అధ్యాత్మము మరియు వ్యవహారము
రచయిత – పం. మిహీలాల్ జీ
రామాశ్రం సత్సంగ్ , మథురా
<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/04/pp_panditji_1945-1.jpg" alt="" width="100" height="136" class="alignnone size-full wp-image-58350" />
ఆధ్యాత్మము మరియు వ్యవహారము
ఆధ్యాత్మము ఒక విద్య, ఒక జ్ఞానము, ఏదైతే ఈ భౌతిక జ్ఞానము కన్నా పైది. మరొక పద్ధతిగా చెప్తే ఇది భౌతిక జ్ఞానాన్ని పరిశుభ్రం చేసే ఒక విశేషమైన ప్రక్రియ. ఉదాహరణకు ఒక మనిషి మనస్సు లో ఒక భావన ఉద్భవించింది, ఫలానా సరుకు చాలా బాగుంది, అది ఎలాగైనా నాకు దొరికిపోవాలి అని, కానీ ఆ సరుకు మరొకరిది, దానిపైన నా అధికారము లేదు అది నాకు ఎలాగ దొరుకుతుంది? మనస్సు అంటుంది దొంగిలిస్తేనో, మోసం చేస్తేనో? అని, కాని మళ్ళీ మరొక ఆలోచన ఏమి వస్తుందంటే, దొంగతనము చేస్తూ పట్టు పడితే కనుక పేరు పాడైపోతుంది, శిక్ష పడుతుంది ఈ భయము మూలాన ఆగి పోతాడు. మరియు రెండవ ఆలోచన కూడా అంతరాలలో వస్తుంది, నేను మరోకరి సరుకు, దొంగతనము చేస్తే ఆ మనిషికి చాలా బాధగా అనిపిస్తుంది, అతని ఆత్మ కి కష్టము కలుగుతుంది, అది నాకూ మరియు నా ఆత్మకు కూడా కష్టాన్ని కల్గిస్తుంది. ఆత్మ ఒకటే, అందుకు అది పాపము. పాపము చెయ్యడము అధర్మము, ఇందువలనే శాస్త్రం ఏమంటుందంటే, ధర్మాన్ని పాటించు, సుఖం పొందుతావు, మరొకరికి కూడా శాంతి కలుగుతుంది, సమాజం యొక్క వ్యవస్థ కూడా సరిగ్గా ఉంటుంది, వ్యవహారమూ బాగా కుదురుతుంది, ఇది ఆత్మ జ్ఞానము .
అదీ జ్ఞానమే, వస్తువు దొరకాలనేది, దొంగలించైనా, మరియు అదీ జ్ఞానమే, వస్తువు దొరకాలి కానీ మరొకరిని కష్టపెట్టి కాదు ,దొంగతనము చేసి కాదు, ఒకటి పశుత్వము లాంటి జ్ఞానము, మరొకటి ఉచ్చకోటి జ్ఞానము, అది మానవుడి జ్ఞానము. ఒకటి స్వాభావికమైన జ్ఞానమైతే రెండవది విశేష జ్ఞానము. ఆత్మ –జ్ఞానము ఉంది, కాని అది ఇలాంటి విద్య కాదు దేనినైతే ప్రత్యేగించి చదువుకోవాలో. చదువుకొని సాధారణ మనుషులను కూడా తమ జీవితాలలో దీనిని చాలా బాగా పాటిస్తూ, నిర్వహిస్తూ చూస్తాము. ఒక చిన్న సంసారము లో తల్లీ తండ్రీ కొడుకూ కూతురూ భార్యా ఉన్నారంటే, అందరితోనూ సరైన వ్యవహారము చెయ్యడము, తల్లీ తండ్రుల సేవ, వాళ్ళ తో మధురముగా మాట్లాడడము, భార్యా –పిల్లలకు పూర్తి ప్రేమ, వాళ్ళ వలన ఏ తప్పైనా జరిగి పొతే వారిని క్షమించడము, వారిని సుఖపెట్టే పూర్తీ ప్రయత్నమూ కాని చుట్టు పక్కల వారి తో ఏ సంబంధమూ లేకపోడమూ, వారి వైపు మా దృష్టి మంచిది కాకపోడము, వారు బాధ పడుతూంటే పడనీ అని అనుకోడము ఇది ఉచ్చ స్తరమైన జ్ఞానము లేక ఆత్మా-జ్ఞానమూ కాదు. మీ వ్యవహారము ఎంత గొప్పది ఐపోవాలంటే, చుట్టు-పక్కల వారితో కూడా అదే వ్యవహారము ఉండాలి ఏదైతే ఇంటివారితోనో.
బహుశ మీకు అనిపించ వచ్చును, నేను ఇంత ఖర్చుఎలాగ పెట్ట గలను? జీతం పెరిగేమాట ఎలాగా లేదు, అయితే అప్పు చేసి ఇలాగ చెయ్యడమూ మంచిది కాదు. కాని మీరు ఇవన్నీ వదిలెయ్యండి , మొదట ఈశ్వరుని ప్రార్థించండి, హృదయ పూర్వకముగా ఏమిటంటారంటే హే ప్రభు! అందరిపై దయ చెయ్యండి, ఎవరూ ఆకలి తో ఉండకూడదు, ఎవరూ నిర్వస్త్రముగా ఉండకూడదు, ఎవరూ దుఃఖ పడ కూడదు. ఎప్పుడెప్పు డైనా వారికి సహాయము కూడా చెయ్యండి, మీ భోజనము లోంచి కొంత వారికీ ఇచ్చెయ్యండి, మీ వస్త్రాలలోంచి కొన్ని వస్త్రాలు వారికీ ఇచ్చె య్యండి. అప్పుడు ఈశ్వరుడు మీ వైపుకి చూస్తాడు, అప్పుడు మీకు అనిపిస్తుంది – అరే ! నా దగ్గర ధనము లేదు, లేకపోతె నేను అందరి సేవ చేసేవాడిని, అందరికీ సుఖము కలిగించేవాడిని. అప్పుడు ఆ ఈశ్వరుడు మీ వైపుకి చూస్తాడు, ధనము పంపడము ప్రారంభిస్తాడు. వస్త్రాలు పంపడము ప్రారంభిస్తాడు. అప్పుడు మీరు చాలా సరదాగా పంచుతారు, మీకూ చాలా ఆనందముగా అనిపిస్తుంది, మరియు ఈశ్వరుడు కూడా ఆనందిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా ఏమి కోరేవాడంటే ఎవరైనా నిజాయతీ తో కూడిన మనిషి దొరకాలి, ఎవరైనా సత్యపరాయణుడు, నిజాయతీ పరుడు మనిషి న్యాయముగా సరుకులు పంచేవాడు, పనిచేసేవాడు కనుక దొరికితే బాగుండేది, మీ లాంటి మనిషి దొరికితే దేవుడు కూడా ఆనందిస్తాడు, ఎందుకంటే దేవుడు పని కూడా సరిగ్గా జరగడము మొదలెడుతుంది, కొందరికి ఆ దేవుడు ఈ పని ఇచ్చేడు, బాగా పని చేసేరు కానీ కొద్ది రోజులు తరువాత వారూ దొంగ తనము చెయ్యడము మొదలు పెట్టేసేరు, తన పరివారికులకు, సంబంధించిన వారికి ఎక్కువ ఇవ్వడము మొదలు పెట్టేసేరు. ఇంక వారు వీరితో పని పుచ్చుకోడము మానేసేరు. మీరు మీ ఊరు లోనే చూసి ఉంటారు, ఎన్ని రేషన్ కోట్లు మూసేసేరో, ఆ పని మరొకరికి ఇవ్వబడినది .
ఇది నిశ్చితము అని నమ్మండి, ఆధ్యాత్మ జ్ఞానము, ఒక దీపము. మీ ఇట్లో వెలుగు ఇచ్చే ఒక కాగడా. అది లేకపోతే చీకటే, ఏ పనైనా చక్కగా సవ్యంగా ఎలాగ చెయ్యగలుగుతారు? చిన్న పని కూడా, ఎలాగైతే సూదిలో ధారము ఎక్కించడమైనా మీరు చీకటిలో చేయ్యగలుగుతారా? మనుషులు అంటారు, వ్యవహారము పవిత్రముగా ఉంచుగోండి ,సత్యంమే చెప్పండి, మరోకరికి మంచి చెయ్యండి, ఎవరినీ అసహ్యిన్చొద్దు, దు:ఖముగా ఉన్నవారికి సేవ చెయ్యండి. అనే మాటలన్నీ సరే కానీ ఇది ఇలాగే, ఎలాగైతే ఎవరో చెప్పినట్లు, మీ భోజనము ఈ గదిలో ఉన్నది అని, అక్కడకి వెళ్లి భోజనం చెయ్యండి అని
కానీ గదిలో వెల్తురే లేదు, భోజనము వెతుకుతున్నప్పుడు, ఒక మాటు కుర్చీ తగిలి పోతుంది, టేబల్ పడిపోతుంది, కంచము మరియు నీళ్ళ గ్లాసూ పడిపోవచ్చును, మీకు దెబ్బ తగలగలదు, ఆ సుఖము కలిగించే సరుకులే మీకు దుఃఖాన్ని కలిగించ వచ్చు, ఎందుకంటే గదిలో వెల్తురు లేదు. ఇలాగే మీ అంతరాలలో అన్నీ ఉన్నాయి, మనస్సూ ఉంది, బుద్ధీ ఉంది, చిత్తమూ ఉంది స్వత్వమూ ఉంది ,వీటి అన్నిటల వలన మీరు చాలా బాగా పనిచెయ్య గలరు ,కాని ఎలాగ చేస్తారు ?ఆత్మా రూపమైన దీపము లో వెలుగే లేదు ,ఇందుకే అంతరాలలో ఒక ద్వంద్వము జరుగుతోంది ,మనస్సు ఎదో అరుస్తోంది ,బుద్ది ఎదో అంటోంది ,చిత్తము ఎదో ఆలోచిస్తోంది, నేను (అహంకారము) ఎదో చేస్తోంది
. వ్యవహారము లోకి తెచ్చే ముందు వీటిని సమత్వము లోకి తీసుకురండి ,వీటికి ప్రకాశము ఇవ్వండి .ఒక సారి లక్ష్మణుడు శ్రీరామ చంద్రుడితో అన్నారు ,నాకు కొద్దిగా సత్య జ్ఞానము ఇవ్వండి ,దేని వలనైతే నేను సంసారములో ఉండి సరైన వ్యవహారము చేయ్యగాలుగుతానో ,సత్యతతో కూడిన జీవితము గడప గలుగుతానో .భగవంతుడు అన్నారు –విను లక్ష్మణా! ఈ జ్ఞానమైతే నేను నీకు చాలా త్వరగా చెప్పేస్తాను, దానికి ఏ టైమూ పట్టదు, కాని దాని ముందు నీకు ఓక పని చెయ్య వలసి వస్తుంది. మీ అంత:కరణము లో ఉన్న వినేవి మరియు అర్ధము చేసుకొనేవి ఏ యంత్రాలైతే ఉన్నాయో,మొదట ఒక క్షణము కొరకు ఆపెయ్యండి, మీ మనస్సు నా మాట విన గలిగి, చిత్తము దానిని అర్థము చేసుకో గలిగి, బుద్ధి నిర్ణయము ఇవ్వగలిగి ,అహంకారము దానిని స్వీకరించడానికి తయ్యారు అవగలగాలి .అప్పుడు అన్నారూ –నేను సంక్షేపము లోనే చెప్పేస్తాను, ధ్యాన పూర్వకముగా (ఏకాగ్రత తో కూడిన - చిత్తము మనస్సు మతితో) విను .
మనిషి యొక్క మనస్సు ప్రతి క్షణమూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. చిత్తమూ ఎదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఈ పరిస్థితిలో మరోకరి దగ్గర నుండి వస్తూన్న జ్ఞానాన్ని ఎలాగ ధరించ గలరు? మీరు నీళ్లలో ముక్కు ముఖము చెవులూ మూసుకొని కూర్చోండి, మీ చుట్టు నీళ్లు ఉన్నాగానీ అవి మీ లోపలకి రా లేవు ఇలాగే, జ్ఞానము మీ చుట్టూ అనంత గతి తో ప్రవహిస్తోంది, కానీ దాని కొరకు మీ హృదయము యొక్క తలుపులు మరియు, చిత్తము, మనస్సు యొక్క తలుపులు మరి తెరిచి ఉంచండి, అప్పుడే కదా అది తీవ్ర గతి తో లోపలకి ప్రవేశిస్తుంది .ఒక్క క్షణము లోనే మీరు పూర్ణత్వాన్ని పొందేస్తారు కానీ, ఇలాగ చెయ్యక పొతే మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినాగానీ ఆ జ్ఞానము దొరకలేదు. మీరు అనుకోకండి చెవిటి వాడే (చెవులు లేని వాడే) వినలేడని. కానీ ఆ మనుషులు ఎవరికైతే చేవులున్నాయో, వింటారు కూడా, కానీ ధ్యానము మరొక వైపుకి ఉంది అనుకోండి,అలాంటప్పుడు అస్సలు వినలేడు.ఏ వైపు ధ్యానము ఉంటుందో మీరు ఆ జ్ఞానాన్నే పొందుతారు .
ఒక సారి గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆయనని అడిగాడు –భగవాన్ మీరు మాకు అంతా చెప్పెశారా?లేక ఏ జ్ఞానమైనా ఇంకా ఇవ్వడము ఉండిపోయిందా .ఆయన రెండు చేతులు విప్పేసి అన్నరూ ,నేను నీకు అంతా చెప్పేశాను మరియు అంతట ఇచ్చేశాను కానీ ఇది సంభవమే నువ్వు వినలేక పోయుండచ్చు ,పుచ్చుకోలేక పోయుండచ్చు .
ఇలాగే ఒకమాటు భగవంతుడు శివుడుని మహాదేవి పార్వతి కూడా ప్రార్థించింది.ప్రభు ఆ కథ చెప్పండి దేనిని వింటే ప్రాణి అమరత్వాన్ని పొందుతాడో. క్లేశాల నుండి ముక్తి కలుగుతుందో, అప్పుడు శివుడు అన్నారూ, నేను కథైతే చెప్తాను కానీ నువ్వు మాత్రం అతి జాగ్రత్తగా విను కథ వింటూండగా నిద్ర వచ్చేసినా లేక మరొక ఆలోచన వచ్చినాకానీ,ఇది సఘములోనే ఉండిపోతుంది, పూర్తి లాభము కలగదు, మరియు ఇలాగే జరిగింది కూడా ,పార్వతి కి కొంత సేపటికి నిద్ర వచ్చేసింది ,మరియు దగ్గరలో ఉన్న ఒక చెట్టు లో ఉన్న తొర్రలో ఉన్న ఒక పక్షి పిల్ల దానిని పూర్తిగా వినేసింది ,మరియు పూర్తి లాభాన్ని పొందింది .ఈ కాలము లో కూడా ఆ కథ నడుస్తోంది ,గురువులు చెప్తూనే ఉన్నారు శిష్యులు వింటూనే ఉన్నారు కాని సరిగ్గా వినక పోవటం వలన లాభము పొందలేక పోతున్నారు.
ఒక సారి గురు మహారాజ్ గారు కూడా అన్నారు ,ఆ కథ నాకూ తెలుసును నేను కూడా మా గురు మహారాజ్ గారి నోటితో విన్నాను ,నేనూ అందరికీ చెప్తాను కానీ, అదే అవుతుంది ఏదైతే ఇప్పటి దాకా నడుస్తూ ఉందొ .లక్షలాది లోంచి ఎవరో ఒకళ్ళు ఇద్దరు వినగలుగుతారు. అన్నారు కూడా –
తులసీదాస్ గారు అన్నారు –క్రతం చేసిన పాపాల కారణముగా ,హరి చర్చ కూడా నచ్చదు.కొందరు నిద్రలోనే తన సమయము గడిపేస్తారు కొందరు దేబ్బలాటల్లోనూ ,కొందరు ఇంటినించే పారిపోతారు .
ఆయన అన్నది ఏమిటంటే మీకు కథ వినాలని లేక పోయినా ,వినలేక పోయినా పరవాలేదు ,మీరు వారి శరణము లోకైనా వెళ్లండి ,వారు ఒక రోజు సరిదిద్దేస్తారు. జాగృతి అవస్తలో కాకపొతే ఈ జ్ఞానాన్ని సుషుప్తిలో మీ లోకి ప్రవేశింప పరుస్తారు ,మరియు మీకు తెలియ కుండానే ఈ జ్ఞానమంతా మీ అంత:కరణము లోకి చేరిపోతుంది. గురువులు సమర్థులు ఉంటారు.
ఒక సంత్ అన్నారు ఎప్పటి వరకూ ఆత్మా దృష్టి తెర్చుకోదో ,అప్పటిదాకా వారికి ధర్మమూ-అధర్మమూ యొక్క జ్ఞానము కూడా ఉండదు.ఏ పద్ధతి అయితే నడుస్తోందో ,అదే సరి ,అదే మా ధర్మము అనుకుంటారు.ఎలాగైతే ఎవరినైనా చంపడం ఒక హింస, కానీ బలిదానము రూపములో అది ధర్మము అనుకుంటున్నారు .కుర్బానీ చెయ్యడము పుణ్యము అంటారు .ఇంకా ఏమంటారంటే మీ ప్రియతరమైన సరుకుని బలిదానము ఇచ్చెయ్య మని ,కాని ఆ బలి ఇవ్వబడేది ఏమిటీ ?మేకలూ గొర్రెలూ కాని నిజమాలోచిస్తే అన్నిటలకన్నా ప్రియతరమైనది మన ప్రాణము .ఏమిటి ఎప్పుడైనా మీ ప్రాణాల్ని బలి ఇచ్చే మాట ఆలోచిన్చేరా ? ఇలాగ అయ్యి ఉంటే ,ఆ క్షణమే ఉద్దారము అయి పోయేది ,కాని ఎవరు తన బలిదానము ఇస్తారు ?చేసేది ఇంకోకరి బలి దానము ఇంకా పైన్నించి చాల పెద్ద ధర్మము అనుకుంటారు .ఇది ఎవరికి తోచినట్లు చేసిన ధర్మము అయ్యి ఉండచ్చు .ఒక సమాజము ఏదైనా దీనిని స్వీకరించిందేమో ,అది సామాజిక ధర్మము అనిపించుకోవచ్చు కానీ సత్య ధర్మము మాత్రం ,లేక ఆత్మిక
ధర్మమూ కాదు.ఇందువలన ఎప్పటిదాకానైతే సరైన ధర్మమున తెలుసుకోమా? అప్పటిదాకా వ్యవహారములో కోశల్యము ఎలాగ వస్తుంది?
ఏంతో తెలివితేటలు ఉన్న పురుషులు కూడా ఆత్మజ్ఞానము లోపిస్తే
పెద్ద పెద్ద తప్పులు చేసేస్తారు.రాజు యయాతి నే చూడండి ,చాలా తెలివితెటలైన వాడే,ప్రజలతో వ్యవహారమూ బాగా చేసేవాడు, తన కి చాలా మంది కొడుకులు ఉండేవారు,తను వృద్ధావస్థ కి చేరెడు కానీ విషయ వాసనలలో (కోరికలలో)చిక్కుకొని ఉండేవాడు .అనుకున్నాడూ ఏ విధముగానైనా యువకుడిని అయిపోతే బాగుండును.యౌవనము తిరిగి వచ్చేస్తే నా విషయ వాసనలను పూర్తీ చేసుకుంటూ ఉంటాను .పండితులను,తాన్త్రికులనూ అడిగేడు,నేను తిరిగి యౌవనాన్ని పొందగలనా?వారు అన్నారు ,పొంద గలవు,కానీ ఎప్పుడైతే ఎవరైనా తన యౌవనాన్ని నీకు ఇచ్చేస్తాడో మరియు నీ వ్రుద్ధా వస్థను సంతోషముగా స్వీకరిస్తాడో. రాజు చాలా మందిని అడిగేడు , సగం రాజ్యము కూడా ఇవ్వడానికి సిద్ధ పడతాడు, కానీ ఏ యువకుడు వ్రుద్ధావస్థను స్వీకరిస్తాడు,ఎవ్వరూ సిద్ధ పడ లేదు.ఆఖరికి కామాంధుడై,తన కొడుకులనే అడిగేడు ,ఏ కొడుకులూ సిద్ధ పడలేదు,ఎప్పుడైతే చాలా బాధ పడ్డాడో అప్పుడు తన చిన్న కొడుకు అన్నాడు ,మీరు బాధ పడకండి నేను సిద్ధముగా ఉన్నాను.నా ఈ శరీరము కూడా మీదే.ఈ విధముగా విషయాలను పొందడానికి కొడుకు యొక్క యౌవనాన్ని పుచ్చేసుకున్నాడు .
చూడండి ఈ వ్యవహారాన్ని.ఎంత గ్లాని కలిగించే పని! ఎలాంటి మదాన్ధత ,కారణము అజ్ఞానత ,ఇందుకే అన్నారు ,ఆత్మా జ్ఞానము లేకపోతే వ్యవహారము సరిగ్గా ఉండదు.
ఒక సంత్ ఇలా అన్నారు:
ఈ సంసారములో ఏ మనుశ్శులైతే పవిత్రమైన మరియు స్వచ్ఛ మైన వస్త్రము ధరించి వెళ్ళారో వారిని సంత్ మహాత్ములని అనుకోండి , ఎందుకంటే ఇది ఎలాంటి స్థలము అంటే మసి అంటుకుని పోతుంది. ఒక సామెత కూడా ఉంది. మసి పట్టిన గదుల్లోకి ఎంత తెలివితేటలు ఉన్నవారు వెళ్లినా మసి మాత్రము అంటూకోకుండా ఉండదు. మబ్బుల నుండి కురిసే జలము స్వచ్ఛమైనదే ఉంటుంది కానీ భూమిపైకి వచ్చి మైల పడిపోతుంది. సాధారణ మనుషుల మాట వదిలెయ్యండి పెద్ద-పెద్ద జ్ఞానవంతులు కూడా ఈ సంసారంలోకి వచ్చేక , ఇక్కడ నుండి పవిత్రముగా తిరిగి వెళ్ళలేక పోతారు. కొందరు అనుకుంటారు, మేము పవిత్ర వంశములో పుట్టేము, అందుకు మేము ఎప్పటికీ పవిత్రమే, కొందరు అనుకుంటారు నేను ఆజీవనం ప్రభు సేవ లోనే గడిపెను, నాపైనే వారి పూర్తి దయ ఉంది, కొందరంటారు నేను ఎన్ని యజ్ఞాలు చేసానంటే అన్ని ఈ సంసారములో ఎవరూ చెయ్య గలిగి ఉండరు. కొందరంటారు నేనైతే నాలుగు వేదాలూ, ఆరు శాస్త్రాల యొక్క అధ్యయనము చేసేను, ఇంక నాకు తెలుసుకోడానికి ఏమీ మిగలనే లేదు. కొందరంటారు నేను అన్ని తీర్థాలు దర్శనము చేసేను. హుజూర్ యొక్క దరగాహ వెళ్లి వచ్చాను రోజే కూడా పెట్టుకున్నాను, మూడు సార్లు హజ్ కూడా చేసేను. మేము మా ధర్మాలను కూడా పూర్తిగా పాటించాము. మమ్మల్ని పరమాత్ముడు పూర్తిగా క్షమించేసాడు, కానీ ఇదంతా ఒక ఆడంబరము. ఇది నిద్ర కొరకు ప్రయత్నము మాత్రమే, కానీ నిద్రలోకి చేర లేక పోయారు. నిద్రలో ఉన్న ఆనందము, నిద్ర గురించి ఆలోచించడములో లేదు. ఇంకా ఒక ఆవరణ ఉంది, మీరు ఇప్పటి దాకా దానిని వేరు చెయ్య లేక పోయారు, దానిని తీసేయ్యడము మన వశము లో ఉన్న పని కూడా కాదు. మీకు ఇది తెలుసు నాటకము ఆడే వాళ్ళు వేరు మరియు తెర లాగేవారు (తేరవేసేవారు) వేరని. నాటకము యొక్క ఆఖరి తెర ఆ పరమాత్ముడే లేక గురువే తీసేస్తారు. మరొకరు కాదు. ఆ తెరదూరమవగానే, నాటకము నాటకముగా ఉండదు, నిజములోకి మారిపోతుంది.
మీకు ఇది కూడా తెలుసును అదేమిటంటే, సుషుప్తి వరకు చేరడానికి రెండు స్థానాలు దాటవలసి వస్తాయి, మొదటిది జాగృతిది, రెండవది స్వప్నముది. సుషుప్తి ఎలాంటి స్థితి అంటే ఎక్కడకైతే చేరి ప్రాణి జాగృతి యొక్క దుఃఖాలనుండి మరియు స్వప్నము యొక్క, లేని పోని సుఖాల నుండి నివృత్తి పొందగలడో. ఇలాగే పరమాత్ముడి యొక్క స్థానము దానికన్నా చాలా ఉన్నతమైనది, ఎక్కడైతే సాధకుడు అసలైన జ్ఞానాన్ని పొందుతాడో, ఎందుకంటే నిజము కానివి ధర్మము, సంప్రదాయము. పూర్ణ జ్ఞానమే నిజమైన ధర్మము. ఇప్పటి వరకూ మనము సాంప్రదాయిక ధర్మాన్నే తెలుసుకొన్నాము నిజమైన ధర్మాన్ని కాదు, ఎందుకంటే నిజమైన ధర్మము అది ఏదైతే, అందరినీ ఏకము చేస్తుందో, సాంప్రదాయిక ధర్మము అది ఏదైతే అందరినీ వేరు-వేరు చేసేస్తుందో. పరమాత్ముడొక్కడే అయినప్పుడు ధర్మాలు మాత్రము రెండు ఎలాగ? దీని గురించీ ఒక కవి (షాయర్) ఇలా అన్నారు.
ఓ యాత్రికుడా! నీవు ఎలాంటి స్థానానికి చేరాలంటే ఎక్కడైతే ఏ అడ్డంకులూ లేవో, ఎక్కడైతే సంపూర్ణ శాంతి ఉందో, జీవితము యొక్క పూర్ణ పవిత్రత ఉందొ. అక్కడ రెండు ఉండవు. ఇంటి నుండి బైల్దేరితే ఒకరు, గుడికి, మరొకరు మస్జిద్కి, చర్చకి లేక గురుద్వారాకి ఇలాంటి చోట్లకే చేరేరు కాని, అచ్చట కి చేరలేదు ఎక్కడైతే ఏ ప్రతిబంధములేదో ఒక ప్రహారి గోడ లేదో, ఈ సంప్రదాయాలను దాటడము సాధకుడికి చాలా కష్టము. లోకుల యొక్క భయము, సమాజము, మరియు కురీతుల భయము ముందుకి వెల్ల నివ్వవు. పుస్తకాలలో ఏమి వ్రాసుందంటే ఎప్పుడైతే మీరాబాయి కి దేవుడుపై మనస్సు వచ్చేసిందో, అప్పుడు ఆవిడ అన్ని బంధాలనూ తెమ్పెసినారు సమాజము యొక్క భయము, లోకములో ఉన్న నీతులనూ త్యజించి ముందుకి వెళ్లి పోయారు.
ఏమన్నారంటే ఎక్కడో ఇద్దరు మనుషులు వాదనకి సిద్ధపడి ఉన్నారు ట. అందులో ఒకరు హిందూ మరొకడు ముస్లిం , ఇద్దరూ పెద్ద జ్ఞానవంతులు, మన్చి చదువుకున్నవారు కూడా, ఒకరు అన్నారు ఈశ్వరుడు సాకారుడు, మరియు నిరాకారుడు కూడా, మరొకరు అన్నరూ మరి నిరాకారుడైతే మరి సాకారుడు ఎలాగ అవ్వగలుగుతాడు? ఒకరు అన్నారు మా ధర్మము సత్యమని మరొకరు అన్నారు, మా ధర్మము సత్యమని , ఇంత ట్లోకీ మూడవ మనిషి అక్కడకి చేరేరు ,తను ఇద్దరి మాటలనూ విని అన్నాడూ, అరే! మీరు కొంత సేపటికి హిందుత్వము యొక్క దుప్పటీని తీసేసి ఒక వైపు పెట్టెయ్యండి, మీరు కూడా ఇస్లామీ బట్టని కొంత సేపటికి వేరే పెట్టెయ్యండి, లేక పోతే మీరు పెట్టుకున్న కళ్ళద్దాలను ఏవైతే ఎరుపు మరియు ఆకుపచ్చవో వాటిని కళ్ళ నుండి తీసేసి ఒక పక్కని పెట్టెయ్యండి. తరువాత ఈశ్వరుడు ఇచ్చిన మీ కళ్ళతో చూడండి , అప్పుడు మీరు ఏకత్వము లోకి వస్తారు అప్పుడు ఒకటే వస్తువు కనిపిస్తుంది, ఇక్కడ వాదించే మాట ఏమీ లేదు, అర్థము చేసుకొనే మాట అంతే .
ఇదే ఈశ్వర దర్శనము కి కూడా కావలసినది.ముందు ఎకాగ్రతలోకి రండి, తరువాత ధ్యానము ద్వారా దానికన్నా పైకి నిరోధా వస్థకి చేరండి.
ఆత్మా లాభము తప్పక పొందుతారు, ఇది ఎలాగంటే, నీటిలో మన ప్రతిబింబాన్ని చూడాలంటే ఎలాంటి చెరువు పక్కకి వెళ్ళాలంటే, ఏదైతే పూర్ణ శాంతిలో ఉందో, ఎందులోనైతే ఒక అల కూడా లేదో ఎకాగ్రతలోకి వెళ్ళడము మీ పని, కానీ ఏకాగ్రత నుండి పైకి తీసుకొని వెళ్ళడమూ మరియు అందులో ఆ జ్ఞానాన్ని ఇమర్చడము గురు యొక్క పని. వారు అన్నారు మీరు కనుక ఏ మహాపురుషుడు యొక్క సాన్నిధ్యా నికి వెళ్లి, వారి కి మిమ్మల్ని అప్పచెప్పి, చూడండి వారు మీ ధ్యానము పూర్తిగా పెట్టుకుంటారు .
మీకు తెలిసున్డక పోవచ్చును ఎవరైతే పూర్ణ పురుషులో సంత్ మహాత్ములో వారు ఈ పనే చేస్తారు, ఎప్పుడైతే వారి శిష్యుడు తన చెయ్యి వారి చేతులో పెడతారో ఆ క్షణమే ఆ చేతిని భగవంతుడికి అప్ప చెప్పేస్తారు. ఒక సంత్ అన్నారూ నాకు తెలియదు నా మృత్యు ఎప్పుడు వచ్చేస్తుందో ఆ దేవుడు పిలుపు, ఎప్పుడు వచ్చేస్తుందో, ఇందుకే ఎవరైతే నా శరణు లోకి వచ్చారో, తనదంతా నాకు అర్పించేస్తారో అదంతా పరమాత్ముడికి అర్పించేస్తాను, అప్పుడు అది నాది కాక వారిది అయిపోతుంది. ఇందుకే అంటారు, ఎవరైతే గురువుగారి వారు అయిపోయారో వారు భగవంతుడి వారు అయిపోయారు, మరి దేవుడు లోనూ గురువు లోనూ ఏ భేదమూ లేదు .
ఒక సంత్ ఒక మాటు అన్నారు ట, నా ప్రారంభిక జీవితము పవిత్రముగా ఉండేది కాదు, విషయ వాసనలలో చిక్కుకుపోయి ఉండేవాడిని, భగవంతుడిని మర్చిపోయి ఉండేవాడిని, సురాపానము చేస్తూ ఉండేవాడిని, ఒక వేశ్య కూడా నాతొ పాటూ ఉండేది. విపరీతమైన ఎండ, నేను ఆ ఎండలోను నడుస్తూ, నాగొడుగు పెట్టి ఆమెకి నీడ చేస్తూ ఉండేవాడిని. నాకు లోకము ఏమనుకుంటుంది,అనే భయము కూడా ఉండేది కాదు, ఆ మేళా కి ఒక సంత్ కూడా వచ్చేరు మరియు ఒక చిన్న కొండ పై కూర్చుని ఉండేవారు. వారి దృష్టి నా పై పడింది, వారు తన ఒక శిష్యుడిని పంపి, ఆ గొడుగు వాడిని ఇక్కడకి పిల్చుకొని రా అన్నారు .
శిష్యుడు పరుగేట్టుగొని వచ్చి,నాతొ అన్నాడు, చూడు అక్కడ కూర్చున్న మహాత్ముడు మిమ్మల్ని పిలుస్తున్నారు,నేను వారి వైపుకి చూసాను ,వెళ్ళాలని ఉండేది కాదు, కానీ, ఎప్పుడైతే నా దృష్టి వారి పై పడిందో ,నేను ఆగ లేక పోయాను , వెళ్ళాను చరణాలు స్ప్రుశించాను, ,వారు చాలా ప్రేమగా తన దగ్గర కూర్చో పెట్టుగున్నార, అన్నారు, ఇప్పటి వరకూ చేసిన పొరపాటు క్షమించాను, ఇంక ముందు చేయ్యారాదు. .
నేను తిరిగి ఇంటికి వెళ్ళేను కానీ మహాత్ముడు వచనాలు నా అంతరాలలో గుంజాయమానము అవుతూనే ఉన్డేవి
“ఇప్పటి దాకా జరిగిన మరుపు(తప్పులు) క్షమించేను కానీ ఇంక మాత్రం ముందు మళ్ళీ చెయ్య వద్దు”
రాత్రి నేను పడుక్కున్నప్పుడు, కలలో ఏమి చూసేనంటే, నా మృత్యు అయి పోయింది, యమదూతలు నన్ను యమరాజు ముందుకి తీసుకొని వెళ్ళేరు, ఆయన అన్నారు, ఈ మనిషి చాలా పాపాలు చేసాడు, నరకానికి తీసుకు వెళ్లండి. అక్కడ ఉన్న ద్వారపాలకులు మరియు అక్కడ ఉన్న వాళ్ళూ అన్నారు, అరే ! ఈ మనిషిని ఇక్కడకి తేవద్దు, వీడి శరీరాన్నించి కంపు కొడుతోంది, మాకు ఇక్కడ ఆగడము కష్టముగా ఉన్నది, యమ దూతలు చాలా ఆశ్చర్య పడ్డారు, ఇలాంటప్పుడు ఎక్కడకి తీసుకు వెల్లడము? స్వర్గము లోకి తీసుకుని వేల్లలేము, నరకము వాళ్ళు రానివ్వరు . ఇంతట్లోకీ నేను ఏమిచూసేనంటే, ఆ మహాత్ముడు వచ్చేసేరు మరియు అన్నరూ – రా నువ్వు నా వాడివి, నేను నిన్ను నాతోపాటూ తీసుకు వెళ్తాను, ఏదైతే స్వర్గము కన్నా పైస్తరముది.
కళ్ళు విడిపోయాయి, జీవితమూ పవిత్రం అయిపొయింది. నేను ఏలా ఉండే వాడిని, ఏమి అయిపోయాను, ఎక్కడకి వెళ్ళవలసిన వాడిని, ఎక్కడకి వెళ్లి పోయాను? నిజముగానే సంత్ యొక్క చరణాలే ఈ భవసాగరాన్ని దాటించే ఒక చక్కటి మరియు సుదృఢమైన నౌక. ఇందుకే విభీషణుడు,హనుమంతుడు తో కలుసుకున్నప్పుడు అన్నాడు ఇంక నాకు విశ్వాసము కుదిరింది, హరి కృప లేకుండా సంత్ దొరకలేరు.
*************
మాలిన్యము
ప్రస్తుతము మనల్కి తెలియడము లేదు కానీ మాలిన్యము మనలోపల నిండిపోయింది, అది మన ఆలోచనలలోను, వాణీ లోను, చేస్తూన్న పను ల్లోనూ, నిండిపోయింది, వాటినుండి దుర్గంధము రావడము లేదు అని ఏమీ కాదు, అది మన మనస్సుల్లోను నిండిపోయింది, పరిస్థితి ఎంత దాకా వచ్చేసింది అంటే బహుశ: సుగంధము కూడా దుర్గంధము లాగ అనిపించడము మొదలుపెట్టేసింది. ఒక మహాత్ముడు ఒక కథ చెప్పేవారు
ఒక ఊళ్ళో ఇద్దరు స్త్రీలు వాళ్ల –వాళ్ల సరుకులు తీసుకొని వాటిని అమ్ముకోడానికి ఏ ఊరికో వెళ్ళేవారు ట, ఒక ఆవిడ పువ్వుల మాలలూ రెండవ ఆవిడ చాపలూ. చాపల ఆవిడ ఊరునుండి రెండు మైళ్ళు దూరాన్ని ఉండేది. ఇద్దరూ ఎక్కువగా కలుసుకున్టూ నే ఉండేవారు. ఎప్పుడెప్పుడైనా ఒకరింటికి ఒకరు వెళ్ళేవారు కూడా. ఒక రోజు చాపలావిడకి ఊళ్లోనే చీకటి పడి పోయింది, ఆవిడ అనుకున్నారు ఈ రోజుకి, మాలల ఆవిడ ఇంట్లోనే ఆగి పోదాము, మరియు ఆగిపోయింది కూడా, ఆమె చాలా సత్కారము కూడా చేసారు. భోజనము అయ్యి పడుక్కునే ప్రయత్నాలలో ఉండేవారు, అప్పుడు ఆవిడ అన్నరు – మీరు పువ్వుల గదిలో పడుక్కోండి, నేనూ ఇక్కడే ఒక పక్కన పడుక్కుంటాను.ఆ గది పూర్తిగా పూల సుగంధము తో నిండిపోయి ఉండేది .ఆ పువ్వుల ఆవిడకి కళ్ళు ముయ్యగానే నిద్ర పట్టేసింది కానీ ఆ చాపల ఆవిడకి ఎంతకీ నిద్రే రాలేదు, గాబరా పెట్టడము మొదలుపెట్టింది, మరియు ఆలోచించడము మొదలు పెట్టింది ఈ దుర్గంధము ఎక్కడ నుండి వస్తోంది ? నా ముక్కు పగిలిపోతోంది,ఇంక నిద్ర ఎక్కడ ?లేచి కూర్చుంది, అవతల కి పారిపోదాము అనుకుంది కానీ ఎలాగ మరొకరి ఇల్లు, అంతా చీకటి, ఆమెకి ఒక ఉపాయము తోచినది, తన చాపల బుట్ట తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంది, వాటి మెడ కప్పే అతి దుర్గంధమైన బట్ట తీసి తన ముఖము మీద కప్పుకుంది కప్పుకోగానే నిద్ర పట్టేసింది, ఈ మాలిన్యము తన కి ఎంత నచ్చి పోయిందో.సామెత కూడా ఉంది ---ఉద్ధవ్! ఎవరి మనస్సుకి ఏది నచ్చితే అదే -----ద్రాక్షలు జీడి పప్పు లాంటి అమృత ఫలాలని వదిలి విష పురుగు విషమే తింటుంది .
ఇలాగ ఎందుకౌతుంది అంటే ,మాలిన్యము మనల్లోను ఉండడము ప్రారంభిస్తుంది ,ఒక మాటు వచ్చిన మాలిన్యాన్ని మీరు కనుక స్వీకరించేరంటే, అది మీ మస్సులోనే ఉండిపోతుంది. ఒక మాటు చెయ్యకూడని భోజనము పరవాలేదని చేసేస్తే, దాని వలన బుద్ధి మలినమైపోతుంది, అంతే మాలిన్యము నచ్చేసింది. ఇందువలనే తామస భోజనము చేసేవారు, దాని తప్పులేంచలేరు, దీని వలనే దొంగతనము చేసేవాడు దొంగతనము చేస్తాడు, అబద్ధము ఆడేవాడు అబద్ధము ఆడుతాడు. ఎందుకంటే ఇంట్లో చీకటి అయిపొయింది, అందువలన ఏమి తెలుసుకోలేకపోతున్నారు .
మాలిన్యాన్ని దూరము చేసేది ఒకటే ఉపాయము, మీరు మీ ఇంటిని ప్రకాశమయము చేసుకోండి, మాలిన్యము తప్పక వెళ్లి పోతుంది. చెప్పండి మీ గదిలో ఉన్న చీకటిని బైటకి ఎలాగ పారేస్తారు, నింపి నింపి అవతలకి పారెయ్యండి, చీకటి తగ్గదు, ఒకటే ఉపాయము, గదిలో దీపము వెలిగించండి, కిటికీ తెరవండి, గది పవిత్రమైనది మరియు అంధకారము దూరమైపోతుంది, ఇలాగే మీరు ఒక సారి మీ హృదయము యొక్క కిటికీ గురు భగవంతుడు ముందు తెరవండి,గది (హృదయము)ప్రకాశమయము అయిపోతుంది. దాని వలన అందులో ఉన్న అన్నిటలనీ చూడడము మొదలు పెడతారు.ఎవరైతే గురు ఎదురుగా కూర్చుని హృదయాన్ని తెర్చేస్తారో వారికి తనలోనే ఈశ్వరుడు కనిపించడము మొదలు పెడతారు, కానీ అంతరాలయోక్క కిటికీని చీకటిలో చూస్తెఎలాగ తెరవగలుగుతారు? దాని కొరకు మీరు ముందు మీ పరమేశ్వరుడిని తల్చుకోండి , రామ నామమే స్మరించండి , గురు పేరు తల్చుకోండి . ఇంతకే అంధకారములో మెరుపుతీగవలే అజ్ఞానములో ఉన్న మీకు జ్ఞానము కలుగుతుంది. ఈ విధముగా చప్పపడినది కూడా “రామ నామ శశి కిరణ్ సమానా తాత్పర్యము ఏమిటంటే రామ నామము చంద్ర కిరణముల తో సమానము అని చెప్పబడినది. “ఇంతే ఇంకా ఆ కిటికీ తెరిచేయ్యండి, సంపూర్ణ ప్రకాశము లోపలకి అంతరాలలోకి చేరిపోతుంది.ఒక సంత్ అన్నార, నేను మూర్ఖుడిగా ఉండేవాడిని, నాకు ఏ జ్ఞానమూ ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే నాకు నా గురు దర్శనము అయిందో, వారి చరణాలను స్ప్రుశించేనో, నా అంతరాలలో వెలుగు, ప్రకాశము, నిండిపోయింది, అప్పుడు గురు అన్నారూ _ఇంకా ఈ జ్ఞానము యొక్క పుస్తకం ( గ్రంథము)చదువు , నేను తక్షణమే చదవడము మొదలు పెట్టె సేను నేను చాలా ఆశ్చర్య పడ్డాను, వారి కృప అంతే, ఏదైతే నాకు ఇదంతా ఇచ్చేసిందో .
ఇదైతే సంభవమే పేద మనిషి పాపాలతో జాగర్తగా ఉండ వచ్చును, విషయ వాసనలలో చిక్కుకోకుండా ఉండ వచ్చు, కానీ ధనము దొరికేక కూడా సరిగ్గా ఉండడము కష్టము. ఇందుకే సంత మహాత్ములు ధనాన్ని పాము తో పోల్చేరు అంటే మీరు ధన రూపమైన సర్పాన్ని మీ దగ్గర పెట్టుకున్దామనుకుంటే, పాముని పట్టుకునే మంత్రము కూడా నేర్చుకొండి, ధనమున పెట్టుకునే నియమాలను కూడా తెలుసుకోండి, అప్పుడు మీకు ధనముతో ఏ హాని కలగదు . అందరికీ తెలుసున్నదే, అన్నము లాగే ధనము కూడా అందరికీ కావలసినది, కానీ ఎలాగైతే అన్నము ఎంత అవసరమో అంతే ఉంచుగోగలము అలాగే ధనము కూడా ఎంత అవసరమో అంతే ఉంచుకోండి, రెండవది ఏమిటంటే, నిష్పాప సాధనాల ద్వారా ధనార్జన చెయ్యండి, మరియు ఆలోచించి ఖర్చు పెట్టండి. ధనహీనుడికి ధనము తో సహాయపడండి. మూడవది ఏమిటంటే ధనాన్ని ఎవరైతే సంయమముగా ఖర్చుచేస్తారో వారే మహాత్ములు, నాలుగోవది, ధనము వచ్చేస్తే మేము దానము చేస్తామనుకొని, ధనము మాత్రము పోగు వెయ్యకండి. ఈ మనస్సు చాలా మైలమైనది ఏమి తెలుసు మరి ఏమి ఆలోచించడము మొదలుపెడుతుందో ?
బుద్ధిమంతులు అన్నారూ ఈ సంసారము ఒక మసి గది, మచ్చ, మరక పట్టుకోడము ఏమీ పెద్ద మాట కాదు. ఒక సంత్ తన శిష్యుడికి చెప్తూ ఉండేవారు, ధనమూ, అందమైన యువతులు మరియు, ఎక్కువ ధనస్తులతోనూ జాగర్త, వారి సంపర్కాన్నించి నువ్వు దూరమే ఉండు. ఎక్కువ ఘనిష్ట సంబంధము అయిపోయినప్పుడు మనస్సు పా పము వైపుకి తిరిగి పోతుంది. ఎక్కడైతే మిమ్మల్నిపొగిడేవాల్లు ఉంటారో అక్కడకి తక్కువ వెళ్లండి, ఎక్కువ సేవ పుచ్చుకోడముతో జాగ్రత పడండి, ఆహారము ఎప్పుడూ స్వల్పము మరియు సాధారణమైనదే గ్రహించండి.దుర్జనుల తో ఉండడముగన్నా ఒక్కరూ కూర్చోడము, లేక చెట్లలలో కూర్చోవడము మెరుగు. రోజంతలోనూ కొంత సమయము ఎలాంటిది ఉండాలంటే ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడకుండా గడుస్తుందో. కొంత సమయము ఇలాంటిది కూడా ఉండాలి ఎప్పుడైతే మన ఆలోచనలను ఆపగాలమో.ఇలాంటి మనుషులు చాలా మంచి వారు ఎవరైతే పని లో నిమగ్నము అయిపోయి మాట్లాడరో, వాళ్ళ పనులు పూర్తీ అయిపోతాయి మరియు వాణీ దోషము తో కూడా జాగర్త పడి ఉంటారు, డంభము కపటము తో జాగర్త పడండి. వీటిని ఎంతవరకూ కప్పుతావు, ఎందుకంటే మనుషులు మిమ్మల్ని ప్రతి వైపు నుంచీ చూస్తారు. ఒక రోజు బండారము బైట పడుతుంది మరియు మిమ్మల్ని మనుషులు శ్రర్ధ కాకుండా అసహ్య పడడము మొదలు పెడతారు. అది మీ దు:ఖానికే కారణము అయిపోతుంది .
భయంకరమైన పాపము కూడా ప్రారంభములో చిన్నదే ఉంటుంది, మరియు అస్తమానూ చేసి – చేసి అదే పెద్దది మరియు ప్రబలమైనది అయిపోతాయని అంటారు.. బాదశాహ్ నౌశేఖాన్ తమ పనివాళ్ళకి ఏమనిచేప్పారంటే, మనము ఎక్కడ ఆగినా, అక్కడ నుండి ఏ వస్తువూ డబ్బు ఇవ్వకుండా తీసుకోవద్దు అని. ఒక మాటు వారి లష్కర్ బయట ఎక్కడో ఆగినది, అన్ని సరుకులూ డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు కానీ, ఉప్పు మాత్రమూ డబ్బు ఇవ్వకుండా అడిగి తీసేసుకున్నారు. బాద్ షాకి కి ఈ మాట తెలిసింది, ఆ మనుషులకు దొంగతనము మరియు లంచము పుచ్చుకోన్నారని శాస్తి వేసేరు. మరియు ఏమన్నారంటే చిన్న పాపాన్ని కూడా చిన్నది అనుకోవద్దు, చిన్న శత్రుని చిన్నశత్రు, చిన్న రోగాన్ని చిన్నది అనుకోవద్దు మరియు నిప్పు నేరుసు ని చిన్నది అనుకోవద్దు, ముందు ఇవి భయంకరమైన రూపాన్ని ధరించేస్తాయి. ఇంకను ఏ పరాయి స్త్రీ ను అక్క- చెల్లి , కూతురూ లేక తల్లీ అని ఎక్కువ సంపర్కము లోకి వెళ్లొద్దు. పైనున్న మాలిన్యము సులువుగా ఓదిలిపోతున్దిగానీ ఏదైతే మనస్సు లో పట్టిపోతుందో అది అప్పడి దాకా పోలేదు ఎప్పడిదాకానైతే మనస్సు పవిత్రము అవ్వదో ఎందుకంటే ప్రతి పనీ ముందు మనస్సునుండే ప్రారంభిస్తుంది తరువాత ఇంద్రియాలు చేస్తాయి. ఏ పనీ కూడా ముందు ఆలోచించనది ఉండదు.ఇందుకే మనస్సు యొక్క మాలిన్యాన్ని దూరము చేసే ప్రయత్నము చెయ్యండి. ఆ మాలిన్యము మీరు మీ అంతట ఒదుల్చుకో లేరు, డాక్టర్ ఎంత యోగ్యుడైనా తన కన్ను తనే చూసుకోలేడు , ఇలాగే ఇది అంతరాల మాలిన్యము, మీరు స్వతమ్ గా దూరము చెయ్యలేరు, ఏ మహా పురుషుడి సహాయమో పుచ్చుగో వలసి వస్తుంది దీని కొరకు మూడు మాటలు జ్ఞాపకము ఉంచుకోండి. మనస్సుని అపవిత్రమైన ఆలోచనలతో రక్షించుగుంటూ ఉండండి , ఇంద్రియాలను అశుభమైన పనులతో దూరముగా అట్టేపెట్టండి మూడవది దుర్జనుల సంగతి తో జాగార్టపడి ఉండండి
జిజ్ఞాసులు ఎక్కువగా చెయ్యవలసిన పురుషార్థమేమిటంటే తన అంతరాలలో ఉన్న మాలిన్యాన్ని దూరముచేస్తూ ఉండాలి, స్థూల మాలిన్యాలైతే కొన్ని ఆలోచనలతోనే దూరమవగలవు, కానీ సూక్ష్మ మాలిన్యాలు మాత్రము గురుకృప వలనే దూరమవుతాయి .
***********