Login with OTP

Enter your mobile number to receive OTP

+91
Demo mode: OTP will be shown in response

Update Your Name

Install Guru Darshan app

ପଛକୁ

Manushya jeevan ki pashuta aur vivek

రామాశ్రమ సత్సంగ్, మథురా (యూ. పీ)

మానవ జీవితంలో పాశవిక ప్రవృత్తి మరియు వివేకము

సమర్థ గురు పరమసంత డాక్టర్. చతుర్భుజ్ సహాయ జీ

మానవ జీవితంలో పాశవిక ప్రవృత్తి మరియు వివేకము

ఈ సంసారము లో జరుగుతున్న   ప్రతి సంఘటనని అతిసూక్శ్మమైన దృష్టి తో చూడడము , దానిని గమనించడము ఇంకా చివరికి ఒక ముఖ్యమైన పరిణామము దాకా చేర్చడము వివేకము అనిపించుకుంటుంది. వివేకము వల్ల బుద్ధి వికసిస్తుంది. జ్ఞాన నేత్రాలు విచ్చుకుని  ,సంసారము యొక్క వాస్తవిక రూపము ప్రత్యక్షం అవుతుంది,ఇంకా దీనివల్లే వైరాగ్యము మరియు ఉదాసీనత చిత్తములో కలుగుతాయ. వివేకము వల్ల మనిషికి వారి స్థితి అర్థం అవుతుంది  , మరియువారి బలము,సామర్థ్యము యొక్క జ్ఞానము కలుగుతుంది .తనకి చెయ్య వలసిన కర్తవ్యాలు కనిపించడము మొదలు పెడతాయి ఇంకా ఆ వివేకమే ,అంతర్చక్షులను తెరిచి,సన్మార్గమువైపుకి  తీసుకుని వెళ్తుంది.

వివేకము ఒక శక్తి ఎదైతే ప్రాణి యొక్క మస్తిష్కములో ఉంటుందో ,అది ఉదయించగానే జ్ఞానశక్తి (బుద్ధి) లో తీక్షణత వస్తుంది,అది సంసారములో ఉన్న ప్రత్యెక పదార్థము యొక్క యథార్థ రూపాన్ని  చూసే యోగ్యత కలిగిస్తుంది. సూక్ష్మ బుద్ధి వల్ల సూక్ష్మ తత్వాలయొక్క  జ్ఞానము లభిస్తుంది , మరియు అదే వాస్తవిక జ్ఞానము, ఆత్మదర్శనము కలిగిస్తూ మోక్షము కలిగిస్తుంది.  వివేకహీనులు ఎప్పుడూ జ్ఞానవంతులు కాలేరు . వివేకహీనులు  ఎలాంటి పశువు తో సమానము అంటే - ఎవరిలో అయితే మస్తిష్కము ఉన్నా, తన కోసము ఏమి ఆలోచించ లేరు , ఇంకను సమాజములో  తన కర్తవ్యముఏమిటి అని  కూడా తెలుసుకోలేరు  . పశువు తన మేత  కోసము గడ్డి వెతుక్కోవడము , గడ్డి తినడము పడుకోవడము ఇంకనూ పేడ వెయ్యడము, ఈ నాలుగు పనులూ పశువు తన బుద్ధి తో చేస్తుంది , మిగిలిన పనులు ఏవైతే చేస్తున్నట్లు కనిపిస్తాయో అవిఅన్నియు తన ఇష్టం తో చేసిన పనులు కావు. అవి ఎవరో బుద్ధిమంతుని  యెక్క ప్రేరణ, ఇంకా భయము యొక్క ఫలితము. ఇప్పుడు ఇదే దశ మనది  కూడా అయిపోతోంది . మనము వివేక శక్తి కోల్పోయాము  , మన  బుద్ధి పనికిరానిది అయిపొయింది. మరియొకరి  అలోచనలు మన  మెదడులో తిరుగుతూ ఉంటాయి ఇంకా పొరబాటుగా మనము  ఆ ఆలోచనలు  మనవే అనుకుంటాము .మనము ఎంత మూర్ఖులము అయిపోయామంటే , ఆ పశువుల లాగ  ఆ నాలుగు  పనులు  _భోజనము కొరకు కష్ట పడడము,తినడము ,పడుకోవడము , నిద్ర, మలత్యా గము ఇవేకాకుండా  మన ఆలోచనలు కలలో  కూడ మరోవేపుకి వెళ్ళవు ,ఇంకా దాని అవసరము కుడా అర్ధము చేసుకోము  .మనిషి  యొక్క పశుత్వము ఇదే అనిపించుకుంటుంది , ఎదైతే  వివేకము లేక పోదము వల్ల మనలో పుడుతుందో.

యోగము యొక్క సాధన, ధారణ ఇంకా ధ్యానము , బుద్ధి కి సంబంధించినవి కావు  . అది మనస్సు  యొక్క సాధన. దీనివల్లే మనసు లో ఏకాగ్రత ఇంకా శాంతి కలుగుతుంది , దాని చపలత్వము ఆగిపోతుంది. ఎలాగైతే తుఫాను వచ్చి నప్పుడు దాని వేగము మూలాన మనిషి మెదడు పాడైపోతుందో, అలాగే మనస్సు  అశాంతిగ  ఉన్నప్పుడు  మనిషియొక్క బుద్ధి  ఏ పని చెయ్యలేదు .ఇందుకే బుద్ది పనిచేయ్యడానికి  ,దాన్ని తీవ్రము చెయ్యడానికి మనిషికి సాధన అవసరము .  అభ్యాసము చేస్తూ -చేస్తూ బుద్ధి తీవ్రము అవుతుంది  ఇంకా అందులో ఉన్న  గూఢ  రహస్యాలు అర్ధము చేసుకునే శక్తి రావడము మొదలు అవుతుంది, దానివల్లే సంపూర్ణ  త్యాగి అయిపోతారు. ఎక్కడయితే ఏకాగ్రత లేదో అక్కడ జ్ఞానము లేదు.

ధారణ ఇంకా ధ్యానము యొక్క అభ్యాసముతో శాంతి ఎలాగూ  దొరుకుతుంది . ఇలాంటి అభ్యాసము చేసేవాళ్ళకి రక -రకాల సిద్ధులు ,శక్తులు కుడా లభిస్తాయి కానీ దీని వల్ల వివేకము వికసించదు . వివేకము వికసించడానికి సత్సంగము యొక్క అవసరము ఉంటుంది. సత్సంగము  అంటే మహాపురుషుల సమీపములో కూర్చుని,వాళ్ళ ఉపదేశాలని గ్రహించడము . సత్పురుషుల వాక్యాలు  , హృదయ గ్రంథిని విప్పుతాయి . వారి శరీరము ఇంకా ఆత్మ నుండివచ్చే విద్యుత్ ధారలు శిష్యుడులోకి ప్రవేశించి ,వారి హృదయపు పొరలు  ఛేదించి శిష్యుడుకి ప్రకాశము ఇస్తుంది.

ఈ విధముగా అతను చాలా సుళువుగా అంధకారమైన చంద్ర లోకాన్నుండి పైకి ఎక్కి ,జ్యోతిర్మయమైన సూర్యలోకము లోకి చేరి పోతాడు .ఆ ప్రకాశములోనే ఆ మనిషికి సత్పథము /సన్మార్గము కనిపించడము మొదలుపెడుతుంది , మరియు సాధకుడు ఆ మార్గము మీద నడవడానికి సిద్ధము  అయిపోతాడు . ఇలాంటి సాధకుడిని "ముముక్షు " అంటారు . దీని అర్ధము ఏమిటంటె మాయల బంధనాల నుండి ముక్తి యొక్క కోరిక   పేట్టుకునేవారు. ముముక్షు కొరకు  వివేకము , వివేకము కొరకు సత్సంగము చాలా  అవసరము . అందరు సంత్ మహాపురుషులు  ఇదే అన్నారు .రామాయణములో గోసాయిజీ కూడ  ఇదే అన్నారు

బిను సత్సంగ్ వివేక న హొఈ

తాత్పర్యము ఏమిటంటే సత్సంగము లేక పొతే వివేకము ఉండదు. ఇందుకే జ్ఞాన చక్షులు తెరుచుకోవడానికి పరమ ఈశ్వరీయ తత్వముయొక్క సాక్షాత్కారము పొందడానికి మరియు భవసాగరము దాటి ముక్తి ధామముదాకా  చేరడానికి అభ్యాసముతో పాటు సత్సంగము కూడ  అవసరము. ఏ సాధకుడుకి అయితే సత్సంగము యొక్క మహిమ తెలియదో, సత్సంగాలకి  వెళ్ళడము కోసము కష్ట పడడో , ఇంకా ఉట్టినే అభ్యాసము          వెనకాలే  పడి ఉంటాడో ,అభ్యాసాన్నే అన్నీ అనుకుంటాడో అది అతని తప్పు . విజ్ఞానమయము ఇంకఆనందమయమైన లోకాలను , సత్సంగమే దాటించ గలదు ,ఎవరైతే   సత్సంగ రూపమైన నౌక ఎక్క లేదో వాళ్ళు ఈ విశాలమైన జలాశయాలను దాట లేరు .ఇందులో ఏమాత్రము సందేహము లెదు . సంపూర్ణముగా గురు యొక్క ఆశ్రయము పుచ్చుకోవదము ,ఆయన ఆశిర్వచనాలు పొందడమే ఈ రెండు లోకాలను (విజ్ఞానమయము ఇంకా ఆనందమయము ) పొందే సాధన .

వివేకము ప్రాప్తి కొరకు అవసరమైన మూడవది  స్వా ధ్యాయము .మహాపురుషులు వ్రాసిన గ్రంథాలు చదవడము వాటి గురించి ఆలోచించడము , ఇంకా వాటి అనుసారముగా మన జీవితాన్ని తీర్చి దిద్దుకొనే ప్రయత్నము చెయ్యడమే స్వాధ్యాయము అనిపించుకుంటుంది. స్వాధ్యాయము కూడా ఒక రకమైన సత్సంగమే అనిపించుకుటుంది .ఎందుకంటే అప్పుడు ఆ పుస్తకాలలో ఉన్న ఆలోచనలు మన లోనికి చేరతాయి .ఎప్పుడైతే మనము పుస్తకము చదువుతున్నమో పుస్తకము  వ్రాసిన వారి ఒక కాల్పనిక రూపము మన కళ్ళ ఎదురుకుండా తిరుగుతూ  ఉంటుంది .ఈ రెండింటి లాభాలు మనకి దొరుకుతాయి కానీ పుస్తకము జడ వస్తు అవడము వల్ల అది మనకి పూర్తి లాభము ఇవ్వలేదు ,అది చాలా వరకు  మనని  పైకి తీసుకు  వెళ్తుంది.

పుస్తకము మనకి వివేకము ఇంకా జ్ఞానము ఇస్తుంది ,కానీ ఏదైతే  చైతన్యమైన శరీరము దగ్గరకి వెళ్తే దొరుకుతుందో ,అది కేవలము స్వాధ్యాయము వల్ల దొరకదు .ఇందుకే ఏకొద్ది అవకాశము దొరికినా కష్టపడైనా,ధనము ఖర్చు పెట్టి అయిన,వేరే పనులన్నీ పక్కకు పెట్టి,ముముక్షు కొరకు గురు సత్సంగము యొక్క లాభాన్ని తప్పక వినియోగించుకోవాలి , లేకపోతె  వారి పని అసంపూర్ణముగ  ఉండిపోతుంది.

శాస్త్రాలలో  స్వాద్యాయము యొక్క మహిమను ఇలా వ్రాశారు   "శతపథ " బ్రాహ్మణ ములో ఇలా వ్రాసివుంది .”స్వాద్యాయో వై బ్రహ్మయజ్ఞః” .ఐతరేయ బ్రాహ్మణ లో-----“ అపహతపాప్మా హి స్వాద్యాయః .దేవః పవిత్రం వై ఏతత్ .” తాత్పర్యము ఏమిటంటే స్వాద్యాయము బ్రహ్మయజ్ఞాము. స్వాద్యాయము అన్ని పాపాల నాశనము చేసేది ,మరియు దేవతలతో సమానమైన పవిత్రత నిశ్చయముగా కలిగించేది. తాత్పర్యము ఏమిటంటే జ్ఞానవంతులు అవ్వాలంటే మరియు ప్రభు యొక్క రహస్యమయమైన లీలల  యొక్క యదార్థ భేదము తెలుసుకోవడానికి మనిషికి ఈ మూడు పదాలు అవసరమైనవి_

1- అభ్యాసము 2- గురువు యొక్క సత్సంగము 3-ఋషులు మరియు సంత్ మహాత్ములు వ్రాసిన గ్రంథాలను చదవడము .ఎవరైతే చదవలేకపోతారో వారు ఇతరులు చదివినది విన్నా అంతే లాభము పొందుతారు ఎంతైతే చదివిన వారు  పొందారో. కానీ ఈ మూడు పనులను చాలా ఏకాగ్రతగా చెయ్యవలెను. ఏపనైన మనఃపూర్వకముగా చెయ్యకపోతే  సాఫల్యము లభించదు. గురువు చెప్పిన అభ్యాసాన్ని ప్రతిరోజూ శ్రద్ధగా చెయ్యాలి. గురువు లేక శాస్త్రోక్తవాక్యాలకు  హృదయాలలో చోటు ఇవ్వండి. వీటి అనుసారంగా జీవితాన్ని గడిపే  ప్రయత్నము చెయ్యండి .వీటి వలన వివేకము వికసించి జ్ఞానము ప్రాప్తిస్తుంది,మరియు దుఃఖ సాగారముతో ముక్తి కలుగుతుంది.

అమృత  వాక్యాలు

-ఓ శిష్శుల్లారా! మాటలు చెబితే పని కాదు  ఎవరైతే  గురువు ద్వారా జ్ఞానాన్ని పొందారో వారీకే మోక్షము కలుగుతుంది .పరమాత్ముడి పూజలతో మనస్సు ,బుద్ధి ఇంకనూ ఆత్మలో బలము వస్తుంది. ఈ బలము వలననే యదార్థ జ్ఞానము కలుగుతుంది మరియు ఇలాంటి నిశ్చయాత్మక జ్ఞానముతో మోక్షము దొరుకుతుంది

ఏ భావాలైతే మీలో ఉన్నవో  వాటినే ప్రకటించండి.ఆర్భాటాలకు పోకండి.ఆడంబరాలు, గొప్పలు మనిషికి పతనాన్ని ఇస్తాయి, దీనివలన అంతఃకరణము మలినము అవుతుంది. అనురాగము గుప్తముగా ఉంచితేనే పెరుగుతుంది.

శారీరములో ఎలాగైతే వివిధ శక్తులకు వేరే వేరే స్థానము వుందో అలాగే ఒక స్థానము వుంది ఎక్కడైతే వివేక శక్తి వుంటుందో. విజ్ఞానమయ శరీరములో ఆ శక్తి వుంటుంది. దీని కొరకు గురు సామీప్యము చాలా అవసరము,గురువు తన ఆత్మ బల శక్తితో ఈ గ్రంధిని చేధించి వారి హృదయాల తెరను తొలగిస్తారు.