Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

واپس

SAMARPAN

సమర్పణము

SAMARPAN
రచయిత:
పరం భాగవత
పరం సంత్ పండిత శ్రీ మిహి లాలజీ

రామాశ్రం సత్సంగ్
మథుర

<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/04/pp_panditji_1945-1.jpg" alt="" width="100" height="136" class="alignnone size-full wp-image-58350" />

సమర్పణము
జ్వాలా మరియు జ్వాలాదేవి
ఈ సంసారములో ఉన్న ప్రాణుల యొక్క యోని ఏదైనా , ఆకారము ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, అణు లేక పరమాణు లాగ ఉన్నా, ఎంత అందముగా ఉన్నా మరియు ఎంత జ్ఞానము ఉన్నా లేక ఎంత అజ్ఞాని అయినా, అది మాత్రం మహా ప్రభు యొక్క మందిరమే. ఆ పరమేశ్వరుడే అందరిలోనూ నివసిస్తున్నాడు. ఈ ప్రపంచములో, ఏ శరీరమూ పరమేశ్వరుడు నివసిన్చనది లేదు . అంతే కాదు , వనస్పతులూ, చెట్లూ, పర్వతాలూ, సరితలూ, చలాచలమైన ప్రతి దాంట్లోనూ నివసిస్తున్నాడు. ఒక సూది మోపే అంత లేక ఒక బిందు పెట్టే అంత స్థానము కూడా ఖాళీగా లేదు. అంతటా ఆ పరమేశ్వరుడు ఉన్నాడు , అందుకే విశ్వము లేక బ్రహ్మాండము యొక్క అధిపతి లేక మహారాజు ఆ ప్రభువే. మీరు ఆకాశములోను కోట్ల మైళ్ళు ఎగిరి వెళ్లండి , పృథ్వీ లోపలకి వేల మైళ్లు కిందకి వెళ్లి పోండి తనే దొరుకుతారు , మరియు ఇంక ఎంతవరకూ చెప్పను , మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూసినా, ఎవరి సంపర్కంలోకి వచ్చినా, అంతటా ప్రతిచోటా తనే ఉన్నాడు.
ఒక వెలుగుతూ ఉన్న అగ్నిగుండము దగ్గరకి వెళ్లండి , మీరు ఏమిచూస్తారంటే అందులో కర్ర మరియు బొగ్గులూ వెలుగుతున్నాయి . చాలా తీవ్రమైన మంటలు వస్తున్నాయి, కానీ మీరు ఎక్కడైతే నిలుచున్నారో అక్కడ ఆ వేడి లేదు , మనుషులు ఏమనుకున్టారంటే, ఎక్కడైతే ఆ కర్ర కాలుతోందో , అక్కడే అగ్ని ఉంది, మా దగ్గర లేదని. కానీ జ్ఞానవంతులకు తెలుసు మేము ఎక్కడ నిలుచున్నామో అక్కడా అగ్ని ఉన్నది, కానీ మేము ఎందుకు కాలడము లేదంటే ,మా శరీరములో కూడా ఆ అగ్ని ఉంది , ఈ మాత్రము వేడి మేము సహించగలము మరొక పద్దతిగా చెప్తే దాని వలనే మేము బతుకుతున్నాము. బైట ఉన్న ఆ అగ్ని ఒక విశేష రూపములో ప్రకటింపబడింది , మనకి ఎంత వేడీ–చలవ మనము ఇష్టపడతామో అది మనకి ఎలాగా కావాలి . ఎప్పుడైతే ఇది హెచ్చు – తగ్గులు అవుతుందో అప్పుడు అది మనకి అనుభవమౌతుంది. ఇందువలనే ఇది రెండు రూపాలుగా విభజింపబడింది ఒకటి వ్యాపించినది , రెండవది వ్యాపిమ్పబడినది . కర్రలో ,బొగ్గులో మరియు మనలోనూ ఉన్న అగ్ని సమానమైనదే, కానీ అది మనల్ని కాల్చదు. మరియు జీవితము ఇస్తుంది, రెండవది ఎప్పుడైతే అది ప్రకటమోతుందో , అప్పుడు అది కనిపిస్తుంది, అప్పుడు మీరంటారు , అగ్నిని చూస్తున్నాము అని. వాస్తవములో మీరు అగ్నిని చూడడము లేదు, మీరు దాని మిశ్రితమైన రూపాన్ని చూస్తున్నారు. దీపము యొక్క జ్యోతి, కర్ర యొక్క అగ్ని,లేక బల్బు యొక్క జ్యోతి, ఇవన్నీ ఒక స్థూలము లోకి వచ్చి స్థూల రూపాన్ని ధరించాయి . జ్వాల ఒకటైతే జ్వాలా దేవి మరొకటి. జ్వాలా దేవి (అగ్ని) ఒక శక్తి , జ్వాల దాని స్థూల రూపము , అందుకే ఆ పరమాత్ముడిని మనము స్థూల రూపములో చూడలేము . కానీ వ్యాపక రూపములో ఉన్నప్పుడు కొంత అనుభవం అవుతుంది . ఇప్పటి దాకా ఆ శక్తి స్వరూపులైన భగవంతుని దర్శనము ఎవరికీ లభించలేదు , అదైతే అనుభవాతీతమైనది.
ఎవరు తెలియచేస్తారు
పెద్ద-పెద్ద యోగులు, ఆ పరమాత్ముడిని ధ్యానములో చూసే ప్రయత్నము చేసారు , మహాజ్ఞానులు , జ్ఞానము ద్వారా తెలుసుకొనే ప్రయత్నము చేసారు కానీ పూర్తిగా తెలుసుకోలేక పోయారు ఇది ఎలాగుందంటే ఒక ఉప్పు తో తైయ్యారు చేసిన బొమ్మ సముద్రము యొక్క లోతు తెలుసుకోడానికి బైల్దేరితే ఎమవ్వాలి? కొంత దూరము వెళ్లి అందులోనే విలీనమైపోతుంది , మరియు అది ఎంత లోతు ఉందొ ఎవరు చెప్తారు? మనిషిది కూడా ఇదే స్థితి , కొంత దూరము వరకు బుద్ధి కూడా ఉంటుంది కానీ కొంత దూరము వెళ్ళేక అది కూడా తోడు వదిలేస్తుంది . దీని తరువాత కొంత దూరము వరకూ అహం కూడా తోడు ఉంటుంది , తరువాత అదికూడా వేరవడము మొదలు పెడుతుంది మరియు మన ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఇంతే, ఈ మనస్సు, బుద్ధి మరియు అహం ఎప్పటివరకైతే ఈ జీవుడుతో ఉంటాయో , జీవుడు అప్పటిదాకా ఒక బంధం లో ఉంటాడు మరియ ఆత్మ యొక్క ఆనందాన్ని ఏ పరిస్థితిలోనూ పొందలేకపోతాడు .
గుణమే ఆవరణము
జీవికి ఈ అన్ని గుణాలనీ విడిచి పెట్టెయ్యడం చాలా కష్టతరమైన పని . ఈ జీవి శరీరముతో ఎంతగా మమైకం అయి ఉన్నాడంటే దీనితో మమత్వం విడవడం చాలా కష్టం .ఆ పైన మనస్సు బుద్ధి మరియు అహంకారం ఆ జీవిని ఎట్టి పరిస్థితిల్లోనూ విడిచిపెట్టవు. వాస్తవం మాట్లాడితే జీవి పైన చెప్పబడిన వేటినీ విడిచి పెట్టడు . ఆ జీవి వీటిలో ఎంతగా మమైకం అయిపోయి ఉంది అంటే ఒక క్షణము కూడా అవి లేకుండా ఉండలేడు. ఈ జీవి ఎన్ని ఆవరణాలతో కప్పబడి ఉన్నాడో లెక్కలేదు . ఒక ధనవంతుడిని నువ్వు ధనహీనుడివి అంటే వాడికి ఎంత కోపమొస్తుంది? ఒక విద్వాంసుడిని మూర్ఖుడు అంటే ఏమిటి పరిస్థితి? ఒక బ్రాహ్మడుని నీచుడు అంటే క్రోధాగ్ని తో మండి పోతాడు, ఒక నిండు పరివారంగలవాడిని సంతానహీనుడన్నా, లేక బలవంతుడుని బలహీనుడన్నా , ఎంతగా కోప్పడతాడు ? కారణము ఏమిటంటే జీవి వీటినే తన స్వంత గుణం అనుకుంటాడు. ఈ కారణముగా వాడు ధనవంతుడు , పుత్రవంతుడు , విద్వాంసుడు, గుణవంతుడు మరియు జ్ఞానవంతుడుగా గుర్తింపబడతాడు. కానీ దేనిని వాడు గుణంగా గుర్తిస్తున్నాడో , అదే వాడి పైన ఆవరణం అయి ఉంది . సంత జనులు లేక సద్గురువులు వీటితోనే కదా విముక్తి పొందాలని అనుకుంటారు.
సాధన ద్వారా గురువు శిష్యుడిని క్రమంగా ఒక జన్మలో లేక అనేక జన్మల్లో ఏ స్థితి కి తీసుకువస్తారంటే వాడికి ఇవన్నీ నేను కాదు , ఇవి నా స్వప్నాన్ని (ఆత్మా సాక్షాత్కారాన్ని పొందే కల )దాచి ఉంచే ఆవరణాలు మాత్రమే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నేను ఎదో విధంగా వీటితో ముక్తి పొందితే నేను నా నిజ స్వరూపాన్ని తెలుసుకోకలుగుతాను . అందువలనే శిష్యుడికి గురువు త్యాగం ఉపదేశిస్తాడు . తాత్పర్యము ఏమిటంటే నువ్వు ఏ ఒక్కటి గ్రహించినా ప్రతి ఒక్కటీ త్యజించు. ఒకవేళ ఇంకొకరి తోట నుండి మరొకరు ఎవరైనా తనని అడగకుండా ఒక్క ఆకు కోసినా , తన కి బాధగా ఉంటుంది. ఇలాంటి అంతులేని దు:ఖాలతో ప్రాణి దు:ఖపడి ఉన్నాడు తాత్పర్యం ఏమిటంటే ఏ వస్తువలపై మనకు మమకారము ఉందో అది శారీరికంగా లేక మానసికంగా కానీ అన్నీ కష్టదాయకమే . త్యాగము వలన అది ఎలాగైపోతుందంటే ఎలాగైతే ఆ తోట మీరు ఎవరికో అమ్మేశారు .ఇంక వాటి పళ్ళు యవరైనా కోసినా ఏ బాధా ఉండదు. ఎప్పటి వరకైతే గ్రహణము ఉందొ అంతవరకే మోహము , అజ్ఞానము ,అంధకారము , మరియు వీటిలోనే దుఃఖము.
మూడు రకాల సంబంధాలు
ఈ లోకములో మూడు రకములైన సంబంధాలు ఉన్నాయి . ఒకటి శారీరిక సంబంధము , యథా – తల్లీ –తండ్రీ, అన్నా –చెల్లీ , పుత్రులూ- పోత్రులూ ; రెండవది మానసిక సంబంధం యథా – మిత్రుడు –మిత్రుడు, మిత్రుడు –శత్రువు , స్వామీ- సేవకుడు, ధనము- ఐశ్వర్యము, మూడవది ఆత్మ సంబంధం, ఇది రెండింటి కన్నా పైది. ఇది శారీరిక సంబంధం కన్నా లోతైనది. ఎట్టి పరిస్థితి లోను ఇది తెగదు, ఈ సంబంధం ఆత్మకీ –ఆత్మకీ మధ్య ఉన్న సంబంధము . శారీరిక సంబంధాలు విడిపోవచ్చు , మానసిక సంబంధాలు కూడా విడిపోవచ్చు కానీ ఆత్మిక సంబంధం మాత్రం సత్యము, అచలము . అందువలనే ఆత్మ సంబంధీకులే నిజమైన లేక సత్యమైన సంబంధీకులు లేక సత్సంగీలు అనబడతారు . ఈ సంబంధం విడనే విడదు . గురు శిష్యుల మధ్య ఈ సంబంధమే ఉంటుంది. అందువలనే వీళ్ళ శరీరాలు వేరు వేరైనా ఆత్మా ఒకటిగానే ఉంటుంది. గురు శిష్యుల మధ్య ఈ విధమైన సంబంధము ఏర్పడినప్పుడు శిష్యుడు పై గురువు యొక్క సంపూర్ణమైన అధికారము ఉంటుంది మరియు శిష్యుడు కూడా గురువు యొక్క కష్టతరమైన ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉంటాడు.ఆ పరిస్థితి లో గురు శిష్యుడుని ఈ బంధాలనుండి విముక్తి కలిగించడానికి సిద్ధ పడిపోతాడు . గురువు శిష్యుడు కొరకు ఇంతగా సిద్ధ పడ్డా కానీ జీవుడు ఈ మిథ్యా ఆవరనాలనూ మరియు దోశాలనూ విడిచిపెట్టడం ఇష్టపడడు.”ఇది నాది .ఎలాగ విడిచిపెట్టను? ఇది వాడిది నాకు ఏల? ఏదైతే నాకేల ? ”ఇది పరిశుద్ధమైన జ్ఞానం కాదు . యుధిష్ఠీరుడు కి ఈ విధమైనవే మూడు పరీక్షలు అయ్యాయి . ఆ పరీక్షల్లో ఆయన మనా- తానా విచక్షణ లేకుండా ధర్మాన్నే ఆచరిన్చేరు. నకులుడి జీవితాన్ని కోరుకోవడం , కుక్కని రథం పైన కూర్చో పెట్టి స్వర్గానికి తీసుగు వెళ్ళడం ,నరకం లోబాధ పడుతూన్న జీవుల బాధలు తీర్చడానికి స్వయంగా తనే నరకంలో నివసించడం , ఇవన్నీ స్వీకరించడం వలన ధర్మము అంటే ఆ భగవంతుడు ప్రసన్నుడు అయ్యాడు . సమర్పణము
ఎప్పుడైతే శిష్యుడు (జీవి)ఏ ప్రకారంగానూ ఈ మాయ యొక్క ఆవరణాలను తీసెయ్యడానికి ఇష్ట పడడో అప్పుడు , గురువు ప్రేమగా ఇలాగ ఉపదేశిస్తారు . సర్వగుహ్యతమం భూయ:శృణు మే పరమం వచ: |
ఇష్టోSసి మే దృఢ మితి తతో వక్ష్యామి తే హితం ||
ఓ అర్జునా ! విను—సంపూర్ణ గోపనీయాలలోనూ అతి గోపనీయమైన , పరమ రహస్యం తో కూడిన నా వచనాలను నువ్వు మళ్ళీ విను , ఎందుకంటే నువ్వు నా అతిశయ ప్రియుడివి కనుక ,ఇందుకే ఈ పరమ హితకరమైన వచనాలు నేను నీతో నీ కొరకు చెప్తాను. ఎప్పుడైతే శిష్యుడు గురువుకి తన హృదయం అప్పచేప్తాడో , అప్పుడు గురు యొక్క ఆత్మ వాడి దు:ఖము వలన అత్యంత దు:ఖపడి ఏమి కోరుతుందంటే, నేను తొందరగా వీడిని ఉద్ధరించేస్తాను . అప్పుడు తను అంటారు , నువ్వు ధర్మ –కర్మల యొక్క అన్ని ఆశ్రయాలనూ వదిలేసి నా శరణానికి వచ్చెయ్యి , ఈ ఉన్నవన్నిటల్నీనువ్వు త్యజించేయ్యి .కేవలం నన్ను నమ్ము మరియు నీవన్నీ నాకు అర్పించేయ్యి .
రెండు రకాలగా
ఈ సమర్పణ క్రియ రెండు విధాలగా అవుతుంది .మొదటిది ప్రకట లేక ప్రత్యక్ష రూపములో. కొన్ని సంప్రదాయాలలో ఎలాంటి రీతి ఉంది అంటే , గురు శిష్యుని ద్వారా తన అన్ని వస్తువులూ సమర్పణ చేయిన్చేసుకుంటాడు, ఎంతవరకూ అంటే తనని తాను గురు కి సమర్పించేసుకుంటాడు . ఒక విధముగా శిష్యుడు గురు చేతులో అమ్ముడైపోతాడు . ఈ పద్ధతిని ఇస్లాం సంప్రదాయంలో “బైత్ “అంటారు .రెండవ పద్ధతి ఇంతకన్నా శ్రేష్ఠమైనది . ఈ పద్ధతి లో గురు తన నోటితో ఏమీ అనడు , కానీ శిష్యుడు యొక్క ఆంతర్యం పదే –పడే అంటుంది –హే ప్రభో ఈ సర్వస్వమూ మీదే ,నాది ఏమీ లేదు . నేను సర్వస్వము అనుకునే నా శరీరము కూడా నీకే అర్పిస్తున్నాను .ఇంక నీవే శరణం , నీవే శరణం . అర్జునుడు ఈ విధముగానే కృష్ణుడుతో అన్నాడు.
శిష్యస్తేSహం శాధి మాం త్వాం ప్రపన్నం .
ఈ రెండు ప్రక్రియలూ చాలా ఆలోచించి చెయ్యవలసి ఉంటాయి . సంపూర్ణ అధ్యాత్మజ్ఞానము ఈ విధమైన సమర్పణం మీదే ఆధార పడి ఉంటుంది . ఏ క్షణమైతే సంపూర్ణ సమర్పణ అయిపోతుందో ఆ క్షణమే హృదయము వికార రహితమైపోతుంది మరియు ఆత్మజ్ఞానము యొక్క ప్రకాశము (వెలుగు) ప్రసరిస్తుంది. కానీ ఒక పద్ధతి లో గురు చేయిస్తాడు , రెండవ పద్ధతిలో శిష్యుడు హృదయం తో ప్రార్థించగా గురువు దానిని స్వీకరిస్తాడు .
సావధానము
చాలా మంది గురువులు శిష్యుడి మరొక మార్గానికి అవరోధించడానికి వాడికి చెప్పి సమర్పణం చేయిన్చేస్తారు .ప్రస్తుతం శిష్యుడుకి ఆ కోరిక లేదు కానీ గురు ఆజ్ఞా పాటించి సమర్పణం చేసేస్తాడు , దానిని వాడి హృదయం అంగీకరించ లేక పోతుంది . ఈ రకమైన సమర్పణములో, ముందు- ముందు గురువు కి ఇచ్చిన వచనాన్ని పూర్తిగా నిర్వహించ లేక పొవచ్చు, మరియు శిష్యుడు ఆ మార్గాన్ని తప్పుగా భావించి వాడి పూర్వ మార్గానికి తిరిగి వచ్చెయ్యచ్చు. నిజానికి ఒక వేళ శిష్యుడు మోసపోయి వాడి ఆత్మా దీనిని స్వీకరించక పొతే , అలాంటి సమర్పణ చెయ్య రాదు , ఒక వేళ ఏ విధముగానైనా చెయ్య బడితే దాన్ని త్యజించడంలో ఏ విధమైన హాని లేదు .
ధర్మము
ఒక వేళ మీ హృదయం స్వీకరించింది , మీరు గురు చెప్పకుండానే మీ సర్వస్వం ఆయన కి సమర్పించుకున్నారు అంటే దాన్ని పూర్తిగా నిర్వహించే ప్రయత్నం చెయ్యండి . సర్వస్వం సమర్పించేసుకు న్నాక మీ మీద మీకు ఏ అధికారమూ ఉండదు . అలాగైనా నువ్వు ఏ వస్తువు మీదైనా నీ అధికారం ఉంది అని అనుకుంటే అది సమర్పణమే కాదు . గురుమహరాజ్ గారు మొదటి పద్ధతిని త్యజించేసేరు .
సమర్పణము లో ఒక స్థితి వస్తుంది , ఎందులోనైతే శిష్యుడు తనని అంత:కరణము తో గురు కి సమర్పించుకుంటాడు . ఒక వేళ శిష్యుడు అలాగ చేసినట్లయితే ఇంక ఏమి కావాలి ? ప్రతిఒక్క వస్తువు గురు మహారాజ్ గారిదే , ఈవేళే తీసుకోండి లేక రేపు. ఇంక ఇందులో బాధ పడే విషయమే లేదు . ఒక వేళ ఆ వస్తువు ఇచ్చినప్పుడు బాధ కలుగుతే సమర్పణము ఇంకా అవలేదు అన్నమాట. ధనము, వైభవము , పుత్రుడు ,భార్య ,శరీరము , విద్య ఏదైనా అన్నీ గురూవే , ఆయన ఇష్టం ఏప్పుడైనా తీసేసుకోవచ్చు . ఒక వేళ మనం బాధ పడితే ఆ వస్తువ మీద మనకి ఉన్న మమత్వం అనమాట , అది చాలా పెద్ద పాపం. సమర్పణం చేసుకున్నవాడికి సంసారం మీద మొహం ఉండకూడదు , తనలో ఒక రకమైన తేలికపాటుతనం ఉండాలి ,అంత :కరణం ప్రసన్నంగా ఉండాలి మరియు హర్షం ఉండాలి –నేను నా పని పూర్తీ చేసుకున్నాను అని .
చెప్పేరు కదా అని కాదు
అందువలనే మొదట నువ్వు ఎవరో చెప్పేరు కదా అని నిన్ను సమర్పించుకోవద్దు . ఆ పైన ఎప్పుడు స్వయంగా నీ అంత:కరణం చెప్తే అది నీ స్వంత ఆలోచన అనుకో వద్దు . దీని వలన ఒక కొత్త పాపం కట్టుకున్నవాడివి అవుతావు . ఎవరైతే గురు కి కాకుండా ఈశ్వరుడికి అర్పించుకున్నారో వారికీ ఇదే నియమం, ప్రతి ఒక్క వస్తువ భగవంతుడిదే అని భావించాలి,అలా చేసినతో అన్ని ఆవరణాలూ తొలిగిపోతాయి , మనిషి తన నిజ స్వరూపాన్ని (ఆత్మని) పొందుతాడు.
ఓం శం