Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

واپس

ASHANT KYON

<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/04/pp_panditji_1945-1.jpg" alt="" width="100" height="136" class="alignnone size-full wp-image-58350" />

ASHANT KYON
అశాంతి ఎందుకు
మీరు ఎప్పుడైనా జీవితములో మనస్సు చాలా అశాంతిగా ఉంది లేక చాలా దుఃఖ పడుతున్నామని అనుభవం చేసినారా? ఇలాంటి పరిస్థితి అందరి జీవితములోనూ ఉంటుంది, వస్తుంది, వచ్చే ఉంటుంది దుఃఖ పడే ఉంటారు, అశాంతి అనుభవించి ఉంటారు. ఇంకా దానికి కారణం కూడా ఇదే అయివుండచ్చని అనుకొనివుంటారు, కానీ ఎక్కువగా మనుషులు ఆ అశాంతి యొక్క కారణం, అయితే ఈ ప్రపంచము, లేక ఈ ఆలోచనలు, లేక ఉద్భవిస్తున్నకోరికలు అని అనుకుంటారు కానీ బాగా అర్ధం చేసుకోండి మీ అశాంతికి కారణం ఇవి కావు .
ఈ విశ్వం శాంతంగా ఉంది, మీరూ శాంతంగా ఉన్నారు, ఈ విశ్వం అశాంతిగా ఎలాగవుతుందో దీన్ని
కొంచము అర్ధంచేసుకొనండి. ఉదాహరణ కి—ఒక మహాసాగరం ఏమీ అలలు లేకుండా శాంతంగా ఉన్నదనుకోండి. అందులో, ఒక సారి వాయు వీచిక వీచగానే తరంగాలు ఉద్భవిస్తాయి, సాగరం అలలమయం అయిపోతుంది, దానిని మీరు అశాంతి అంటారు. కానీ అది అశాంతి కాదు, అది దేవుడి యొక్క ఒక లీల ,ఎలాగైతే ఎవరో పడుకున్నవారు మేలుకున్నట్టుగా, ఒక కొత్త విషయం తెలుసుకున్నట్టుగా ఆనందోదయం అవుతుంది. ఇలాగే మీరుకూడా శాంతంగా ఉండేవారు, ఆలోచనలతో (వృత్తులతో) శూన్యంగా వుండేవారు, హటాత్తుగా ప్రభువు యొక్క ఒక్క వీక్షణంతో ఒక కొత్త జాగృత్ దశ అంటే మేలుకున్న స్థితి యొక్క అనుభవం అయ్యింది. మిమ్మల్ని మీరు చూసుకోగానే ఆనందం అనిపించింది. మీరు ఎప్పుడైనా ఆ ప్రసన్నతని అనుభవించారా? ఎప్పుడైతే - మీకు పుత్ర రత్న ప్రాప్తి అయ్యిందని మొట్టమొదట కబురు అందినప్పుడు, మీ మనస్సు వికసించి పోయింది, ఇంకా మీ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే మనస్సులో ఏ బాధా వుండదు, ఇంక మా సంసారంలో కష్టాలు ఆరంభమయ్యాయి, ఎలా గడుస్తుంది అని అనిపించదు, దాని బదులు ఆనందం ఉంటుంది, కారణం ఏమిటంటే మీ కొడుకు మీ స్వరూపం యొక్క ప్రతిరూపము కాబట్టి . ఇలాగే ఎప్పుడైతే మనము మనల్నే చూసుకుంటామో, మెలకువలోకి వస్తామో అప్పుడు ఆనందము కలుగుతుంది. దీని వల్ల ఏమి అర్థమౌతుంది అంటే మెలకువ రావడం ( జాగృత్ అవస్థ ) మనకు ఆనందాన్ని కలిగించడానికి వచ్చినది కాని కష్టాలను ఇవ్వడానికి కాదు .

మీరే ఆలోచించండి మీరు కనుక పడుకునే ఉంటే ఈవిశ్వంలో ఉన్న ఆనందాన్ని ఎలాగ చూడ గలిగేవారు ? మన మనస్సులో ఆలోచనలే రాక పోయివుంటే మనము కూడా ఒక రాతి విగ్రహము లేక మట్టి బెడ్డ కన్నాఎక్కువ కాక పోదుము. ఎవరైనా ఏళ్ల తరబడి నిద్రలో ఉండిపోతే మెలకువలో ఉన్నఆనందాన్ని ఎలా పొందగలరు? ఇందుకే ఇది దేవుడి కృప. దీని వల్లనే మనకు ఈ జాగృత్ దశ ప్రాప్తించింది. ఎందు కంటే మీరు నవ్వడము, ఆడుకోవడము ఇష్టపడతారు. అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అవసరము. నిద్ర మనకు అత్యంత ఆవశ్యకము, నిద్ర తర్వాత మేలుకోవడము దాని కన్నాఆనందకరమైనది మరియు ఆవశ్యకరమైనది కూడా.
మీలో కోరిక పుట్టడము స్వాభావికం. అది ఎందువలన ఉద్భవించింది అని మీకు ఇప్పుడు అర్ధంకాదు. ఎలాగైతే మీరు ఎందుకు మేలుకున్నారో కూడ అర్ధంకాదు. పిల్లలకి ఒక కోరిక ఉంటుంది, అది ఏమిటంటే విద్యాలయములో అధ్యాపకుడు ఇకనైనా మమ్మల్ని ఆట్లాడించాలని, వెంటనే గంట మ్రోగి సెలవు దొరకి పొయింది, అందరూ క్రీడా మైదానం లోకి వచ్చి బంతి ఆట మొదలుపెట్టారు . ఒక సారి ఆట గెలిచిన సంతోషమైతే మరోసారి ఓడిపోయిన బాధ. కానీ ఆట ఇంక ఆగకపోతే, అప్పుడు ఏమిటౌతుంది? అయితే పిల్లవాడు ఆడుతూనే ఉంటాడా? ఆట ఆడే మనస్సు లేక పోయినా ఆట నడుస్తూనే ఉంటుందా? దీని పరిణామం ఏమిటి? అతనికి దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది కానీ అక్కడ నుండి కదలడు, ఇది దుఃఖము, ఇంక ఆట ఆడడం అంటే ఇష్టం లేదు, కానీ అది ఆగడం లేదు. ఇదే అశాంతి, ఇదే దుఃఖము .
మన జీవితంలో కూడా ఇదే నడుస్తోంది, మేలుకోవడము మీకు ఇష్టము, కానీ పడుకోవాలి అని మనస్సు కోరుతోంది, అలాంటప్పుడు ఈ ఆటలన్నీ ఇష్టంగా అనిపించవు, ఈ మేలుకోవడము కూడా బాగుండదు. కానీ మీరు ఇప్పుడు పడుకొనే క్రియ మర్చిపోయేరు, నిద్రలోకి చేరడము లేక శాంతి లోకి చేరే దారి జ్ఞాపకం లేదు, ఇంకా మీరు దాని కోసం పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తారు. భలేవారే ! నిద్ర పోవడం కోసం ఒక కాలు మీద నుంచోవడం, లేక ఆహారం త్యజించడము, బట్టలు మార్చి కాషాయ రంగు బట్టలు వేసుకోవడము చేస్తే నిద్ర వచ్చేస్తుందా? మనము శాంతి కొరకు కఠినమైన ప్రయత్నాలు చేస్తాము . ఇంటినుంచి బయటకు వెళ్లిపోవడము, నిద్రను గెలవడము, మరియు శాంతి లేక సుఖ నిద్రను కోరడము. ఏమి విచిత్రము, ఎలాంటి భ్రమ ఇది? చేయాలునుకున్నది వేరు, చేస్తున్నది వేరు, కానీ ఆశ మాత్రం ప్రగాఢమైన శాంతి. కొందరు సంత్ మహాత్ములలో చూసినదేమిటంటే వాళ్ళు ఎప్పుడనుకుంటే అప్పుడు తక్షణం నిద్ర పోతారు, మళ్ళీ అనుకున్నప్పుడు లేచేస్తారు. వారు అరగంట పడుకోవాలని అనుకొని సరిగ్గా సమయానికి లేచేస్తారు. మీరు అనుకుంటారు ఇదెలా సాధ్యమని? ఎలాగంటే ఏపనైనా చెయ్యడానికి అరగంట కోసము లోపలకి వెల్లి పోయినట్టుగా, వాళ్ళు బయట నుండి లోపలకి వెళ్ళిపోతారు, మెలకువలోవున్న అన్ని పనులను కొంత సేపటికి ముగిస్తారు, సంపూర్ణ భారాన్ని ఒక ప్రక్కన పెట్టేస్తారు, ఎప్పుడైతే అరగంట పూర్తి అయిపోతుందో వెంటనే లేచి పని ప్రారంభించేస్తారు. మహాత్మా గాంధీ కేవలము పది నిమిషాలు నిర్ణీత సమయములో మాత్రమే పడుకునేవారట, పడుకున్న వెంటనే గురక పెట్టేసేవారట. చిన్న పిల్లల్ని చూడండి , వారి చేతిలో ఆట వస్తువు చేతిలోనే వుంటుంది, ఆడుకుంటూనే అలా మంచి నిద్ర లోకి జారి పోతారు. కాని మనకు ఇది సాధ్యము కాదు, మనం నిద్ర పోవాలని చూసినా అది రాదు. అప్పుడు మన మనసులో తిరుగుతున్న ఆలోచనలను మరచిపోవడానికి మాత్ర లేక ఇంజక్షన్ వేసుకొంటాము.

ఇదే పరిస్థితి మన జీవితానిది కూడా, మనకి ఇవన్నీ తెలియవు. దేవుడా ! నేను చాలా దుఃఖంగా ఉన్నాను, ఏవిధముగానైనా శాంతి ప్రసాదించండి అని కోరుకుంటాము.
కానీ గుర్తుంచుకోండి, శాంతి ఇంకా అశాంతి రెండూ మీలోనే ఉన్నాయి. మీరు ఏదీ బయట నుంచి తెచ్చుకోనవసరము లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు శాంతంగా, చపలత్వంగా ఇంకా ఆనందంగా ఉండవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది, దేనినైతే మీరు మరచిపోయార, ఎలాగైతే మీ వల్ల ఒక చక్కటి గది యొక్క తాళం చెవి పోయింది, ఎక్కడైతే మిమ్మల్ని ఆనందపరిచే అన్ని సౌకర్యాలు ఉన్న గది తాళము చెవి మీరు పోగుట్టుకున్నారో, దానిని వెతకడంలో మీరు ఎంత మునిగి పోయారంటే ఇంక చెప్పలేము. మనుషులు, కోరికలే దుఃఖము యొక్క కారణము అని అనుకుంటారు, కానీ అలాగ కాదు.
ఎవరికైతే కోరికలే ఉండవో వారికి సుఖము కూడా కలగదు కదా? మంచి కోరికలతో శుభం జరుగుతుంది. మంచి జరిగితే ఆనందము కలుగుతుంది. ఈశ్వర భజన కూడా ముందు ఒక కోరిక వల్లనే ఆరంభము అవుతుంది. ఒక రాజు చాలా తపస్సు చేస్తే, దేవుడు ప్రత్యక్షమై అడిగాడట–కోరుకో, ఏమికావాలో అని. ప్రభూ! నాకు ఏ కోరికా ఉండకూడదు అని రాజు అన్నాడు. దేవుడు “తథాస్తు” అన్నాడు. రాజు రాజభవనం లోకి వచ్చేశాడు. ఇంక ఏ కోరికా లేదు, భోజనం చెయ్యాలనీ లేదు, మాట్లాడాలనీ లేదు. ప్రతిరోజూ చిన్న పిల్లలని చాలా ముద్దు చేసేవాడు, దాని వల్ల తన మనస్సు చాలా ఆనందంగా ఉండేది. కానీ ఈ పూట అదీ పోయింది. మహారాణి కారణం అడిగితే, ఆయన కోరిన వరము గురించి వివరంగా చెప్పారు. అదేమిటంటే నేను ఒక వరం కోరుకున్నాను, ఇప్పుడింక నాకు ఏ కోరికా ఉద్భవించడంలేదు అన్నారు. మహారాణి అడిగేరు, అయితే మీకు ఇప్పుడు ఆనందంగా వున్నదా? మహారాజు అన్నారు, ఇదైతే ఇంకా కష్టంగా, ఊపిరి సలపకుండా అయిపోయింది. మహారాణి అన్నారు–మీకు చాలా కోరికలు ఉండేవి, అప్పుడూ మీరు చాలా అశాంతిగా ఉండేవారు, ఇప్పుడింక ఏ కోరికలూ లేకపోతే కూడా మీరు సుఖంగా లేరు, వాస్తవము ఏమిటంటే, శాంతి కోరికలు ఉండడము, లేకపోవడంలోనూ ఆధారపడి లేదు. శాంతి కోరికలు తీరడంలోను మరియు తీరకపోవడంలోనూ లేదు, వాటిని ఆపడంలోనూ లేదు .
మహారాణి చాలా తెలివిగలది, ఇలా అంది –శాంతి మరియు అశాంతి వీటిలో లేవు, కాకపొతే ఈ రెండూ మీ లోనే ఉన్నాయి. ఈ శరీరం మీది, దాని స్వామి మీరు, మనస్సు మీ సేవకుడు, ఇప్పుడు ఈ సేవకుడు తమ ఇష్టంతో పని చేస్తున్నాడు. మీకుతెలుసా! సేవకుడి యొక్క ఇష్టంతో స్వామికి ఏమి సంబంధం? ఆ మనిషి ఎలాగ ఆనందంగా ఉండగలుగుతాడు? మీకేమో చాలా విచ్చలవిడిగా ఖర్చు చెయ్యాలని ఉంటుంది. మనస్సుకి ఖర్చు పెట్టవద్దనిపిస్తుంది. మీలో సత్యo మరియు దయ ఉన్నవి. దానికి అబద్ధం మరియు హింస నచ్చవు. అలాంటప్పుడు మీకు శాంతి ఎలాగ కలుగుతుంది? మీరు సదాచారము కలిగి ఉండడం ఇష్టపడతారు. అదిమీతో అనాచారము చేయిద్దాం అనుకుంటుంది. మీ కోరికలు శ్రేష్ట మైనవి, సరైనవి, అందరి మంచి కోసము ఉంటాయి, ఎందుకంటే మీరు శ్రేష్ఠులు కనుక. అవి అన్నీ నెరవేరడము లేదని మీకు దుఃఖం. ఇందుకే మీరు మీ మనస్సు యొక్క కోరికలను త్యజించి మీ కోరికల్నిపూర్తి చేసుకోండి, శాంతి దొరుకుతుంది .
ఈ జీవితం యొక్క పరిస్థితి ఇలాగే ఉంది. మీరు కోరికల వలయంలో పడ్డారంటే ఇంక ఏవేవో కోరుకుంటూనే ఉండిపోతారు, వాటికి అంతు లేదు. దీనికి చాలా ప్రచలితమైన ఒక కథ వున్నది. ఒక పేద వాడు ఒక కుండ తలమీద పెట్టుకొని ఆలోచిస్తూ వెళ్తున్నాడట. కుండలో వున్నఈ పెరుగు అమ్ముతాను దానితో వచ్చే డబ్బుతో గుడ్లు కొంటాను, అందులోంచి వచ్చిన కోళ్ళను అమ్ముతాను. ఇలాగ చేస్తూ చేస్తూ బాగా ధనాన్ని సంపాదిస్తాను, పెళ్లి చేసుకుంటాను, సంతానోత్పత్తి అవుతుంది. పిల్లలు దెబ్బలాడుకుంటారు. అప్పుడు నేను వాళ్ళను ఇలా కొడతాను అని ఒక కర్రను విసురుతాడు. అది వెళ్లి కుండకి తగిలి పగిలి పోతుంది. ఆ పెరుగంతా నేలమీద పడిపోతుంది. ఇలాంటి అనవసరమైన ఊహలు, కల్పనలు మీకు శాంతి కలిగించవు .
ఇందుకే ఈ జీవితంలో శాంతి, ఇంకా ఆనందం కొరకు మీరు మీలోని వివేకాన్ని మేలుకోలపాలి. మీ హృదయాంతరాలలో అన్నీ ఉన్నాయి, కానీ మీకు వాటి గురించి తెలియదు. వాటి గురించి తెలుసుకోడానికే మీకు వివేకము అత్యావశ్యకము. మీరు పడుకున్నప్పుడు, మేలుకున్నప్పుడు, ఇటుఅటు తిరుగుతున్నప్పుడు ఆ కోరికలనుంచి వేరు కాలేక పోతారు. ఇప్పుడు ఆకలివేసింది, భోజనం చేసారు, ఇంక కోరిక శాంతించాలి కదా? కానీ ఇప్పటినుంచీ సాయంత్రం కోసం బెంగ, సాయంత్రం ఏమి వండుకుందాము అని? ఎందుకు ఇవన్నీ? కోరికలు కోరుకోవడము, కోరుకోకపోవడము శాంతి, అశాంతి కాదు. కానీ అశాంతి ఏమిటంటే, అవసరం లేకుండా వీటిలో చిక్కుకుని ఉండడము. కోరికలని మన వశంలో పెట్టుకోవడమే సుఖము. ఎప్పుడుకావాలో అప్పుడు కోరుకోవడం, అవసరం లేనప్పుడు ఆలోచించడం మానెయ్యడం. తాత్పర్యం ఏమిటంటే మీ మీద మీకు పూర్తి అధికారము వుంది. ఇదంతా వివేకము వల్లే సంభవము. వివేకము మీకు చెప్తుంది మీకు ఎలాంటి కోరికలు ఉండాలి? ఎలాంటివి అక్కరలేదు, ఏ కోరికలను సాధించాలి, ఏవి అవసరం లేదు. ఎప్పుడైతే మీ వివేకము మే లుకుంటుందో, అప్పుడు మీ మీద, మీ రాజ్యమే ఉంటుంది . మీ మనస్సు మీ వశంలో ఉంటుంది. ఎవరైతే మనస్సుని గెలిచేరో వారు సంపూర్ణ విశ్వాన్ని గెలిచినట్టే. ఇందుకే వివేకం ద్వారా మీ మనస్సు మీద అధికారాన్ని పొందండి. వివేకంతో కూడిన సంసారం ఆనందపూర్ణమైనది. అంటే ఆనందంతో కూడి ఉంటుంది. వివేకము లేనప్పుడు వైరాగ్యం కూడా దుఃఖమయం అయిపోతుంది. వివేకము ఉన్నప్పుడు పేదరికం కూడా సుఖప్రదమైనది అయిపోతుంది. అజ్ఞానము వల్ల లక్ష్మీకటాక్షం ఉన్నవారు కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇందుకే మీ జీవితంలో వివేకం పొందే ప్రయత్నం చెయ్యండి .
వివేకవంతుడి పరివారము ఆనందముగా వుంటుంది. అవివేకముతో వైరాగ్యముకూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. ధనము లేక పోయినా వివేకము వుంటే సుఖము వుంటుంది. అజ్ఞానము వలన ధనవంతునికి కూడా దుఃఖము ప్రాప్తిస్తుంది. అందుకే వివేకము పొందడానికి ప్రయత్నిచండి. వివేకము, వివేకవంతులైన వారితోనే లభిస్తుంది. మంచి వివేకవంతులు సంత్ మహాత్ములే, కనుక వాళ్ళ సంపర్కము పొందండి, అంటే వారి సత్సంగం చెయ్యండి, అప్పుడే వివేకం కలుగుతుంది. భగవంతుడి కృప వల్ల మనకి ఈ మానవ శరీరము దొరికింది. ఇందులోనే వివేకము మేలుకోగలదు. అయితే సంత్ మహాత్ముల శరణాగతి పొందితే, వారి వల్లే ఈ సృష్టి యొక్క జ్ఞానం పొందగలరు, ఇంకా ముక్తి యొక్క మార్గము తెరుచుకుంటుంది.
__________