారు,కొందరు మరణిస్తున్నారు,కొందరు గెలుస్తున్నారు,కొందరు ఓడిపోతున్నారు. కానీ వాస్తవములో ఏ గొడవలూ లేవు,ఏ గెలుపూ, ఓటమి లెదు. ఏక్టింగ్ తర్వాత రెండు పక్షాల వారు కూర్చొని టీ త్రాగుతూ వుంటారు. ఇదంతా ఒక నాటకము. మనము సహజ అవస్తలోకి వచ్చాక చూస్తే ఏదో మార్పు స్థూలంగా,సూక్ష్మంగా కనిపిస్తుంది, కానీ ఆ పరివర్తన మనల్ని ప్రభావితము చెయ్యటములేదు. జనన ,మరణ భేదము వుండదు. ఈ పరిస్థితుల్లోనే వుంటూ , అన్ని వ్యవహారాలూ చేస్తూ ఉంటాము కానీ జననము యొక్క సంతోషము, మరణము యొక్క భయము ఏమీ వుండవు. ఈ అవస్తను గురించి కబీర్ దాసు గారు
ఇలా అన్నారు.
“ఏ మరణముతో నైతే ఈ ప్రపంచము భయపడుతుందో నాకు ఆ మరణము పరమానందాన్నిస్తుంది. ఎప్పుడు మరణిస్తానో ,ఎప్పుడు ఆ పరమానందాన్ని పొందుతానో “
జీవితములో క్రాంతికారీ పరివర్తన
ఈ ఆవస్థ లోకి చేరేక మన జీవితములో, మన స్వభావములో ఒక క్రాంతికారీ పరివర్తన వచ్చేస్తుంది. జీవితములో ఒక పారదర్శకత (transparency) వచ్చేస్తుంది , దానినే వీతరాగ అంటారు. ఈ పారదర్శకత యొక్క లక్షణము ఏమిటి? ఎలాగైతే మన శరీరము లోని ఏ అంగంయొక్క ఏ భాగానికైనా బాధ కలిగితే అది మనకు వెంటనే తెలిసిపోతుంది, మరియు మనము ఆ బాధ నివారణ కొరకు ఉపాయము చేస్తాము, అలాగే ఈ ప్రపంచము కూడా ఒక శరీరము లాంటిది. మనలో పారదర్శకత వచ్చేస్తే ప్రపంచములో ఎక్కడైనా , ఎవరికైనా, ఏదైనా దుఃఖము లేక కష్టము కలిగినా, ఎవరికైనా, ఏదైనా, ఎక్కడైనా అవసరము ఉన్నా మనకు తెలియడము మొదలెడుతుంది .
దీనినే నరసీ మెహతాగారు తమ భజనలో ఇలాగ పాడేరు
వైష్ణవ జన తో తేనే కహియే ,
జే పీర్ పరాయీ జాణే రే.
పర దుఃఖే ఉపకార కరే తోయే,
మన అభిమాణ న ఆణేరే.
మహాత్మా గాంధీ గారికి, పరమ పూజ్య పండితజీ మహారాజ్ కి కూడా ఈ భజన చాలా నచ్చేది. ఇచ్చట ఆత్మ ఒకటే, ఎదైతే ప్రతి జీవి లోనూ, ఈ ప్రపంచములో వ్యాప్తించి ఉందొ. ఎప్పుడైతే మనలో పారదర్శకత వచ్చేస్తుందో, అప్పుడు ఆ విరాట ఆత్మ యొక్క ఏ మూల బాధ, కష్టముందో తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే అక్కడకి సహాయము చెయ్యడానికి చేరిపోతాము. అలాంటప్పుడు విశ్వమంతా మనదే అనిపిస్తుంది. అలాంటప్పుడు .ఏ గొడవలు వుండవు. ఈ సంసారములో చూస్తూన్న అత్యాచారాలూ, ఆతంకవాదము అన్ని సమాప్తమైపోతాయి .
పరమ పూజ్య పండితజీ మహారాజ్ గారు ఏమిటి అనేవారు అంటే ఈ సంసారము అంతా ఒక ఆత్మ యొక్కసంత . .ఇక్కడ పరమేశ్వరుడు
తప్పిస్తే ఇంక ఏమీ లేదు .ఇక్కడ అందరిలోనూ ఆ పరమాత్ముడే ఉన్నాడు .ముస్లిమ్స్ కూడా “లా ఇలాహఇల్లిల్లాహ అంటారు హిందూలు కూడా”ఈశావాస్యమిదం సర్వం “అన్నారు కానీ ఎవరూ దీనిని నమ్మరు ఎందుకంటే అందరిలోనూ నేను-నేను (అహం )నిండి ఉంది అందువల్లే అడ్డంకులు వస్తున్నాయి అందుకే అన్ని సమస్యలూ. పారదర్శకత (ట్రాన్స్పరెన్సీ)తో కూడిన మనిషి ఒక సూచనకేంద్రము
వలెను అయి పోతారు తాత్పర్యము ఏమిటంటే ,ఎక్కడ ఏమి జరుగుతోందో అన్ని సూచనలూ ఈ మనిషి దగ్గర కూడబడతాయి .
ఏ మనిషి లో అయితే పారదర్శిక{ ట్రాన్స్పరేన్సి}
త వచ్చేస్తుందో వారు రాగ ద్వేషాలను అధిగమించిన వారు అయిపోతారు. .వారిని సంత్ {మహాపురుషులు }అంటారు. గురువు అంటాము. పారదర్శకత అంటే ఏమిటి అనే దాన్ని గురించి నేను మీకు ఒక సంఘటన చెబుతాను. నేను పరమ పూజ్య పండిత్ జీ మహారాజు గారి జీవన విధానాన్ని చాలా దగ్గరగా చూసాను. ఆయనలో ఎంత పారదర్శకత ఉండేదో. ఒక మారు టూండ్ల లోని ఒక వీధిలో ఒక చాకలి వ్యాదిగ్రస్తుడయ్యాడు . అతను చాలా ముసలి వాడు. ఆ ఇంటి వారు ఇంకా ఎలానూ మరణిస్దాడని బయట ఉంచేశారు. అది శీతాకాలము. పరమ పూజ్య పండిత్ జీ గారికి అతని దయనీయ స్తితి గురించి తెలిసి వెంటనే అచ్చటికి వెల్లి చూస్తె అతని ఒంటి మీద సరైన బట్టలు లేక చలికి బాధ పడుతున్న అతన్ని చూసి వెంటనే దగ్గరలోనే వున్న గాంధీ ఆశ్రమ్ వారి దుకాణము నుంచీ ఒక కంబలి తీసుకొని అతనికి కప్పి ఇంటికి వెళ్ళిపోయారు.మరుసటి దినము అతను ఎలా ఉన్నదో చూడటానికి ఆయన వెళ్ళారు. వెల్లి చూస్తే అతని పైన వున్న కంబలి ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. కొత్త కంబలి కదా ఎవరు వాడులుతారు..
ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. మరల ఇంకొక కంబలి కొని మరల అతని పైన కప్పారు. మూడవ దినముకూడా ఆ కదలలేని పరిస్తితుల్లో వున్న అతని కంబలిని మరలా ఎవరో తీసుకొని వెల్ల్లి పోయారు .
పండిత్జీ గారు ఇంటికి వచ్చి ఎదినా పాత చిరిగినా కంబలి వుంటే ఇవ్వమని అన్నారు. ఈ చిరిగిపోయిన కంబలితో ఏమి చేసుకుంటారు అని మాకు చాలా ఆశ్చర్య ము వేసింది. అయన ఆ కంబ ఆలిని తీసుకొని ఎక్కడికి వెళ్ళారో మాకు అర్థము కాలేదు. మరుసటి దినము పండిత్ జీ గారు ఇలా అన్నారు. “ అతను చనిపోయాడు.”ఎవరండీ అని నేను అడిగాను. అప్పుడు ఆయన జరిగిన దంత చెప్పారు. పార దర్శికత అంటే ఇది. సంత్ మహాత్ములు చూస్తూ వుంటారు ఎక్కడ ఏమిజరుగుతున్నదని . ఆ వైష్ణవ జనులకి తెలిసిపోతుంది వారి అవసరము ఎక్కడ అని అచ్చటికి వారు సహాయము చెయ్యడానికి వెళ్ళిపోతారు. ఇదే వైష్ణవ జనుల పని.