Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

பின்

NAYE JIGYASUON KE LIYE

ప్రథమ శృంఖల....NAYE JIGYASUON KE LIYE
నూతన
జిజ్ఞాసుల
కొరకు

రచయిత
సమర్థ గురు
పరమసంత డాక్టర్. చతుర్భుజ్ సహాయ జీ

రామాశ్రమ సత్సంగ్, మథురా (యూ. పీ)

<img class="alignnone size-full wp-image-58336" src="http://www.gurudarshan.org/wp-content/uploads/2016/05/pp_guru_maharaj_1.jpg" alt="" width="215" height="293" />

నూతన జిజ్ఞాసుల కొరకు
మనిషి యొక్కఅంతరాలలో ఒక అలౌకికమైన శక్తి నివసించి వుంటుంది . ఈ శక్తి ప్రకటింపబడినప్పుడు మనిషి ఎలాంటి అద్భుతమైన పనులు చేసేస్తాడంటే వాటిని చూసి తనే ఆశ్చర్య పడతాడు . ఈశ్వర దర్శనము , మోక్షము ఇలాంటి అవస్థలన్నీమనస్సుయొక్క శక్తి పైన ఆధార పడి ఉన్నవి .ఎ మహాపురుషులైతే ఈ శక్తిని పొంద కలిగారో వారు ప్రపంచములో పూజింప బడటమే కాక పారమార్థిక క్షేత్రాలలో కూడా అన్నీ పొందారు.
ఈ శక్తి యొక్క సాక్ష్ట్కారము కొరకు ఎ సాధనలయితే ఆవసరమో వాటిలొ ముఖ్యమయినది ఏకాగ్రత . సాక్షాత్కారము పొందడానికి అన్నింటికన్నాముందు మనస్సుని రక-రకాల ఆలోచనల నుంచీ తప్పించి ఒకే ఆలోచన పైన కేంద్రీకరించడము , ఒకే ఆలోచన వద్ద స్థిరపడుతుందో అప్పుడు దానిని కూడా వదిలి వెయ్యడము.
ఎప్పుడైతే మనము అన్ని ఆలోచనలను తొలగించి మనస్సుని మరియు చిత్తమును పరిషుభ్రాముగా, నిర్మలంగా చేసేస్తామో,అప్పుడే మనకు ఆనందమయమైన ఆ విశ్వమూర్తి దర్శనము లభించడము మొదలవుతుంది. మనస్సు ఒక గంభీరమైన జలాశయము లాంటిది ,ఎందులోనైతే ప్రతిక్షణము కోరికల తరంగాలు ఎగసి పడతాయో,ఆ తరంగాలను ఆపి కామము, క్రోధము ,లోభము,మద మోహము అనే వాయు ప్రవాహాల ప్రభావము పడకుండా ఆ జలాశయాన్ని సురక్షితము చెయ్యండి. ప్రేమ ,భక్తీ అనే గోడ కట్టి ఈ కోరికల తుఫాను ప్రభావముతో దానిలో కదలిక రానివ్వకండి ,అప్పుడే ఆ జాలములో మీకు మీ,ఇంకను మీ ప్రియతముల ముఖము కనిపిస్తుంది .ఎప్పటిదాకా జలము (మనస్సు) కదులుతూ ఉంటుందో ,అందులో కోరికల తరంగాలు పుడుతూ ఉంటాయి ,అప్పటి దాకా , లక్షప్రయత్నాలు చేసినా సరే, పరిశ్రమ చేసి-చేసి అలిసిపోయినా ఏ పరిణామము దొరకదు.
మీరు భక్తీ ఇంకా ప్రేమమర్గము మీద నడిచి మీ ఇష్టదేవుడు దరికి చేరినా, లేక మీరు యోగము ఇంకను పూజ పునస్కారాలు చేసి దేవుని సాక్షాత్కారము పొందాలనుకున్నా లేక జ్ఞాని అయి తత్వాలను శోధించినా మనస్సును ఏకాగ్రతలో ఉంచడము అవసరము .మనస్సుని సాధించకుండా మనస్సులోని వృత్తులను (ఆలోచనలు)నశించకుండా ,వీటిలోంచి ఎ మార్గము ద్వారా వెళ్ళినా సరే మీకు సాఫల్యము లభించదు. పతంజలి మహర్షి యోగాన్ని ఇలా పరిభాషించారు యోగశ్చిత్త వ్రుత్తి నిరోధః . చిత్తములో ఉన్నవృత్తులు (ఆలోచనలు)పూర్తిగా నశించినప్పుడే యోగము కుదురుతుంది . యోగము అంటే కలవడము.గీత లో భగవంతుడు- భక్తీ యోగము, సాంఖ్య యోగము ,కర్మ యోగము మరియు జ్ఞాన యోగము ఇలాంటి ఎన్నో రకాల యోగాల గురించి చెప్పారు ,వీటి అన్నింటి కొరకు మనస్సు యొక్క ఏకాగ్రత అత్యంత అవసరము .మనస్సుని లగ్నము చెయ్యకుండా సాంసారిక కార్యాలు కూడా పూర్తి చెయ్య లేము కదా ! మరి అలాంటప్పుడు ఇంతటి సూక్ష్మమైన, దుర్లభమైన పారమార్థిక జ్ఞానము ఎలాపొందగలము ?
యమ్ , నియమ్ ,ఆసన్,ప్రాణాయామ్ ,ప్రత్యాహార్, ధారణా, ధ్యాన్ మరియు సమాధి ఇవి యోగము యొక్క 8 అంగాలు . ఈ 8 అంగాలను సాధన చేస్తేనే యోగ శరీరము బలపడుతుంది ,అభీష్టము దాకా చేరుస్తుంది .మొదట ఒక అంగాన్ని పట్టుకొని దాన్ని సాధించి ,తర్వాత రెండవది పట్టుకోవడము, ఈ పద్దతిగా వెళ్ళితే జన్మలు గడచి పోతాయి కానీ మనకు సాఫల్యము దొరకదు .అన్ని అంగాలను ఒక్కసారే సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉండడము ,ఇదే తొందరగా పని పూర్తి చేసుకునే పద్ధతి .

ఆత్మప్రాప్తి లేక ఈశ్వర సాక్షాత్కారము కొరకు ఏ ప్రయత్నాలైతే మనిషి చేస్తాడో అవన్నీ “సాధన “అనిపించుకుంటాయి . సాధన యొక్క ఉద్దేశ్యము మనస్సు యొక్క చపలత్వాన్ని నష్టపరచి దాన్ని ఏకాగ్రత లోకి తీసుకుని రావడము,మరియు చిత్తము లోని వ్రుత్తులన్నింటిని నిరోధించడము అయినప్పుడే దర్శనము లభిస్తుంది ,పరమాత్ముడుతో సంపూర్ణ యోగము అవుతుంది .యోగము అవ్వగానే జీవుని అన్ని క్లేశాలు విడిపోయి బంధాలు దూరమవుతాయి ,ఇంకనూ పూర్ణ జ్ఞానము లభిస్తుంది.పతంజలి మహర్షి ఇలా వ్రాశారు “వ్రుత్తి సారూప్య మితరత్ర “ ఈ అభిప్రయముతోటే సాధన చెయ్య పడుతుంది మరియు నిరోధము కలిగినప్పుడు అది పూర్తి అయిపోతుంది ,అప్పుడు అది సాధన అనిపించుకోకుండా సిద్ధి అనిపించుకుంటుంది.
మనుష్యుల యొక్క ఆలోచనలు ,వారి భావాలు ,వారి రుచులు ,వారి కర్మలు ,వారి సామర్థ్యాలు ,వారి సంస్కారాలు ఇవన్ని వేరు-వేరుగా ఉంటాయి .ఒక దానితో ఇంకో దాన్ని పోల్చలేము. అందువలనే ఉద్దేశ్యము ఒక్కటే అయినా భిన్నమైన సాధన పద్దుతులు తయారు చేయ బడ్డాయి. ఒక్కటే క్రియతో అందరికీ లాభము దొరకదు.వీటిలో లక్ష భేదాలు వున్నవి ,కానీ అవన్నీ ఈ మూడింటిలోనే అంతర్గతమై వున్నవి –కర్మ యోగము,ఉపాసన యోగము మరియు జ్ఞానయోగము .
కర్మ యోగము _ఇందులో ఇంద్రియాలని ఇంకను శరీరాన్ని కూడా పొందుపరచి మనస్సు పని చేస్తుంది.ఇంకను జీవాత్మ ఈ పని కొరకు తనని కర్త అనుకుంటుంది .హట యోగము ,తంత్ర యోగము,శబ్ద యోగము ,జప యోగము,ప్రాణ యోగము, ముద్రలు ,ఆసనాలు ఇవన్ని కర్మ యోగములు
ఉపాసన యోగము_ఉపాసన కేవలము మనస్సు తోనే చెయ్య బడుతుంది .ఈ యోగములో ఏ బాహ్య క్రియలు ఉండవు ,ఇంకను ప్రాణి తనని కర్త అని భావించడు .ధ్యాన్ ధారణా ,ఏకాగ్రత మరియు నిరోధము ఇవన్నీ ఉపాసన లో కి వస్తాయి .ఉపాసన మరియు భక్తీ-ప్రేమ యొక్క మార్గములు .ఉపాసన మార్గములో సాధకుడు ఏ ఆలోచనలతొ వెళ్ళతాడంటే ప్రభువు దూరంగా లేడు తనకి అతి దగ్గరగా ఉన్నాడని,ఇంకను మన నిజ స్థానము లోనే (హృదయము –దేశము} నివసిస్తాడు .మనస్సుని అన్ని వైపుల నుంచి తొలగించి ప్రభు చరణాలలో పెట్టడము ,మరియు తమ ప్రియతములను హృదయ స్థానము లోనే వెతకడమే ఉపాసన అనిపించుకుంటుంది.ఎప్పుడైతే తమ ఇష్ట రూపాన్ని ధారణ చేసి (ధరించి )చిత్తాన్ని (మనస్సుని )నలు వైపులనుంచి తీసుకొని వచ్చి దీనిపైన పెట్టి ఉంచినప్పుడు యమ్ ,నియమ్ ,ఆసన్ ,ప్రాణాయామ్ మరియు ప్రత్యహార్ సాధనలు కూడా వాటంతట అవే అయిపోతాయి .ధారణ లో మునిగిపోవడాన్ని ధ్యానమని అంటాము .ఈ ధ్యానములోనే మునిగిపోవడాన్ని సమాధి అంటాము (ఏదయితే ముందుకు వెళ్లి అనేక రూపాలలో మారిపోతుందో) .ఈ విధముగా ఉపాసన ,యోగము యొక్క కుండలిని మేల్కొలిపి దానిని ఉత్థానము (పైకి లేపడము)చేస్తుంది ,మరియు యోగ దర్శనము యొక్క అష్టాంగ యోగాన్ని కూడా పూర్తి చేస్తుంది ఇవన్ని వారీకే సంభవము ఎవరైతే వృత్తి ఆలోచనలను అంతర్ముఖి చేసి హృదయాంతరాలలో ఉపాసన చేస్తారో .బహిర్ముఖి ధ్యానము చేసేవారు (జపము,పూజ ఇత్యాది బాహ్య కర్మలు చేసేవారు)వీటిలోనుంచి ఏమీ పొందలేరు .ఎందుకంటే ఇవన్ని అంతరంగికమైనవి .
జ్ఞానయోగము _ జ్ఞాన యోగము మనస్సుని ఏకాగ్రత చేసిన తరువాత బుద్ధి ద్వారా చేయ బడుతుంది .దీని సాధనమార్గము స్వాధ్యాయము ,సత్సంగము మరియు వివేకము ,అన్ని సాధనలు ఇక్కడ దాక వచ్చి పూర్తి అవుతాయి .దీని తరువాత ప్రేమ యోగము లేక సమర్పణ యోగము ,ఎదైతే సాధన కాదు సిద్ది .కర్మయోగము,ఉపాసన యోగము మరియు జ్ఞానయోగము ఈ మూడింటిలోనూ మధ్యదైన ఉపాసన యోగము శ్రేష్టమైనది ఏదైతే ,త్వరిత గతిన చేర్చేది,త్వరిత గతిన ఫలితమిచ్చేది మరియు సులభమైనది
మన పద్ధతి _వాటి విషిష్టతలు

ఈ మాత్రము పని కొరకే మనుష్యులు ఏమేమి పనులు చేస్తారో .సంసారాన్ని త్యజించి ,పర్వత గుహలలోకి వెళ్లి ఉండడము ,కఠినమైన తపస్సులు ,ఉపవాసాలతో శరీరాన్ని శుష్కించడము కఠినమైన ఆసనాలు ,ప్రాణాయామాలు లాంటివి చేసిన ఏమి లాభము పొందలేక పోతున్నారు .మా పద్ధతి ద్వారా ఈ పని ఎంత సునాయాసంగా అవుతుందంటే దాన్ని విని అందరూ ఆశ్చర్య పడతారు .ఈ నూతన పద్దతి కర్మ, భక్తి మరియు జ్ఞానము యొక్క మిశ్రమము . స్త్రీ పురుషులు , వయోవృద్ధులు ,విద్వాంసులు నిరక్షరాస్యులు ,గృహస్తులు ,విరక్తులు ,జాతి భేదాలు లేకుండా అందరూ ఎంతో సులభముగా దీనిని చెయ్య గలరు .మత ధర్మ భేదాలు కూడా వీటికి అడ్డు రావు ,ఎందుకంటే ఎచ్చటైతే మత,ధర్మ భేదాల సీమ సమాప్తమవుతుందో, అచ్చటి నుంచే ఈ పద్ధతి ప్రారంభమవుతుంది .ఇది చెప్పడానికి మాకు ఎటువంటి సంకోచాలు లేవు .ఈ నూతన పద్ధతిని అనుసరించిన సాధకులు ,ఈ పద్ధతి ద్వారా ఉపదేశము పొందినవారు మరియు వీటిని నియమ బధ్ధతతో పాటించిన జిజ్ఞాసులు కొద్ది కాలము లోనే ఎంత ఉన్నతి పొందేరంటే ,ఎవరైతే పాతిక సంవత్సరాల పాటూ యోగిక క్రియలు చేసిన వారు ,సంసారాన్ని త్యజించి వనవాసాలకు వెళ్ళిన తపస్విలు కూడా వీరితో పోటి పడలేరు. ప్రారంభములోనే సాధకునికి ఎలాంటి అనుభవము కలుగుతుందంటే వారి మనస్సుని ఎదో శక్తి బలంగా పట్టేసిందని ,వారి మనస్సు యొక్క వేగము ,చపలత్వము నశింపబడ్డయని మరియు అది ఏ పనిలోనూ విఘ్నము కలిగించడము లేదని .నిత్య ఆబ్యాసముతో ఈ స్థితి మరింత ముందుకు వెళ్తుంది .కొద్ది కాలము లోనే సమాధి యొక్క ఆనందాన్ని పొందడము మొదలు పెడతారు .
ఈ సాధన కొరకు జిజ్ఞాసులకు ఒకటి , రెండు సారులు గురువు సమ్ముఖంగా కూర్చుని క్రియను చెయ్యవలసి వస్తుంది .గురువు తన ఆత్మ శక్తిని శిష్యునిలో ప్రవేశింప చేస్తాడు .ఆ ఆత్మ బలముతో శిష్యునికి సహాయపడి
అతని చపలమైన మనస్సుని స్థిరపరుస్తారు .శిష్యుడు ఈ పధ్ధతి లోనే స్వయం అభ్యాసము చేస్తూ ముందుకు వెళతాడు .తిరిగి ఎప్పుడైనా మనస్సుయొక్క చపలత్వము పెరిగి ,దానిని అదుపులో ఉంచని పరిస్థితి లో గురువుగారు తిరిగి సహాయము చేస్తారు. దీనికొరకు గురువుగారి సమ్ముఖము లోకి వెళ్ళ నవసరము లేదు ,వారు ఎంత దూరములో ఉన్నా వారి శక్తి తక్షణమే సాధకుడికి సహాయపడి శాంతి యొక్క అనుభవాన్ని కలిగిస్తుంది ఇది ఈ నూతన పద్ధతి లోని విశిష్టత.
ఈ శిక్షిత సమాజములో కొందరికి గురు శిశ్యులసంబంధము అంటేనే అసహ్యము పుడుతుంది. దీనికి కారణము గురువుల్లో ఉన్న ధన వ్యామోహము, శిష్యుడు తో పొందే సేవలు. మన గురువుగారు ఈ పద్ధతిని తొలగించారు, వారు చెప్పేదేమిటంటే ఎవరూ గురువు కాదు, ఎవరూ శిష్యులు కాదు, అందరూ సమానులే, అందరూ మిత్రులే, అందరు సోదరులే, ఈ భావము తోనే నేర్పే పధ్ధతి మన సత్సంగములో నడుస్తుంది. గురువుగారు అనేదేమిటంటే నిష్కామభావము తో అందరికి సేవ చయ్యమని అందరూ మనవారే అని అనుకోమని , బదులుగా ఏమి ఆశించ కూడదని. భేద భావములను తొలగించడమే ప్రేమ ఇలాంటిప్రేమే ఈశ్వరుని యొక్క స్వరూపము.
సాధన లో చెయ్య వలసిన మరియొక పని ఏమిటంటే, హృదయము పైన పేరుకొని ఉన్న మలినాన్ని తొలగించి హృదయాన్ని
శుభ్రపరచాలి .మనస్సు పైన అధికారము చేసే విషయము ఎదైతే చెప్పబడిందో దానితో విక్షేపము దూరమౌతుంది .విక్షేపము దూరమైనాకానీ మలీనము ఇంకను పొరలు అంతఃకరణము పైన ఆవరించి ఉంటాయి, దానికారణముగా ఆత్మ యొక్క ప్రకాశము లోపల దాగి అంధకారము అలుము కుంటుంది’. ఈ అంధకార కారణముగా అశాంతి మరియు దు:ఖములో జీవుడు ఉంటాడు ,ఇందుకే భగవత్ దర్శనము కొరకు మలినము పొరలు తొలగించే అవసరము ఉన్నది .ఇవి దూరం అయ్యే కొలది భగవంతుడు మనకు దగ్గరై దాని తో ఆనందము లేక ప్రకాశవంతమైన కాంతి దొరుకుతూ ఉంటుంది .
ప్రాణాయామము ,జపము,తపము,ధ్యానము ఇత్యాది యోగిక పద్ధతులు చలనములో ఉన్నాయో ఇవన్నికూడా ఈ పనే చేస్తాయి .జన్మజన్మా న్తరాలుంచి వచ్చిన మంచి, చెడు కర్మలు బీజరూపములొ సూక్ష్మముగా మనలోపల నిండి ఉన్నవి .వీటినే సంస్కారము అంటాము .ఈ సంస్కారాల పోగు ఎప్పడ దాకా అయితే తొలగిపోదో ,దగ్ధింపబడదో,అప్పడిదాకా దర్శనము సంభవము కాదు ,యిది సిద్ధాంతము
ఈ పని మా సత్సంగములో చాలా సుళువుగా చెయ్యబడుతుంది .శిక్ష ఇచ్చేవారు సాధకుడుయోక్క అంతఃకరణము పై తన ఆత్మ యొక్క ప్రకాశాన్ని ప్రసరిస్తారు , దాని ద్వారా వారి అంధకారాన్ని దూరము చేస్తారు ,ఈ ప్రకాశములో జ్ఞానము ,ఆనందము ఉన్నవి .ఇలా చెయ్యగా శిష్యుడు తన దు:ఖాలకు దూరమై ,ఆనందములో విహరిస్తాడు,శాంత సముద్రములో ములిగి తేలుతాడు .ఈ స్థితి కూడా మొదటి రోజు నుంచే దొరకడము ప్రారంభిస్తుంది .యోగులకు ఎదైతే 50 సంవత్సరాలలో కూడా లభించదో ,” ఇది మా సత్సంగము యొక్క రెండవ కానుక “ .
గురువుగారు తన శక్తి ద్వారా మెల్ల మెల్లగా వారి హృదయాల మలినాన్ని తొలగింస్తారు కానీ కొద్ది సమయము తీసుకుంటారు ,ఎందుకంటే తొందరగా చెయ్యడము వలన శిష్యుడికి ,హాని కలగ గలదు .కానీ ఎవరి హృదయ క్షేత్రమైతే పవిత్రంగా ఉంటుందో ,వారికి ఎక్కువ సమయముతీసుకో కుండా అతిశీఘ్రంగా వారిని ప్రభు యొక్క సాన్నిధ్యాన్నికి చేర్చేస్తారు .
మా సత్సంగములో సమయము, తక్కువ పరిశ్రమతో ఈ విశేషతలన్నీ లభిస్తాయి.గురు యొక్క ఆశ్రయములో వెళ్లి కూర్చోవడమే, శిష్యుడి యొక్క కర్తవ్యము .తరువాత గురువు అన్నీ తనపై భారము వేసుకుని చేస్తారు .ఇందులో శిష్యుడు దృష్టా (చూసేవాడు),గురువు కర్త (చేసేవారు).
ఎందుకంటే ఇందులో గురువుపై ఆశ్రితులై ఉండవలిసి వస్తుంది .అందుకే దీనిని సమర్పణ యోగము అన వచ్చు ,ఇంకను ఇందులో వ్యవహారము యొక్క ఆర్జన చేస్తూ రెండింటిని సమరేఖలో తీసుకు రావలిసి వస్తుంది ,ఇందుకే దీనినీ సామ్య యోగము ,అని కూడా అనవచ్చు ఇది భగవద్గీత యొక్క అనుభవపుర్వాకమైన సాధన (ప్రేక్టికల్).చదవడము,అప్పచేప్పడము ,దానిని అర్థము చేసుకోదము ఒక ప్రక్క అయితే ,వాటిని పాటించి మన జీవితాలని ఆ పద్దతిగా జడపడము ఇంకొక వైపు .ఇలాంటి మా పద్ధతి ,స్వభావాల్లాన్ని మార్చి ప్రేమమయమైన జీవితాన్ని ఇస్తుంది .విచిత్రమైన దైవ శక్తి యొక్క ప్రేరణ వలన ఇలా జరుగుతుంది .
ఇదే ఆత్మ జ్ఞానము యొక్క అత్యంత శ్శ్రేష్టమైన ,సులభమైన మరియు ఉత్తమమైన సాధన .దీని పేరే ఆధ్యాత్మిక యోగము లేక “ఆత్మ యోగము”.నా విశ్వాసము ఏమిటంటే ఎవరైతే ఈ స్వర్గమునుంచి వచ్చిన పతిత పావన ధారలో శ్రద్ధ మరియు విశ్వాస పూర్వకముగా ములిగి తేలుతా రో వారు తప్పక కృతార్ధులు అవుతారు.