Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

Retour

Dukh Bhi Parmata Ki Den

దు:ఖము
కూడా పరమాత్ముడి వరము
Dukh Bhi Parmata Ki Den

<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2018/01/15741268_1326715307396260_6618069820526969433_n-300x200.jpg" alt="" width="300" height="200" class="alignnone size-medium wp-image-58292" />

రచయిత:
శ్రీయుత్ కృష్ణకాంత్ జీ

రామాశ్రం సత్సంగ్
మథుర

దు:ఖము కూడా పరమాత్ముడి వరము
మనమందరమూ మన జీవితాలను పరిశీలిస్తే, సు:ఖ, దు:ఖాల మధ్యలో జరుగుతూన్న సంఘటనలు, తటస్థ పడతాయి. దు:ఖం వస్తే దు:ఖపడిపోతాము, సుఖం వస్తే సుఖపడిపోతాము, ఇదే మన అందరి జీవితం. ఎలాగైతే శ్వాస పీల్చుకొని వదలుతామో అలాగే జీవితములో సుఖ దు:ఖాలు వస్తాయి వెళ్తాయి, కానీ వీటి తరువాత ఏమిటి? దీని గురించి మనకు తెలియదు.
జీవించడానికి ఎంత అయితే శ్వాస అవసరమో, అలాగే దు:ఖము మరియు సుఖము రావడము కూడా చాలా ఆవశ్యకరమైనది. జీవితాన్ని నిలబెట్టడానికి ఇలాంటి దు:ఖము మరియు సుఖము కూడా రావడము ఆవశ్యకరమే. కానీ, అజ్ఞానము యొక్క ఒక ఆవరణ మూలాన మనము దుఃఖము వస్తే చాలా దుఃఖ పడిపోతూ ఉంటాము. పరం పూజ్య పండిత్ జీ మహారాజ్ గారు చాలా చక్కగా వ్రాసారు –--“మనము పరమాత్ముడిని సుఖమే కోరుతాము. మందిరములో, మస్జిద్ లో ,చర్చిలో ఎక్కడకి వెళ్లినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఒకటే అడుగుతాము– ఓ పరమాత్ముడా! మాకు సుఖము ఇవ్వండి, సంపత్తి ఇవ్వండి. దుఃఖము ఎవరూ కోరరు. దుఃఖము పరమాత్ముడి వరము. మనిషి సుఖాన్ని కోరతాడు. ఎవరైతే దుఃఖాన్ని పరమాత్ముడి వరము అని తెలుసుకుంటారో వారు బ్రతకడము తెలుసుకుంటారు. మీరు భక్త ప్రహ్లాదుడి జీవితం గురించి చదివేఉంటారు. తండ్రి చాలా కష్టాలు పెట్టినా, సముద్రములో విసిరెసినా. కఠినతరమైన కష్టాలు పెట్టినా సహనముతో భగవంతున్ని తలచిన ఆయన నరసింహావతారము ధరించి హిరణ్యకశిపుడిని వధించాడు. భక్త ప్రహ్లాదుడు భగవంతుని స్తుతి చేసాడు, మరియు అన్నాడు ఓ మహారాజా! మా తండ్రి పెట్టిన కష్టాలు ఎక్కువగా లేవు. నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే ఈ విశ్వములో ఉన్న అన్ని కష్టాలూ మీరు నాకు ఇచ్చెయ్యండి, ఎందుకంటే ఈ రోజు మీ దర్శనము యొక్క కారణము ఆ దు:ఖాలే.
మహాభారతము లోనూ ఇలాగే మీరు చదివే ఉంటారు, యుద్ధము సమాప్తమై, యుధిష్ఠిరుడు రాజు అయ్యాక, పాండవులు ఆనందముగా ఉండడము మొదలు పెట్టారు. ఒక రోజు కృష్ణ పరమాత్ముడు అన్నారు –నాకు ద్వార క నుండి వచ్చి చాలా సమయము అయిపోయింది, ఇంక నేను తిరిగి వెళ్ళ తల్చుకొన్నాను అని, అందరికీ చెప్పి ఆఖరున కుంతీ దగ్గరకు వెళ్ళారు. కుంతీ తో కూడా ద్వారక తిరిగి వెళ్తున్నాను అనగా, కుంతి ఎంతో దుఃఖముతో –కృష్ణా! మాకు ఎప్పుడేప్పుడైతే కష్టాలు వచ్చాయో, నువ్వు మాతోటే ఉన్నావు. ఈ రోజు సుఖ సమయము వచ్చింది ఇలాంటప్పుడు నువ్వు వెళ్లి పోతానని అంటున్నావు. దీనికన్నా దు:ఖమే బాగుండేది. నువ్వు మాకు కష్టాలే పెట్టు, దేనివలనైతే మనము కలిసి ఉండడము సంభవము అవుతుందో .
నిజమాలోచిస్తే, దు:ఖమే మనకి పరమాత్ముడి సాన్నిధ్యం కలిగిస్తుంది. ఎవరి వివేకమైతే మేలుకుంటుందో వారు అజ్ఞానాన్ని దాటి ముందుకి వెళ్లి పోతారు. దు:ఖమే పరమాత్ముడి సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది అన్న మాట వారే అర్థము చేసుకో కలుగుతారు. ఇందుకే భక్త జనులు దు:ఖమే కోరారు, ఎందుకంటే వారికి తెలుసు, దు:ఖము లోనూ సుఖము లోనూ చాలా తేడా లేదు. మనము సముద్రపు ఒడ్డున నిలబడినప్పుడు గమనించేది ఏమిటంటే పెద్ద-పెద్దవి మరియు ఎత్తు-ఎత్తు కెరటాలు వస్తున్నాయి, మనము అంటాము, సముద్రము చాలా అశాన్తముగా ఉంది. సముద్రము లో లోతుకి వెళ్లి చూస్తె అక్కడ ఏ కెరటాలూ లేవు, ఏ అలజడి లేదు. పూర్ణ శాంతి. ఇలాగే జీవితములో సుఖ దుఃఖాలు, సముద్రము యొక్క కెరటాల లాంటివే .
ఇంద్రియాలకు ఏదైతే బాగుండదో అది దుఃఖము, మరియు సుఖము ఏదైతే ఇంద్రియాలకు బాగుంటుందో. ఈ విధముగా సుఖ దుఃఖాలు ఇంద్రియాలవరకే చేరగలవు, ఇంతకు ముందుకి కాదు. ఎలాగైతే సముద్రపు కెరటాలు పై పైనే ఉంటాయి లోతుకి వెళ్తే ఉండవు. ఈ విధముగానే సుఖ దు:ఖాలు మన ఇంద్రియాలకే వస్తూ ఉంటాయి. వాస్తవము లో వీటికి అంత ఎక్కువ మహత్యం లేదు . ఈ విధముగానే ఎవరైతే హృదయ గుహ లోకి దిగుతారో వారు చూసేది ఏమిటంటే అక్కడ ఏ సుఖ దుఃఖాలూ లేవు. అచ్చట సపూర్ణ శాంతి ఉంది .
మీరు సిక్ఖ్ గురువుల జీ వన చరిత్ర చదివేరు. వారికి విపరీతమైన కష్టాలు పెట్టబడ్డాయి. కానీ వారు ఆ కష్టాలకు విచలితము అవ లేదు. వారిని అడగబడినది, మీకు ఇన్ని కష్టాలు ప్పెట్టినా మీరు విచలితమవడం లేదే, మీ ముఖము ఎంత సహజముగా ఉందొ? వారు అన్నారు -- మీరు కష్ట పెడుతూన్నది నా శరీరాన్ని, కానీ నేను ఇప్పుడు ఆత్మ లో నివసిస్తున్నాను. నేను ఇప్పుడు ఆ ఆత్మా లో కూర్చున్నాను, ఎక్కడకైతే ఏ దుఖమూ చేర లేదు. వాస్తవములో మేము ఏదైతే కనిపిస్తున్నామో అది కాదు. శాస్త్రాలు మన మూడు శరీరాలగురించి వ్రాసాయి. స్థూల, సూక్ష్మ మరియు కారణ. స్థూల శరీరము ద్వారా మనము సుఖ దు:ఖాల అనుభవము అలాగే చేస్తాము ఎలాగైతే మనము సముద్రపు కేరటాలను చూస్తామో. కె రటాలు వస్తూ వెళ్తూ ఉంటాయి, కానీ మనము సముద్రములో కొంచెం కిందకి దిగితే అక్కడ ఇంత భయంకరమైన రూపము లేదు. కొంత శాంతి ఉంది. ఈ ప్రకారముగానే స్థూలములో మనము సుఖ దు:ఖాల అనుభవము చేస్తాము. కానీ ఇంకొంచం కిందకి దిగితే ఏమి చూస్తామంటే ఇచ్చట ఇంకా శాంతి ఉంది మరియు ఇంకా లోతుకి వెళ్ళిపోతే అక్కడ సంపూర్ణమైన శాంతి ఉంది.
ఇందువలనే సంత్ - –మహాత్ముల కథనము ఏమిటంటే, సుఖ దు:ఖాలను పట్టించుకో వద్దు. స్థూలము కన్నా ముందుకి నడవండి, సూక్ష్మము మరియు కారణము లోకి వెళ్లండి. ఆ తల్లి ఒళ్ళో కి వెళ్ళండి. చిన్నపిల్లాడు తల్లీ ఒళ్ళో కూర్చుని ఎంత ఆనందాన్ని పొందుతాడో ఎప్పుడైనా గమనించేరా? ఇలాగే ఎప్పుడైతే మీరు కూడా ఇంకా లోతుకి వెళ్తారో అప్పుడు సుఖ దు:ఖాలు ఉండవు ఇది సంపూర్ణ శాంతి స్థితి. ఇక్కడనే మీరు మీ వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ స్థితిలోనే ఈ ఈశ్వర రూపమైన జీవుడు, చైతన్యుడు, ఏ మాలిన్యమూ లేనివాడు, సహజమైన సుఖాల యొక్క రాశి అని అనుభవించ కలుగుతాడు. ఇందువలన లోతుకి దిగే అవసరము ఉన్నది.
గురు మహారాజ్ గారు దీని కొరకు ఒక ఎలాంటి సాధన పద్ధతి యొక్క ప్రతిపాదన చేసేరంటే ఏ విధముగా మనము ఆ లోతైన అవస్థకు చేరగలమో, దేనిని పొందగానే స్థూలము లో ఉండే సుఖ దు:ఖాలు అన్నీ మాయమయిపోతాయి. ఎలాగైతే లోతైన సముద్రము లోకి దిగాలంటే మంచి అనుభవము ఉన్న మనిషి యొక్క అవసరము ఉంటుందో అలాగే ఆత్మ యొక్క గహనమైన స్థితి కి చేరాలంటే మనకి ఏ సంత్ మహాత్మ యొక్క సహాయము కావలసే ఉంటుంది, ఆ సంత్ మహాత్ముడే మీకు ఆ అవస్థను బోధిస్తారు. గురువు లేక సంత్ మహాత్ముల సహాయము లేకుండా ఆ గహనమైన స్థితి కి మీరు మీ అంతట చేర లేరు, ఎందుకంటే ఆ గహనమైన స్థితి కి చేరే ముందు మనస్సు, బుద్ధి మరియు అహం, యొక్క భయంకరమైన క్షేత్రాలు పడతాయి, వేటినైతే మనంతట మనము దాటడము అసాధ్యము. ఎప్పుడైతే మనము మనని గురువుకి అప్ప చెప్పేస్తామో అప్పుడు గురువు మన మీద కృప చేసి సహజమైన స్థితిలోకి వెంటనే తీసుకోచ్చేస్తారు.
ఈ విశ్వములో మీరు ఏమి చూస్తారంటే నిర్జీవమైన రాళ్ళ తో కళాకారుడు మూర్తి తయారు చేస్తాడు. ఆ మూర్తికారుడు
ఆ నిర్జీవమైన రాతి ని పుచ్చుకొని నెమ్మదిగా విగ్రహాన్ని తీర్చి దిద్దుతాడు. ఆ రాతి కి ఒకటే పని, అది ఏమిటంటే
తనను తామే ఆ కళాకారుడికి అప్పచేప్పేయ్యాలి. ఆ రాయి తనని స్వయంగా విగ్రహము లోను మార్చెయ్య లేదు, ఆ రాయి ఏదైతే సందుల్లో పడి ఉండేదో, బహుమూల్యమైనది అయి పోయింది, ఇంకా ఆ రాతి విగ్రహమే మందిరాలలో స్థాపించ పడుతుంది, దాని పూజ అర్చన చెయ్యబడుతుంది. లెక్ఖ లేనన్ని భక్తులు ఆ రాతి విగ్రహము యొక్క దర్శనము చేసుకుంటారు. రాతి యొక్క సమర్పణ ప్రభావమే కదా! దానిని ఈ స్థితిలోకి తీసుకు వచ్చింది. ఇదే పని మనకీ చెయ్యాలి, ఏ వీతరాగ పురుషుడుకో మనని అప్ప చెప్పెయ్యాలి .
శ్రీమద్ భగవద్ గీత లో శ్రీ కృష్ణ పరమాత్ముడు అంటారు –“మన్మనా భవ “. ఈ మంత్రము యొక్క తాత్పర్యము ఏమిటంటే జీవుడు తనని తామే ఈశ్వరుడికి అప్ప చెప్పెయ్యాలి. వస్త్రము మాసి పోతుంది, దానికి సబ్బు రాసి పెట్టేస్తాము, కానీ అది తనంతట తానే శుభ్ర పడలేదు, దానిని ఎవరో శుభ్రం చేస్తారు. ఈ విధముగానే మనము కనుక కోరుకుంటే మనము స్వయంగానే పవిత్రముగా అయిపొదాము, స్వయంగానే ఆ గహనమైన స్థానానికి చేరిపోదామంటే, అది అసంభవము. ఇలాగ అనబడినది కూడా –
బిన గురు భవనిధి తరై న కోయీ |
జో విరంచి ,శంకర సమ హోయీ||
మనిషి పెద్ద చదువు చదువుకొని విద్వాంసుడు అవగలడు కానీ ఎప్పటి దాకానైతే తనను తానే గురువుకి అప్పచ ప్పడో లేక సమర్పించేయ్యడో అప్పటి వరకూ తను ,తానంతటే అంతరాలలోకి దిగలేడు , వాస్తవములోను తను ఏమిటి అని తన గురించి తెలుసుకో లేక పోతాడు. అంటూనే ఉంటాడు అందరికీ చెప్తూనే ఉంటాడు కూడా,-- “ఈశ్వర అంశ జీవ అవినాశీ “
ఒక జ్ఞానము చదివేది, అది చదివేసేము, గంటల కొద్ది ఉపదేశిస్తూ ఉన్నాము కానీ జ్ఞానము దీని కన్నా వేరు, ఎక్కడైతే మనము వాటిని ప్రత్యక్షముగా చూస్తామో. కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి అస్తమానం ,విధ-విధాలా అర్థమైయ్యేలాగ చెప్తారు, వేదాంతము పద్ధతి గానూ చెప్తారు, అంటారూ నేనే దేవుడిని, ఇంత స్పష్టముగా చెప్పేవాడు ఏ మహాత్ముడూ ఉండడు. నన్ను నమ్ము నేనే పరమాత్ముడిని. శ్రద్ధ మరియు విశ్వాసమూ అంత సుళువైనవి కావు. నేనూ అంటాను విశ్వాసము తో కూడి సాధన చెయ్యండి అని, కానీ ఇలాంటి గట్టి నమ్మకము ఎక్కడ నుండి వస్తుంది? విశ్వాసము బజారులో అమ్ముడైయ్యే సరుకూ కాదు, ఇంక ఎక్కడ నుండీ దొరికే సరుకూ కాదు.
వాస్తవములో మన శ్రద్ధ మరియు విశ్వాసమూ ములిగిపోయాయి, అసలు మిగల లేదు. ఏ బంగారపు ఆభరణ అయినా మట్టిలో పడిపోతే మరియు ఏళ్ల తరబడి అక్కడే ఉండిపొతే, దాని నిండా మట్టి నిండి పోతుంది, చూస్తె తెలియే పడదు ఏమిటని. బంగారము ని తెలుసుకో గలిగిన మనిషి దాన్ని తీసి శుభ్రము చేసి ఏమి చూస్తా డంటే ఇది బంగారము అని. అచ్చు ఇలాగే శ్రద్ధ మరియు విశ్వాసమూ చీకటిలో పడి ఉన్నాయి. ఎప్పుడైతే మనము మనని ఎవరికైనా అప్ప చెప్పేస్తామో, అప్పుడు నెమ్మదిగా శ్రద్ధ మరియు విశ్వాసమూ మన అంతరాలలో పుట్టిన్చేస్తారు. తాత్పర్యము ఏమిటంటే మనలో ఇమిడిపోయిన అశ్రద్ధ అవిశ్వాసము, గ్లాని వీటి అన్నింటిని దూరము చేసేస్తారు, అప్పుడు శ్రద్ధ విశ్వాసమూ, ఉద్భవిన్చేస్తాయి. ఆ అర్జనుడే ఎవరైతే అస్తమానూ కృశ్నుడుని ప్రశ్నలు వేస్తాడో, భగవంతుడు ఎప్పుడైతే వాడి అశ్రద్ధ అవిశ్వాసమూ తోలిగించేస్తారో అప్పుడు, తనే అంటాడు –ఓ మహారాజ! నేను చాలా పెద్ద తప్పు చేసాను, నన్ను క్షమించండి, మీరు నిజముగానే పరమాత్ముడు, నేను తెలుసుకోలేక పోయాను. నా కళ్ళు మిమ్మల్ని పోలిక పట్ట లేక పోయాయి. ఇందుకే క్షమార్పణ వేడుకుంటాడు, మహారాజా! నేను మిమ్మల్ని సఖ అన్నాను, యాదవ్ అన్నాను, సారథి అన్నాను, కృష్ణ అన్నాను. ఇలాగే ఆ గురువు ఎవరైతే మన అంతరాలలో శ్రద్ధ మరియు విశ్వాసము ఉద్భవిస్తున్నారో వాస్తవములో పరమాత్ములే, మనిషి కాదు. గురువు మనపై ఎప్పుడైతే కృప చేస్తాడో అప్పుడు తన శక్తి ద్వారా మన అంతరాలలో ఉన్న అవిశ్వాసాన్ని కడిగేస్తాడు మరియు మన అంతరాలలో శ్రద్ధ, విశ్వాసము యొక్క దీపాన్ని ప్రజ్వలింప చేస్తాడు ఆ దీపములో శ్రద్ధ, విశ్వాసమూ ప్రకటిస్తాయి, ఈ ప్రకాశములో మనము ఏమి చూస్తామంటే గురువే పరమాత్ముడు. పరమాత్ముని భక్తీ యవరైనా చెయ్య గలరు కానీ, గురు భక్తీ చెయ్యడము అతి కష్టము.
పరమాత్ముడు నిర్గుణుడూ మరియు నిరాకారుడూ. సగుణుడి భక్తీ పరమాత్ముని రూపములో చెయ్యడము అసంభవము. ఇది అప్పుడే సంభవము ఎప్పుడైతే గురు కృప చేస్తారో. గురువు ఎప్పుడైతే మన అంతరాలలో ఉన్న మాలిన్యాన్ని కడిగేస్తారో లేక దూరము చేసేస్తారో అప్పుడు, మన అంతరాలలో ప్రేమ మేలుకుంటుంది మరియు ఈ ప్రేమ యొక్క ప్రకాశము లోను మనము ఏమి చూస్తామంటే వాస్తవములో నేను యవరినైతే చూస్తున్నానో పరమాత్ముడే.
ఇలాగ చెప్పబడినది కూడా
గురుర్బరహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:
గురువు మొదటి దృష్టిలోనైతే మనకి మనిషే అనిపించేరు ఎలాగైతే కాకభుశుండి యొక్క వృత్తాంతములో ఉందొ, అది అందరికీ తెలుసున్నదే, కాకభుశుండి చెప్పేరు ---నేను ఉజ్జయిని వెళ్ళిపో యాను. అచ్చట ఒక బ్రాహ్మణుడి దగ్గర శివ మంత్ర దీక్ష పుచ్చుకు న్నాను. ఆయననే గురువు అని భావించాను. కానీ ఆయన మాత్రము పేరుకే గురువు, నాకు ఆయన పై శ్రద్ధ కాదు, విశ్వాసమూ ఉండేది కాదు, ఆయన మీద ప్రేమ కూడా ఉండేది కాదు, కపటమే ఉండేది, గురువు అనేవాడిని కానీ అంతరాలలో వారి కోసము శ్రద్ధ మరియు విశ్వాసము ఉండేది కాదు. నేను కొంచము కూడా ఆయనకు గౌరవము ఇచ్చేవాడిని కాదు. కానీ గురువు అంటేనే కృపా దృష్టి కలిగించేవారు. వారు చెప్పారు –ఒకసారి నేను మందిరము లో శివుడు యొక్క జపము చేసుకొంటూ ఉండేవాడిని. అప్పుడే గురువు వచ్చేరు. నాకు ఏమి తెలియదు, నేను వారిని ఒక సాధారణమైన మనిషి అనుకొనేవాడిని. నేనైతే శివుడు యొక్క ఆరాధన చేస్తున్నాను, గురువు అయితే సాధారణమైన పురుషుడు. వారిని గౌరవించడానికి నేను లేచి నుంచోవనేనా లేదు, స్వయంగా ఒక సంత్ మహాత్ముడు. విద్వాంసుడు, మరియు చాలా జాలిగుండెగలవారు దీనిని పట్టించుకొనే లేదు కానీ, శివుడు ఈ సంఘటనని సహించ లేక పోయారు. వెంటనే శపించేసేరు –ఓ దుష్టుడా! నీవు గురువుని గౌరవించడానికి లేచి నిలబడనైనా లేదా? కొండచిలువ లాగ కూర్చునే ఉన్నవా? పో! వెయ్యి జన్మల వరకు కొండచిలువ అయ్యి కూర్చుని ఉండు, ఇలాంటి భయంకరమైన శాపము విని ఒక భయానకమైన శబ్దము వినిపించింది. ఆ శబ్దము, మా గురువుగారు కూడా విన్నారు. వారికి చాలా బాధగా అనిపించింది. వారు వెంటనే శివున్ని స్తుతి చేసారు అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. శివుడు ప్రసన్నమై అన్నారు ఒక వరము కోరుకో. అప్పుడు నా ఆ గురువు, ఎవరిపైన అయితే నా హృదయము లో విశ్వాసము, నమ్మకము ఉండేదికాదో. కపటమే ఉండేదో వారు, నా కొరకు వరము కోరుకున్నారు. ఓ భగవంతుడా! వీడికి బుద్ధి లేదు, ఏమి తెలియదు, మీరు వీడిని క్షమించండి అని, పరమాత్ముడు ఆ గురువు మూలాన్నే నన్ను క్షమించేరు, శివుని శాపము నా కొరకు వరములోకి మారినది. ఆయన అన్నారు నేను ఇప్పుడు ఏ స్థితి కి చేరేనంటే నాకు పూర్ణ జ్ఞానము ఉన్నది. నా దగ్గ రకు శంకరుడు మరియు గరుడ లాంటి వాళ్ళు వచ్చారు. నేను ఎప్పటికీ నషింప బడను. సృష్టి యొక్క ఆది నుండి అంతము వరకు నేను ఉంటాను. ఈ రోజు కూడా నా హృదయము అంటుంది, గురువు ఎంత కృప చేసేవారో కదా! నా హృదయములోను ఒక ముల్లు లాగ గుచ్చుకుంటూ ఉంటుంది, నిజంగా నేను ఎలాంటి వాడిని ఉండేవాడిని, వారు ఎలాంటి వారు ఉండే వారు. ఇందువలనే గురువుని గౌరవించేవారి ని ఇప్పటి దాకా ఎవరినీ చూడ లేదు. ఎవరైతే పూజ్య పండితజీ మహారాజ్ యొక్క దర్శనము చేసారో వారిని చూసే ఉంటారు, వారు గురుభక్తీ యొక్క ఒక ఉదాహరణగా ఉండేవారు. వారి గురించి అసలు చెప్పెఅవసరమె లేదు. వారు ఒకటే మాట అనేవారు నేను ఒక రాతి లాగ పడి ఉండే వాడిని. ఎందుకూ పనికి రాని వాడిని. ఎవరిదో దృష్టి నాపై పడింది, వారు నన్ను తీసి ఒక మూర్తిగా తయారుచేసారు. ఈ రోజు ఈ పేరు- ప్రతిష్ట నాది కాదు, ఆ కళాకారుడిది. గురు భక్తురాలు సహజో బాయి ఇలా వ్రాసారు---
రామ తజూన్ పర గురు న బిసారూన్
గురు కే సమ హరి కో న నిహారూన్
రాముడుని వదలగలను కానీ , గురువుని మరవలేను,
గురుతో సమానముగా రాముడిని చూడను.
వాస్తవములో గురువు ఎప్పుడైతే దయ చేస్తారో అప్పుడు వారు చూపిస్తారు, వారు ఎవరో ? ఎక్కడైతే అంధకారము దూరమైపోతుందో, మరియు మనకి అంతర్ద్రుష్టి లాంటి కృప కలిగినప్పుడే మనము వీరు పరమాత్ములే అని చూడగలిగే స్థితికి, గురువు మనని తీసుకువెళతారు. ఇందువలనే గురువు గురించి ఎంత వర్ణించినా ఎంత వ్రాసినా గురువు యొక్క ఋణము తీర్చుకో లేము. ఎలాగైతే ఒక సాధారణ పిల్లాడు, వాడికి ఏమీ తెలియదు, కానీ ఒక అధ్యాపకుడి సంపర్కము లోకి వచ్చి మరియు చదువుకొని, డాక్టరు మరియు ఇంజినియర్ అవుతాడు. ఇలాగే ఈ గురువు గురించి ఏమి అనగలము? ఎవరైతే మనిషిని పరమాత్ముడే చేసేస్తారో, లేకపొతే మనిషి జన్మ –జన్మాంతరాల బట్టి ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. పూజ్య పండిత్ జీ మహారాజ్ ఎప్పుడైతే గురు మహిమ గురించి మాట్లాడేవారో అప్పుడు అస్తమానం అనేవారు --
జాన్ దీ తో క్యా దీ , దీ హుఇ ఉసీ కి థీ
హక్ తో యహ హై కి, హక్ అదా న హు ఆ
ప్రాణాలు ఇస్తే మాత్రం ఏమిటి , ఇవ్వబడినది మీ వలనే
మీ హక్కునాపై ఎంత ఎక్కువ ఉందంటే, దానిని నేను ఎలాగ తీర్చుకోగలను?
ఇందువలనే ఇదే ప్రార్థన-- మావి అయితే, అవే సాంసారిక కళ్ళు . మీరు వచ్చారు, మీతో ఉన్నాము, మీతో కూర్చున్నాము, ఆడుకున్నాము, కానీ మిమ్మల్ని తెలుసుకో లేక పోయాము. మీరు మమ్మల్ని మీ శరణములో ఉంచుకొనే కృప చేయ్యండి.
ఆ సంగీతమే మా చెవులతో విన్నాము, మీరు ఎవరి అవగుణా లూ చూడరు. ఎంత మంది పాపిష్టిలు, కుపాత్రులు మీ దర్బారుకి వచ్చారో. ఏ యోగ్యుడూ రా లేదు, కానీ మీరు ఎవరి అవగుణాలనూ చూడ లేదు. అందరినీ దగ్గరకి తీసుకున్నారు. అందరినీ ఏ స్థితి నుండి ఏ స్థితి కి తీసుకు వెళ్ళారో. ఇందుకే మీ ఈ ఖ్యాతి విని మేమందరమూ మీ దర్బారులో వచ్చి కూర్చున్నాము. మా స్థితి మీకు తెలుసును కానీ మా ప్రార్థన ఇదే మీరు మమ్మల్ని స్వీకరించండి. . మీరు దాత! మరియు ఇలాంటి-అలాంటి రకమైన దాత కూడా కాదు, ఎక్కడైతే ఎదో యాభై –నూరు రూపాయలు ఇచ్చే దరబార్ మీది కాదు. దాత ఎవరంటే, ఎవరైతే అడుక్కునే వారిని దాత చేసేస్తారో మీ ముందర. కొంగు చాచి అర్థిస్తున్నాను, మీ దయ దృష్టి మా పై చూపి, మమ్మల్ని అందరినీ స్వీకరించండి. ఎలాగైనా ఏ భావముతో వచ్చి కూర్చున్నా, ఎదో తమాషా కొరకు వచ్చినా, మేము మాత్రం ఇక్కడకి వచ్చేశాము, ఏ భావముతోనైనా, మిమ్మల్ని విమర్శించడానికైనా కానీ మీరు కృప చెయ్యండి. మా అందరిపై దయ చెయ్యండి, మీరు దయ- సాగరులు, మీరు మా అందరి పై దయ చేసి మమ్మల్ని స్వీకరించండి.
మేఘాలు కురుస్తాయి అవి భూమి ఎలాంటిది? అని చూడవు కదా ! ఎలాంటి భూమైనా, అవైతే అందరిపైన ఒకలాగే కురుస్తాయి. ఇక్కడ మనమందరమూ కూర్చున్నాము. వాన కురిసినప్పుడు కొందరు రైన్ కోటు, కొందరు గొడుగులు పెట్టేసుకుంటారు, వానలో కూడా తడవకుండా ఉండి పోతారు. కానీ మీతో ప్రార్థన ఏమిటంటే మీరు ఆలోచనల గొడుగులు మాత్రం పెట్టుకోకండి. మీరు మిమ్మల్ని ఆనంద రూపమైన వర్షములో తడవనివ్వండి ఏ ఆలోచనలూ లేకుండా విముక్తంగా ఉండండి .
******