శాంతి యొక్క రెండు గుటకలు (shanti ke ghunt)
పరమ భాగవత బ్రహ్మలీన్ పరమసంత్ పం- మిహిలాల్ జీ
రామాశ్రమ సత్సంగ, మథురా
<img src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/04/param-poojya-panditji-222x300.jpg" alt="" width="222" height="300" class="alignnone size-medium wp-image-58358" />
సుఖపడాలనే కోరిక
ఈ జీవితములో ఎవరు సుఖము కావాలని కోరుకోరు? ఎవరు ఈ జీవన్మరణముల నుంచి ముక్తి పొందాలని అనుకోరు? ఎవరు ఈ అజ్ఞానమనే అంధకారములో జీవితాన్ని సాగించాలని అనుకుంటారు? ఎవరి హృదయములో ఈ భవబంధాలనుంచి ముక్తి పొందాలనే కోరిక లేదు? కానీ మనము కోరినంత మాత్రాన ఇవన్నీ దొరకవు. సుఖంగ, శాంతిగ జీవించాలని కోరుకున్నా, దుఃఖాలను మరియు అశాంతిని అనుభవించక తప్పదు .
శాస్త్రాలు ఏమి చెబుతున్నాయంటే దుఃఖము యొక్క ముఖ్య కారణము అజ్ఞానము. మీ ఇంటిలో సకల సౌకర్యాలు వున్నా, ఎప్పటివరకైతే మీకు వాటి గురించి తెలియదో అప్పటి దాక మీరు ఆ ఇంటిలో సౌకర్యంగా ఉండలేరు మంచి రుచికరమైన భోజనము వున్నా ఆకలితో ఉండిపోతారు, చల్లటి మంచి నీరు వున్నా దాహము తోనే ఉండిపోతారు, ఇంకా అంతులేని ధనము వున్నా దరిద్రుడివనే పిలువబడతారు.
.
విపరీత దారి
మీకు తెలుసా ! అశాంతి అంటే ఏమటో, అశాంతితో మనము ఎందుకు దు:ఖిస్తామో ? అశాంతే అజ్ఞానము, అజ్ఞానమే దుఃఖము. శాంతియే జ్ఞానము. అందుకే అది సుఖము మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. లోకములో అందరు శాంతి కావాలని కోరుకుంటున్నారంటే దాని అర్థము ఏమిటంటే మనుషులు జ్ఞానము కావాలని కోరుకుంటున్నారన్నమాట. జ్ఞానము లభించగానే ఈ ప్రపంచము నిండుగా కనిపిస్తుంది, లేశమాత్రమైనా కష్టము కనిపించదు. ఎప్పుడైతే మనస్సులో శాంతి లోపిస్తుందో అప్పుడే వారిలో అర్థము చేసుకునే శక్తి నశించి తమ చేతులారా తమ కష్టాలను కొనితెచ్చుకుంటారు.
కోపము
నేను ఒక ముక్కోపిని చూశాను. ఎప్పుడైతే అతనిలో కోపము అనే భూతము ప్రవేశిస్తుందో అప్పుడు అతను పిచ్చివాడు అయిపోతాడు. ఇంటిలో సామాన్లు పగులగొట్టి, సరుకులన్ని విసిరివేసి కలగాపులగము చేసి భార్యను, పిల్లలను కొట్టి హింసిస్తాడు. ఒక్కోసారి సామాన్లు బావిలో పడేస్తాడు. అతని కోపము తగ్గాక అతను విసిరివేసిన సామాన్లు సర్ది పిల్లలను ఆసుపత్రికి తీసుకొని వెళతాడు మరియు బావిలో పడేసిన సామాన్లు తీసి దుఃఖిస్తూ పశ్చాతాపము పడతాడు. మీకు తెలుసా! ఇలా ఎందుకు అవుతుందో? కోపము ఒక అగ్ని, అది మనిషిని సమాంతర అవస్తలో ఉంచడానికి అత్యంత ఆవశ్యకమైనది.విషమ అవస్థకు చేరిందో భయంకర రూపము ధరిస్తుంది,ఇంకనూ దాని పొగ పైకి లేచి బుద్ధి క్షేత్రము లోకి ప్రవేశించి వివేకము, స్మృతి ,నిర్ణయము అనే మూడు శక్తుల పైకి ప్రాకిపోతుంది. అందువలన వివేకము నశించి చెయ్యకూడని పనులు జరిగిపోతాయి. స్మృతి లేకపోవడము వలన మునుపటి జ్ఞానమంతా మరచిపోతారు,ఇంకనూ నిర్ణయ శక్తి లోపించడము వలన ఏమి చెయ్యాలి అని నిర్ణయించుకోలేక పోతారు మరియు అస్సలు చెయ్యకూడని పనులు చేస్తారు.
కోపము ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా! ఆలోచిస్తే కోరికలే కోపానికి నాంది. మనిషి యొక్క మనస్సు ఏ విషయాలనైతే (కోరికలనైతే) అస్తమానూ తలచు కుంటూ ఉంటుందో, వాటి పైన ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి పెరిగి ఆ కోరికలు నెరవేరక పోతే చిరాకు వస్తుంది, అది కోపములోకి దారి తీసి బుద్ధిమందగిస్తుంది . అందు వలన సాధకుడికి మొదట చెయ్యవలసినది ఏమిటంటే కోరికలను ఆపాలి. కోరికలను ఎలా ఆపాలో మీకు తెలుసా? వీటిని ఆపడము అంత సులభమైనది కాదు, ఇవి ఎన్ని జన్మలనుంచో మనని అంటి పెట్టుకుని ఉన్నవి, అవి మన మనస్సు, బుద్ధి, చిత్తము(అంత:క రణము) లోనికి ప్రవేశించి పోయినవి. అందుకే మనస్సులోంచి లేక చిత్తములో నుంచి వీటిని తొలగించడము అంత సులభముకాదు. వీటిని ఎంతగా వదిలించుకోవాలన్నా అంతే తీవ్రగతి తో లోపలికి ప్రవేశిస్తుంది. ఈ కోరికలు కూడా ఒక రకమైన శరీరధారులే, ఇంకను చాలా శక్తివం తమైనవి కూడా. ఇవికూడా జీవించాలంటే వీటికి ఆహారము కావాలి. భోగాలే వీటికి ఆహారము, భోగాల ద్వారానే ఇవి పుష్టింప బడతాయి (బలపడతాయి). ఎవరిలోపలై తే ఈ కోరికలు బలపడ్డాయో వీటికి ఆహారము ఇవ్వడము మానెయ్యాలి. అంటే ఏ భోగలైతే వీటికి కావాలో అవి ఇవ్వకుండా ఉంటే, కొన్నిరోజుల తరువాత అవి నీరస పడి చాలా సుళువుగా మీ మనస్సులను (అంత: కరణను) వదలి వెళ్ళిపోతాయి.
శుభాన్ని పొందాలంటే
కోరికలు రెండు రకాలు గా ఉంటాయి. మొదటివి శుభమైనవి,రెండవవి అశుభమైనవి మొదట మీరు అశుభ కోరికలను ఆపి వెయ్యండి, శుభ కోరికలను నివసించనివ్వండి. అవే ఫలించి మంచి మంచి ఆలోచనలను పుట్టిస్తాయి. దేనివల్లనైతే మీకు ఆనందము లభిం స్తుందో . ఎప్పుడైతే మీ హృదయము ఈ దూషిత కోరికలకు దూరమై పవిత్రంగా అయిపోతుందో, అప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న మంచి మంచిఆలోచనలు,ఇంకనుజ్ఞాన భండారాలు మీ హృదయాంతరాలలోకి ప్రవేశించడము మొదలు పెడతాయి. ఎలాగైతే పూల సుగంధానికి భ్రమరాలుచేరువవుతాయోఅలాగేనిర్మలమైనమనిషిహృదయాంతరాలలోకి జ్ఞానము పరుగులు పెట్టి ప్రవేశిస్తుంది.
“సిమిట్ సిమిట్ జల భరహి తలావా,
జిమి సద్గుణ సజ్జన్ పహి ఆవా”
తాత్పర్యము ఏమిటంటే ఎలాగైతే నీరు ప్రవహించి చెరువు లోకి చేరుతుందో, మంచి గుణాలు కూడా మంచి మనుష్యుల్లోకి చేరుతాయి. ఇది ఒక సాధన, మనిషికి సాధన చాలా అవసరము, సాధనలేని మనిషి యొక్క హృదయాన్ని ఒక పూల తోటతో పోల్చవచ్చు, దేని కైతే కంచె లేదో. అందులో ఉన్న పూల మొక్కలను మేకలు, పశువులు మేసేస్తాయి. అందుకే సాధన లేని మనుష్యుల యొక్క అంతరాలలో శ్రేష్ఠమైన బుద్ధి ఉండదు, ఇలాంటి అంతరాలలో ఆస్తికభా వాలు కూడా ఉండవు. ఆస్తిక భావాలు లేని మనిషికి శాంతి దొరకదు. శాంతి లేకపోతే సుఖము ఎలా సంభవము?
శ్రీమద్ భగవద్గీతలో చాలా మంచి శ్లోకము ఉన్నది.
"ప్రసాదే సర్వదు:ఖానాం హనిరస్యో ప జాయతే .
ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి: పర్యవతిష్ఠతే" (2-65)
అనగా నిర్మలమైన మనస్సులోంచి సర్వ దు:ఖాలు మాయమైపోతాయి. ఇంకను ప్రసన్న చిత్తమైన మనిషి యొక్క బుద్ధి చాలా సుళువుగా స్థిర పడుతుంది. బుధ్ధి స్థిరపడటమే సాధన యెక్క ఆఖరి సిద్ధి. ఏ మనిషైతే ఏ పధ్ధతిలోనైనా తన లోపల నివసిస్తున్న బుధ్ధిని స్థిరపెట్టగలడో ఆ మనిషే తన అంత:కరణములో ఉన్న మహాత్ముని దర్శింప గలడు. యోగులు కూడా అత్యంత పరిశ్రమతో తమ మనస్సులను ఎప్పుడు పవిత్రము చేస్తారో అప్పుడు ఈశ్వర దర్శనము పొంద కలుగుతారు. మనుష్యులు సాధన, అభ్యాసాలు చేస్తూన్నా ఎవరి హృదయాలైతే పవిత్రంగా ఉండవో ఆ అజ్ఞానులకు భగవత్ దర్శనము ఎలా సంభవము?
మనస్సు యొక్క అపరిశుభ్రత
శరీరము స్నానము లేక, బట్టలు మాసిపోయి మలిన పడినట్లే, ప్రత్యేక తత్వము తమ నిజ స్వరూపములో ఉండదు, ఎప్పుడైతే అందులో వేరే తత్వము కలిసి మైల పడిపోతుందో. భూమి పైన మలినములు పడి భూమి మలిన పడినట్లే, నీటిలో మట్టి ఇతర పదార్థాలు కలిసి నీరు అపరిశుభ్రము అయినట్లే అగ్ని, వాయువు కూడా మలిన పడతాయి. ఆకాశములో కూడా ఎప్పుడైతే దుర్గంధము(ఏదైనా గ్యాస్) వాయువులో కలుస్తుందో అప్పుడు ఆకాశము కూడా నిర్మలంగా ఉండదు. ఆకాశముకన్నా మిన్నగా మనస్సు తత్వము ఉన్నది అందులో ఎప్పుడైతే అశుభ ఆలోచనలు నిండిపోతాయో, అప్పుడు ఆ మనస్సు కూడా మైల పడి పోతుంది (మలిన మౌతుంది).
మనస్సులో ఏ ఆలోచనైనా ఆగిపోయింది అంటే అది మనస్సుని దూషితము చేస్తుంది . అందుకే ఎప్పుడైతే మనస్సులో ఏ ఆలోచనా ఉండదో అప్పుడు ఆ మనస్సు పవిత్రంగా ఉంటుంది. ఆకాశంలో పక్షులు కలకలారావాలు చేస్తూ ఎగురుతాయో, ఆ శబ్దము కొద్దిసేపటిదాకానే ఉంటుంది, ఆ తరువాత తిరిగి ఆకాశము స్వచ్చంగా, నిశ్శబ్దంగా అయిపోతుంది. అలాగే ఆకాశములో విమానాల ధ్వని ఆకాశాన్ని కుదిపేస్తుంది, కొద్దిసేపటి తరువాత ఆకాశము నిశ్శబ్దంగా అయిపోతుంది. ఇలాగే మనస్సులో ఆలోచనలు పరుగులు పెడుతూ ఉంటాయి. ఆకాశము ప్రతి చోటా విస్తరించి ఉంది ,అందులోఅన్ని శబ్దాల ధ్వనులు ఉంటాయి అలాగే మనస్సు తత్వము కూడా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇందులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఆలోచనల రాక-పోకలకు ఒక మార్గము. మరి మనస్సు మీ అంతరంగములో కూడా విస్తరించి ఉన్నది కదా? ఆలోచనలు మీ మనస్సు లోంచే వెళ్తాయి. ఏ ఆలోచనలైతే మీరు ఇష్ట పడరో అవి నా మనస్సు లోనికి ఎందుకు వస్తున్నాయి అని మీకు చాలాదు :ఖముగా అనిపిస్తుంది. కానీ అవి అచ్చటనే స్థిరముగా ఉండవు. ఎలాగంటే ఒక మనిషి పాట పాడుకుంటూ ఉంటాడు, అది మీకు వినిపించాలనికాదు, కానీ వాటి తరంగాలు మీ చెవిన కూడా పడతాయి. మీ ఇష్టము, వాటిని వినవచ్చు లేదా మానెయ్యవచ్చు. మీరు ఆ స్వరాలను వినకపోయినా, పట్టుకోకపోయినా పాటైతే నడుస్తూనే ఉంటుంది, మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు కూడా అలాగే అనుకోండి, ఆకాశములో ఎగిరే పక్షులలానె. పాపము ఆ పక్షులు మాత్రము ఎక్కడ ఎగురుతాయి? అలాగే మనస్సు కూడా ఆలోచనలని ఒక స్థానము నుంచి ఇంకో స్థానానికి చేర్చే సాధనము. మనస్సు లేక పోతే శబ్దాన్ని వినగలరు కాని దాని గురించి ఆలోచించ లేకపోయేవా రు.
ఈ ఆలోచనలు మూడు భాగాలుగా విభజించ వచ్చును. అందులో కొన్ని చాలా మలినమైనవి. ఇవి "తమో" ప్రధానమైనవిగా ఉంటాయి. రెండవవి మంచివి మరియు పరిశుభ్రమైనవి, వీటివలన మనస్సుపైన మంచి ప్రభావము పడుతుంది. ఇవి "సత్" విచారాలని అనిపించుకుంటాయి. ఇలాంటి ఆలోచనలు పడ్డ మనస్సు సతోగుణ ములతో కూడినది అయిపోతుంది. వీటిని "ఆవరణ" అంటారు. మూడవవి ఈ రెండు ఆలోచనల కలయిక, వీటిలో రజోగుణ్ ప్రధానముగా ఉంటుంది.
ఈ ఆలోచనలు మనస్సులో నుంచి వెళ్ళినప్పుడు మనస్సు ఏ స్థితిలో అయితే ఉంటుందో దానిని "విక్షేప్" అంటారు. వీటిలో చాలా చపలత్వము ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు ఒక్క క్షణము కూడా ఆగకుండా ఉంటుందో, ఆ స్థితిని మనుస్సు యెక్క విక్షేప్ స్థితి అంటారు.
మీరు కళ్ళకు నల్ల కళ్ళద్దాలు ధరిస్తే తెల్ల వస్త్రం కూడా నల్లగా కనిపిస్తుంది,అదే రంగురంగుల అద్దాలు ధరిస్తే అదే వస్త్రం రంగు రంగులగా కనిపిస్తుంది . వస్తు యొక్క అసలు స్వరూపము మాత్రము మన శుధ్ధమైన కళ్లే చూడగలవు. తెల్ల అద్దాలు (సతోగుణీ మనసు) వస్తువును సరిగ్గా చూస్తుంది కానీ అప్పుడు కూడా కొంచెము తేడా అయితే ఉంటుంది. మనస్సులో ఏదైనా ఆలోచన ఆపేరంటే, మనస్సు తన అసలు లక్ష్యము నుంచి తొలగి పోతుంది.
రాజమార్గము అందరిదీ
మీ ఇంటిముందు ఉన్న మార్గము అది రాజమార్గము అది అందరిదీ, ఆ దారి పైన నడవడానికి ఎవరికీ ప్రతిబంధకము లేదు. మంచి వారు, చెడ్డ వారు అందరూ వెళ్ళుతూ ఉంటారు. మీరు మీ ఇంటి ముందర దారి పైన ఎవరూ నడవకూడదని, దుమ్ము ధూళి రాకూడదని, శబ్దాలు వినిపించకూడదని అనుకుంటే ఎలా సంభవము? ఎవరైనా అలా చేస్తే గొడవలు అయిపొతాయి. దారిన పోయే వారిని అడ్డగించకండి. మీరు మీ పని చేసుకోండి, వారిని వారి పని చేసుకోని వ్వండి, దాని వలన శాంతి ఉంటుంది. ఇలాగె మీరు మీ చిన్ని మనస్సు లో మీ గురించే ఆలోచించండి, వాటినే అనుసరించండి, ఎ వ్వరూ మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. అలా కాకుండా మీ పనుల కొరకు దారిన వెళ్లే వారిని ఆపినా, దారిని అడ్డగించినా చాలా గొడవలు అయిపోతాయి. మనస్సులో ఏ ఆలోచనలైతే వస్తున్నాయో, వాటిని దారిన వెళ్ళే వారని అనుకోండి, వాటిని వెళ్ళ నివ్వండి, వాటి వైపు ధ్యాస పెట్టకండి. మీరు మీ ఆలోచనల పైనే ధ్యాస పెట్టి, ఎక్కడకి వెళ్ళాలో అక్కడకి వెళ్లండి. మీకు కూడా మీతో పాటూ నడిచే వాళ్ళు దొరికిపోతారు.
చిన్ని బ్రహ్మాండము
ఈ మానవ శరీరము బ్రహ్మాండము యొక్క చిన్న నమూనా అని చెప్పబడినది. ఏదైతే ఈ బ్రహ్మాండములో ఉన్నదో అదే ఈ పిండం లో కూడా ఉన్నది. ఏ జ్ఞానమైతే పరమేశ్వరుని లో ఉన్నదో అదే మీ చిన్ని శరీరము లోపల కూడా ఉన్నది. ఇందువల్లనే, బ్రహ్మాండములో ఉన్న ఆలోచనలు అప్పుడప్పుడు మీ మనస్సులలో కూడా చూడ గలుగుతారు. కానీ అది ఎప్పుడు సంభవమం టే ఎప్పుడైతే మీరు మీ మనస్సుని ఒక వైపు కేంద్రీకృతము చేస్తారో. మీకు తెలుసా! సముద్రము యొక్క ఒక్క నీటి చుక్కలోకూడా సముద్రము లోని అన్ని గుణాలూ ఉంటాయి , ఇలాగే మీరు కనుక ఏ మిత్రునితో నైనా, ప్రియమైన వ్యక్తితో అయినా మన:పూర్వకముగా కలిసిపోతే మీ ఇద్దరి మనస్సు ఒక్కటైపోతుంది. అలాంటప్పుడు మీ మిత్రుని మనస్సులో ఉన్న భావాలన్నీ మీ మనస్సులోకి వచ్చేస్తాయి, తనులోనూ మీ లోనూ ఏ తేడా కనిపించదు. అలాగే భగవంతుని మీలో కలుపుకుంటారో, నిష్కపట భావము తో ఒక్కటైపోతారో అప్పుడు ఆ భగవంతుని యొక్క సంపూర్ణ రహస్యాలు మీకు తెలుస్తాయి.
ఆత్మ యొక్క రూపము
మనుష్యులు శాంతి యొక్క అసలు స్వరూపాన్ని అర్థము చేసుకో లేదు. వారు ఏమిటంటారంటే మొదట మీరు శాంతించండి, మనుస్సుని శాంత పరచండి, తరువాత ఈశ్వర భజన చెయ్యండి. వీరికి తెలియనది ఏమిటంటే శాంతియే ఆత్మ యొక్క నీడ అని .ఆత్మని ఒక వృక్షము అనుకోండి.శాంతి దీని నీడ .మీరు ఆ వృక్షము కిందకి వెళ్ళకుండా దాని నీడ యొక్క ఆనందాన్నిపొందగలరా? వృక్షములో మూడు గుణాలు ఉన్నవి . మొదటిది నీడని ఇస్తుంది, రెండవది ఫలాలని ఇచ్చి మన ఆకలిని తీరుస్తుంది ,మూడవది వాటిని చూడగానే మనస్సు ఉల్లాసభరితమౌతుంది .వృక్షాలు దీనికి బదులుగా మీ దగ్గర నుంచి ఏమీ ఆశించవు .వాటి జీవితము ఇవన్నీ ఇవ్వడానికె. ఇలాగె ఆత్మయొక్కస్వరూపము కూడా ,దాని శరణులోకి వెళ్ళగానే జన్మజన్మాంతర పాపాలు నశించి పోతాయి.
“ రామ నామ సుర తరు కీ ఛాయా
దు:ఖ భైయె దూర్ నికట్ జో ఆయా.”
తాత్పర్యమేమిటంటే రామ నామము దేవతల వృక్షము యొక్క నీడ. ఎవరైతే దాని దగ్గరకి వెల్తారో వారి దు:ఖాలు దూరమౌతాయి.
ఆత్మ యొక్క నీడలోకి చేరగానే మీకు జ్ఞాన రూపమైన ఫలము దొరుకుతుంది. దానిని రుచి చూడగానే జన్మ జన్మాంతరాల అజ్ఞానరూపమైన ఆకలి బాధ తీరి పోతుంది, హృదయము చల్ల పడిపోతుంది. మూడవ సుఖము ఏమిటంటే మీరు ఆ ఆత్మని అందరిలోనూ చూడగలిగితే ఆ ఆనందానికి అంతు ఉండదు. మీరు మనుష్యులలో రాగ ద్వేషాలతో కూడిన మాటలు విని ఉంటారు, దాని తో మీ ఆత్మ చాలా బాధ పడి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆత్మ యొక్క అపరూపమైన ఆ నాదము (అనహద్ నాదము) వింటారో, ఏ మధుర ధ్వని, మనుష్యులలోనే కాదు చెట్లల్లో, పురుగుల్లో, పశువుల్లో, పర్వత శిఖరాలలో ప్రతిధ్వనిస్తుందో దాన్ని వింటే మీరు మిమ్మల్ని మరిచిపోతారు, ఆనంద డోలికలలో మునిగిపోతారు.
జ్ఞానము అనే జలపాతము
ప్రియమైన జ్ఞానముముక్షులారా! మీరు ఎచ్ఛట దారి తప్పి తిరుగుచున్నారు ? మీరు ఎప్పుడైనా పర్వత యాత్ర చేసారా? అచ్చట అడుగడుగునా చల్లటి తియ్యటి నీరు జలపాతాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు నీటికొరకు ఎవ్వరినీ అడగవలసిన పని లేదు. అలా గే ఏ దారైతే మీరు నడుస్తున్నారో అచ్చట అడుగడుగునా పవిత్రమైన (శుధ్ధ జ్ఞానము) ప్రవహిస్తున్నది కానీ ఆశ్చర్యమేమిటంటే మీరు వాటివైపెనా చూడకుండా ఇంకా అయ్యో! దాహం అనుకుంటూ పరుగెడుతున్నారు. యవరొ మహాత్ముడు మిమ్మల్ని పిలుస్తున్నా, మీకు రెండు గుటకల నీరు తగించాలని చూసినా ఆ మహత్ముల మాటలను విశ్వసించకుండా, మీరు ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రవర్తన ఎంత దు:ఖకరమైనదో కదా!
మీకు యవరి పైనా విశ్వాసము కలగటము లేదు. విద్వాంసులు, సత్‌పురుషులు యొక్క వాణి నిజమనిపించదు. ఎక్కడదాకా అంటే ఎవరినైతే మీరు దేవుడని నమ్ముతున్నారో, ఆయన అవతారము, నబీ లేక పైగంబర్ అని పిలుస్తున్నారో వారి మాటలపైన కూడా శ్రధ్ధఉండదు.
చెప్పటమేకాదు ఆచరించాలి
మహాపురుషులు చెప్పినదేమిటంటే ఇలా చేస్తే మీకు శాంతి దొరుకుతుందని, ఆ వాక్యలను మీరు కంఠస్థము చేసేసుకున్నారు కానీ దానిని మీరు అనుసరించడములేదు , వారు చెప్పిన మాటలని ,మీరుకూడా చెబుతున్నారు.దీని వలన లాభముఏమిటి? ఇది ఎలాగుందంటే ఒక చిలుకకు మనము ఏమి నెర్పిస్తే అది అలాగే పలుకుతుంది .ఉదాహరణ _"చల్లటి నీరు తాగండి "ఈ వాక్యాన్ని పంజరములోని చిలుక పలుకుతూనే ఉంటుంది .కానీ ఆ చిలుకే నీరు త్రాగక దాహం తో మరణిస్తుంది .ఇలాగే ఈ మార్గము చాలా సులువైనది అయినా అది చాలా కష్టమైనది . అరే! మీరు మీ జీవితములో నిత్యమూ ఒక అడుగు ముందుకి వేసినా కూడా మీరు ఎంతో ముందుకు వెళ్ళిపోయేవారు. మహాపురుషులు ఏమిటంటారంటే భగవంతుడు మీకు ఒక్క అడుగు దూరాన్నెఉన్నాడు, దగ్గరగా అంటే అతి దగ్గరగా, అయినా కానీ చూడ లేక పోతున్నారు .
అర్థమైనదామీకు
మీరు ఎందుకు చూడలేకపోయారో దానికి కారణము మీకు అర్ధమైందా?కళ్ళు తమ కంటి కాటికను చూడలేదు , భగవంతుడు మీ అంతరంగములోనే ఉన్నాడు అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆ దేవుడు కూడా ఉన్నాడు మీరు ఏమి చేస్తారో అదే తనూ చేస్తారు, మీరు ఎదైతే భోజనము రూపములో సేవిస్తున్నారో ,మీరు ఎక్కడైతే నడుస్తున్నారో అక్కడే తనూ నడుస్తున్నారు ,ఇంకను మీరు మీ దేవుడు ఎలాగ కలసిపొయిఉన్నారంటే ఒకరినుంచి ఇంకొకరిని వేరు చెయ్యలేము .చక్కెరను ,దాని లోని తీపిదనాన్ని వేరు చెయ్య గలమా? మీరు చక్కర అయితే ఆ దేవుడు దాని తీపిదనము .మీరు శబ్దమయితే ఆ దేవుడు అందులో ఉన్న జ్ఞానము.
మనస్సు యొక్క అశాంతి
శాంతి అంటే ఏమిటంటే ఏ ఆలోచనలలో మనము చిక్కుకొని ఉన్నామో ,వాటిని కొంత సేపటి కొరకు వేరుచేయ్యడము. అశాంతిని తొలగించడానికి మూడు సార్లు “ఓం శాంతి “అంటే మాత్రము చాలదు. దాని కొరకే మనుష్యులు పెద్ద పెద్ద తపస్సులు చేసారు .ఇల్లూ ,వాకిలీ, సంతానము ,రాజ్యము వదిలి విపరీతముగా కష్టపడ్డారు .ఇంత చేసినా వారు శాంతి గురించి కొంచమే తెలుసుకో గలిగేరు. వారు తెలిపినది ఏమిటంటే మీరు ఇంటిలో ఉండి కూడా ఆ శాంతిని పొందకలరు .మాకు తపస్సు చేస్తూ చేస్తూ ఎలాగైనా మనస్సుని పవిత్రముగా ఉంచడము, దాన్ని స్థిరముగా ఉంచడము ఇవన్నీ చెయ్యాల్సి వస్తుంది, మరి అలాగ జరగలేదు. మీకు తెలుసా మనసు ఎందుకు శాంతిగా ఉండదో? అబద్ధాలు చెప్పడము మనస్సుకి నచ్చదు అంతేగాక అసత్యము మనస్సుకు దు:ఖాన్ని కలిగిస్తుంది, ఎవరైనా ద్వేషిస్తే మనస్సుకు నచ్చదు ఎందువలనంటే మనస్సు ద్వేషాన్ని అసహ్యించుకుంటుంది. మనస్సుకి యవరైనా కోపగిస్తే నచ్చదు, ఎందుకంటే అది క్రోధాన్ని సహించదు. ఇలాగే కామము హింస ఇష్టపడదు, ఎవరినైనా తూలనాడటం ,అన్యాయము చెయ్యటము ఇవన్నీ మనస్సు సహించదు . మనస్సుకి ఇవన్నీ భారాలు, వీటిని మొయ్యడము వలన మనస్సు అశాంతి పొందుతుంది ,అందుకే మనస్సు చపలంగా ఉంటుంది. ఎవరైనా, ఎవరికైనా అన్యాయము చేస్తే నిష్పక్షమైన మనస్సు భరించలేదు . అలాగే మంచి మనస్సు ఉన్న మనుష్యులను చూస్తే మీకు వారిపైన గౌరవము పుడుతుంది, ఎందుచేతంటే మీ మనస్సు కూడా ఇదే ఇష్ట పడుతుంది . మనస్సుకి కోరినది దొరికితే శాంతి దొరుకుతుంది .
మొదట, ఎ మనుషులకైతే దాహము అనిపించిందో వారు నీటిని కనుగొన్నారు. దాని కొరకు వారికి చాలా సమయము పట్టింది, చాలా కష్టపడ్డారు కూడా . ఆ నీటిని వెతకడములో వారు , చాలా అలసి పోయారు కానీ వారు ఎదో విధముగా నీటిని కనుగొన్నారు . వారి జీవితాలను సుఖమయం చేసుకున్నారు. ఆ తరువాత తరాలకు కూడా ఆ అమృత భాండము యొక్క శ్రోతము , ఎంతో దూరములేదు , చాలా దగ్గరే ఉందని చెప్పేరు . మీరు అటూ ఇటూ తిరగక మీ దాహాన్ని తీర్చుకోండి అని సంకేతము ఇచ్చివెళ్ళేరు . ఇది విజ్ఞాన యుగము. మంచి యంత్రాలు తయారు చెయ్యపడ్డాయి. మనము ఆ యంత్రాలను కొనుక్కుని వాటిని ఉపయోగించి సుఖపదతామా , లేక ఆ యంత్రాలను తయారు చేసిన వారి లాగ మనమూ తయారు చెయ్యాలని కష్ట పడతామా ?ఇవి తయారుచెయ్యడానికి వారికి చాలా సమయము పట్టి వుంటుంది,మరియు చాలా కష్టపడి వుంటారు కూడా ,కానీ మనము ఇప్పుడు ఆ దొరుకుతున్న ఆనందాన్ని ఎందుకు పొందకూడదు? ఉదా :-నది దాటడానికి పడవలు వసతిగ ఉన్నవి.పడవను తయారు చెయ్యాలని అనుకోక వాటిలో నుంచి దేనినైనా ఉపయోగించి నదిని దాటవచ్చు. పడవలో ఎక్కేటప్పుడు గుడ్డిగా ఎక్కకుండా ఆలోచించి ఎక్కాలి. ఎవరో అన్నట్లు ,”మహాత్ములు చేసినది చెయ్యకండి, చెప్పినది చెయ్యండి.”
ఇది సరైన విషయము కాదు
మనము ఏమి అనుకుంటామంటే ఒక వ్యక్తి సంసారాన్ని త్యజించాడు , దాని వలన అతనికి భగవద్దర్శనము అయినది .ఇంకో వ్యక్తీ వ్రతాలను ఆచరించినందువలన దేవుని దర్శనము అయినది, మనముకూడా ఇలాగే చెయ్యాలని అంటే అది సరి అయిన పధ్ధతి కాదు . వారికి అలాంటి పరిస్థితులు సంభవించినవి కనుక అలా చెయ్యవలసి వచ్చినది . ఉదాహరణ కి –“మీరాబాయి కి తన రాజమందిరాన్ని త్యజించ వలసి వచ్చినది . విషము త్రాగవలసి వచ్చినది. ఇవే ఈశ్వరుని దర్శనానికి కారణాలా ? గౌతమబుద్ధుడు మహారాణిని , పసికందు అయిన రాజకుమారున్ని, రాజ్యాన్ని, ప రివారాన్ని పరిత్యగించ వలసి వచ్చినది. ఇదే ఆయన పొందిన భగవత్ సాక్షాత్కారానికి కారణమా ?తులసీదాస్ తన భార్యని ,ధ్రువుడు తన తల్లి తండ్రులను పరిత్యజించాడు, ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించేడు, అప్పుడే ఈశ్వర దర్శనము లభించినది, అయితే ఇవన్ని చేస్తేనే ఈశ్వర దర్శనము లభిస్తుందా ? కాదు ,కాదు ఇవన్నీ వారికి వారి సాధనాలలో అడ్డంకులుగా అనిపించినవి. వీటిని త్యజిస్తేకాని సాధన కుదరలేదు కనుక ఇవి చెయ్యవలసి వచ్చాయి. మహాత్ముడు తులసీదాసు ఏమన్నారంటే
జాకే ప్రియ న రామ వైదేహి .
తజియే తాహి కోటి బైరీ సమ యద్యపి పరమ సనేహీ .
మరియు
తజో రే మన హరి విముఖాన్ కో సంగ్ .
జాకే సంగ కుబుధి ఉపజతి హై పరత భజన్ మే భంగ
ఎవరికైతే సీతారాములు ప్రియము కాదో అటువంటివారిని పరమ శత్రువుల లాగ త్యజించండి వారు మీకెంత ప్రియమైనా .
ఎవరి సాన్నిధ్యము వలన చెడు బుద్ది పుడుతుందో, దేవుడి భజన లో ఆటంకాలు వస్తాయో, మరియు ఎలాంటివారికైతే దేవుడి పట్ల విముఖత ఉంటుందో అలాంటివారి సాన్నిధ్యాన్ని వదిలి వేయండి .
దైవ ప్రార్థనకై ఇల్లు ,వాకిలి వదిలి వేయ వలసిన అవసరము లెదు .ఏ కారణాలవలన మీ దైవ కార్యాలలో ఆటంకాలు వస్తున్నాయో , తల్లి తండ్రులైనా అన్నదమ్ములైనా , భార్య బిడ్డలైనా , సిరి సంపదలైనా వాటిని త్యజించండి. మీకు సహాయంగా వున్నవారిని, మీ దైవ కార్యాలలో ఏవిధంగానూ ఆటంకాలు కలిగించని వారిని వదిలి వెయ్యటము ఏ మాత్రము సమంజసము కాదు . ,
.సంత్ ఇబ్రహీం
సంత్ ఇబ్రహీం ఒక రోజు తన హృదయాన్ని లోతుగ పరిశీలించారు , ఏ కారణం వలన భగవంతుడ్ని మనస్సులో నివసింపనియ్య లేక పోతున్నారని ? తను అన్నీ త్యజించినా, భగవంతుడు తన హృదయం లో ఎందుకు నివసించడములేదు అని, చాలా గంభీరంగా ఆలోచిస్తేతెలిసినదేమిటంటే అతనికి తన పుత్రుడు భగవంతుని కంటే ప్రియమైనవాడని. వెంటనే తన పుత్రుడిని భగవంతునికి అర్పించ నిశ్చయించుకున్నాడు . దీని అంతరార్థము ఏమిటంటే ఎదైతే మీకు అత్యంత ప్రియమైనదో దానిని దేవుడికి సమర్పించండి . హే ప్రభూ! ఇది మీ వస్తువే .నా మనస్సు దీనిని గట్టిగా పట్టుకొని వున్నది , దయ వుంచి దీనిని స్వీకరించండి .లోకులు ఏమంటారంటే ఇబ్రహీంతన పుత్రుడిని బలి ఇచ్చాడు .కానీ త్యజించడమంటే బలి ఇవ్వడము కాదు .ఏదైతే మీకు అత్యంత ప్రియమో దానినే ప్రభువుకుఅర్పించడము .మీరు దేవుణ్ణి ఇష్టపడుతున్నారు .దేవుణ్ణి ఇష్టపడేవారికి వేరే వాటిపైన ఆసక్తి ఉంటుందా?అరే !ఎవరైతే సంపూర్ణ సంపదల భండాగారమో ,ఎవరైతే సంపూర్ణ విద్యలకి కేంద్రమో ,ఎవరైతే సర్వ ఆనందానికి సాగరమో , ఆ దేవుడుని పొందితరువాతదేనిపైనైనఇంక ఆసక్తి ఉంటుందా?
అందువల్లనే ఇంట్లోనే వుంటూ కూడా వ్యామోహము వదిలి పెట్టమని మహాత్ములు శిక్షణ ఇస్తారు . వారు (మహాత్ములు)అటు ఇటు తిరిగే తీర్థాలు .మన ప్రక్కనే ప్రవహిస్తూన్న జ్ఞానప్రవాహాలు . వారి దగ్గర రెండు గుటకలు సేవిస్తే కూడా
జ్ఞానము దొరికిపోతుంది ,శాంతి కలుగుతుంది ,ఆనందం వెల్లివిరుస్తుంది .ఈ జ్ఞాన గుటకలు వారు ఉచితముగా అందిస్తూ వెళుతుంటారు .మీరు ఇంతకూడా చెయ్యలేరా , వారి మాటల్ని విశ్వచించి శాంతి యొక్క రెండు గుటకల్ని సేవించ లేరా ?
________________